బీసీల వివరాలను బయటపెట్టాలి: వీహెచ్ | v hanumantha rao letter to governor, bc commision chairman | Sakshi
Sakshi News home page

బీసీల వివరాలను బయటపెట్టాలి: వీహెచ్

Published Sat, Oct 29 2016 4:00 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

బీసీల వివరాలను బయటపెట్టాలి: వీహెచ్

బీసీల వివరాలను బయటపెట్టాలి: వీహెచ్

హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వేలో నమోదు చేసిన బీసీల వివరాలను బయటపెట్టాలని కోరుతూ గవర్నర్ నరసింహన్, బీసీ కమిషన్ చైర్మన్‌లకు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు లేఖ రాశారు. బీసీలకు కేంద్రం ఇస్తున్న 27 శాతం రిజర్వేషన్ అమలు కావడలేదని వీహెచ్ లేఖలో పేర్కొన్నారు.

సచివాలయాన్ని కూల్చేసి కొత్తవి నిర్మిస్తామంటూ సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఇష్టాను సారం అప్పులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మారుస్తున్నారని వీహెచ్ విమర్శించారు. కొత్త జిల్లాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement