
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ను వీడాలనే యోచనలో ఉన్న రాష్ట్ర రోడ్ల అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డి మరో అడుగు ముందుకేశారు. గురువారం గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతితో భేటీ అయ్యారు. ఈ భేటీలో నర్సారెడ్డి కాంగ్రెస్‌లోకి చేరేందుకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. నర్సారెడ్డి త్వరలోనే రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరతారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment