నంద్యాల(రూరల్): టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ని ఉద్దేశించి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (టీడీపీ) 'ఎక్స్' (ట్విటర్)లో ఆదివారం వివాదాస్పద పోస్ట్ చేశారు. 'అల్లు అర్జున్ గారూ.. మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ మరువలేనిది. మీరు నంద్యాలలో ముందస్తు ఎన్నికల ప్రచారంలా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీరు నంద్యాలను సందర్శించినప్పుడు మీ సెంట్‌మెంట్ మాకు చాలా బాగా పనిచేసింది. ఆ సెంట్‌మెంట్ మాదిరిగానే మీ 'పుష్ప 2' కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం' అని పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: 'పుష్ప 2' రెమ్యునరేషన్.. ఎవరికెంత ఇచ్చారు?)
వెటకారం ధ్వనించేలా ఉన్న ఈ ట్వీట్ కింద అల్లు అర్జున్ అభిమానులు విమర్శలు, కామెంట్లు చేశారు. దీంతో సరైన సమాధానం చెప్పుకోలేక ఆమె ఆ పోస్ట్‌ను తొలగించారు. కాగా, గత ఎన్నికల ముందు నంద్యాల నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చారు.
(ఇదీ చదవండి: 'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment