అమెరికాలో ప్రొఫెసర్‌గా వరంగల్ ఆదివాసీ | From The Tribal Level To The Professor Level In America | Sakshi
Sakshi News home page

అమెరికాలో ప్రొఫెసర్‌గా వరంగల్ ఆదివాసీ

Published Thu, Jul 27 2023 8:43 AM | Last Updated on Fri, Jul 28 2023 2:59 PM

 From The Tribal Level To The Professor Level In America - Sakshi

వరంగల్‌: కడు పేదరికం.. తినడానికి అన్నం కూడా దొరకని పరిస్థితి. తండ్రి పని చేస్తేనే పూటగడిచేది. లేనిపక్షంలో పస్తులుండడమే. పైగా మారుమూల గ్రామం.. అందులో పాఠశాల కూడా లేని కుగ్రామం. ఇలాంటి తరుణంలో ఎవరికైనా చదువుకోవాలనే ఆలోచనే రాదు.

ఏదైనా పని చేసుకుని బతకాలని భావిస్తారు. కానీ అలాంటి వారికి ఈ యువకుడు పూర్తిగా విరుద్ధం. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. ఒక పక్క సమస్యలతో సహవాసం చేసూ్తనే.. మరో పక్క అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఆయననే మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం మారుమూల ఏజెన్సీ ఆదివాసీ గ్రామం దొరవారివేంపలి్లకి చెందిన ఈక ప్రభాకర్‌.

తాను ఎంచుకున్న విద్యలో ఖండాంతరాలు దాటి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ అయోవాలో ప్రొఫెసర్‌గా పని చేసేందుకు ఎంపికయ్యారు. ఎర్ర బస్సు కూడా ఎరగని ఈ గ్రామం నుంచి అమెరికాకు వెళ్లడంపై గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈక పాపమ్మ–సమ్మయ్య దంపతుల ప్రథమ సంతానం ప్రభాకర్‌. తన ఎదుగుదల గురించి ఆయన మాటల్లోనే.. 

‘పోడు వ్యవసాయం ఆధారంగానే మా కుటుంబ పోషణ గడిచేది. తినడానికే ఇబ్బంది పడే పరిస్థితి. గ్రామంలో పాఠశాల కూడా లేదు. 1989లో అప్పటి ఐటీడీఎ పీఓ బెస్ట్‌ అవైలెబుల్‌ పాఠశాలలకు విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. హాస్టల్‌కు వెళ్తే కనీసం అన్నం అయినా సరిగా దొరుకుతుందనుకునే పరిస్థితి ఉండేది.

ఈ పరిస్థితిలోనే రాజేంద్ర కాన్వెంట్‌ హై స్కూల్‌లో సీటు వచ్చింది. పాఠశాల చదువులోనే మా తల్లి పాపమ్మ 1997లో మృతి చెందింది. ఈ ఘటనను దిగమింగుకుని పదో తరగతి పూర్తి చేశా. అనంతరం ఇంటర్‌ ఎల్‌బీ కళాశాల వరంగల్‌లో, కర్నూలు సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో బీజెడ్‌సీ గ్రూపులో డిగ్రీ పూర్తి చేశా. వారణాసిలోని బనారస్‌ హిందూ యూనివర్సిటీలో బయో టెక్నాలజీలో పీజీ పూర్తి చేశా. బెస్ట్‌ అవైలెబుల్‌ స్కీం పూర్తయిన తరువాత ఐటీడీఏ నుంచి స్కాలర్‌ షిప్‌కు ఎంపికయ్యా.

ఆ స్కాలర్‌ షిప్‌తోనే డిగ్రీ, పీజి పూర్తయింది. 2006 నుంచి 2013 వరకు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డి పూర్తి చేశా. 2013 నుంచి 2017 వరకు సీఎస్‌ఐఆర్‌ఆర్‌ఏలో రీసెర్చ్‌ అసోసియేట్‌గా పని చేశా. ఇదే సమయంలో మండలంలోని ఈశ్వరగూడెం గ్రామానికి చెందిన రవళితో వివాహమైంది. పీహెచ్‌డీ ఫెలోషిప్‌లో భాగంగా‘టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌’లో సంవత్సరం పని చేశా. అనంతరం గీతం యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరాను.

అక్కడ ప్రొఫెసర్‌గా పని చేసూ్తనే గత సంవత్సరం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ అయోనాలో ప్రొఫెసర్‌గా అప్లికేషన్‌ చేశాను. నాలుగు దఫాలుగా జరిగిన ఇంటర్వూ్యల ఆధారంగా నన్ను ఎంపిక చే సి వీసా ఇచ్చారు. ఈనెల 28న అమెరికాకు వెళ్తు న్నా. ఖండాతరాలు దాటి ప్రొఫెసర్‌గా పనిచేసే అ వకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది’.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement