ఎల్బీనగర్‌లో లంబాడీల ఆందోళన | lambadi leaders protest in LB nagar | Sakshi
Sakshi News home page

ఎల్బీనగర్‌లో లంబాడీల ఆందోళన

Published Sat, Dec 9 2017 1:20 PM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

 lambadi leaders protest in LB nagar

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌లో లంబాడి సంఘాల నేతలు శనివారం తీవ్ర ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో లంబాడీల ఆందోళనను పోలీసులు అడ్డుకుని పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. పీఎస్‌ ముందు బైఠాయించిన లంబాడీలు.. శాంతియుతంగా నిరసన తెలుపున్న తమను అన్యాయంగా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఆదివాసీలు, లంబాడీల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ నెల 13 న సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియం సభ నిర్వహిస్తామని వారు లంబాడీ సంఘం నేతలు తెలిపారు.

కాగా ఈ రోజు సరూర​ నగర్‌లో ఆదివాసీల మహాగర్జన సభ జరుగనుంది. ఈ సభకు ఆదివాసీలు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఎస్టీల నుంచి లంబాడీలను తొలగించాలని ఈ సభ నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement