aadivaasi
-
డ్రోన్ దాడులను ఖండించండి
ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో పోలీసులు జరిపిన డ్రోన్ దాడులను ఖండించాలని మావో యిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో సమత ఆదివారం లేఖ విడుదల చేశారు. ఆదివాసీ గ్రామాలైన మెట్టగూడ, ఎర్షన్పల్లి, బొట్టెంతోగు గ్రామాల్లోని పొలాలు, ఇళ్ల సమీపాల్లో ఈనెల 13న పోలీసులు డ్రోన్ల ద్వారా పెద్ద ఎత్తున బాంబులు వేశారని, నాలుగైదు కిలోమీటర్ల పరిధిలో పలు చోట్ల పెద్ద ఎత్తున అలజడి సృష్టించారని సమత పేర్కొన్నారు. ఇలాంటి దాడులను అన్ని వర్గాల ప్రజలు ఖండించాలని కోరారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాక అటవీ ప్రాంతాలపై దాడులు అధికమయ్యాయని, అటవీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను దోచుకునే క్రమంలో అడ్డంకిగా ఉన్న ఆదివాసీలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకే క్యాంపులు ఏర్పాటు చేస్తూ వేల సంఖ్యలో పోలీసులను మోహరింపజేస్తున్నారని ఆరోపించారు. అటవీ సంపదను దోచుకెళ్లేందుకు అడవులను ధ్వంసం చేసి రోడ్లు, సెల్ టవర్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. ఆదివాసీ గ్రామాలపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరపడం, అమాయకులను కొట్టడం, జైళ్లల్లో నిర్బంధించడం వంటి దుశ్చర్యలు సరైనవి కావని హితవు పలికారు. బీజాపూర్ జిల్లా మద్వేడి గ్రామంలో పోలీసు కాల్పుల్లో అరు నెలల పాప మృతి చెందగా, ఆమె తల్లికి గాయాలయ్యాయని, వైద్యం పేరుతో అదుపులోకి తీసుకొని జైళ్లో బంధించారని విమర్శించారు. ఈ దాడులన్నీ సీఎం విష్ణుదేవ్‌సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్‌శర్మ ఆదేశాల మేరకు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రజాప్రతినిధులు డ్రోన్ దాడులను ఖండించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇవి చదవండి: ప్రాణం తీసిన చైనా మాంజా! -
అమెరికాలో ప్రొఫెసర్‌గా వరంగల్ ఆదివాసీ
వరంగల్: కడు పేదరికం.. తినడానికి అన్నం కూడా దొరకని పరిస్థితి. తండ్రి పని చేస్తేనే పూటగడిచేది. లేనిపక్షంలో పస్తులుండడమే. పైగా మారుమూల గ్రామం.. అందులో పాఠశాల కూడా లేని కుగ్రామం. ఇలాంటి తరుణంలో ఎవరికైనా చదువుకోవాలనే ఆలోచనే రాదు. ఏదైనా పని చేసుకుని బతకాలని భావిస్తారు. కానీ అలాంటి వారికి ఈ యువకుడు పూర్తిగా విరుద్ధం. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. ఒక పక్క సమస్యలతో సహవాసం చేసూ్తనే.. మరో పక్క అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఆయననే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మారుమూల ఏజెన్సీ ఆదివాసీ గ్రామం దొరవారివేంపలి్లకి చెందిన ఈక ప్రభాకర్. తాను ఎంచుకున్న విద్యలో ఖండాంతరాలు దాటి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అయోవాలో ప్రొఫెసర్‌గా పని చేసేందుకు ఎంపికయ్యారు. ఎర్ర బస్సు కూడా ఎరగని ఈ గ్రామం నుంచి అమెరికాకు వెళ్లడంపై గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈక పాపమ్మ–సమ్మయ్య దంపతుల ప్రథమ సంతానం ప్రభాకర్. తన ఎదుగుదల గురించి ఆయన మాటల్లోనే.. ‘పోడు వ్యవసాయం ఆధారంగానే మా కుటుంబ పోషణ గడిచేది. తినడానికే ఇబ్బంది పడే పరిస్థితి. గ్రామంలో పాఠశాల కూడా లేదు. 1989లో అప్పటి ఐటీడీఎ పీఓ బెస్ట్ అవైలెబుల్ పాఠశాలలకు విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. హాస్టల్‌కు వెళ్తే కనీసం అన్నం అయినా సరిగా దొరుకుతుందనుకునే పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిలోనే రాజేంద్ర కాన్వెంట్ హై స్కూల్లో సీటు వచ్చింది. పాఠశాల చదువులోనే మా తల్లి పాపమ్మ 1997లో మృతి చెందింది. ఈ ఘటనను దిగమింగుకుని పదో తరగతి పూర్తి చేశా. అనంతరం ఇంటర్ ఎల్బీ కళాశాల వరంగల్‌లో, కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో బీజెడ్సీ గ్రూపులో డిగ్రీ పూర్తి చేశా. వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో బయో టెక్నాలజీలో పీజీ పూర్తి చేశా. బెస్ట్ అవైలెబుల్ స్కీం పూర్తయిన తరువాత ఐటీడీఏ నుంచి స్కాలర్ షిప్‌కు ఎంపికయ్యా. ఆ స్కాలర్ షిప్‌తోనే డిగ్రీ, పీజి పూర్తయింది. 2006 నుంచి 2013 వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డి పూర్తి చేశా. 2013 నుంచి 2017 వరకు సీఎస్ఐఆర్ఆర్ఏలో రీసెర్చ్ అసోసియేట్‌గా పని చేశా. ఇదే సమయంలో మండలంలోని ఈశ్వరగూడెం గ్రామానికి చెందిన రవళితో వివాహమైంది. పీహెచ్డీ ఫెలోషిప్‌లో భాగంగా‘టాటా ఇన్స్టిట్యూట్ ఫండమెంటల్ రిసెర్చ్’లో సంవత్సరం పని చేశా. అనంతరం గీతం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాను. అక్కడ ప్రొఫెసర్‌గా పని చేసూ్తనే గత సంవత్సరం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అయోనాలో ప్రొఫెసర్‌గా అప్లికేషన్ చేశాను. నాలుగు దఫాలుగా జరిగిన ఇంటర్వూ్యల ఆధారంగా నన్ను ఎంపిక చే సి వీసా ఇచ్చారు. ఈనెల 28న అమెరికాకు వెళ్తు న్నా. ఖండాతరాలు దాటి ప్రొఫెసర్‌గా పనిచేసే అ వకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది’. -
ఆదివాసీలు ఆదుకుంటారా?
గుజరాత్లో 27 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను అధిగమించడానికి బీజేపీ చేయని ప్రయత్నాల్లేవు! ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కూడా కావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ప్రతిష్మాత్మకంగా మారింది. ముక్కోణ పోరులో నెగ్గేందుకు ఆదివాసీ మంత్రం జపిస్తోంది...! ఆదివాసీ ప్రాంతాల్లో పట్టు బిగించడం ద్వారా గుజరాత్ అసెంబ్లీతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా విజయం సాధించడానికి బీజేపీ పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఎన్నిక, మరో జలియన్‌వాలాబాగ్‌గా పేరు పడిన రాజస్థాన్‌లోని మాన్‌గఢ్ ధామ్‌ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించడం వంటి చర్యలెన్నో చేపడుతోంది. కాంగ్రెస్ కంచుకోటలైన ఈ స్థానాల్లో ఆప్ కూడా ప్రభావం చూపొచ్చన్న ఆందోళనా బీజేపీలో ఉంది. ఆదివాసీ స్థానాల్లో ఆప్ గట్టిగా ప్రచారం చేస్తోంది. వారు మొదట్నుంచే తనవైపే అయినా ముక్కోణపు పోటీలో ఏం జరుగుతుందోనన్న అనుమానంతో భారతీయ ట్రైబల్ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. 27 ఏళ్ల బీజేపీ పాలనతో తమ బతుకులు ఏమీ మారలేదని ఆదివాసీలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ ప్రాంతాల్లో ప్రచారాన్ని బీజేపీ మరింత ఉధృతం చేసింది. ‘మీ దీవెనలు కావా’లంటూ ఆదివాసీ ప్రాంతమైన వల్సద్ నుంచే మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 27 ఎస్టీ స్థానాల్లో కనీసం 20 గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రూ.15 వేల కోట్లతో ఆదివాసీల అభివృద్ధి ప్యాకేజీ తెచ్చింది. ఆదివాసీలకు ఉద్యోగాల కల్పన, ఆ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని ప్రచారంలో ప్రస్తావిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో స్వయంపాలన కోసం 1996లో పార్లమెంటు చేసిన ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయత్స్ యాక్ట్ (పెసా) అమలు కాకపోవడం, భూ యాజమాన్య హక్కుల వంటివి విపక్షాల ప్రచారాస్త్రాలుగా మారాయి. ‘‘పెసా తదితరాలపై ఆదివాసీలు కాస్త అసంతృప్తిగా ఉన్నా అది చాలా తక్కువ. 20 ఏళ్లలో వారి జీవితాలు చాలా మారాయి. అభివృద్ధి కనిపిస్తోంది. అందుకే ఆదివాసీలు ఈ సారి మా వైపే ఉంటారు’’ అని భరూచ్ బీజేపీ ఎంపీ మన్సుఖ్ వాసవ ధీమాగా చెప్పారు. గుజరాత్లో ప్రచారాన్ని బీజేపీ, ఆప్ ఉధృతంగా చేస్తున్నా కాంగ్రెస్ నుంచి గాంధీ కుటుంబానికి చెందిన వారు ఇప్పటివరకు ఆ రాష్ట్రం వైపు కూడా చూడకపోవడం పార్టీలో అంతర్గతంగా అసంతృప్తిని రాజేస్తోంది. ఈ ముక్కోణపు పోటీలో బీజేపీ ఆశిస్తున్నట్టుగా ఆదివాసీలు అండగా ఉంటారో లేదో.. వేచి చూడాలి.. ఏ ఫర్ ఆదివాసీ ‘‘ఏ ఫర్ ఆదివాసీ’’ వారి కంటే తనకు ముఖ్యం మరెవరూ కాదంటూ ప్రధాని మోదీ గుజరాత్‌లోని ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. గుజరాత్ జనాభాలో 15% గిరిజనులే ఉన్నారు. అంటే దాదాపుగా 80 లక్షల నుంచి కోటి మంది వరకు గిరిజన జనాభా ఉంటుంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే 8.1% గిరిజన జనాభా గుజరాత్‌లోనే ఉన్నారు. రాష్ట్రంలోని 14 జిల్లాలు 53 తాలూకాల్లో వీరి జనాభా విస్తరించి ఉంది. ఉత్తరాన అంబాజీ నుంచి దక్షిణాన ఉంబర్‌గావ్ వరకు ఆదివాసీల ప్రాబల్యమున్న ప్రాంతాలున్నాయి. మొత్తంగా 12 తెగలు ఉన్నప్పటికీ భిల్ తెగకు చెందినవారే సగం మంది ఉన్నారు. ఇక దాంగ్ జిల్లాలో గిరిజనుల ప్రాబల్యం ఎక్కువ. గిరిపుత్రులు ఎటువైపో?! రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 182కి గాను 27 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే 48 అసెంబ్లీ స్థానాల్లో ఆదివాసీ ఓట్లు అత్యంత కీలకం. రెండు దశాబ్దాలుగా అధికారంలో బీజేపీ ఉన్నప్పటికీ ఎస్టీ జనాభా ప్రాబల్యం అధికంగా ఉన్న సీట్లలో కాంగ్రెస్ స్థానం చెక్కు చెదరలేదు. గత మూడు దఫా ఎన్నికల్లోనూ ఎస్టీ రిజర్వ్ స్థానాలను బీజేపీ కంటే కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో కాంగ్రెస్ 17 స్థానాల్లో విజయం సాధిస్తే, బీజేపీ ఎనిమిది సీట్లు, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) రెండు సీట్లలో విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో అయిదుగురు ఆ తర్వాత బీజేపీ గూటికి చేరుకున్నారు. అంతకు ముందు 2012లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 16 సీట్లలో గెలుపొందితే, బీజేపీకి 10, జనతాదళ్ (యూ)కి ఒక్క సీటు వచ్చింది. గిరిజనుల సమస్యలు గుజరాత్లో ఆదివాసీ ప్రాంతాల్లో పౌష్టికాహార లోపం ఇప్పటికీ ప్రధాన సమస్యగా ఉంది. అక్షరాస్యత చాలా తక్కువ. కొండల్లో కోనల్లో పండిన పంటల నుంచి వచ్చే ఆదాయం ఏ మాత్రం వారికి సరిపోవడం లేదు. దళారుల దోపిడీలతో విసిగి వేసారి ఉన్నారు. ప్రతీ ఏడాది రాష్ట్రంలోని గిరిజనుల్లో 30% మంది ఉపాధి అవకాశాల కోసం తాత్కాలికంగా వలస వెళ్లిపోతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విద్య, నిరుద్యోగం, ఆరోగ్యం, కుల సర్టిఫికెట్, ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయత్స్ యాక్ట్ అమలు వంటి సమస్యలు ఇప్పటికీ ఎన్నికల ఎజెండాలో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించే ఎనిమిది సీట్లు!
మధ్యప్రదేశ్ చివరి దశ కీలకం లోక్‌సభ ఎన్నికల చివరి దశలో మధ్యప్రదేశ్‌లోని 8 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. దళితులు, ఆదివాసీల జనాభా అధికంగా ఉన్న ఈ స్థానాలు రాజస్తాన్, మహారాష్ట్ర వైపు ఉన్న మాల్వా–నిమాఢ్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ఎనిమిది సీట్లలో రెండింటినీ ఎస్సీలకు, మూడింటిని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఎస్సీ సీట్లు: దేవాస్, ఉజ్జయిన్, ఎస్టీ సీట్లు: రత్నామ్, ధార్, ఖర్గోన్. మిగిలిన మందసోర్, ఇండోర్, ఖండ్వా జనరల్ స్థానాలు. 2014 ఎన్నికల్లో ఈ 8 సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంది. 2018 చివర్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రాంతంలోని 66 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 2013లో 56 గెలుచుకుంది. 2018లో 21 సీట్లలోనే విజయం సాధించింది. కాంగ్రెస్ తన బలాన్ని 9 నుంచి 35 సీట్లకు పెంచుకోగలిగింది. ఈ ప్రాంతం దేశ మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుందనే పేరుంది. 2009 ఎన్నికల్లో ఇక్కడి 8 సీట్లలో ఆరు గెలుచుకున్న కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు రెండు సీట్లే గెలిచిన బీజేపీ 2014 ఎన్నికల్లో మొత్తం సీట్లన్నీ గెలిచి ఢిల్లీలో గద్దెనెక్కింది. సిట్టింగ్ సభ్యులపై ప్రజా వ్యతిరేకత కారణంగా బీజేపీ ఈ ఎనిమిది సీట్లలో ఐదు చోట్ల కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. ఇండోర్‌లో ‘తాయి’ లేని ఎన్నికలు 1989 నుంచీ వరుసగా 8 సార్లు ఇండోర్ నుంచి గెలిచిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ (తాయి) తనకు 76 ఏళ్లు నిండాయంటూ పోటీకి దిగలేదు. నగరానికి చెందిన మరో బడా నేత కైలాస్ విజయవర్గీయ కూడా ఎన్నికల బరిలో లేకపోవడంతో ‘తాయి(సుమిత్ర), భాయీ(కైలాస్)’ లేని ఎన్నికలని జనం అనుకుంటున్నారు. బీజేపీ టికెట్‌పై సింధీ వర్గానికి చెందిన శంకర్ లాల్వాణీ, కాంగ్రెస్ అభ్యర్థిగా పంకజ్ సంఘ్వీ పోటీ చేస్తున్నారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ్ పటేల్‌పై 4 లక్షల 66 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో సుమిత్రా మహాజన్ గెలిచారు. రైతుల రుణ మాఫీ ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారింది. ఎన్నికల హామీ ప్రకారం అధికారం చేపట్టిన పది రోజుల్లో కమల్‌నాథ్ కాంగ్రెస్ సర్కారు రుణ మాఫీ చేయలేదని బీజేపీ అభ్యర్థి లాల్వాణీ ప్రచారం చేశారు. రుణ మాఫీ సక్రమంగా జరగకపోవడంతో కాంగ్రెస్ ఇబ్బంది పడుతుండగా, కొత్త అభ్యర్థి కావడంతో లాల్వాణీ విస్తృతంగా ప్రచారం చేయాల్సివచ్చింది. రెండుసార్లు నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి తరఫున సుమిత్రా మహాజన్ ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇండోర్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ సుమిత్రా తాయి మాత్రమే తనను మందలించగలరని చెప్పారు. 30 ఏళ్ల తర్వాత ఎలాగైనా ఇండోర్ సీటు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఖండ్వాలో పాత ప్రత్యర్థుల మధ్య పోటీ ఖండ్వాలో సిట్టింగ్ బీజేపీ ఎంపీ నంద్‌కుమార్ చౌహాన్, కాంగ్రెస్ అభ్యర్థి అరుణ్ యాదవ్ మధ్య మరోసారి ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. 2014లో యాదవ్‌ను 2 లక్షల 59 వేలకు పైగా ఓట్లతో చౌహాన్ ఓడించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా గతంలో పనిచేసిన యాదవ్ 2009లో అప్పటికి నాలుగుసార్లు గెలిచిన చౌహాన్‌ను ఓడించారు. మారిన పరిస్థితుల్లో యాదవ్‌కు గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని కాంగ్రెస్ భావిస్తోంది. మన్మోహన్ కేబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయన తండ్రి సుభాష్ యాదవ్ కూడా గతంలో పీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు. ఇప్పుడు ఎస్టీ రిజర్వ్ సీటైన ఖర్గోన్ నుంచి 2007 ఉప ఎన్నికలో అరుణ్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. దేవాస్‌లో కాంగ్రెస్ టికెట్‌పై కబీర్ దోహాల గాయకుడు ఎస్సీలకు కేటాయించిన మరో లోక్‌సభ స్థానం దేవాస్. కబీర్దాస్ దోహాలు పాడుతూ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన ప్రహ్లాద్‌సింగ్ టిపానియా కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేస్తున్న కారణంగా దేవాస్ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సిట్టింగ్ సభ్యుడు మనోహర్ ఉంత్వాల్కు బదులు మాజీ సివిల్ జడ్జి మహేంద్రసింగ్ సోలంకీకి బీజేపీ టికెట్ ఇచ్చింది. 64 ఏళ్ల టిపానియా కబీర్ కవితలు పాడుతూ ఎన్నికల సభల్లో ప్రజలను అలరిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి మోదీ సర్కారు సాధించిన విజయాల గురించి వివరిస్తూ జడ్జిగా కన్నాఎంపీగా ఎక్కువ మందికి సేవచేయగలనని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ సభ్యుడు ఉంత్వాల్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సజ్జన్‌సింగ్ వర్మను ఓడించారు. ఈ స్థానంలో అధిక సంఖ్యలో ఉన్న బలాయీ దళిత కులానికి చెందిన టిపానియా, సోలంకీ మధ్య పోరులో కాంగ్రెస్ అభ్యర్థికే విజయావకాశాలు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఉజ్జయినీలో బీజేపీ కొత అభ్యర్థి ఫిరోజియా ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఉజ్జయినీలో బీజేపీ సిట్టింగ్ సభ్యుడు చింతామణి మాల్వీయాకు బదులు ఈసారి అనిల్ ఫిరోజియాను బరిలోకి దింపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని కొత్త బీజేపీ నేతకు అవకాశమిచ్చారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేంచంద్ గుడ్డూపై మాల్వీయా 3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. కాంగ్రెస్ టికెట్‌పై ఈసారి బాబూలాల్ మాల్వీయా పోటీచేస్తున్నారు. బీజేపీ తరఫున పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్ తరఫున ప్రియాంకాగాంధీ ఉజ్జయినీలో ప్రచారం చేశారు. మూడు ఎస్టీ సీట్లలో హోరాహోరీ ఆదివాసీలకు రిజర్వ్ చేసిన రత్నామ్, ధార్, ఖర్గోన్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య కూడా గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ కంచుకోట రత్నామ్లో 2015 ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భురియా విజయం సాధించారు. మళ్లీ 2019లో పోటీచేస్తున్న భురియాపై బీజేపీ తరఫున గుమన్‌సింగ్ డామోర్ పోటీకి దిగారు. కిందటి ఎన్నికల్లో బీజేపీ నేత దిలీప్‌సింగ్ భురియా గెలిచారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య చేతులు మారే స్థానం ధార్. ఇక్కడ బీజేపీ సిట్టింగ్ సభ్యురాలు సావిత్రీ ఠాకూర్‌కు బదులు ఛతర్సింగ్ దర్బార్‌ను పోటీలో నిలిపింది. ఆయన గతంలో రెండుసార్లు ఇక్కడ నుంచి గెలిచారు. కాంగ్రెస్ టికెట్‌పై దినేశ్ గిర్వాల్లో బరిలోకి దిగారు. ఈ స్థానంలో బీజేపీకి విజయావకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఖర్గోన్లో కూడా బీజేపీ కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపింది. గజేంద్ర పటేల్ (బీజేపీ), గోవింద్ ముజాల్దా(కాంగ్రెస్) మధ్య గట్టి పోటీ ఉంది. మంద్సోర్ శూరులెవ్వరో? మధ్యప్రదేశ్‌లోని మంద్‌సోర్‌లో ఆరుగురు రైతులు మరణించిన రెండేళ్ళ అనంతరం ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం అందకపోవడం ఈ ఎన్నికల్లో తిరిగి చర్చనీయాంశంగా మారింది. నెత్తురోడిన రైతు కుటుంబాలు ఈ ఎన్నికల్లో బీజేపీపై వ్యతిరేకతతో ఉన్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు హోరాహోరీగా మారింది. మంద్సోర్ లోక్‌సభ స్థానం బీజేపీ జనసంఘ్‌కి బలమైన ప్రాంతం. బీజేపీ లక్ష్మినారాయణ పాండే 8 సార్లు ఈ లోక్‌సభ స్థానం నుంచి విజయపరంపరని కొనసాగించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ బీజేపీని ఓడించి, ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నా, తరిగి బీజేపీ సుధీర్ గుప్తా 2014లో ఈ స్థానంలో గెలుపు బావుటా ఎగురవేశారు. తిరిగి ఈ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ నుంచి మీనాక్షి నటరాజన్ బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి సుధీర్ గుప్తా అభివృద్ధి మంత్రంతో జనంలోకి వెళ్ళారు. మంద్సోర్ లోక్‌సభ స్థానంలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ సీట్లున్నాయి. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా బీజేపీ ఎనిమిది అసెంబ్లీ సీట్లల్లో ఏడింటిని కైవసం చేసుకోవడం విశేషం. అయితే ఒక్క సీటు మినహా ఆరు సీట్లలో ఈ రెండు పార్టీల మధ్య కేవలం 2000 ఓట్ల తేడానే ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో సైతం ఓటింగ్ శాతం పెరిగితే అది బీజేపీకి అనుకూలించవచ్చుననీ, లేదంటే కాంగ్రెస్‌కి గెలుపు అవకాశాలుంటాయనీ, రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఏదిఏమైనా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. -
రాజకీయ లబ్ధి కోసం అంతరాలు సృష్టిస్తున్నారు: ఎంపీ సీతారాంనాయక్
హైదరాబాద్: కొంతమంది కావాలని రాజకీయ లబ్ది కోసం ఆదివాసీలు, లంబాడీల మధ్య లేనిపోని అంతరాలు కల్పిస్తున్నారని ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో బుధవారం జరిగిన లంబాడి సభలో ఆయన మాట్లాడుతూ 1975 నుండి ఇక్కడే ఉన్నా తమను మైగ్రేటెడ్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఏం కావాలో చెప్తే సామరస్యపూర్వకంగా మాట్లాడుకుందామంటూ క్రిమీలేయర్ ద్వారా ట్రైబల్ యాక్ట్ తీసుకొచ్చారన్నారు. తాము 25 లక్షల మందిమి ఉన్నామని, 30 నుండి 60 మంది ఎమ్మెల్యేలను గెలిపించగల దమ్ము ఉందని, తమ జాతి కోసం ఏమైనా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒకటి రెండు శాతం లేని వాళ్ళు 50 శాతం ఉన్నవాళ్లను శాశిస్తున్నారంటూ రాబోయే రోజుల్లో దేశంలో రిజర్వేషన్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని సీతారాంనాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. -
9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు గిరిజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి వెంకటస్వామి, బీ కృష్ణానాయక్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఐక్యవేదిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులకు ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు మధ్యాహ్నం వరకు అనుమతిని ఇవ్వాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని తండాలు, గూడేల్లో ఉత్సవాలను నిర్వహించాలన్నారు.