
హరీశ్ మంచోడనుకున్నా: వీహెచ్
‘రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు మంచోడనుకున్నా.. ఇదేం పద్ధతి.. ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు..
దేవరకొండ: ‘రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు మంచోడనుకున్నా.. ఇదేం పద్ధతి.. ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.. రైతులు ఏం కావాలంటున్నారు.. భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం అడుగుతున్నారు.. మీరు 4 గ్రామాల వాళ్లను లేపితే.. నేను 400 గ్రామాల వాళ్లను లేపుతా! అని ఆయన అనడం సమంజసం కాదు?’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు విమర్శించారు.
శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండలో యాంటీ టైస్ట్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. అధికార దాహంతో కాంట్రాక్టులు, మంత్రి పదవులు ఎరగా విసురుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లోబర్చుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తెలంగాణ ఏర్పాటు సోనియాగాంధీ పెట్టిన భిక్షని కేసీఆర్ అర్థం చేసుకోవాలన్నారు. వలసలను ప్రోత్సహిస్తూ పార్టీలను నిర్వీర్యం చేయడం మంచిది కాదన్నారు. దేవరకొండ సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పార్టీ మారడంపై స్పందిస్తూ ‘నీ జెండా ఏమైంది... నీ ఐడియాలజీ ఏమైంది?’ అని వీహెచ్ విమర్శించారు.