st list
-
ఢిల్లీలో కదంతొక్కిన ఆదివాసీలు
సాక్షి, న్యూఢిల్లీ: హక్కుల సాధన కోసం ఆదివాసీలు కదంతొక్కారు. అస్తిత్వ పోరాటాన్ని దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఉధృతం చేశారు. తమ హక్కులను కాలరాస్తున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సోమవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం జోడెఘాట్ కేంద్రంగా పురుడుపోసుకున్న ఉద్యమం ఢిల్లీకి చేరింది. ఆదివాసీల హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాకు వేల సంఖ్యలో ఆదివాసీలు తరలివచ్చారు. ప్రత్యేక రైళ్లు, వాహనాల్లో ఢిల్లీ బాటపట్టారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ధర్నా చేపట్టారు. దేశవ్యాప్తంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీ భూమిపై హక్కులు కల్పించాలని, ఆదివాసీలపై అటవీ అధికారుల దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి ఆదివాసీలు ధర్నాలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో సరైన విధానం పాటించకుండా లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చారని, దీనివల్ల ఆదివాసీలు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను పొందలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ఆందోళన చేపట్టినట్టు తెలిపారు. వందలో మూడు ఉద్యోగాలు కూడా దక్కడం లేదు: సోయం లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఆదివాసీలు అన్యాయానికి గురవుతున్నారని, వందలో 3 ఉద్యోగాలు కూడా ఆదివాసీలకు దక్కడం లేదని, 97 శాతం రిజర్వేషన్ ఫలాలు లంబాడాలకే దక్కుతున్నాయని బీజేపీ ఎంపీ, సమితి అధ్యక్షుడు సోయం బాపురావు అన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఆది వాసీలు హక్కులు కోల్పోతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ సభ నిర్వహించినట్టు తెలిపారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, ఎమ్మెల్యే సీతక్క సహా పలు రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
ఐటీడీఏను ముట్టడించిన ఆదివాసీలు
ఉట్నూర్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధాన డిమాండ్‌తోపాటు తమ సమస్యలను ప్రభుత్వం వెంట నే పరిష్కరించాలంటూ ఆదివాసీ మహిళాలోకం కదంతొక్కింది. భారీగా తరలివచ్చిన ఆదివాసీలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఐదువేలకు పైగా ఆదివాసీలు ఆందోళనలో పాల్గొన్నారు. ఉట్నూర్ ప్రధానవీధుల్లో భారీ ప్రదర్శన చేపట్టారు. మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మూడు కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ ఐటీడీఏ కార్యాలయానికి చేరుకుని వారి నుంచి వినతిపత్రం తీసుకున్నప్పటికీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేయడం.. గేటుకు తాళం వేయడం తో ఆదివాసీలు కోపోద్రిక్తులయ్యారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికా రి రావాల్సిందేనంటూ.. లోపలికి చొచ్చుకెళ్లే యత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నా.. ఆదివాసీలు భారీ సంఖ్యలో ఉండటంతో చేతులెత్తేయాల్సి వచ్చింది. పలువురు ఆదివాసీలు గోడపై నుంచి దూకి కార్యాలయం లోపలికి వెళ్లారు. అదనపు ఎస్పీ రవికుమార్, డీఎస్పీ డేవిడ్ ఆదివాసీలకు నచ్చజెప్పే ప్రయ త్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆదివాసీ మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఐటీడీఏ ఉన్నది ఆదివాసీల కోసమేనని, తమను ఎందుకు అనుమతించట్లేదని ప్రశ్నించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు తమ పోరాటం ఆపబోమన్నారు. లంబాడీలకు ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వొద్దంటూ నినదించారు. ఇప్పటికే ధ్రువీకరణ పత్రాలిచ్చిన తహసీల్లార్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్టీలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన 25 మందిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీ నేతలపై పెట్టిన కేసుల ను ఎత్తి వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహిళా సంఘం నాయకులు గోడం రేణుకాబాయి, సోయం లలితాబాయి, మర్సకోల సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
ఐటీడీఏ ముట్టడికి యత్నం
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీలు మళ్లీ పోరుబాట పట్టారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని కోరుతూ బుధవారం ఐటీడీఏ కార్యాలయ ముట్టడికి యత్నించారు. భారీగా తరలివచ్చిన ఆదివాసీలను పోలీసులు కట్టడి చేసే క్రమంలో తోపులాట, వాగ్వాదం జరిగింది. ఒక దశలో కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కుమురంభీం కాంప్లెక్స్‌లో బుధ వారం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ నినాదాలు చేశారు. లోపల సమావేశం జరుగుతుండగా.. వెలుపల ఆదివాసీలు నినాదాలతో హోరెత్తించారు. లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులకు, ఆదివాసీలకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పే అవకాశాలు కనిపించడంతో కలెక్టర్ దివ్యదేవరాజన్, ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్యలు బయటకు వచ్చి ఆదివాసీలను శాంతింపజేసేందుకు యత్నించారు. వారి ప్రధాన డిమాండ్‌పై సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసినందున తీర్పు వచ్చేవరకూ ఆగాలన్నారు. ఏజెన్సీలో డీఎస్సీ నిర్వహిం చేందుకు ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో తీర్మా నం చేసి ప్రభుత్వానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. -
పార్లమెంటే చట్టం చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బంజారాలను ఎస్టీలుగా పరిగణించడాన్ని రాజ్యాంగవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఆదిలాబాద్‌కు చెందిన గోం డ్వానా సంక్షేమ సంఘం అధ్యక్షుడు హనుమంతరావు దాఖలు చేసిన వ్యాజ్యా న్ని హైకోర్టు కొట్టేసింది. ఎస్టీ జాబితాలో చేర్పులు, తొలగింపులన్నీ పార్లమెంట్ పరిధిలోని వ్యవహారాలని హైకోర్టు స్పష్టం చేసింది. లంబాడీలు, సుగాలీలను ఎస్టీల్లో చేరుస్తూ అధికరణ 342 (2) కింద పార్లమెంట్ చట్టం చేసినందున, వారిని ఆ జాబితా నుంచి తొలగించడం దాని పరిధిలోని అంశమని తేల్చిచెప్పింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గతవారం తీర్పు వెలువరించింది. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. -
ఆదివాసీల లడాయి ఆగదు
గుడిహత్నూర్ (బోథ్): సహనం నశించాకే ఉద్యమం పురుడు పోసుకుందని, లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు లడాయి ఆగదని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావ్ స్పష్టం చేశారు. ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో జరిగిన ఆదివాసీ మహిళ పోరుగర్జనసభలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ విరుద్ధంగా లంబాడాలు అనుభవిస్తున్న ఎస్టీ హోదా నుంచి వారిని తొలగించే వరకు ఈ ఉద్య మం ఆగదన్నారు. ఉద్యమంలో ఆదివాసీ మహిళలు కీలక పాత్ర పోషించాలన్నారు. లంబాడాలు ఎస్టీలు కాదని రుజువు చేసే పత్రాలను నివేదించినా నేటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. డీఎస్సీ రాసిన ఆదివాసీ మహిళ అభ్యర్థులందరికీ వెంటనే ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి ఆదివాసీ ప్రొఫెసర్లు, మహిళలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ సంఘాల నేతలు హాజరయ్యారు. -
ఆదివాసీలు ఏకతాటిపై ఉండాలి
ఆదిలాబాద్ రూరల్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకూ ఉద్యమాన్ని కొనసాగించాలని, దీనికోసం ఆదివాసీలందరూ ఏకతాటిపై ఉండాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఉద్యమంలో భాగంగా ఈ నెల 17న కలెక్టరేట్ల ముట్టడి, వినతిపత్రాల సమర్పణ, 19న నాగోబా దర్బార్‌లో వినతిపత్రాలు ఇవ్వాలని, అలాగే, దర్బార్‌కు లంబాడీలు ఎవరూ రావద్దని.. 22న గిరిజన సంక్షేమ శాఖ కమిషన్‌కు, అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాల సమర్పణ ఉంటుందని తెలిపారు. 23న గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతిపత్రం అందజేత, 24న హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్, 27న మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర నిర్వహణ బోర్డు సభ్యులుగా లంబాడీలు కొనసాగరాదని పూజారులతో సమావేశం, అదే రోజు కుమురంభీం విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తామని వివరించారు. 30, 31వ తేదీల్లో జిల్లాల వారీగా ప్రజాప్రతినిధుల రాజీనామాలపై ఒత్తిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 5 నుంచి అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని సోయం బాపురావ్ వివరించారు. ఈ నెల నుంచి జూన్ వరకు చేపట్టనున్న కార్యచరణను ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. సమావేశంలో ఆదివాసీ సంఘాల నేతలు మడావి రాజు, పల్ల సత్యనారాయణ, దుర్వ సంజీవ్, ఉయికే సంజీవ్, గోడం గణేశ్, సిడాం వామన్ రావ్, కుడ్మేత భీంరావు, గేడం మనోహర్, ఆదివాసీలు పాల్గొన్నారు. -
లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించాలి
హైదరాబాద్: చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు డిమాండ్ చేశారు. ఆయన సోమవారం హైదరాబాద్ హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ఉద్యమాన్ని ఆదివాసీలు తీవ్రతరం చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో అనేక సంఘర్షణలు నెలకొన్నాయన్నారు. గత 40 సంవత్సరాలుగా రాష్ట్రంలో లంబాడీలు ఎస్టీలుగా చలామణి అవుతూ ఆదివాసీల రిజర్వేషన్లు కొల్లగొడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లంబాడీలు కేవలం జీవో నం. 149 ద్వారా మాత్రమే ఎస్టీలుగా కొనసాగుతున్నారన్నారు. వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు. సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసం సుధాకర్, కబ్బాకుల రవి తదితరులు పాల్గొన్నారు. -
లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించాలి
హైదరాబాద్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి వెంటనే తొలగించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గెజిట్ నోటిఫికేషన్ లేకుండా లంబాడీలను 1976లో ఎస్టీ జాబితాలో చేర్చారని, కాని లంబాడీలు మాత్రం తాము 1956 నుంచే ఎస్టీల్లో ఉన్నామని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు పూనెం శ్రీనివాస్, ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు నైతం బాలు మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీల్లో కలపలేదని 2011లో కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిందన్నారు. దాని ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ గెజిట్ లేకుండా లంబాడీలను ఎస్టీల్లో కలపడం అన్యాయమంటూ తాము హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోందని, త్వరలోనే తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. లంబాడీలు తమ రిజర్వేషన్లు, హక్కులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీసీలుగా, కర్ణాటకలో ఎస్సీలుగా, రాజస్తాన్‌లో ఓసీలుగా ఉన్న లంబాడీలు తెలంగాణలో ఎందుకు ఎస్టీలుగా చలామణీ అవుతున్నారని ప్రశ్నించారు. తమ డిమాండ్ నెరవేర్చుకునేందుకు త్వరలో కొమురం భీం లాంటి æపోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. -
అదివాసుల ధర్మ యుద్ధమహాసభ
-
కదంతొక్కిన ఆదివాసీలు
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌లో ఆదివాసీలు కదంతొక్కారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సోమవారం ఆదివాసీలు జిల్లా కేంద్రం లో కలెక్టరేట్‌ను ముట్టడించి, ధర్నా నిర్వహించారు. అంతకు ముందు భారీ ర్యాలీ చేపట్టారు. లంబాడీల ను ఎస్టీ జాబితాలోనుంచి తొలగించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు డిమాండ్ చేశారు. అంతవరకు ఉద్యమం ఆగదన్నారు. 1977 నుండి ఎస్టీలుగా చలామణి అవుతున్న పక్క రాష్ట్రం నుంచి వలస వచ్చిన లంబాడీలు ఏజెన్సీ సర్టిఫికెట్లు పొంది ఎస్టీలుగా గుర్తింపుతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారన్నారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. కొమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర కార్యదర్శి వెంకగారి భూమయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. వచ్చే నెల 9 వరకు వేచి చూస్తాం ఆదిలాబాద్ రూరల్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే విషయంలో డిసెంబర్ 9 వరకు వేచి చూస్తామని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆదివాసీ నాయకులు హెచ్చరించారు. ఆదివాసీలు సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందజేశారు. -
లంబాడీలను ‘ఎస్టీ’ నుంచి తొలగించకుంటే..
గుడిహత్నూర్(బోథ్): లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించకుంటే ‘మావ నాటే–మావ రాజ్యం’ (మా ప్రాంతం–మా రాజ్యం) ఏర్పాటు చేసుకుంటామని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాపురావుతోపాటు పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడారు. గత పాలకులు రాష్ట్రంలో ఉన్న లంబాడీలను రాజ్యాంగానికి విరుద్ధంగా ముసాయిదా లేకుండా, రాష్ట్రపతి ఆమోదం లేకుండా ఎస్టీ జాబితాలో చేర్చారని ఆరోపించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నేడు అసలైన ఆదివాసీ బిడ్డలు వివక్షకు గురై వెనుకబాటును అనుభవిస్తున్నారన్నారు. లంబాడీ ఉద్యోగులు ఆదివాసీ బిడ్డలను విద్య, రాజకీయ, ఉద్యోగ పరంగా వివక్షకు గురి చేస్తూ వారికి భవిష్యత్తు లేకుండా వ్యవహరిస్తున్నారని గర్జించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు శాంతియుత పోరాటం చేస్తామన్నారు. ఈ నెల 9న హైదరాబాద్‌లో నిర్వహించే సభకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సభకు అనుమతి లభిస్తుందని అనుమతి లభించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ మోహన్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు జల్కే పాండురంగ్ తదితరులు పాల్గొన్నారు. -
లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించాలి
ఇంద్రవెల్లి(ఖానాపూర్): లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని ఆదివాసీలు డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఉద్యమం ఆపేది లేదని తేల్చి చెప్పారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇంద్రవెల్లి స్తూపం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఆదివాసీలు శనివారం భారీ ర్యాలీ తీశారు. నల్లబ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉన్నా.. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివచ్చారు. ఐటీడీఏ ఏపీవో జనరల్ కుమ్రు నాగోరావు, తహసీల్దార్ శివరాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ గత పాలకులు లంబాడీలను విద్యాపరంగా మాత్రమే 1976లో ఎస్టీ జాబితాలో చేర్చారని, దీంతో అసలైన ఆదివాసీలకు వచ్చే ఉద్యోగ, రాజకీయ హక్కులన్నీ లంబాడీలే దోచుకుంటున్నారని ఆరోపించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్‌తో డిసెంబర్ 9న ‘చలో హైదరాబాద్’ నిర్వహిస్తామని చెప్పారు. ఏజెన్సీలో 144 సెక్షన్ ఎత్తివేయా లని డిమాండ్ చేశారు. ఆదివాసీల ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓఎన్డీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి వెడ్మా బోజ్జు, అమరవీరుల ఆశయ సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు పుర్క బాపురావ్, ఆదివాసీ నాయకులు కనక తుకారాం, ఆర్క ఖమ్ము, తోడసం నాగోరావ్, ఆయా గ్రామాల పెద్దలు వెట్టి రాజేశ్వర్, సోయం మాన్కు, హెరేకుమ్ర జంగు, మెస్రం ఇస్తారి, కినక లచ్చు, మెస్రం వెంకట్రావ్ తదితరులున్నారు. -
‘ఎస్టీ’ నుంచి లంబాడీలను తొలగించాలి
ఉట్నూర్(ఖానాపూర్): ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకూ ఆదివాసీలందరూ ఒక్కటై పోరాటం చేస్తారని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావ్ స్పష్టంచేశారు. మరో ఇంద్రవెల్లి ఘటన పునరావృతం కాకముందే ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఆదివాసీ నాయకులపై ఇటీవల నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం నుంచి ఉట్నూర్‌లోని ఐటీడీఏ వరకు సుమారు 19 కిలోమీటర్ల మేర ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిత్రు, ఆర్డీవో విద్యాసాగర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సోయం బాపూరావ్ మాట్లాడుతూ... ‘1976లో నాటి ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాయి. నాటి నుంచి అసలైన ఆదివాసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతోంది. షెడ్యూల్డ్ తెగలో గోండు, కోలాం, తోటి, నాయక్‌పోడ్, మన్నెవార్, కోయ, ప్రధాన్, ఆంద్ జాతులను రాజ్యాంగం ఆదివాసీలుగా గుర్తించి అభివృద్ధి ఫలాలు అందించాలని పేర్కొంది. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చిన నాటి నుంచి విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, ఆర్థిక ఫలాలు నిజమైన ఆదివాసీలకు అందకుండా పోతున్నాయి’అని అన్నారు. ఇటీవల ఆదివాసీ నాయకులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, జోడేఘాట్‌లో కుమ్రం భీం వర్ధంతి నిర్వహణలో విఫలమైన జిల్లా కలెక్టర్ చంపాలాల్, లంబాడీ అధికారులను సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తుంటే అధికారులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనేతరులకు వ్యతిరేకం కాదు.. ఆదివాసీలు గిరిజనేతరులకు వ్యతి రేకం కాదని, తమ మనుగడ కోసం చేస్తు న్న ఉద్యమానికి గిరిజనేతరులు మద్దతు ఇవ్వాలని బాపూరావ్ పిలుపునిచ్చారు. తమ ఉద్యమానికి మద్దతు ఇస్తే గిరిజనేతరులకు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఏజెన్సీలో ఆదివాసీలు, గిరిజనేతరుల మధ్య చిచ్చుపెట్టడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. వచ్చేనెల 9న ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే ప్రధాన డిమాండ్‌తో హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నాగేశ్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మా బోజ్జు, ఆంద్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ముకాడే విష్ణు, గోడ్వాన రాయిసెంటర్ జిల్లా అధ్యక్షుడు మెస్రం దుర్గు, కోలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావ్, ఏఎస్యూ కుమురం భీం జిల్లా ఇన్చార్జి కోట్నాక్ గణపతి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి భూపతి, ప్రధాన్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు అర్క పాల్గొన్నారు. -
ఎస్టీ జాబితాలో చేర్చేదాకా ఉద్యమం
ఆత్మకూర్ : వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలంగాణ వాల్మీకి బోయ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆత్మకూర్‌లోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే చెల్లప్ప కమిషన్ నివేదికను శాసనసభలో ఆమోదించి పార్లమెంట్‌కు పంపాలని డిమాండ్ చేశారు. ఏ కుల వృత్తిలేని వాల్మీకి బోయలు అన్నిరంగాల్లో వెనుకబడ్డారని, విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం అత్యున్నత స్థాయిలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ కేంద్రంగా వాల్మీకి భవన నిర్మాణం కోసం రెండెకరాలు కేటాయించి భవన నిర్మాణం చేపట్టాలని, రూ.200 కోట్ల సంక్షేమ నిధి కేటాయించాలన్నారు. ఈ విషయమై సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టే వాల్మీకి బోయల సత్యాగ్రహం కార్యక్రమానికి జిల్లాలోని వాల్మీకులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం నాయకులు ప్రకాష్, శ్రీను, రఘు, రాజు, రఘు తదితరులు పాల్గొన్నారు. -
అధ్యయనం తర్వాతే ఎస్టీ జాబితాపై సర్కారుకు నివేదిక
ప్రగతినగర్(నిజామాబాద్): సుదీర్ఘ అద్యయనం తర్వాతే కాయతీ లంబాడీలు, వాల్మీకీ బోయలను షెడ్యూల్డ్ కులాల (ఎస్టీ) జాబితాలో చేర్చే విషయమై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ చెల్లప్ప తెలిపారు. బుధవారం ఆయన నిజామాబాద్‌లోని ప్రగతి భవన్లో కాయతీ లంబాడీ,వాల్మీకీ బోయ, బంజారా సేవా సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించారు. తాము నివేదిక ఇచ్చిన అనంతరం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 33 తెగలకు ఆరు శాతం రిజర్వేషన్ మాత్రమే ఉండేదని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర విభజన అనంతరం జనాభా ప్రాతిపదికన ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని అనుకుంటున్నారని చెప్పారు. ఈ మేరకే ఎస్టీ కమిషన్ తెలంగాణ ప్రాంతంలో విచారణ జరుపుతోందన్నారు. ఇందుకోసం ఆరు నెలల గడువు ఇచ్చిందని, గడుపు లోపు తెలంగాణలోని అన్ని జిల్లాలో ఉన్న కాయతీ లంబాడీ, వాల్మీకి బోయలకు సంబంధించి ఆర్థిక స్థితిగతులు, ఆచార సాంప్రదాయాలు తదితర విషయాలపై సమగ్ర అధ్యయనం చేస్తామని చెప్పారు. కాయతీ లంబాడీలు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో మేదర సంక్షేమ భవనం
- రాష్ట్ర మేదర సంఘం మహాసభలో మంత్రులు ఈటల, జూపల్లి, లక్ష్మారెడ్డి హామీ - మేదరలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి - సెక్యూరిటీ లేకుండా బ్యాంకు రుణాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆర్థికంగా అత్యంత వెనుకబడిన మేదర కులస్తులను బీసీ -ఎ జాబితా నుంచి ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఒకే కులం ఒకే వృత్తిలో కొనసాగుతున్న మేదరులకు సీమాంధ్రుల పాలనలో తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్ర మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చి, తెలంగాణ మేదరులను మాత్రం బీసీ ‘ఎ’ జాబితాలో చేర్చారని ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మాదిరే తెలంగాణలోని మేదరులను సైతం ఎస్టీలుగా గుర్తించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. మేదరుల ఆవేదనను సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర మేదర మహాసభ ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగింది. మేదర సంఘం అధ్యక్షుడు బాలరాజ్ అధ్యతన జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా మంత్రి రాజేందర్, విశిష్ట అతిథులుగా వైద్యశాఖమంత్రి సి.లక్ష్మారెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ జితేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో మేదరుల కోసం ఒక సంక్షేమ భవనాన్ని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మేదరుల సంక్షేమం కోసం ప్రస్తుత బడ్జెట్లో రూ.15 కోట్లు కేటాయించామని, అవసరమైతే మరో రూ.5 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వమే మధ్యవర్తిగా వ్యవహరించి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకుల ద్వారా రూ.ఐదు లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ రుణాలపై ఇస్తున్న సబ్సిడీని 30 నుంచి 50 శాతానికి పెంచనున్నట్లు తెలిపారు. ఆర్థిక సరళీకృత విధానాల వల్ల తెలంగాణలోని అనేక కులవృత్తులు ఘోరంగా దెబ్బతిన్నాయన్నారు. మేదరులు తయారు చేసిన వెదురు బుట్టలు, చాటలు, శిబ్బి వంటి ఉత్పత్తులు కనుమరుగై పోయాయని, ఒకప్పుడు సమాజంలో చాలా గొప్పగా బతికిన మేదరులు నేడు కులవృత్తి దెబ్బతినడంతో ఉపాధిలేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ, బీసీ కులాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సొసైటీలకు భూములు కేటాయించి వెదురు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని మంత్రి ఈటల హామీనిచ్చారు. సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నట్లు నిర్వాహకులు ప్రచారం చేశారు. తీరా సభకు ఆయన రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహానికి లోనయ్యారు. మంత్రులు మాట్లాడుతున్న సమయంలో కొంతమంది మేదరులు లేచి సీఎం కేసీఆర్ రావాలి.. అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయం నెలకొంది. సమావేశంలో మేదర సంఘం కార్యదర్శి జొర్రీగల శ్రీనివాసులు, కన్వీనర్ మురళీకృష్ణ, గౌరవ అధ్యక్షుడు వెంకటరాముడు, కోశాధికారి ఏకుల సత్యం, ప్రచార కార్యదర్శి గణేష్‌రావు, యువజన సంఘం అధ్యక్షుడు జొర్రీగల శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. -
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బీటీనాయుడు పత్తికొండ టౌన్: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీటీ నాయుడు డిమాండ్ చేశారు. బుధవారం పత్తికొండలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చేవరకు బ్రిటీష్‌వారి హయాంలో రెండువందల ఏళ్లు వాల్మీకులు ఎస్టీలుగానే ఉన్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాల్మీకులు ఎస్సీలుగా, కర్ణాటకలో ఎస్టీలుగా గుర్తించారన్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో వాల్మీకులు విద్య, ఉద్యోగపరంగా అభివృద్ధి సాధించారన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కోస్తాలోని ఐదు జిల్లాల్లో ఎస్టీలుగా, తెలంగాణ ప్రాంతంలో బీసీలుగా, రాయలసీమ ప్రాంతంలో డీనోటిఫైడ్ ట్రైబ్‌లుగా గుర్తించారన్నారు. ఒకే రాష్ట్రంలో ప్రాంతీయ వ్యత్యాసాలతో పూర్తిగా నష్టపోయారన్నారు. వాల్మీకులకు కులవృత్తి లేకపోవడంతో రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఊబిలో చిక్కుకుని నేరాలకు పాల్పడి, కేసులలో ఇరుక్కుని కుటుంబాలు నాశనం చేసుకున్నారన్నారు. అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల వేళ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీలు ఇచ్చి, తర్వాత విస్మరిస్తున్నాయన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో వాల్మీకులను ఎస్టీజాబితాలో చేరుస్తామని తీర్మానం చేసి, పార్లమెంట్‌కు పంపించాడన్నారు. అలాగే రిటైర్డు ఐఏఎస్ చెల్లప్ప ఆధ్వర్యంలో కమిటీని నియమించారన్నారు. ఈ విషయమై వాల్మీకి సంఘాల నాయకులతో కలసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తమ సమస్య విన్నవించామన్నారు. సీఎం చంద్రబాబు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంపై సానుకూలంగా స్పందించాడన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ మైరాముడు, బీసీసంక్షేమసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆస్పరి శ్రీనివాసులు నాయుడు, వాల్మీకిసంఘం నాయకులు ఆస్పరి రవిచంద్ర, బీటీ గోవిందు, హోసూరు రామాంజినేయులు, దస్తగిరి నాయుడు, మునిస్వామి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీకి వడ్డెరల మద్దతు
* జగన్‌తోనే మేలు జరుగుతుందని వెల్లడి * వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతి * తమ సమస్యలపై జగన్ * సానుకూలంగా స్పందించారని వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్న వైఎస్సార్సీపీకే తమ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం తెలిపింది. సీమాంధ్ర అభివృద్ధి ఆ పార్టీతోనే సాధ్యమని, జగన్ సీఎం అయితేనే వడ్డెరలకు మేలు జరుగుతుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లెపు బాలరాజు చెప్పారు. బాలరాజు నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం జగన్మోహన్రెడ్డిని కలిసి.. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగా ల్లో వెనుకబడిన వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతిపత్రం సమర్పించింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో మాదిరిగా వడ్డెరలను ఎస్టీలుగా గుర్తించాలని కోరింది. అనంతరం బాలరాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఈ నెల 5న సీమాంధ్రలో తాము సంఘంగా ఏర్పడ్డామన్నారు. జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో వడ్డెరల కోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధులు మంజూరు చేశారని.. జగన్ కూడా తమ సంక్షేమం కోసం పాటుపడతారని ఆశాభావం వ్యక్తంచేశారు. వడ్డెరలు ప్రమాదంలో మృతి చెందితే రూ.5 లక్షలు పరిహారం అందించాలని, తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరామ న్నారు. తమ విన్నపాలపై జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. సంఘం ప్రతినిధులు తన్నీరు రాయలబాబు, కె.జంగయ్య, యల్లె ఈశ్వరరావు, కె.రామరాజు, పల్లపు రాంబాబు, కె.వెంకట్రావు, వి.చిన్నరాజు, టి.భాస్కర్ తదితరులు జగన్‌ను కలిశారు.