
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు రచించిన ‘విహారం దీర్ఘకావ్యం’ పుస్తకాన్ని సోమవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. అమ్మ గురించి, ప్రకృతి గురించి, ఉద్యమ స్ఫూర్తిని వర్ణిస్తూ బీఎస్ రాములు రచించిన వందవ కవితాసంపుటిని తెలంగాణ భవన్ అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్ రామ్మోహన్‌రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ భవన్ పరిపాలనాధికారి కె.లింగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment