
తూప్రాన్: గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతాప్‌రెడ్డిది బూరుగుపల్లి, తనది వర్గల్ అని, కేసీఆర్ ఊరు ఎక్కడో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం తూప్రాన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డితో నర్సారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రాంత నాయకులపై అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ నాలుగున్నరేళ్లలో గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి శూన్యమని నర్సారెడ్డి ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఉమ్మన్నగారి భాస్కర్‌రెడ్డి, నాయిని యాదగిరి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment