సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని నేరేడుగొండలో ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. లంబాడీలు దాడి చేశారంటూ జాతీయ రహదారిపై ఆదివాసీలు రాస్తారోకోకు దిగారు.
దీంతో రహదారిపై 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మరో వైపు ఆదివాసీ మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి నిరసన తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత జరిగింది. కాగా జిల్లాలో 144 సెక్షన్ విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
కాగా జిల్లాలోని ఉట్నూరులో శుక్రవారం జరిగిన ఉద్రిక్తత నేపథ్యంలో ఆందోళనకారులు శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో జిల్లా కేంద్రంలో వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఎక్కడి బస్సులను అక్కడ నిలిచి పోయాయి. ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు మొహరించాయి. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment