bc commision chairman
-
‘విహారం దీర్ఘకావ్యం’ పుస్తకావిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు రచించిన ‘విహారం దీర్ఘకావ్యం’ పుస్తకాన్ని సోమవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. అమ్మ గురించి, ప్రకృతి గురించి, ఉద్యమ స్ఫూర్తిని వర్ణిస్తూ బీఎస్ రాములు రచించిన వందవ కవితాసంపుటిని తెలంగాణ భవన్ అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్ రామ్మోహన్రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ భవన్ పరిపాలనాధికారి కె.లింగరాజు పాల్గొన్నారు. -
బీసీల వివరాలను బయటపెట్టాలి: వీహెచ్
హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వేలో నమోదు చేసిన బీసీల వివరాలను బయటపెట్టాలని కోరుతూ గవర్నర్ నరసింహన్, బీసీ కమిషన్ చైర్మన్లకు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు లేఖ రాశారు. బీసీలకు కేంద్రం ఇస్తున్న 27 శాతం రిజర్వేషన్ అమలు కావడలేదని వీహెచ్ లేఖలో పేర్కొన్నారు. సచివాలయాన్ని కూల్చేసి కొత్తవి నిర్మిస్తామంటూ సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఇష్టాను సారం అప్పులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మారుస్తున్నారని వీహెచ్ విమర్శించారు. కొత్త జిల్లాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు.