
కిడ్నాపైన బాలిక సురక్షితం
ఇటీవల హైదరాబాద్ హైకోర్టు వద్ద కిడ్నాపైన మౌనిక ఆచూకీ బుధవారం లభ్యమైంది.
గుంటూరు సిటీ : ఇటీవల హైదరాబాద్ హైకోర్టు వద్ద కిడ్నాపైన మౌనిక ఆచూకీ బుధవారం లభ్యమైంది. జిల్లాలోని అరండాల్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గురవయ్య హైస్కూల్ వెనక ఉన్న ఒక గుడిసెలో పాపను దాచాడు. పోలీసులు సీసీటీవీ పుటేజీల ద్వారా నిందితుడ్ని గుర్తించారు. అతని కదలికలను నిఘా ఉంచి పట్టుకున్నారు. నిందితుడు గుంటూరుకు చెందిన హనుమంతరావుగా గుర్తించారు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.