Nationwide bandh
-
భారత్ బంద్‌లో వీరేరి?
సాక్షి, న్యూఢిల్లీ : రైతు....అనగానే మనకు మదిలో నాగలి పట్టిన లేదా పొలానికి నీరు పట్టేందుకు కాల్వతీస్తున్న రైతన్న మెదలుతాడు. మరి పొలం దున్నే రైతమ్మ కనిపించదా? అంటే కనిపించదనే చెప్పాలి. నాట్లు వేస్తూనో, నాట్లు కడుతూనో వ్యవసాయ కూలీలుగా మాత్రం మహిళలు కనిపిస్తారు. మగవాళ్లు మాత్రమే కష్టపడి వ్యవసాయం చేస్తారనే పాత కాలం నాటి మాటే మన మెదళ్లలో గూడుకట్టుకు పోయింది. కాలక్రమంలో వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోవడంతో మన రైతులు ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణాల బాట పట్టారు. దాంతో వారి భార్యలు, అక్కా చెల్లెళ్లు పొలాల్లో రైతులుగా, రైతు కూలీలుగా మారి పోయారు. ఈ క్రమంలో రైతన్నలకన్నా రైతమ్మలు ఎక్కువయ్యారు. దేశంలో వ్యవసాయ గణాంకాల ప్రకారం 73.2 శాతం మంది మహిళలు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. వారిలో 12.8 శాతం మందికి మాత్రమే సొంతంగా వ్యవసాయ భూములు ఉన్నాయి. వ్యవసాయ భూములు కలిగిన మహిళలకు ప్రభుత్వ సంస్థల నుంచి రుణాలు, సబ్సిడీలు లభించక పోవడం విచిత్రం. వ్యవసాయం చేస్తోన్న ఎక్కువ మంది మహిళలు వారి భర్తల పేరిట గల భూముల్లో పని చేస్తున్నారు. (చదవండి: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హౌజ్ అరెస్ట్) పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లాల్లో మనకు మహిళా రైతులు ఎక్కువగా కనిపిస్తారు. వారంతా రాజ్‌బన్సీ, నామశుద్రాస్, కపాలీసీ, ఆదివాసీలు పిలిచే ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనకబడిన వర్గాలకు చెందిన మహిళలే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ మహిళా రైతుల గురించి ప్రత్యేకంగా ఏమీ పట్టించుకోవడం లేదు. రాజ్‌గంజ్ పట్టణంలో మహిళల పొలం పనులు తెల్లవారు జామున ఐదు గంటలకే ప్రారంభం అవుతుంది. వారు పొలం దున్నడం నుంచి విత్తనాలు చల్లడం, నీళ్లు పెట్టడం, ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకంతోపాటు మార్కెట్‌కు వెళ్లి పంటలను అమ్మే వరకు అన్ని విధులు వారే నిర్వహిస్తారు. పశువులు మేపడం, పాలు పిండడం అదనం. ఇక అందరి తల్లుల మాదిరి ఇంటి పనులు, పిల్లల పోషణ బాధ్యతలు వారే నిర్వహిస్తారు. రాత్రి పొద్దెక్కి నిద్రపోయే వరకు వారికి క్షణం తీరిక ఉండదు. పొలం నుంచి ఇంటికి ఇంటి నుంచి పొలానికి తిరగడంలో వారి జీవితం గడచిపోతుంది. అంతటిలాగే ఆ పట్టణంలో కూడా మగవారు, ఆడవారి మధ్య వ్యవసాయ వేతనాల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. వ్యవసాయ పనులు చేసే మగ కూలీలకు రోజుకు 250 రూపాయలు, మహిళలకు రోజుకు 150 రూపాయలే చెల్లిస్తున్నారు. ఆ పట్టణంలోని ఎక్కువ మంది మహిళా రైతులు వితంతువులు కాగా, వారి వ్యవసాయ భూములు ఇప్పటికీ వారీ దివంగత భర్తల పేరుతోనే ఉన్నాయి. వారి పేరిట ఆ భూములను బదలాయించమంటూ అధికారులను వేడుకుంటున్నా, ఓట్ల కోసం వచ్చే నేతలకు మొర పెట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ మంగళవారం కొనసాగుతున్న భారత్ బంద్ ఆందోళనలో ఎక్కడా మహిళా రైతులు కనిపించడంలేదు. ఎప్పటిలాగే ఆందోళన కార్యక్రమాలను మగవారికి అప్పగించి మహిళా రైతులు పొలం పనుల్లో నిమగ్నమై ఉండవచ్చు. రైతు నేతలతో చర్చోప చర్చలు జరపుతున్న రాజ్యాధికార నేతలు వ్యవసాయ మహిళల తల రాతలను ఇకనైనా పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
భారత్ బంద్: ఆ అదృష్టం ఎవరికి రాదు.. కానీ..
సాక్షి, సిద్దిపేట: రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన బిల్లులను వెంటనే రద్దు చేయాలని నేడు రైతులు భారత్ బంద్‌కు పెలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రైతులు దేశవ్యాప్తంగా నిరసన, ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతారావ్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు రైతులకు మద్దతు తెలుపుతూ ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కండువాలు మోసి పార్టీకి సేవ చేసన నాయకులను కాదని ఇతర పార్టీ నుంచి వచ్చిన రాములమ్మను స్టార్ క్యాంపైనర్‌గా బాధ్యతలు ఇచ్చామన్నారు. ఆ అదృష్టం ఎవరికి రాదని, కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్‌లు ఉన్నారని, పార్టీ వదిలిపెట్టినప్పుడు మీకు తెలిసిందా? అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లును ఉపసంహరించుకునేంతవరకు కాంగ్రెస్ పార్టీ దేనికైనా సిద్దమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లు వలన కార్పొరేట్ వ్యవస్థలకు లాభమే కానీ రైతుకు మాత్రం ఉరిశిక్ష వేసినట్లే అని ఆయన వ్యాఖ్యానించారు. -
తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ ప్రభావం
-
విజయవంతంగా ముగిసిన భారత్ బంద్
భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. రైతులకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించింది. తెలంగాణలోనూ బంద్ విజయవంతంగా సాగింది. తెలంగాణ రోడ్లపై టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు నిరసన తెలిపాయి. రైతులకు పూర్తి అండగా నిలుస్తామని పలు పార్టీల నేతలు పేర్కొన్నారు. రైతు మెడకు ఉరి తాడుగా మారిన చట్టాలను రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపులో భాగంగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు మెడకు ఉరి తాడుగా మారిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు భూపాల్ రెడ్డి, నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించిన కేటీఆర్ కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్‌లో పాల్గొనడానికి మంత్రి కేటీఆర్ బూర్గులకు చేరుకున్నారు. అనంతరం షాద్నగర్జాతీయ రహదారిపై బైఠాయించి కేంద్రం తెచ్చిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేట్టారు. నల్లబెలూన్లు ఎగురవేసిన నిరసన తెలిపిన ఎంఎల్సీ కవిత కామారెడ్డి: భారత్ బంద్‌కు మద్దతుగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు టెక్రియల్ చౌరస్తాకు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం నిజామాబాద్- ముంబై జాతీయ రహదారిని దిగ్భందించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు రహదారిపైకి భారీగా చేరుకున్నారు. కార్యక్రమంలో ఎంఎల్సీ కవిత, ఎంపీ బీబీ పాటిల్ పాల్గొని నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జాతీయ రహదారి దిగ్భందనంలో కవిత బైటాయించారు. వైఎస్సార్ జిల్లాలో.. రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ నేడు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారత్ బంద్ తలపెట్టారు. దీంతో కమలాపురంలో కడప- తాడిపత్రి జాతీయ రహదారి క్రాస్ రోడ్డు వద్ద సీపీఐ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. మరికాసేపట్లో బూర్గులకు చేరుకోనున్న కేటీఆర్ మంత్రి కేటీఆర్ మరికాసేపట్లో బూర్గుల చేరుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న భారత్ బంద్‌లో పాల్గొననున్నారు. కాగా ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ కార్యకర్తలు బూర్గులకు చేరుకున్నారు. కాసేపట్లో హైదరాబాద్- బెంగళూర్ హైవేను దిగ్భందించనున్నారు. ఇప్పటికే కార్యకర్తలు రోడ్లపైకి చేరుకోడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడలో.. భారత్ బంద్‌లో భాగంగా లెనిన్ సెంటర్లో రైతు, కార్మిక, విద్యార్థి, మహిళా సంఘాలు, వామపక్ష నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయ పనిముట్లతో మహిళా సంఘాల నేతలు నిరసన తెలుపుతున్నారు. ఆల్ ట్రేడ్ యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. కనీస మద్దతు ధరల చట్టం, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయకుండా కేంద్రం నల్ల చట్టాలు తెచ్చింది. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. 62 లక్షల కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. రైతాంగానికి మద్దతుగా నిలిచిన సీఎం జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. కేంద్రం మెడలు వంచైనా.. చట్టాలు రద్దు చేసేవరకు పోరాడతాం. చట్టాలను రద్దు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాము' అని ట్రేడ్ యూనియన్ నాయకులు తెలిపారు. తెలంగాణలో.. తెలంగాణలో భారత్ బంద్ కొనసాగుతోంది. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనగా.. మంత్రి తలసాని సికింద్రాబాద్‌లో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ.. 'దేశానికి రైతు వెన్నెముక. ప్రస్తుతం రైతులు దేశవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్ వ్యవస్థలకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చట్టాలతో రైతుల నడ్డి విరుగుతుంది. రాజ్యసభలో అన్ని పార్టీలు వ్యతిరేకించినా చట్టాలను ఆమోదించుకున్నారు. సంఖ్యా బలం ఉందని ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చారు. చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో రైతులను ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమే. కొంత మంది మూర్కులు అనవసరంగా మాట్లాడుతున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఏం మాట్లాడుతున్నారు. చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం రైతుల నిరసన చేస్తుంటే రాజకీయ పార్టీలపై నెడుతున్నారు. వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు సహకరించాలి. చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం అవుతుంది. పంటలకు గిట్టుబాటు ధర లేదు. తెలంగాణలో పండిన పంట దేశంలో వేరే చోట అమ్ముకోవాలంటే ఎలా. రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టదా. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతాంగం కోలుకుంటోంది. ఎవర్ని పెంచి పోషించడం కోసం ఈ చట్టాలు. పంజాబ్, హరియాణలో నిరసనలు ఇంత ఉధృతంగా ఎందుకు జరుగుతుందో ఆలోచించాలి. టీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి భయపడుతోందని అంటున్నారు. ఇలాంటి రాజకీయాలు, ఎన్నికలు మేం ఎన్ని చూడలేదు. అధికారం శాశ్వతం కాదు. నిజంగా సమస్య లేకపోతే కేంద్రం ఎందుకు చర్చలు జరుపుతుంది. ఇప్పటికైనా కేంద్రం దిగిరావాలి' అని మంత్రి తలసాని కోరారు. కరీంనగర్లో స్వల్ప ఉద్రిక్తత భారత్ బంద్ సందర్భంగా కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంద్‌లో భాగంగా బస్ స్టేషన్ వద్ద వామపక్షాలతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించి ధర్నా చేస్తుండగా అదే సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఆందోళనకు దారితీసింది. టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రూప్ సింగ్ ఆధ్వర్యంలో కొందరు విపక్ష పార్టీల ధర్నా వద్దకు రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు ఇరువర్గాల మధ్య నిలిచి సర్దిచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. ఆ తరువాత వేరువేరుగా రోడ్డుపై బైఠాయించి ధర్నా కొనసాగిస్తున్నారు. భారత్ బంద్‌కు ఆస్ట్రేలియాలోని తెలుగువారి మద్దతు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని తలపెట్టిన భారత్ బంద్‌కు మద్దతుగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశవ్యాప్తంగా రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకొని ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలు రైతులకు గొడ్డలిపెట్టు: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు గొడ్డలిపెట్టుగా మారనున్నాయని, ఈ చట్టాల ద్వారా కార్పొరేటు సంస్థలకు మేలు చేసేందుకు కేంద్రం ఆరాటపడుతున్నట్టు ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రైతు సంఘాల భారత్ బంద్ పిలుపులో బాగంగా మహబూబ్ నగర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైతు ప్రయోజనాల కోసం వారితో కలిసి పోరాడుతామని, కేంద్రం తన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించే వరకు తమ ఆందోళన ఆగదని హెచ్చరించారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలవాల్సిన భాద్యత అందరిపైనా ఉందని.. కేంద్రం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే కుట్ర పన్నుతోందని మంత్రి పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో.. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఢిల్లీలో రైతుల దీక్షకు మద్దతుగా విద్యా, వ్యాపార సముదాయాలు మూసివేసి బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా బస్సు సర్వీసులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. నిర్మానుష్యంగా జేబీఎస్ బస్టాండ్ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రైతు చట్టాలని వ్యతిరేకిస్తూ భారత్ బంద్ చేపట్టారు. దీనిలో భాగంగా సికింద్రాబాద్, జేబీఎస్ బస్టాండ్ వద్ద బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. కంటోన్మెంట్, పికెట్ డిపోలో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. జేబీఎస్ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. ప్రయాణికులు లేక బస్టాండ్ వెలవెలబోతోంది. జేబీఎస్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతు సంఘాలు చేపట్టిన బంద్‌కు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంతో ఎక్కడికక్కడ అన్ని బంద్ అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీస్‌లను నిలిపివేసింది. దీంతో 950 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయాన్నే టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బంద్‌ను నిర్వహిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే అరూరి రమేష్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మడికొండ వద్ద తమ నిరసన తెలుపనున్నారు. అలాగే ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఘనపూర్‌లో ఎమ్మెల్యే నరేందర్ నాయుడు పెట్రోల్ బంక్ వద్ద తమ ధర్నా కొనసాగించనున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందగా బంద్ పాటిస్తున్నాయి. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో భారీగా ట్రాఫిక్ జామ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బందులో భాగంగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా రైతులు నిరసనకు దిగారు. చివ్వేంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద రైతులు ట్రాక్టర్లను రోడ్డుపై అడ్డంగా ఉంచి వ్యవసాయ చట్టాలకు వ్యతిరకేంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో హైవేపై ట్రాఫిక్ భారీగా స్తంభించి పోయింది. హుస్నాబాద్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల నడ్డివిరిచేలా ఉన్నాయని చెప్పారు. పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్న ఈ చట్టం తేనె పూసిన కత్తిలాంటిదని విమర్శించారు. ప్రస్తుతం రైతు పండించిన పంట మార్కెట్ యార్డులో అమ్ముకొని మద్దతు ధర పొందేవారని తెలిపారు. అయితే.. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు అమ్మితే జవాబుదారీ ఎవరుంటారని ప్రశ్నించారు. ప్రస్తుతం కృత్రిమ కొరత సృష్టించకుండా నిత్యావసర సరుకులు స్టాక్ పెట్టుకోవడానికి వీలు లేకుండా చట్టం ఉండేదని, కొత్త చట్టం ద్వారా బడా వ్యాపారులు నిత్యావసర వస్తువులను స్టాక్ పెట్టుకునేలా వారికి లాభం చేకూర్చేలా ఉందన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు బ్రిటన్ ప్రధానితో పాటు అమెరికా వీధుల్లో తెలుగు ప్రజలు మద్దతు తెలుపుతుంటే, కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. లెవీ సేకరణ చట్టాన్ని రద్దు చేయాలి సన్న వడ్లు కొనాలంటూ ధర్నాలు చేస్తున్న బీజేపీ నేతలు.. ముందు కేంద్రం జారీ చేసిన లేవీ సేకరణ చట్టాన్ని రద్దు చేసేలా చేయాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రమైనా కేంద్రం నిర్ణయించిన ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ ధర పెట్టినా లెవీ సేకరణ నిలిపివేస్తామని కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. చట్టాలు తెచ్చేది మీరే, ధరలు పెంచుతూ ధర్నాలు చేసేది మీరే అని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం కరెంట్, రైతు బీమా, రైతుబంధు ఇలా రైతుల కోసం ఏటా రూ.50 వేల కోట్లు ఖర్చు పెడుతుంటే, సన్నరకం ధాన్యానికి ఇంకో రూ.400 కోట్లు ఖర్చు పెట్టలేమా అని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో.. రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని కోరుతూ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రంపచోడవరంలోని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి నాయకులు రోడ్లపైకి చేరి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ బంద్‌ను పాటిస్తున్నారు. బంద్‌కు మద్దతుగా రంపచోడవరంలో దుకాణాలు, వ్యాపార సముదాయాల స్వచ్ఛందంగా మూతపడ్డాయి. బండెనక బండి.. రైతన్నకు మద్దతు దండి ►భారత్‌బంద్‌కు మద్దతుగా రైతులు, టీఆర్ఎస్ శ్రేణుల ర్యాలీ హన్మకొండ: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ హన్మకొండలో ఎడ్ల బండ్లతో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు వినూత్న ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వరకు చేపట్టిన ఈ ర్యాలీని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ప్రారంభించి మాట్లాడారు. రైతాంగమంతా కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లాలో.. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరణ చేసుకొని కర్నూలులో వామపక్షాలు పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ కొనసాగుతోంది. జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు బంద్‌కు స్వచ్చందంగా మూసివేశారు. ఢిల్లీ రైతులకు మద్దతు ఇస్తూ ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం వరకు మూసివేస్తున్నారు. కర్నూలులో ప్రధాన కూడళ్లలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ రైతులకు మద్దతు ఇస్తూ కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జిల్లాలో భారత్ బంద్ ప్రశాంతంగా సాగుతోంది. విద్యా, వాణిజ్య సముదాయాలు స్వచ్చందంగా మూసివేశారు. శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, పలాసలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముఖ్య కూడళ్లు, టోల్‌ప్లాజాల వద్ద పోలీసులను మోహరించారు. గ్రేటర్ విశాఖ పరిధిలో.. అన్నదాతలకు మద్దతుగా గ్రేటర్ విశాఖ పరిధిలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. నగరంలోని ద్వారక బస్ స్టేషన్‌కే ఆర్టీసీ బస్సులు పరిమితం అయ్యాయి. వ్యాపార సముదాయాలు, దుకాణాలు మూసివేసి స్వచ్చందంగా మూసివేసి మద్దతుగా నిలిచారు. వామపక్ష పార్టీలు నేతల నిరసన ర్యాలీ చేపట్టారు. అందులో భాగంగా మద్దిలపాలెం జంక్షన్లో జాతీయ రహదారిపై వాహనాలు నిలిపివేశారు. సీపీఐ, సీపీఎంతో పాటు వివిధ ప్రజా సంఘాలు చేపట్టిన ఈ బందుకు వైఎస్సార్సీపీ మద్దతు పలికింది. కేంద్ర ప్రభుత్వం బిల్లును వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో... నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారత్ బంద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతు సంఘాలు చేపట్టిన బంద్‌కు రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో అధికార పార్టీ టిఆర్ఎస్ మద్దతు తెలపడంతో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. కరీంనగర్లో వేకువజామునే సీపీఐ, సీపీఎం నాయకులు కార్యకర్తలు బస్ స్టేషన్ వద్దకు చేరుకొని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. డిపో ముందు బస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు టిఆర్ఎస్ కాంగ్రెస్ వామపక్ష పార్టీల నాయకులు రోడ్లపైకి వచ్చి వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలను బంద్ చేయించారు. గోదావరిఖని బస్ డిపో ముందు బైఠాయించి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆందోళనలో పాల్గొన్నారు. మంథనిలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. వ్యాపారస్తులు, కూరగాయల మార్కెట్ నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతోంది. రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశంలోని పలు రాష్ట్రాలు బంద్ పాటిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే పలు చోట్ల బంద్ ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులు చాలా చోట్ల డిపోలకు పరిమితమయ్యాయి. అత్యవసర సేవలకు అంతరాయం కలిగించకుండా శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బ్యాంకింగ్, బీమా, రవాణా బంద్
సార్వత్రిక సమ్మెకు మిశ్రమ స్పందన - యథావిధిగా బీఎస్ఎన్ఎల్ సేవలు, నిలిచిన బొగ్గు ఉత్పత్తి - కేరళ, తెలంగాణల్లో అధికం.. తమిళనాడు, బెంగాల్లో విఫలం.. - ముంబై, ఢిల్లీలో కనిపించని బంద్ - ఒక్క రోజులో రూ.16 నుంచి 18 వేల కోట్ల నష్టం: అసోచాం - బంద్ ప్రభావం అంతంత మాత్రమే: కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: శుక్రవారం నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మిశ్రమ స్పందన లభించింది. చాలా రాష్ట్రాల్లో సాధారణ జనజీవనంపై బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. బ్యాంకింగ్, బీమా, ప్రజా రవాణా, బొగ్గు గనుల కార్యకలాపాలు మాత్రం పూర్తిగా స్తంభించగా.. బీఎస్ఎన్ఎల్ సేవలు యథావిధిగా పనిచేశాయి. కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బంద్‌తో ప్రజలు ఇబ్బంది పడగా... తమిళనాడు, బెంగాల్లో మాత్రం విఫలమైంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్‌లో పాకిక్ష మద్దతు లభించింది. మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీలో బంద్ ప్రభావం కనిపించలేదు. ఒక రోజు బంద్‌తో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 16 - రూ. 18 వేల కోట్ల మేర నష్టం సంభవించిందని అసోచామ్ తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున గైర్హాజరవడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రైవేట్ బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేశాయి. రిజర్వ్‌బ్యాంకు కార్యకలాపాలకు అంతరాయంతో రూ. 19 వేల కోట్ల విలువైన 26 లక్షల చెక్కుల క్లియరెన్స్ నిలిచిపోయాయని, దాదాపు 18 కోట్ల మంది బంద్‌లో పాల్గొన్నారని కార్మిక సంఘాలు తెలిపాయి. బొగ్గు సరఫరా, ఉత్పత్తి, నిలిచిపోవడంతో కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థలు బీసీసీఎల్, సీసీఎల్, ఈసీఎల్, సీఎంపీడీఐలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే ఎక్కడా విద్యుత్ సరఫరాకు మాత్రం అంతరాయం కలగలేదు. రాజ్‌మహల్, చిత్ర గనుల్లో దాదాపు 300 మంది కార్మికుల్ని అరెస్టు చేశారని సీఐటీయూ నేత రామానందం తెలిపారు. పశ్చిమ బెంగాల్, హరియాణాల్లో పలు చోట్ల అరెస్టుల పర్వం కొనసాగింది. బెంగాల్‌లోని సిలిగురి మేయర్ సహా 270 మంది మద్దతుదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. గతేడాది కంటే ఈ సారి బంద్ ఎక్కువ విజయవంతమైందని ఏఐటీయూసీ కార్యదర్శి డీఎల్ సచ్దేవ్ చెప్పారు. పంజాబ్, హరియాణాలో రోడ్డు రవాణా సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయని, బ్యాంకింగ్, ప్రజా రవాణా విభాగాలు పనిచేయలేదని ఆయన తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్‌లో సగం బస్సులు రోడ్డెక్కలేదని వెల్లడించారు. హరియాణాలోని గుర్గావ్, ఫరీదాబాద్‌లోని పలు పారిశ్రామిక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడంతో పాటు పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సిబ్బంది గైర్హాజరుతో పనులు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ నాన్ ఎగ్జిక్యుటివ్ ఉద్యోగుల గైర్హాజరుతో వినియోగదారుల సేవలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. బిల్లు చెల్లింపులు, సిమ్ యాక్టివేషన్, ఇతర సేవలు నిలిచిపోయాయి. ల్యాండ్‌లైన్, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సేవలకు అంతరాయం కలగలేదు. కేరళలో విజయవంతం.. వామపక్ష ప్రభుత్వ పాలనలోని కేరళలో బంద్ పూర్తిగా విజయవంతమైంది. దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూతపడగా... ఆటోలు, ట్యాక్సీలు, బస్సులు రోడ్డెక్కలేదు. తిరువనంతపురంలో ఇస్రో కార్యాలయాలకు వెళ్లే రోడ్లను దిగ్బంధించడంతో వందల మంది ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లలేకపోయారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ బంద్‌కు మద్దతు తెలపడాన్ని బీజే పీ తప్పుపట్టింది. ఒడిశాలో పలు చోట్ల ఆందోళనకారుల రైల్‌రోకోల వల్ల రైల్వే సేవలకు అంతరాయం కలిగింది. పలుచోట్ల రాస్తారోకోలతో ప్రజా, సరకు రవాణాలు స్తంభించాయి. బిహార్‌లో ఆటోలు, బస్సులు రోడ్డెక్కలేదు. బ్యాంకులు మూతపడగా.. పట్నా, ముంగేర్, భాగల్పూర్, హజీపూర్ తదితర ప్రాంతాల్లో బ్యాంకు ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. అస్సాంలో ముందస్తుగా 500 మంది ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. బెంగాల్, తమిళనాడులో అంతంతే... బెంగాల్లో బంద్‌కు స్పందన లభించలేదు. హైరా, శీల్దాల మధ్య రైలు రాకపోకలు యథావిధిగా సాగగా.. మెట్రో రైళ్లకు ఎలాంటి అంతరాయం కలగలేదు. కర్ణాటకలో బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. బస్సుల రాకపోకలు నిలిచిపోగా, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, మార్కెట్లు, హోటళ్లు తెరిచేఉన్నాయి. తమిళనాడులో బంద్ ప్రభావం అసలు కనిపించలేదు. మహరాష్ట్రలో బంద్‌కు పాక్షిక స్పందన లభించింది. సమ్మె ప్రభావం పాక్షికమే: కేంద్రం సమ్మె ప్రభావం పెద్దగా లేదని, సామాన్య జనజీవనం సజావుగానే సాగిందని కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. రైల్వేలు, పౌరవిమానయానం, ముఖ్యమైన ఓడరేవులపై సమ్మె ప్రభావం పడలేదని, బ్యాంకింగ్, బీమా, బొగ్గు, టెలికాం, రక్షణ ఉత్పత్తి రంగాలపై ప్రభావం పాక్షికమని పేర్కొంది. వామపక్ష పాలిత కేరళ, త్రిపురల్లో ప్రభావం ఉందని, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్,ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌లో పాక్షికమని తెలిపింది. బంద్‌ను కార్మికులు తిరస్కరించారని, కనీసవేతనం 42 శాతం పెంపు వంటి చర్యల్ని అభినందించారని కేంద్ర విద్యుత్, బొగ్గు గతను శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు. నర్సుల నిరవధిక సమ్మె: ఢిల్లీ, యూపీ, మహారాష్ట్రల్లో నర్సులు నిరవధిక సమ్మెకు దిగడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగింది. దీంతో ఢిల్లీలో ఎస్మా ప్రయోగించారు. పంజాబ్, రాజస్తాన్, పుదుచ్చేరిల్లో కూడా నర్సులు సమ్మె బాట పట్టారు. -
నేడు మందుల దుకాణాలు బంద్