lambadi
-
జాతి జాగృతి కోసం.. బంజారా భగవద్గీత : కేతావత్ సోమలాల
రామంతాపూర్: పురాణాల ప్రకారం, దైవత్వాన్ని పొందిన మొట్టమొదటి ధార్మిక గ్రంథం భగవద్గీత. దీన్ని భారతీయ సంస్కృతి, సంస్కారాలను ప్రభావితం చేసిన జ్ఞాన ప్రవాహంగా పరిగణిస్తారు. హిందువులకు ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక గ్రంథం. మనిషి ఎలా మసులు కోవాలి.. కష్టసుఖాల్లో ఎలా వ్యవహరించాలి తదితర విషయాలపై మానవాళిని సన్మార్గంలో నడిపే పవిత్ర గ్రంథం భగవద్గీత. భారతీయ సంస్కృతికి గోపురం వంటి గీతను సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు మానవ ప్రపంచానికి అందించారు. దాదాపు ప్రపంచంలోనే అన్ని భాషల్లోకి అనువదించబడినా బంజారాలకు మాత్రం చేరలేదు. దాంతో వారికి భగవద్గీత సారాన్ని అందించాలని అనుకున్నారు హబ్సిగూడవాసి కేతావత్ సోమ్లాల. తన జాతి జాగృతం కోసం మొక్కవోని సంకల్పంతో 16 నెలలు శ్రమించి భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారాభాషలోకి అనువదించారు. తెలుగు లిపిలో బంజారాలకు సులభంగా అర్థమయ్యే రీతిలో గీతను మలిచి అందజేశారు. యాదాద్రి, భువనగిరి జిల్లాలోని ఆకుతోట బావి తండాకు చెందిన సోమ్లాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తించి వీఆర్ఎస్ తీసుకున్నారు. విద్యార్థి దశలోనే బంజారాలను చైతన్యపరుస్తూ 200లకుపైగా పాటలు రాశారు. తండాలు తిరుగుతూ ఈ పాటలు పాడి బంజారాలను ఉత్తేజపరిచారు. విద్యార్థి దశలోనే బంజారా భాషలోకి అనువాదం చేసేందుకు ఎంతో శ్రమించారు. బంజారా భాషలో మల్లె మొగ్గ అనే పదాన్ని ఏమాంటారో తెలుసుకోవడం కోసం తిరగని తండా లేదు. పువ్వుడా అంటారని తెలుసుకొని ఆ పదాన్ని గీతలోకి చేర్చారు. దాదాపు 50 భగవద్గీతలు చదివి 1988 ఆగస్టు నెలలో అనువాదం మొదలుపెట్టారు. దాదాపు 16 నెలలు కృషి చేస్తే పూర్తయింది. కానీ ముద్రణకు మాత్రం 25 ఏళ్లు నిరీక్షించాల్సి వచి్చంది. బంజారా భగవద్గీతను అప్పటి టీటీడీ ప్రెస్ అధికారి రవ్వ శ్రీహరి సహకారంతో తిరుమల బ్రహ్మోత్సవాల్లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జడ్జి రమణ ఆవిష్కరించారు. బంజారాల కోసం అనువదించిన భగవద్గీతతో పాటు ది హిస్టరీ ఆఫ్ బంజారా, బంజారా గీతమాల వంటి రచనలు చేసిన సోమ్లాల్కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 2001లో ఆల్ ఇండియా బంజారా సేవా సమితి ముంబై వారు సోమ్లాల్కు బంజారా జానపద బ్రహ్మ అనే అవార్డు అందించారు. మాజీ సీఎం కేసీఆర్ బంజారా సాహిత్యానికి సోమలాల్ చేస్తున్న సేవలను గుర్తించి బంగారు కంకణం తొడిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఆయనను అభినందించారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన జనగామలోని ప్రభుత్వ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న సమయంలో ఈ హాస్టల్ పక్కనే ఉన్న గీత మందిరం నుంచి ప్రతిరోజూ ఉదయం లౌడ్ స్పీకర్లో వినిపించే గీతా శ్లోకాలను వింటూ స్ఫూర్తి పొందారు. వెనుకబడిన తన బంజారా సమాజానికి గీతా సారాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. -
సీత్ల పండుగ; ఆటా, పాటా సంబురం
గిరిజనులైన లంబాడీలు (బంజారాలు) ఎంతో పవిత్రతో జరుపుకునే మొదటి పండుగ సీత్ల పండుగ. ఆ రోజు సీత్లా భవానీని పూజిస్తారు. కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా భవానీ కాపాడుతుందని బంజారాల నమ్మకం. తండాలో ఉన్న పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వంటివి పెరగాలనీ, దూడలకు పాలు సరిపోను ఉండాలనీ, గడ్డి బాగా దొరకాలనీ, క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలనీ, అటవీ సంపద తరగకూడదనీ, సీత్ల తల్లికి మొక్కులు తీర్చు కుంటారు. వివిధ తండాల్లో ఆయా తండాల పెద్ద మనుషు లంతా కలిసి ఆషాఢమాసంలో ఒక మంగళవారాన్ని ఎంచుకొని సీత్ల పండుగను జరుపుతారు. ఇలా ప్రతి సంవత్సరం మంగళవారం రోజు మాత్రమే జరపడం ఆనవాయితీగా వస్తోంది. తండాల సరిహద్దుల్లోని పొలి మేరల కూడలి వద్ద సీత్ల భవానీని ప్రతిష్టిస్తారు. పురుషులంతా డప్పు వాయిద్యాలు వాయిస్తూ కోళ్లు, మేకలతో; మహిళలు బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేసుకుంటూ అమ్మవారు ఉన్న ప్రదేశానికి వెళ్తారు. ఈ క్రమంలో అందరూ కలిసి పాటలు పాడుతారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్లు, లాప్సి పాయసం సమర్పిస్తారు. కోళ్లు మేకలను బలి ఇచ్చి వాటి పైనుంచి పశువులను దాటిస్తారు. ఓ బంజారా పెద్ద మనిషిని పూజారిగా ఉంచి ఆయన చేతుల మీదుగా దేవత పూజా కార్యక్రమం నిర్వహిం చడం బంజారాల ఆచారం. పూజా కార్యక్రమం అంతా గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. – నరేష్ జాటోత్, నల్లగొండ -
చిరుత మృతి ఘటనలో కొత్త ట్విస్ట్
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలోని బజార్హత్నూర్ మండలం డేడ్రా అటవీ ప్రాంతం చిరుతపులి మృతి చెందిన ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆదివాసీ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే చిరుతను ఎవరు చంపారనే దానిపై ఆదివాసీలు, లంబాడాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పోలీసు ఇన్ఫార్మర్గా ఉన్న లంబాడీ వర్గానికి చెందిన నామ్‌దేవ్ పులిని చంపి ఆ కేసులో అమాయక గిరిజన రైతులను ఇరికించారని ఆదివాసీ నేతలు ఆరోపిస్తున్నారు. నామ్‌దేవ్ పులిని చంపి వస్తూ దారిలో ఉన్న రైతులకు గోర్లు ఇచ్చి.. రెండు కాళ్లు పోలీసులకు ఇచ్చి తమను కేసులో ఇరికించారని నిందితులు చెబుతున్నారు. దీంతో ఆదివాసీలకు, లంబాడీలకు మధ్య వివాదం ముదురుతోంది. మరోవైపు ఆదివాసీ నేతలు ఛలో ఢిల్లీ కార్యక్రమానికి వెళ్లడంతో.. నిందితులు వారిని ఫోన్లో సంప్రదించి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. నామ్‌దేవ్ పోలీసు ఇన్ఫార్మర్ కావడంతోనే తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే అటవీ అధికారులు తమను అదుపులోకి తీసుకున్నట్టు వారు తెలిపారు. కాగా, చిరుత మరణానికి అడవిలో అమర్చిన విద్యుత్ తీగలే కారణమని అటవీ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అందుకు కారణమైన 5గురిని అదుపులోకి తీసుకున్నట్టు, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలిపారు. విద్యుత్ తీగలు పంటల రక్షణ కోసం అమర్చారా లేదా వేట కోసమా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. -
ఐటీడీఏను ముట్టడించిన ఆదివాసీలు
ఉట్నూర్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధాన డిమాండ్‌తోపాటు తమ సమస్యలను ప్రభుత్వం వెంట నే పరిష్కరించాలంటూ ఆదివాసీ మహిళాలోకం కదంతొక్కింది. భారీగా తరలివచ్చిన ఆదివాసీలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఐదువేలకు పైగా ఆదివాసీలు ఆందోళనలో పాల్గొన్నారు. ఉట్నూర్ ప్రధానవీధుల్లో భారీ ప్రదర్శన చేపట్టారు. మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మూడు కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ ఐటీడీఏ కార్యాలయానికి చేరుకుని వారి నుంచి వినతిపత్రం తీసుకున్నప్పటికీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేయడం.. గేటుకు తాళం వేయడం తో ఆదివాసీలు కోపోద్రిక్తులయ్యారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికా రి రావాల్సిందేనంటూ.. లోపలికి చొచ్చుకెళ్లే యత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నా.. ఆదివాసీలు భారీ సంఖ్యలో ఉండటంతో చేతులెత్తేయాల్సి వచ్చింది. పలువురు ఆదివాసీలు గోడపై నుంచి దూకి కార్యాలయం లోపలికి వెళ్లారు. అదనపు ఎస్పీ రవికుమార్, డీఎస్పీ డేవిడ్ ఆదివాసీలకు నచ్చజెప్పే ప్రయ త్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆదివాసీ మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఐటీడీఏ ఉన్నది ఆదివాసీల కోసమేనని, తమను ఎందుకు అనుమతించట్లేదని ప్రశ్నించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు తమ పోరాటం ఆపబోమన్నారు. లంబాడీలకు ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వొద్దంటూ నినదించారు. ఇప్పటికే ధ్రువీకరణ పత్రాలిచ్చిన తహసీల్లార్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్టీలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన 25 మందిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీ నేతలపై పెట్టిన కేసుల ను ఎత్తి వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహిళా సంఘం నాయకులు గోడం రేణుకాబాయి, సోయం లలితాబాయి, మర్సకోల సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
లంబాడీలను మోసం చేసిన కేసీఆర్‌ను ఓడించాలి
హైదరాబాద్: ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిన సీఎం కేసీఆర్‌ను ఎన్నికల్లో ఓడించాలని కేరళ క్యాడర్ ఐజీ లక్ష్మణ్‌నాయక్ లంబాడీలకు పిలుపునిచ్చారు. సేవాళాల్ బంజార సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర మోతిలాల్ అధ్యక్షతన ఐఎస్‌సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో లంబాడీ ప్రజా చైతన్యయాత్ర కార్యక్రమం వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అక్టోబర్ 1 నుంచి రిజర్వేషన్ల సాధనకు 15 నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన లక్ష్మణ్‌నాయక్ మాట్లాడుతూ..ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కూడా తండాల అభివృద్ధికి కేటాయించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు లంబాడీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, రిజర్వేషన్లు కల్పిస్తామన్నవారికే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని సూచించారు. రాష్ట్రంలో 70 నియోజకవర్గాలను లంబాడీలు ప్రభావితం చేయగలరని, ప్రతి పార్టీ లంబాడీలకు 10 ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విద్యుత్‌శాఖలో డీఈ కోటేశ్వర్‌రావుతో పాటు సంఘం రాష్ట్ర నాయకులు మోతిలాల్‌నాయక్, గాంధీనాయక్, జుక్కిబాయి, సక్రిబాయి, తార్యనాయక్, తుకారంనాయక్, లచ్చిరాంనాయక్, రాంలాల్, హరినాయక్, గణేశ్, తిరుపతి, విక్రం పాల్గొన్నారు. -
రహత్‌నగర్‌లో దారుణం
నిజామాబాద్ జిల్లా : భీంగల్ మండలం రహత్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 30 లంబాడీ కుటుంబాలను కులపెద్దలు గ్రామ బహిష్కరణ చేశారు. గత ఆదివారం ఊర పండగ సందర్బంగా గిరిజన కుటుంబాలకు మాంసం పాళ్లు కూడా గ్రామ పెద్దలు పంచలేదు. ప్రశ్నించిన గిరిజనులను గ్రామం వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఆరు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొంటూ గ్రామాభివృద్ది కమిటీపై భీంగల్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తహసీల్దార్‌ను కలిసి గ్రామ పెద్దలపై ఫిర్యాదు చేశారు. ఇంత జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబాలకు ప్రాణభయం ఉందని రక్షణ కూడా కల్పించాలని వేడుకుంటున్నారు. -
బీజేపీ గిరిజన గర్జన సభను అడ్డుకున్న నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాలో బీజేపీ తలపెట్టిన గిరిజన గర్జన సభ రసాభాసగా మారింది. బీజేపీ సభ జరుగుతుండగా గిరిజన సంఘం నాయకులు మధ్యలో అడ్డుకోవడంతో ఆందోళన నెలకొంది. చర్ల మండల కేంద్రంలో భద్రాద్రినియోజక వర్గ పరిధిలో బీజేపీ గిరిజన గర్జన బహిరంగ సభను నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని గిరిజన సంఘం నాయకులు వేదిక వద్ద బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసుల జోక్యంతో ఆందోళనకారులు వెనుదిరిగారు. -
ఆదివాసీలు ఏకతాటిపై ఉండాలి
ఆదిలాబాద్ రూరల్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకూ ఉద్యమాన్ని కొనసాగించాలని, దీనికోసం ఆదివాసీలందరూ ఏకతాటిపై ఉండాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఉద్యమంలో భాగంగా ఈ నెల 17న కలెక్టరేట్ల ముట్టడి, వినతిపత్రాల సమర్పణ, 19న నాగోబా దర్బార్‌లో వినతిపత్రాలు ఇవ్వాలని, అలాగే, దర్బార్‌కు లంబాడీలు ఎవరూ రావద్దని.. 22న గిరిజన సంక్షేమ శాఖ కమిషన్‌కు, అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాల సమర్పణ ఉంటుందని తెలిపారు. 23న గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతిపత్రం అందజేత, 24న హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్, 27న మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర నిర్వహణ బోర్డు సభ్యులుగా లంబాడీలు కొనసాగరాదని పూజారులతో సమావేశం, అదే రోజు కుమురంభీం విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తామని వివరించారు. 30, 31వ తేదీల్లో జిల్లాల వారీగా ప్రజాప్రతినిధుల రాజీనామాలపై ఒత్తిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 5 నుంచి అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని సోయం బాపురావ్ వివరించారు. ఈ నెల నుంచి జూన్ వరకు చేపట్టనున్న కార్యచరణను ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. సమావేశంలో ఆదివాసీ సంఘాల నేతలు మడావి రాజు, పల్ల సత్యనారాయణ, దుర్వ సంజీవ్, ఉయికే సంజీవ్, గోడం గణేశ్, సిడాం వామన్ రావ్, కుడ్మేత భీంరావు, గేడం మనోహర్, ఆదివాసీలు పాల్గొన్నారు. -
ఆదివాసి, లంబాడీల మధ్య చిచ్చు పెట్టింది వాళ్లే
భద్రాద్రి కొత్తగూడెం : అడవి మీద గిరిజనులకు హక్కు లేదనటం అవివేకమని, ప్రభుత్వ పెద్దలే ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చు పెట్టారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఈ విషయంపై సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపడటం లేదని ప్రశ్నించారు. అఖిల పక్షం ఎందుకు నిర్వహించటం లేదని అడిగారు. ఇలాంటి గొడవలు పాలక వర్గాలకు లాభమేనని, గతంలో మాల, మాదిగల మధ్య చిచ్చు రేపారని గుర్తు చేశారు. ఆదివాసీ, లంబాడీల మధ్య సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్‌ను ఎందుకు చట్టంగా మార్చటం లేదో చెప్పాలన్నారు. రాష్ట్రంలో పాలన ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, ఈ పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. గిరిజనుల పోడు భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం కావాలని సీపీఎం కోరుతుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ గద్దె దించటమే లక్ష్యంగా సీపీఎం ఉద్యమాలు చేస్తుందని వ్యాఖ్యానించారు. -
మంచిర్యాల జిల్లాలో మరోసారి ఉద్రిక్తత
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాలోని జన్నారం మండలోని కొత్తపేటతండాపై ఆదివాసీల దాడికి దిగి, గుడిసెలకు నిప్పు పెట్టారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కోలంగూడలో భీమ్రావ్ అనే వ్యక్తిపై సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే లంబాడీలే భీమ్ రావ్‌పై దాడికి చేశారని ఆదివాసీ నాయకులు తండాను ధ్వంసం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు తండాలో భారీగా మోహరించారు. ఆదివాసీలు, లంబాడీ నేతలతో డీసీపీ మనోహర్ రావు చర్చలు జరుపుతున్నారు. -
మంచిర్యాల జిల్లాలో మరోసారి ఉద్రిక్తత
-
లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించాలి
హైదరాబాద్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి వెంటనే తొలగించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గెజిట్ నోటిఫికేషన్ లేకుండా లంబాడీలను 1976లో ఎస్టీ జాబితాలో చేర్చారని, కాని లంబాడీలు మాత్రం తాము 1956 నుంచే ఎస్టీల్లో ఉన్నామని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు పూనెం శ్రీనివాస్, ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు నైతం బాలు మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీల్లో కలపలేదని 2011లో కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిందన్నారు. దాని ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ గెజిట్ లేకుండా లంబాడీలను ఎస్టీల్లో కలపడం అన్యాయమంటూ తాము హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోందని, త్వరలోనే తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. లంబాడీలు తమ రిజర్వేషన్లు, హక్కులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీసీలుగా, కర్ణాటకలో ఎస్సీలుగా, రాజస్తాన్‌లో ఓసీలుగా ఉన్న లంబాడీలు తెలంగాణలో ఎందుకు ఎస్టీలుగా చలామణీ అవుతున్నారని ప్రశ్నించారు. తమ డిమాండ్ నెరవేర్చుకునేందుకు త్వరలో కొమురం భీం లాంటి æపోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. -
మావోయిస్టు పార్టీ బహిరంగ చర్చకు రావాలి
హైదరాబాద్: జగిత్యాల లాంటి జైత్రయాత్ర లంబాడీల పై చేయాలని సీపీఐ(మావోయిస్టు) నేత జగన్ లేఖ విడుదల చేయడాన్ని ఖండిస్తున్నామని పలు లంబాడీ సంఘాలు పేర్కొన్నాయి. మావోయిస్టుల లేఖను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే బహిరంగ చర్చకు రావాలని లంబాడీ సంఘాల నేతలు అన్నారు. జగిత్యాల, సిరిసిల్ల పోరాటం ఆదర్శమన్న జగన్.. తెలంగాణ ఉద్యమం తర్వాత దొరల రాజ్యం వస్తే ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. ‘జనతన సర్కార్‌లో ఎంతమంది గోండులు, లంబాడీలు ఉన్నారో, ఎంతమంది ముఖ్య నాయకులుగా కొనసాగుతున్నారో తెలపాలి’ అని డిమాండ్ చేశారు. శనివారం లంబాడీ హక్కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్ మాట్లాడుతూ బంజారాభవన్, ఆదివాసీ భవన్ శంకుస్థాపన తర్వాతే ఈ అగ్గి రాజుకుందని అన్నారు. ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీమంత్రి అమర్‌సింగ్ తిలావత్ మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకోకుండా లంబాడీలపై ఆదివాసీలు దాడులు చేస్తున్నారని అన్నారు. సమావేశంలో లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, వెంకటేశ్ చౌహాన్, కొటియా నాయక్ పాల్గొన్నారు. -
ఉట్నూర్ సమస్యకు పరిష్కారం!
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీ, లంబాడీల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాంతిభద్రతలు అదుపు తప్ప గా, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయి. కాగా, ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగం ఉట్నూ ర్కు తరలివచ్చింది. శనివారం ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సోమేష్‌కుమార్‌లతో కలిసి హెలికాప్టర్లో ఉదయం ఉట్నూర్‌కు చేరుకున్నారు. సుమారు నాలుగు గంటలపాటు ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లో గడిపారు. మొదట ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో, ఆ తర్వాత ఉమ్మడి జిల్లా అధికారులతో, ఆపై ఆదివాసీ, లంబాడీ పెద్దలతో చర్చలు జరిపారు. మీడియాను ఈ సమావేశాలకు అనుమతించలేదు. శాశ్వత పరిష్కారంపై సీఎం దృష్టి: సీఎస్ ఎస్పీ సింగ్ ఆదివాసీ, లంబాడీల ఘర్షణ నేపథ్యంలో పాత ఆదిలాబాద్ జిల్లాలో చిన్నచిన్న సంఘటనలు జరగడంతో శాంతిభద్రతలపై కొంత ప్రభావం చూపిందని సీఎస్ ఎస్పీ సింగ్ అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని అన్నారు. ఆ సందర్భంలోనే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. పోలీసు, అధికారులతో చర్చలు జరిగాయని తెలి పారు. పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సి ఉందన్నారు. ఆయా కమ్యూనిటీ లీడర్లతో ముఖా ముఖి చర్చించామన్నారు. శాంతి స్థాపన కోసం సహకారం అవసరమని కోరగా, అందుకు ఇరువర్గాల పెద్దలు సహకరిస్తామని చెప్పారని తెలిపారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత కలెక్ట ర్లు, ఎస్పీలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చినట్లు చెప్పారు. చర్చల్లో అదనపు డీజీపీ అంజనీకుమార్, కరీంనగర్ డీఐజీ ప్రమోద్‌కుమార్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్‌రావు, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్, ఐటీడీఏ పీవో, మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఆసిఫాబాద్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఎస్పీలు విష్ణు ఎస్.వారియర్, కల్మేశ్వర్‌లు పాల్గొన్నారు. చర్చలపై అసంతృప్తి.. చర్చలపై ఆదివాసీ, లంబాడీలు అసం తృప్తి వ్యక్తం చేశారు. చర్చల అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ చర్చలతో ఎలాంటి ఫలితం దక్కలేదని ఆదివాసీ సంఘం నేత నైతం రవి అన్నారు. హక్కుల సాధన కోసం ఆదివాసీలు శాంతియుతంగా పోరాటం చేస్తామన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని అన్నారు. వారితో కలసి చర్చలకు ఒప్పుకునేది లేదన్నారు. మరో ఆదివాసీ సం ఘం నేత బొంత ఆశరెడ్డి మాట్లాడుతూ చర్చలు పూర్తి కాలేదని, సీఎంను పిలవాలన్నారు. గవర్నర్ ఆదివాసీల దగ్గరికి రావాలన్నారు. లంబాడీ నాయకులు మాట్లాడుతూ లంబాడీలు ఆడపిల్లలను అమ్ముకుంటున్న సంఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయని, 45 రోజులుగా ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లడం లేదని, పరిష్కారం లేనప్పుడు చర్చలు ఎలా ఫలప్రదమవుతాయన్నారు. -
ఉట్నూరులో డీజీపీ, సీఎస్ పర్యటన
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన అల్లర్ల దృష్ట్యా శాంతి భద్రతలను పర్యవేక్షంచేందుకు డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ శనివారం జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉట్నూరు చేరుకుని పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులతో సీఎస్, డీజీపీ సమావేశమయ్యారు. అదే విధంగా ఆదివాసీ, లంబాడీ నాయకులతో కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. -
ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి ఉద్రిక్తత
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని నేరేడుగొండలో ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. లంబాడీలు దాడి చేశారంటూ జాతీయ రహదారిపై ఆదివాసీలు రాస్తారోకోకు దిగారు. దీంతో రహదారిపై 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మరో వైపు ఆదివాసీ మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి నిరసన తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత జరిగింది. కాగా జిల్లాలో 144 సెక్షన్ విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా జిల్లాలోని ఉట్నూరులో శుక్రవారం జరిగిన ఉద్రిక్తత నేపథ్యంలో ఆందోళనకారులు శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో జిల్లా కేంద్రంలో వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఎక్కడి బస్సులను అక్కడ నిలిచి పోయాయి. ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు మొహరించాయి. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుతున్నాయి. -
ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి ఉద్రిక్తత
-
ఓయూలో లంబాడీ విద్యార్థుల ధర్నా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో లంబాడీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. విద్యార్థులు శనివారం తరగతులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులు వీసీ ఛాంబర్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కాగా ఆదివాసీలు, లంబాడీలు శుక్రవారం పరస్పర దాడులకు దిగడంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే.ఏజెన్సీలోని నార్నూర్ మండలం బేతాల్‌గూడలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కుమురం భీం విగ్రహానికి చెప్పులదండ వేయడంతో వివాదం రాజుకుంది. -
ఆదివాసీ-లంబాడీల వివాదం హింసాత్మకం
-
ఆదివాసీల ఆందోళన హింసాత్మకం
సాక్షి, భూపాలపల్లి : ఆదివాసీ- లంబాడీల వివాదం హింసాత్మకంగా మారింది. మేడారం జాతర ట్రస్టు బోర్డులో ఉన్న ఇద్దరు లంబాడీ సభ్యులను తొలగించాలని గత కొద్ది రోజులుగా ఆదివాసీ సంఘాలు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. జాతర కోసం తెలంగాణ సర్కార్ నియమించిన 11 మంది సభ్యులు గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసేందుకు మేడారం దేవాదాయ కార్యాలయానికి వెళుతుండగా ఆదివాసీలు వారిని అడ్డుకుని వాహనాలను ధ్వంసం చేశారు. ప్రమాణ స్వీకారానికి వెళుతున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ వాహనాన్ని కూడా వారు అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆదివాసీలు ఒక్కసారిగా వాహనాలను అడ్డుకోవడంతో పాటు రాళ్లు విసురుతూ వాహనాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అలాగే మేడారంలోని ఐటీడీఏ కార్యాలయానికి కొంతమంది ఆందోంళనకారులు నిప్పుపెట్టారు. మంటలు చెలరేగి పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. కార్యాలయంలో ఫర్నీచర్, రికార్డులు దగ్ధమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను మోహరించారు. సమాచారం అందుకున్న ములుగు డీఎస్పీ రాఘవేంద్రరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆదివాసీలతో చర్చలు జరుపుతున్నారు. -
రాజకీయ లబ్ధి కోసం అంతరాలు సృష్టిస్తున్నారు: ఎంపీ సీతారాంనాయక్
హైదరాబాద్: కొంతమంది కావాలని రాజకీయ లబ్ది కోసం ఆదివాసీలు, లంబాడీల మధ్య లేనిపోని అంతరాలు కల్పిస్తున్నారని ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో బుధవారం జరిగిన లంబాడి సభలో ఆయన మాట్లాడుతూ 1975 నుండి ఇక్కడే ఉన్నా తమను మైగ్రేటెడ్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఏం కావాలో చెప్తే సామరస్యపూర్వకంగా మాట్లాడుకుందామంటూ క్రిమీలేయర్ ద్వారా ట్రైబల్ యాక్ట్ తీసుకొచ్చారన్నారు. తాము 25 లక్షల మందిమి ఉన్నామని, 30 నుండి 60 మంది ఎమ్మెల్యేలను గెలిపించగల దమ్ము ఉందని, తమ జాతి కోసం ఏమైనా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒకటి రెండు శాతం లేని వాళ్ళు 50 శాతం ఉన్నవాళ్లను శాశిస్తున్నారంటూ రాబోయే రోజుల్లో దేశంలో రిజర్వేషన్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని సీతారాంనాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. -
గిరిజన శక్తిని విచ్ఛిన్నం చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: అన్నదమ్ముల్లా ఉన్న ఆదివాసీలు– లంబాడీల మధ్యలో చిచ్చుపెట్టి విభజించి–పాలించు అనే నినాదంతో కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని లంబాడీ జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లంబాడీలపై జరుగుతున్న అసత్య ఆరోపణలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి సుమారు ఐదు లక్షల జనాభాతో బుధవారం సరూర్‌నగర్ స్టేడియంలో ‘లంబాడీల ఆత్మగౌరవ శంఖారావం’పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని జేఏసీ నేతలు తెలిపారు. ఈ సభకు ఇంటికి ఒకరు చొప్పున కదలి రావాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో లంబాడీ ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ రాజ్యాంగ పరంగా ఆర్టికల్ 342–2, 108/1976 చట్టం ప్రకారం లంబాడీలను ఎస్టీలుగా చేర్చారని తెలిపారు. కానీ కొందరు లంబాడీలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోయ– గోండు సొమ్మును దోచుకొని తిన్నట్లు డిసెంబర్ 9న జరిగిన బహిరంగ సభలో అసభ్య పదజాలంతో మాట్లాడారని, లంబాడీలు విద్య, ఉద్యోగాలు, రాజకీయంగా అభివృద్ధి చెందారని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. 70 శాతమున్నా అందని పథకాలు రాష్ట్ర గిరిజనుల్లో 25 లక్షల జనాభా (70 శాతం) ఉన్న లంబాడీలకు ఒక ఎంపీ, 6.5 లక్షలు ఉన్న ఆదివాసీ తెగలకు ఒక ఎంపీ ఉన్నారన్నారు. 12 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఆదివాసీలు, ఏడుగురు లంబాడీలు ఉన్నారని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల్లో 75 శాతం ఐటీడీఏలకు కేటాయిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న అనేక పథకాలు లంబాడీలకు అందడం లేదన్నారు. లంబాడీలకు 10 శాతం రిజర్వేషన్లు, బ్యాక్లాగ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రిటైర్డ్ అదనపు డీజీపీ డీటీ నాయక్, మాజీ మంత్రి టిలావత్ అమర్‌సింగ్, మాజీ మంత్రి జగన్ నాయక్, ఆలిండియా బంజారా సేవా సంఘం రాçష్ట్ర అధ్యక్షుడు కిషన్‌సింగ్, లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బెల్లయ్యనాయక్, తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గుగులోతు శంకర్‌నాయక్ ఐక్యవేదిక నాయకుడు హనుమంత్ నాయక్ పాల్గొన్నారు. -
లంబాడీ శంఖారావం.. ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 13న జరిగే తెలంగాణ లంబాడీల శంఖారావం బహిరంగ సభకు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. దిల్సుఖ్నగర్ మీదుగా నగరానికి చేరుకునే వారు ఎల్బీనగర్ వైపు రాకుండా ఇతర ప్రాంతాల నుంచి వాహనాలలో వెళ్లాలని సూచించారు. ఎల్బీనగర్ రింగురోడ్డు నుంచి మలక్‌పేట వైపు వెళ్లకుండా ఉప్పల్ ఎక్స్‌రోడ్డు, రామంతాపూర్ అంబర్‌పేట మీదుగా వెళ్లవచ్చని సూచించారు. లేదంటే సంతోష్‌నగర్, కర్మన్‌ఘాట్ మీదుగా వెళ్లవచ్చన్నారు. నగరానికి వెళ్లేవారు ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి వెళ్లి తుక్కుగూడ, శంషాబాద్ మీదుగా నగరానికి చేరుకోవచ్చన్నారు. ఎల్బీనగర్ వైపు వచ్చే వాహనాలు సంతోష్‌నగర్ మీదుగా ఎల్బీనగర్ రింగురోడ్డు చేరుకోవచ్చని పేర్కొన్నారు. పలు మార్గాల గుండా వచ్చే వాహనాలకు పార్కింగ్ పాయింట్లను కేటాయించామని, ఎవరైనా నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పార్కింగ్ పాయింట్లు ఇవే... - వరంగల్ నుంచి వచ్చే వాహనాలు నాగోలు మెట్రో స్టేషన్‌లోని హెచ్ఎండీఏ లేఅవుట్లో పార్కింగ్ చేయాలి. - విజయవాడ నుంచి వచ్చే వాహనాలు హెచ్ఎండీఏ లేఅవుట్ నాగోలులో పార్కు చేయాలి. - ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే వాహనాలు సాగర్ రహదారిపై ఉన్న ఫ్లైటెక్ ఏవియేషన్ మైదానంలో పార్క్ చేయాలి. - కర్మన్‌ఘాట్ వైపు నుంచి వచ్చే వాహనాలు కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి ఆలయం సమీపంలో పార్క్ చేయాలి. - నగరం నుంచి వచ్చే వాహనాలు కొత్తపేటలోని వీఎం హోంలో పార్క్ చేయాలి. - సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఉప్పల్ క్రికెట్ స్టేడియం పరిసర ప్రాంతాలలో పార్క్ చేయాలి. - ఎల్బీనగర్ వైపు వచ్చే వాహనాలు ఎల్బీనగర్లోని డీసీపీ కార్యాలయం సమీపంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పార్క్ చేయాలి. -
ఎల్బీనగర్లో లంబాడీల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో లంబాడి సంఘాల నేతలు శనివారం తీవ్ర ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో లంబాడీల ఆందోళనను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పీఎస్ ముందు బైఠాయించిన లంబాడీలు.. శాంతియుతంగా నిరసన తెలుపున్న తమను అన్యాయంగా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఆదివాసీలు, లంబాడీల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ నెల 13 న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం సభ నిర్వహిస్తామని వారు లంబాడీ సంఘం నేతలు తెలిపారు. కాగా ఈ రోజు సరూర నగర్లో ఆదివాసీల మహాగర్జన సభ జరుగనుంది. ఈ సభకు ఆదివాసీలు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఎస్టీల నుంచి లంబాడీలను తొలగించాలని ఈ సభ నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
లంబాడీల ‘ఆత్మగౌరవ ర్యాలీ’
కొత్తగూడెం: రాష్ట్రంలో లంబాడీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన బంజారా జేఏసీ నాయకులు, కార్యకర్తలు గురువారం లక్ష్మీదేవిపల్లి నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ‘ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీ అంబర్‌కిషోర్ ఝాకు వినతిపత్రాలు అందజేశారు. అన్నదమ్ముల్లా కలసి ఉన్న లంబాడీలు, కోయలు, గోండుల మధ్య గొడవలు లేపుతూ శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారని లంబాడీ నాయకులు వ్యాఖ్యానించారు. -
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి
హైదరాబాద్ : తెలంగాణలోని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని మాజీ ఎమ్మెల్యే, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాబురావు డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితాలో లంబాడీలు ఉండటం వల్ల ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ తెలంగాణ ప్రజా ఫ్రంట్(టీపీఎఫ్) ఆధ్వర్యంలో ‘‘తెలంగాణలో సాగుతున్న ఆదివాసీ ఉద్యమం– ప్రజాస్వామిక దృక్పథం’’అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ(ఏ)లో ఉన్న లంబాడీలను 1970వ సంవత్సరంలో అసెంబ్లీలో తీర్మానం చేయకుండా, గవర్నర్ నివేదిక, ట్రైబల్ అడ్వజరీ కమిటి నివేదిక లేకుండా ఎస్టీ జాబితాలో చేర్చారని అన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు ఇంద్రవెల్లి తరహాలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. త్వరలో నిజాం కళాశాల మైదానంలో బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. ప్రొఫెసర్ భంగ్యా భూక్యా మాట్లాడుతూ ఎస్టీలపై సమగ్రంగా అధ్యయనం చేస్తే వాస్తవాలు బయటికి వస్తాయని అన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ లంబాడీల వల్ల నష్టపోయామనే భావన ఆదివాసీల్లో బలంగా ఉందని, రెండు గ్రూపుల మధ్య తగాదాలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. టీపీఎఫ్ అధ్యక్షుడు నలమా స కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టఫ్ అధ్యక్షురాలు విమలక్క, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్, రాజు నాయక్,కె.గోవర్ధన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కదంతొక్కిన ఆదివాసీలు
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌లో ఆదివాసీలు కదంతొక్కారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సోమవారం ఆదివాసీలు జిల్లా కేంద్రం లో కలెక్టరేట్‌ను ముట్టడించి, ధర్నా నిర్వహించారు. అంతకు ముందు భారీ ర్యాలీ చేపట్టారు. లంబాడీల ను ఎస్టీ జాబితాలోనుంచి తొలగించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు డిమాండ్ చేశారు. అంతవరకు ఉద్యమం ఆగదన్నారు. 1977 నుండి ఎస్టీలుగా చలామణి అవుతున్న పక్క రాష్ట్రం నుంచి వలస వచ్చిన లంబాడీలు ఏజెన్సీ సర్టిఫికెట్లు పొంది ఎస్టీలుగా గుర్తింపుతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారన్నారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. కొమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర కార్యదర్శి వెంకగారి భూమయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. వచ్చే నెల 9 వరకు వేచి చూస్తాం ఆదిలాబాద్ రూరల్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే విషయంలో డిసెంబర్ 9 వరకు వేచి చూస్తామని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆదివాసీ నాయకులు హెచ్చరించారు. ఆదివాసీలు సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందజేశారు. -
లంబాడీలపై దాడులు అమానుషం
హైదరాబాద్: తెలంగాణలో లంబాడీ జాతిని ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కోయలు, గోండ్లు నిరసన ప్రదర్శన చేయడమే కాకుండా లంబాడీ ఉపాధ్యాయులపై దాడులు చేయడం అమానుషం అని మాజీ ఎంపీ ధరావత్ రవీంద్రనాయక్ అన్నారు. ‘లంబాడీలపై దాడులు – కుట్రలు – వాస్తవాలు’అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం డాక్టర్ రాజ్‌కుమార్ జాదవ్ ఆధ్వర్యంలో లంబాడీ నాయకుల సమావేశం జరిగింది. లంబాడీలను దెబ్బతీయాలని కొన్నిశక్తులు దురుద్దేశంతో కోయలను ఉసిగొల్పుతున్నాయని రవీంద్రనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిన పాలకులు వాటిని విస్మరించడమే కాకుండా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాలల గదుల నుండి లంబాడీ ఉపాధ్యాయులను బయటకు తీసుకువచ్చి దాడులు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. బంజారా, కోయల మధ్య జరుగుతున్న గొడవలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ మాట్లాడుతూ లంబాడీ జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పిం చాలని కోరారు. రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడంలేదని ఆరోపించారు. డాక్టర్ రాజ్‌కుమార్ జాదవ్ మాట్లాడుతూ ఈ నెల 30న భద్రాద్రి కొత్తగూడెంలో లంబాడీ ఆత్మగౌరవ భారీ బహిరంగసభను లక్ష మందితో నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బెల్లయ్య నాయక్, సంజీవ నాయక్, జగన్‌లాల్, లక్ష్మణ్ నాయ క్, బాలు చౌహన్, కరాటే రాజు, శ్యాం నాయక్, రాంచంద్రనాయక్ పాల్గొన్నారు. -
లంబాడీలను ‘ఎస్టీ’ నుంచి తొలగించకుంటే..
గుడిహత్నూర్(బోథ్): లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించకుంటే ‘మావ నాటే–మావ రాజ్యం’ (మా ప్రాంతం–మా రాజ్యం) ఏర్పాటు చేసుకుంటామని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాపురావుతోపాటు పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడారు. గత పాలకులు రాష్ట్రంలో ఉన్న లంబాడీలను రాజ్యాంగానికి విరుద్ధంగా ముసాయిదా లేకుండా, రాష్ట్రపతి ఆమోదం లేకుండా ఎస్టీ జాబితాలో చేర్చారని ఆరోపించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నేడు అసలైన ఆదివాసీ బిడ్డలు వివక్షకు గురై వెనుకబాటును అనుభవిస్తున్నారన్నారు. లంబాడీ ఉద్యోగులు ఆదివాసీ బిడ్డలను విద్య, రాజకీయ, ఉద్యోగ పరంగా వివక్షకు గురి చేస్తూ వారికి భవిష్యత్తు లేకుండా వ్యవహరిస్తున్నారని గర్జించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు శాంతియుత పోరాటం చేస్తామన్నారు. ఈ నెల 9న హైదరాబాద్‌లో నిర్వహించే సభకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సభకు అనుమతి లభిస్తుందని అనుమతి లభించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ మోహన్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు జల్కే పాండురంగ్ తదితరులు పాల్గొన్నారు. -
లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించాలి
ఇంద్రవెల్లి(ఖానాపూర్): లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని ఆదివాసీలు డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఉద్యమం ఆపేది లేదని తేల్చి చెప్పారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇంద్రవెల్లి స్తూపం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఆదివాసీలు శనివారం భారీ ర్యాలీ తీశారు. నల్లబ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉన్నా.. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివచ్చారు. ఐటీడీఏ ఏపీవో జనరల్ కుమ్రు నాగోరావు, తహసీల్దార్ శివరాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ గత పాలకులు లంబాడీలను విద్యాపరంగా మాత్రమే 1976లో ఎస్టీ జాబితాలో చేర్చారని, దీంతో అసలైన ఆదివాసీలకు వచ్చే ఉద్యోగ, రాజకీయ హక్కులన్నీ లంబాడీలే దోచుకుంటున్నారని ఆరోపించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్‌తో డిసెంబర్ 9న ‘చలో హైదరాబాద్’ నిర్వహిస్తామని చెప్పారు. ఏజెన్సీలో 144 సెక్షన్ ఎత్తివేయా లని డిమాండ్ చేశారు. ఆదివాసీల ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓఎన్డీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి వెడ్మా బోజ్జు, అమరవీరుల ఆశయ సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు పుర్క బాపురావ్, ఆదివాసీ నాయకులు కనక తుకారాం, ఆర్క ఖమ్ము, తోడసం నాగోరావ్, ఆయా గ్రామాల పెద్దలు వెట్టి రాజేశ్వర్, సోయం మాన్కు, హెరేకుమ్ర జంగు, మెస్రం ఇస్తారి, కినక లచ్చు, మెస్రం వెంకట్రావ్ తదితరులున్నారు. -
‘నమో వెంకటేశ’ పేరు మార్చాలి
-లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడి డిమాండ్ - లేనిపక్షంలో దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధపడతామని హెచ్చరిక కర్నూలు (సీక్యాంప్): గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న రాఘవేంద్రరావు సినిమా ‘నమో వెంకటేశా’ పేరు మార్చాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కైలాష్ నాయక్ డిమాండ్ చేశారు. నగరశివారు సుగాలితండాలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12కోట్ల మంది బంజారా జాతి గురువు హథీరాంబావాను కించపరిచేలా సినిమా సన్నివేశాలున్నాయన్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు తరహాలో నమో వెంకటేశను కూడా హథీరాంబావా గురించి తీయాలన్నారు. విషయంపై చిత్ర దర్శకుడు రాఘవేంద్రరావును కలుస్తామని, ఆయన అంగీకరించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో సమితి నాయకులు శంకర్ నాయక్, గుండాల్నాయక్, యోగేష్‌నాయక్, శీతారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనులకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి
– లంబాడీ హక్కుల పోరాట సమితి నేతల డిమాండ్ జంగారెడ్డిగూడెం : గిరిజనులకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో లంబాడీ హక్కుల పోరాట సమతి సమావేశం జరిగింది. డివిజన్ అధ్యక్షుడు భూక్యా ధనునాయక్ అధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల జనాభా ఉన్న గిరిజనులకు మంత్రివర్గంలో చోటులేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి మంత్రివర్గంలో గిరిజనులకు చోటు కల్పించడంతో పాటు నామినేటెడ్ పోస్టులు గిరిజనులకు కేటాయించాలని కోరారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా నాగేశ్వరరావు నాయక్ మాట్లాడుతూ అక్టోబర్ 2న పుట్టపర్తిలో గిరిజనుల ఐక్యత బహిరంగసభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 500 మంది జనాభా ఉన్న తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించడం, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ పదవి గిరిజనులకే ఇవ్వాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, కష్ణా జిల్లాలో సీట్లు కేటాయించాలనే అంశాలపై తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సభకు సంబంధించి కరపత్రాన్ని నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు, లంబాడీలు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. గొగ్గులోతు మోహనరావు నాయక్, డీకే నాయక్, డి.నాగేశ్వరరావు నాయక్, జె.వెంకటేశ్వరరావు నాయక్ పాల్గొన్నారు. -
పీఎంపీ కుటుంబానికి న్యాయం చేయాలి
ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఇటీవల చింతలపూడి నియోజకవర్గంలో హత్యకు గురైన ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ ధారావతు నాగేశ్వరరావు కుటుంబానికి న్యాయం చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు భూక్యా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక లంబాడీ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చింతలపూడి మండలం పట్టాయగూడెంలో 20 సంవత్సరాలుగా నాగేశ్వరరావు ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని, రెండు సంవత్సరాల క్రితం ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అతనిపై దాడికి పాల్పడగా నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెద్దలు చర్చలు జరిపి రాజీ చేశారని తెలిపారు. అయితే అప్పటి నుంచి నాగేశ్వరరావుపై కక్ష కట్టిన ఆ గ్రామానికి చెందిన అగ్రకులాలకు చెందిన వ్యక్తులు గత నెల 11న పట్టాయగూడెంకు రెండు కిలోమీటర్ల దూరంలోని అడవిలోకి తీసుకువెళ్లి దారుణంగా హత్య చేశారని తెలిపారు. దీనిపై చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆరోపించారు. బాధితుడికుటుంబానికి న్యాయం చేయాలని, నాగేశ్వరరావును హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సమావేశంలో సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడిత్యా శ్రీనివాస నాయక్, సంయుక్త కార్యదర్శి ధారావతు కీమ్యా నాయక్ పాల్గొన్నారు. -
సమనకేర్.. సంప్రదాయ వేడుక
– గిరిజనుల పండగ – అంటువ్యాధులు ప్రబలకుండా కుల దైవానికి వేడుకోలు – జిల్లాలోని 61 తండాల్లో వేడుక – ఈ నెల చివరి వరకు పూజలు కర్నూలు సీక్యాంప్: సమనకేర్..ఇదో గిరిజన పండగ. ఊరూవాడ, పిల్లాజల్లా అందరూ బాగుండాలని ప్రతీ సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించే వేడుక. జిల్లాలోని 61 తండాల్లో ఉత్సవ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం ప్రారంభమైన పూజలు ఆగస్టు నెల ఆఖరు వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో సమనకేర్ ప్రత్యేక, విశిష్టతలపై ప్రత్యేక కథనం సమన అంటే ఊరి బయట అని అర్థం. ఊరి చివరికి వెళ్లి అమ్మవారికి యాటను బలి ఇచ్చి అక్కడ అన్ని కుటుంబాలు వెళ్లి సామూహిక విందును ఆరగిస్తారు. ఊరి చివరకు వెళ్లి తిని వచ్చిన అనంతరం గ్రామంలో దోమలను, ఈగలను అమ్మవారు గ్రామం బయటకు పంపేస్తారని వారి విశ్వాసం. తర్వాత దోమలు, ఈగల ద్వారా రోగాలు ప్రబలబోవని వారి నమ్మకం. ప్రతీ ఏడాది ఈ పండుగ నిర్వహిస్తారు. పూర్వాకాలంలో దోమలు, ఈగలతో కలరా, మలేరియా లాంటి అంటురోగాలు ప్రబలి జనం మత్యవాత పడేవారు. దీంతో గిరిజనులు తమ కుల దైవం దండిమారెమ్మ, గిరిజనుల గురువు సేవాలాల్ మహరాజ్‌కు పూజలు నిర్వహించారు. అప్పటి నుంచి రోగాలు దరిచేరలేదని..అందుకే ఏటా ఈ పండగను జరుపుకుంటామని గిరిజన పెద్దలు చెబుతున్నారు. పూజలు ఇలా చేస్తారు... గిరిజనుల కుల దైవం దండి మారెమ్మ తల్లికి యాటను బలి ఇచ్చి నైవేద్యం సమర్పిస్తారు. వారి గురువు సేవాలాల్ మహరాజ్‌కు బెల్లంతో తయారు చేసిన అన్నం నైవేద్యంగా పెడతారు. అనంతరం దేవతలకు తమ గ్రామంలో, తమ కులంలో, రాష్ట్రంలో ఉన్న సమస్యలు చెప్పి బాధా తప్ప హదయాలతో వాటిని తీర్చాలని కోరుతారు. అనంతరం సామూహిక భోజనం చేస్తారు. ప్రభుత్వం గుర్తించాలి: రాంనాయక్ లంబాడీ కులం పెద్ద తెలంగాణ ప్రభుత్వం ఈ పండగను అధికారికంగా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పండగను గుర్తించలేదు. గిరిజనులు భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి అన్ని పండుగలతో పాటు సమానంగా మాకు సమనకేర్ కానుకలు ఇవ్వాలి. అంటురోగాలు ప్రబలకుండా ప్రార్థిస్తాం: హాషాబాయ్ పూసల కార్తెలో అంటురోగాలు ప్రబలకుండా సమనకేర్ పూజ చేస్తాం. దేశవ్యాప్తంగా గిరిజనులు ఈ పండుగను నిర్వహిస్తారు. గ్రామంలో ఈ సీజన్లో దోమల ద్వారా వచ్చే అంటురోగాలు ప్రబలకుండా అమ్మవారిని మొక్కుతాం. -
‘ఆసరా’ కోసం ఆందోళనాపథం
మా వయస్సు 70, 75 ఏళ్లుంటాయి. మరి మా పేర్లు ఎందుకు పింఛన్ జాబితాలో లేవు? మేము వృద్ధులం కామా?.. వందశాతం వైకల్యం ఉన్నా.. తమనెందుకు పింఛన్లకు ఎంపిక చేయలేదు.. మా భర్తలు చనిపోయి పింఛన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం.. ఈ సమయంలో పింఛన్ జాబితాలో ఎందుకు మా పేర్లు ఎందుకు చేర్చలేదంటూ జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన వారు ఆయా పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో అధికారులను నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని పలువురు పేర్కొన్నారు. వీరికి పలు పార్టీల నేతలు, వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. జాబితాలోపేర్లు లేని వారు చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కాగా ఎమ్మెల్యే సోలిపేట హామీతో వారు ఆందోళన విరమించారు. - రామాయంపేట/జోగిపేట/దుబ్బాక/మెదక్ రూరల్/చేగుంట పింఛన్రాకుంటే ఎలాబతకాలి? నా వయస్సు 75. చాలాకాలంగా పింఛన్ వచ్చేది. దీంతోనే మందుగోలీలు కొనుగోలు చేసి బతుకుతున్నా. ప్రస్తుతం పింఛన్ లిస్టులో నాపేరు రాలేదట. ఈ పరిస్థితుల్లో నాకు కూలీ పనులు వెళదామన్నా.. కాని పరిస్థితి. నాకు న్యాయం చేయాలి. - లంబాడి దుర్గి హవేళిఘనపూర్ తండా, మెదక్. వందశాతం వైకల్యం ఉన్నా.. నా కొడుకు పేరు నక్క వర్ధన్. పుట్టుకతోనే చెవిటి, మూగతో పాటు మానసిక వికలాం గుడు. కనీసం నిలబడను లేడు. ఇతనికి 100 శాతం వైకల్యం ఉంది. అయితే అధికారులు పింఛన్ జాబితాలో పేరు చేర్చలేదు. - సాయిలు, వర్దన్ తండ్రి,హవేళిఘనపూర్ మెదక్. -
లంబాడీల ఆభరణాల తయారీకి ప్రోత్సాహం
డిచ్పల్లి, న్యూస్‌లైన్: లంబాడీల సంప్రదాయ ఆభరణాల తయారీలో మరింత నైపుణ్యం పెరిగే విధంగా ఆ తెగ మహిళలకు ప్రత్యేక శిక్షణ తరగతుల ఏర్పాటుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న హామీ ఇచ్చారు. శుక్రవారం డిచ్పల్లి మండలం బీబీపూర్ పంచాయతీ పరిధిలోని అవుసుల తండాను కలెక్టర్ సందర్శించారు. తండాలో జర్మన్ సిల్వర్‌తో ఆభరణా లు తయారీ, రంగు రంగుల దారాలతో, వివిధ సైజుల అద్దాలు పెట్టి తయారు చేసే లంబాడీల సంప్రదాయ దుస్తులు, వస్తువులను ఆయన పరిశీలించారు. తయారీ విధానం, తయారీకయ్యే ఖర్చు, వినియోగం, వాటి అమ్మకం ద్వారా వచ్చే ఆదాయ వివరాలను లంబాడీ మహిళలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సమాజం ఆధునికంగా మారడం, మార్కెట్లలో అతి తక్కువ ధరకే రోల్డ్‌గోల్డ్ వస్తువులు, వివిధ రకాల ఆభరణాలు లభిస్తుండటం వల్ల తాము తయారు చేసిన వస్తువులను కొనేవారు తగ్గిపోయారని లంబాడీ మహిళలు కలెక్టర్‌కు వివరించారు. ఎలాంటి యం త్ర పరికరాలు ఉపయోగించకుండా పూర్తిగా జర్మన్ సిల్వర్ ఆభరణాలను స్వయంగా తయారు చేస్తామని ఒక్కో రకం ఆభరణ ం తయారు చేసేందుకు రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుందన్నారు. తమ తాత ముత్తాతల కాలం నుంచి సంప్రదాయ ఆభరణాలు, గిరిజన మహిళలు వివిధ వేడుకల్లో ధరించే దుస్తులు, వస్తువులు తయారు చేస్తున్నామని తెలిపారు. ఇదే తమ కులవృత్తిగా మారిందన్నారు. ఆభరణాలు తయారు చేయ డం వల్లనే తమ తండాకు అవుసుల తండా అనే పేరు వచ్చిందన్నారు. తయారు చేసిన ఆభరణాలు, దుస్తులు, వస్తువులన జిల్లాలోని వివిధ మండలాల్లో జరిగే వారాంతపు సంతల్లో అమ్ముకుని బతుకు బండిని లాగిస్తున్నామని తెలిపా రు. వరంగల్‌లో జరిగే సమ్మక్క - సారక్క జాత ర సమయంలో అక్కడికి వెళ్లి తాము తయారు చేసిన ఆభరణాలు, దుస్తులు అమ్మకాలు సాగిస్తామని తెలిపారు. ఇటీవలే కొందరు సీసీ పరిశ్రమ వారు తమ ఆభరణాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. రాష్ర్టంలోని వివిధ ప్రాం తాలు, ఇతర రాష్ట్రాల్లో తాము తయారు చేసిన సంప్రదాయ ఆభరణాలు, దుస్తులు, ఇతర వస్తువులను ప్రదర్శించే విధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు సహకారం అందించాలని కోరా రు. తద్వారా తాము తయారు చేసే వస్తువులు, ఆభరణాలకు మంచి ధర లభించి ఆర్థికంగా ఎదిగే అవకాశముంటుందన్నారు. జిల్లాలో బాన్సువాడ, నిజాంసాగర్, గాంధారి మండలాల్లో మరో మూడు తండాల్లో గిరిజన సాంప్రదాయ ఆభరణాలు తయారు చేస్తారని కలెక్టర్‌కు ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ) ప్రాజెక్ట్ డెరైక్టర్(పీడీ) వెంకటేశం తెలిపారు. అయితే ఆయా తండాల్లో కేవలం రెండు మూడు కుటుంబాల వారు మాత్రమే ఆభరణాలు తయారు చేస్తారని, డిచ్పల్లి అవుసుల తండాలో మాత్రం తం డాలోని అన్ని కుటుంబాలు ఇదే వృత్తిని కొనసాగిస్తున్నాయని వివరించారు. తండా వాసులు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ఐకేపీ ఆధ్వర్యంలో రూ.కోటి విలువ గల ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు వివరించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా గిరిజన సంప్రదా య ఆభరణాలు, దుస్తులు, ఇతర వస్తువులు తయారు చేయడంతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా గృహోపకరణాల తయారీ, వృత్తి నైపుణ్యాల పెంపులో నూతన విధానాలపై శిక్షణ ఇస్తామని తెలిపారు. గృహ అవసరాలను వినియోగించుకుంటూ, తయారు చేసిన వాటికి తగిన మార్కెట్ సౌకర్యం కల్పించడం, దేశ, విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రోత్సాహాన్ని కల్పించడం తదితర చర్యలు తీసుకుం టామని తెలిపారు. ఇందు కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని కలెక్టర్‌కు వివరిం చారు. ప్రభుత్వం ద్వారా తగిన సహాయ, సహకారాలు అందజేసేందుకు అన్నివిధాల కృషి చేస్తామని కలెక్టర్ తండా వాసుకులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట విశ్రాంత ఐఏఎస్ అధికారి మనోహర్ ప్రసాద్, తహశీల్దార్ వెంకట య్య, సర్పంచ్ సుందర్, డ్వాక్రా బజార్ ఈవో భాగ్యరేఖ,డీపీఎం ప్రసాద్‌రావు, ఏపీఎం అనిల్‌కుమార్, గిరి తదితరులు ఉన్నారు. -
ఘనంగా తీజ్ ఉత్సవ్ మేళా
హైదరాబాద్: లంబాడిల తీజ్ ఉత్సవ్ మేళా ఉరేగింపు ఆదివార ఘనంగా జరిగింది. హబ్సిగూడ గాంధీ గిరిజన బస్తీ నుంచి వెలుగుట్ట వరకు జరిగిన ఉరేగింపులో యువతీయువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తోమ్మిది రోజులపాటు నిష్టంగా పెంచిన గోధుమ నారు బుట్టలను ఉరేగింపుగా బీబీనగర్ చెరువులో నిమజ్జననానికి తీసుకువెళ్లారు. సాంప్రదాయబద్దంగా జరుపుకునే ఈ ఉత్సవంలో లంబాడీలు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతీయువకుల నృత్యాలు అందరినీ ఆకట్టున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి, టిడిపి నాయకుడు బోబ్బల రమణారెడ్డి హాజరయ్యారు.