సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బంజారాలను ఎస్టీలుగా పరిగణించడాన్ని రాజ్యాంగవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఆదిలాబాద్‌కు చెందిన గోం డ్వానా సంక్షేమ సంఘం అధ్యక్షుడు హనుమంతరావు దాఖలు చేసిన వ్యాజ్యా న్ని హైకోర్టు కొట్టేసింది. ఎస్టీ జాబితాలో చేర్పులు, తొలగింపులన్నీ పార్లమెంట్ పరిధిలోని వ్యవహారాలని హైకోర్టు స్పష్టం చేసింది. లంబాడీలు, సుగాలీలను ఎస్టీల్లో చేరుస్తూ అధికరణ 342 (2) కింద పార్లమెంట్ చట్టం చేసినందున, వారిని ఆ జాబితా నుంచి తొలగించడం దాని పరిధిలోని అంశమని తేల్చిచెప్పింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గతవారం తీర్పు వెలువరించింది. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment