సమావేశంలో అభివాదం చేస్తున్న లంబాడీ హక్కుల ఐక్యవేదిక నేతలు
హైదరాబాద్: జగిత్యాల లాంటి జైత్రయాత్ర లంబాడీల పై చేయాలని సీపీఐ(మావోయిస్టు) నేత జగన్ లేఖ విడుదల చేయడాన్ని ఖండిస్తున్నామని పలు లంబాడీ సంఘాలు పేర్కొన్నాయి. మావోయిస్టుల లేఖను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే బహిరంగ చర్చకు రావాలని లంబాడీ సంఘాల నేతలు అన్నారు. జగిత్యాల, సిరిసిల్ల పోరాటం ఆదర్శమన్న జగన్.. తెలంగాణ ఉద్యమం తర్వాత దొరల రాజ్యం వస్తే ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. ‘జనతన సర్కార్‌లో ఎంతమంది గోండులు, లంబాడీలు ఉన్నారో, ఎంతమంది ముఖ్య నాయకులుగా కొనసాగుతున్నారో తెలపాలి’ అని డిమాండ్ చేశారు.
శనివారం లంబాడీ హక్కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్ మాట్లాడుతూ బంజారాభవన్, ఆదివాసీ భవన్ శంకుస్థాపన తర్వాతే ఈ అగ్గి రాజుకుందని అన్నారు. ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీమంత్రి అమర్‌సింగ్ తిలావత్ మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకోకుండా లంబాడీలపై ఆదివాసీలు దాడులు చేస్తున్నారని అన్నారు. సమావేశంలో లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, వెంకటేశ్ చౌహాన్, కొటియా నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment