హైదరాబాద్: కొంతమంది కావాలని రాజకీయ లబ్ది కోసం ఆదివాసీలు, లంబాడీల మధ్య లేనిపోని అంతరాలు కల్పిస్తున్నారని ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో బుధవారం జరిగిన
లంబాడి సభలో ఆయన మాట్లాడుతూ 1975 నుండి ఇక్కడే ఉన్నా తమను మైగ్రేటెడ్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఏం కావాలో చెప్తే సామరస్యపూర్వకంగా మాట్లాడుకుందామంటూ క్రిమీలేయర్ ద్వారా ట్రైబల్ యాక్ట్ తీసుకొచ్చారన్నారు. తాము 25 లక్షల మందిమి ఉన్నామని, 30 నుండి 60 మంది ఎమ్మెల్యేలను గెలిపించగల దమ్ము ఉందని, తమ జాతి కోసం ఏమైనా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒకటి రెండు శాతం లేని వాళ్ళు 50 శాతం ఉన్నవాళ్లను శాశిస్తున్నారంటూ రాబోయే రోజుల్లో దేశంలో రిజర్వేషన్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని సీతారాంనాయక్ ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ లబ్ధి కోసం అంతరాలు సృష్టిస్తున్నారు: ఎంపీ సీతారాంనాయక్
Published Wed, Dec 13 2017 2:50 PM | Last Updated on Wed, Dec 13 2017 2:50 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment