హైదరాబాద్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి వెంటనే తొలగించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గెజిట్ నోటిఫికేషన్ లేకుండా లంబాడీలను 1976లో ఎస్టీ జాబితాలో చేర్చారని, కాని లంబాడీలు మాత్రం తాము 1956 నుంచే ఎస్టీల్లో ఉన్నామని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు పూనెం శ్రీనివాస్, ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు నైతం బాలు మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీల్లో కలపలేదని 2011లో కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిందన్నారు. దాని ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ గెజిట్ లేకుండా లంబాడీలను ఎస్టీల్లో కలపడం అన్యాయమంటూ తాము హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.
ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోందని, త్వరలోనే తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. లంబాడీలు తమ రిజర్వేషన్లు, హక్కులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీసీలుగా, కర్ణాటకలో ఎస్సీలుగా, రాజస్తాన్‌లో ఓసీలుగా ఉన్న లంబాడీలు తెలంగాణలో ఎందుకు ఎస్టీలుగా చలామణీ అవుతున్నారని ప్రశ్నించారు. తమ డిమాండ్ నెరవేర్చుకునేందుకు త్వరలో కొమురం భీం లాంటి æపోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment