
కేంద్రానికి ఏరాష్ట్రంపైనా సవతి ప్రేమ ఉండదు : వెంకయ్య
టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్ రాసిన ‘ఉద్యమబాట’ పుస్తకాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు.
ఎంపీ దేవేందర్‌గౌడ్ ‘ఉద్యమబాట’ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్ రాసిన ‘ఉద్యమబాట’ పుస్తకాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ పుస్తకం చదివి భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందాలని ఈ సందర్భంగా వెంకయ్య అన్నారు. బీసీల గళాన్ని రాష్ట్రంలో అందరికంటే గట్టిగా వినిపించిది దేవేందర్‌గౌడ్ అని చెప్పారు. కేంద్రానికి ఏ రాష్ట్రంపైనా సవతి ప్రేమ ఉండదని, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
ఏడు దశాబ్దాలు దాటినప్పటికీ మన దేశంలో ్రపజాస్వామ్య విలువలు అంతంత మాత్రంగా ఉండడమే తనతో ఈ పుస్తకం రాయించిందని దేవేందర్ గౌడ్ చెప్పారు. సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన దేవేందర్ గౌడ్ ఆంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదిగి తనదైన స్ధానాన్ని సంపాదించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. బీసీలలో రాజకీయ చైతన్యం తీసుకురావడంలో దేవేందర్‌గౌడ్ సఫలీకృతమయ్యారని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు.