MP Sitaram Naik
-
ఎంతో అభివృద్ధి చేశాం
హన్మకొండ: పార్లమెంట్ సభ్యులుగా చాలా అభివృద్ధి చేశామని మహబూబాబాద్ పార్లమెంట్ స భ్యుడు ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ అన్నారు. శనివారం హన్మకొండలో ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ స్వగృహంలో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలందరం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సాధించామన్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ సహకారంతో కేంద్రంపై ఒత్తిడి పెంచి హైకోర్టు విభజన సాధించుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు పడకేస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణాలు చేపడితే వాటి అనుమతులు తీసుకువచ్చామన్నారు. గిరిజన యూనివర్శిటీ సా ధించామని తెలిపారు. వచ్చే జూన్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. కాజీపేటకు పీరియాడికల్ ఒరాయిలింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు రూ.290 కోట్లు నిధులు మం జూరు చేయించినట్లు పేర్కొన్నారు. వ్యాగన్ పరిశ్రమకు కావాల్సిన స్థల సేకరణకు రూ.28 కోట్లు అవసరమని ఇటీవల ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు తీసుకురాలేదని కాంగ్రెస్ మాజీ ఎంపీలను నిలదీశారు. కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ నీతిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు ఏం సాధించి తీసుకువచ్చారని ప్రశ్నించారు. బాక్రానంగల్ ప్రా జెక్టులో ఏడు శాతం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు సాధించామని చెప్పారు. ఢిల్లీ యూనివర్శిటీలో రిజర్వేషన్ల అమలుకు కృషి చేసినట్లు తెలిపారు. మహబూబాబా ద్‌కు పాస్‌పోర్టు సేవా కేంద్రం తీసుకువచ్చానని పేర్కొన్నారు. కేయూకు 207 పడకల హాస్టల్ మంజూరు చేయించామన్నారు. ఎన్ఎస్ఎస్ ఎం ప్యానల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ తీసుకువచ్చామని వివరించారు. వీటితో పాటు ఇంకా చాలా అభివృద్ధి పనులు చేశామని వివరించారు. పార్లమెంట్లో చర్చలో పాల్గొని తెలం గాణ అవసరాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్‌లోకి వచ్చిన వారిని ఎంతకు కొనుగోలు చేశారో చెప్పాలని ప్రశ్నిం చారు. బాబు పొత్తుతో టీఆర్ఎస్ను ముంచాలనుకుంటే కాంగ్రెస్ కొంపే మునిగిందన్నారు. కేయూ భూములను ఆక్రమిం చింది ఎవరో తెలుసునని, త్వరలో జైల్లో పెట్టిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్‌కు ఇంకా బుద్ధి రావడం లేదని దుయ్యబట్టారు. వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతీయ రోడ్లు మంజూరు చేయించామన్నారు. ఢిల్లీలో ఏ రోజు ఖాళీగా కూర్చోలేదని తెలిపారు. ఆజాంజాహి మిల్లును కాంగ్రెస్ మూసేస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటు చేస్తుందన్నారు. వీటితో పాటు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని వివరించారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు పసలేనివని, విమర్శించాలె కాబట్టి విమర్శించినట్లుగా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఎన్ని నాటకాలు, డ్రామాలు ఆడినా ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించరని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎంపీపీ సారంగపాణి పాల్గొన్నారు. -
అభివృద్ధిలో రాజీపడలే..
గుండాల (ఖమ్మం): కనీసం రోడ్డు సౌకర్యం లేని గుండాల ప్రాంతం అభివృద్ధికి 30 ఏళ్ల క్రితమే బాటలు వేశానని, నేటి వరకు మంత్రిగా అనేక పనులు చేయించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా రు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించిన ఆయన గుండాలలో టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. రోడ్లు, చెరువులు, నిర్మించామని, సబ్ స్టేషన్ పూర్తి చేశామని, ఉమ్మడి రాష్ట్రంలోనే తన ఇన్నేళ్ల పాలనలో తుమ్మలను గుర్తుపెట్టుకున్న మండలం గుండాల అని ఆనందం వ్యక్తం చేశారు. గుండాల– ఇల్లెందు, చె ట్టుపల్లి, సాయనపల్లికి రోడ్లు వేయించానన్నారు. ఇటీవల టీఆర్ఎస్ పాలనలో రూ.300 కోట్లు మం జూరు చేయించామని వెల్లడించారు. గ్రామాల మధ్య లింకు రోడ్లు, 14 చోట్ల వాగులపై బ్రిడ్జిల నిర్మాణాలు సాగుతున్నాయని అయినా కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి శూన్యమని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మిషన్ కాకతీ య, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణ లక్ష్మి, ఆస రా పింఛన్లు 24 గంటల కరెంటు సరపరా పథకాలతో ప్రజలందరికీ లబ్ధి చేకూరుతోందని వివరించారు. పాయంను ఆదరించండి : ఎంపీ సీతారాంనాయక్ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆళ్లపల్లి, గుండాల మండలాలను అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నారని, మళ్లీ ఆయ నను ఆదరించి, గెలిపించుకోవాలని ఎంపీ సీతా రాం నాయక్ అన్నారు. గత 60ఏళ్లు పాలనలో ఉ న్న కాంగ్రెస్ పాలకులు చేయలేని పథకాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేక దుర్మార్గపు మాటలు జారు తున్నారని ఆరోపించారు. రానున్నది టీఆర్ఎస్ పాలననేని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖా యమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలంతా పాయం వెన్నంటే ఉంటూ అహర్నిషలు కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ చాట్ల పద్మ, జిల్లా నాయకులు భవానీశంకర్, పేరయ్య, సత్య నారాయణ, పైడి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్ష, కార్యదర్శులు తెల్లం బాస్కర్, ఎస్కె.ఖదీర్, టీ.రాము, ముకుందాచారి, బచ్చల రామయ్య, రషీద్, కుంజ బుచ్చయ్య, బాటయ్య, బుచ్చయ్య, గణేష్, లలిత, నిర్మల, లక్ష్మీనారాయణ, ముఖేష్, దారా అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ లబ్ధి కోసం అంతరాలు సృష్టిస్తున్నారు: ఎంపీ సీతారాంనాయక్
హైదరాబాద్: కొంతమంది కావాలని రాజకీయ లబ్ది కోసం ఆదివాసీలు, లంబాడీల మధ్య లేనిపోని అంతరాలు కల్పిస్తున్నారని ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో బుధవారం జరిగిన లంబాడి సభలో ఆయన మాట్లాడుతూ 1975 నుండి ఇక్కడే ఉన్నా తమను మైగ్రేటెడ్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఏం కావాలో చెప్తే సామరస్యపూర్వకంగా మాట్లాడుకుందామంటూ క్రిమీలేయర్ ద్వారా ట్రైబల్ యాక్ట్ తీసుకొచ్చారన్నారు. తాము 25 లక్షల మందిమి ఉన్నామని, 30 నుండి 60 మంది ఎమ్మెల్యేలను గెలిపించగల దమ్ము ఉందని, తమ జాతి కోసం ఏమైనా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒకటి రెండు శాతం లేని వాళ్ళు 50 శాతం ఉన్నవాళ్లను శాశిస్తున్నారంటూ రాబోయే రోజుల్లో దేశంలో రిజర్వేషన్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని సీతారాంనాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆ 60 వేల మందికి ఎంపీ ఎవరు?
ఏపీలో విలీనమైన మండలాలపై సీతారాం నాయక్ ఆవేదన సాక్షి, న్యూఢిల్లీ: తన నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారని, అయితే ఆ 60 వేల మంది ప్రజలకు ఇప్పుడు ఎంపీ ఎవరని మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం లోక్‌సభలో జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘ఇది ఆది వాసీల సమస్య. 7 మండలాల్లో 60 వేల మంది ఓటర్లయిన ఆదివాసీలను ఏపీలో కలిపారు. వీరంతా ఓట్లువేసి నన్ను ఎంపీగా గెలిపించారు. ఇప్పుడు వీరికి ఎంపీ ఎవరు? ఎమ్మెల్యే ఎవరు? వారు సమస్యలపై ఎవరిని అడుగుతారు?. నేను పార్లమెంటుకు ఎన్నికైనప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను. ఇక్కడ ముంపు ప్రాంతంలో లేని 4 పంచాయతీలను కూడా విలీనం చేశారు. అందువల్ల ఆయా అంశాలపై కేంద్రం దృష్టిపెట్టి వారికి న్యాయం చేయాలి’ అని కోరారు. -
పత్తాలేని గిరిజన పారిశ్రామిక రాయితీ
⇒ నాలుగేళ్లుగా విడుదల కాని నిధులు ⇒ పేరుకుపోయిన బకాయిలు రూ.123 కోట్లు సాక్షి, హైదరాబాద్: గిరిజన యువతను స్వయం ఉపాధివైపు మళ్లించాలనే సంకల్పంతో తలపెట్టిన పారిశ్రామిక రాయితీ పథకం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ పథ కం కింద ఎంపికైన లబ్ధిదారుల రాయితీ విడు దలకు తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో తాత్సారం చేయడం... మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలోని బకాయిలపై స్పష్టత ఇవ్వకపో వడంతో రాయితీ బకాయిలు ఏకంగా రూ.123 కోట్లు పేరుకుపోయాయి. ఇందులో రాష్ట్ర ఏర్పాటుకు ముందున్న రాయితీ బకాయిలు రూ.78 కోట్లు. వాస్తవానికి ఈ నిధులను 2013–14 సంవత్సరం చివర్లో విడుదల చేయాల్సి ఉండగా... అప్పట్లో ఖజానాపై ఆంక్షల నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం పాత బకాయిల విడుదలపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. దీంతో దాదాపు 4వేల మంది లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఔత్సాహిక గిరిజన పారిశ్రామికవేత్తలు నెలకొల్పే చిన్న పరిశ్రమలకు గరిష్టంగా 75 శాతం రాయితీ ఇవ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 2012–13 సంవత్సరంలో ఈ పథకం అందుబాటులోకి రాగా... గిరిజన యువతకోసం అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా పెద్ద మొత్తాన్ని రాయితీ కింద ఇచ్చేలా కేటాయించింది. దీంతో ఈ పథకం కింద భారీ వాహనాల కొనుగోలుకు వేలాది దరఖాస్తులు రాగా... అదేస్థాయిలో అధికారులు మంజూరు చేశారు. తొలి ఏడాది నిధుల విడుదల సంతృప్తికరంగా జరిగినప్పటికీ... ఆ తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఎస్సీ, ఎస్టీ కమిటీ సమావేశంలో రాయితీ నిధుల విడుదలపై ఎంపీ సీతారాం నాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రాయితీ సకాలంలో ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు అప్పుల పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. -
2019కి ‘వ్యాగన్ పిరియాడికల్’ పూర్తి
డిప్యూటీ సీఎం కడియంకు రైల్వే బోర్డ్ మెంబర్ గుప్తా హామీ సాక్షి, న్యూఢిల్లీ: కాజిపేట్లో వ్యాగన్ పిరియా డికల్ ఓవరాలింగ్ యూనిట్‌ను 2019 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి రైల్వే బోర్డు మెంబర్ రవీంద్ర గుప్తా హామీ ఇచ్చారు. మంగళవారం ఈ మేరకు కడియం, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతి నిధులు రామచంద్ర తేజోవత్, వేణుగోపాల చారి, ఎంపీ సీతారాం నాయక్ తదితరులు రవీంద్ర గుప్తాతో సమావేశమై రాష్ట్రంలోని వివిధ రైల్వే డిమాండ్లపై చర్చించారు. అలాగే కాజీపేటలో వ్యాగన్ పిరియాడికల్ ఓవరాలింగ్ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్రం తరఫున 160 ఎకరాల కేటాయింపునకు సంబంధిం చిన ఉత్తర్వులను ఆయనకు అందించారు. గుప్తా స్పందిస్తూ.. రూ.300 కోట్ల నిధులతో 2019 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు పెరుగు తున్న రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి వద్ద మూడో టెర్మినల్‌ను ఏర్పా టు చేయాలని కోరినట్టు కడియం తెలిపారు. చర్లపల్లి వద్ద కేంద్ర ప్రభు త్వానికి చెందిన భూమి ఉందని, అందులో 250 ఎకరాలను టెర్మినల్ ఏర్పాటుకు రైల్వేకు ఇవ్వాలని ఇప్పటికే కోరామన్నారు. ఇల్లం దుకు సింగరేణి ప్యాసింజర్ రైలును పునః ప్రారంభించాలని కోరినట్టు ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు. పాండురంగపురం– సారపాకకు మధ్య 13 కిలోమీటర్ల ట్రాక్ వేస్తే భద్రాచలం దేవాలయానికి దేశవ్యాప్తంగా ప్రజలు రావడానికి అవకాశం ఉంటుందని వివరించినట్టు చెప్పారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గుప్తా హామీ ఇచ్చారని తెలిపారు. -
దళితుల అభివృద్ధికి సమగ్ర విధానం
ఎంపీ సీతారాం నాయక్ సాక్షి, న్యూఢిల్లీ: దళితులను అభివృద్ధిపథంలోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, అందుకు నిదర్శనంగా అన్ని పార్టీలకు చెందిన దళిత ప్రజాప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు చేసి విధానాల రూపకల్పనకు నడుం బిగించారని టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులను పరిరక్షించి వాటిని అమలు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పంతో ఉందన్నారు. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ శాతం నిధులు కేటాయించడానికి, ఆయా నిధులను ఖర్చు చేయడానికి అవసరమైన విధానాలను రూపొందించడానికి కమిటీలు ఏర్పాటు చేయడం శుభపరిణామని పేర్కొన్నారు. అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌గా విభజించి ఏ పాంత్రాల్లో ఎలాంటి పథకాలు అమలు చేయడం వల్ల ఎక్కువ మంది దళితులకు లబ్ధి చేకూరుతుందో అధ్యయనం చేస్తామని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో దళితులకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన ఫలాలు అందకుండా పోయాయని సీతారాం నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. -
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
కొత్తగూడ: తాగుబోతుల వల్ల జరిగిన ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా ఆదుకుంటామని మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ హమీ ఇచ్చారు. గురువారం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ పండగ రోజు ఇంట్లో కూర్చున్న వారికి ప్రమాదం జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రమాదంలో నష్టపోయిన వారికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు కొట్టారని బాధిత కుటుంబ సభ్యులు తమ గోడును ఎంపీ సీతారాం నాయక్‌కు వెల్లబోసుకున్నారు. స్పందించిన ఎంపీ గూడూరు సీఐ రమేష్‌నాయక్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఎంపీ వెంట టీఆర్ఎస్ నాయకులు సమ్మయ్య, శ్రీనివాస్ రెడ్డి, స్వామి, దూదిమెట్ల లింగయ్య పాల్గొన్నారు. -
మానుకోటలో ‘ఫైబర్ టు ది హోం’ అభినందనీయం
తొలి విడతలో 10 గ్రామాలకు ఉచిత వైఫై సేవలు ఎంపీ సీతారాం నాయక్ కేబుల్ ఆపరేటర్ల సహకారంతో బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్రాజెక్టు పోచమ్మమైదాన్ : మానుకోట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కేబుల్ ఆపరేటర్ల సహకారంతో బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో ‘ఫైబర్ టు ది హోం’(ఎఫ్టీటీహెచ్) కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. మంగళవారం వరంగల్‌లోని బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్(పీజీఎం) నరేందర్ అధ్యక్షతన నిర్వహించిన టెలికాం అడ్వైజరీ కమిటీ(టీఏసీ) సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరికి హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడమే లక్ష్యంగా ఎఫ్టీటీహెచ్ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. మహారాష్ట్ర తరహాలో మానుకోట పార్లమెంట్ స్థానం పరిధిలో తొలి విడతగా 10 గ్రామాలు ఉచిత వైఫై సేవలు అందేలా చూస్తానన్నారు. చిన్న జిల్లాలతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎంపీ అన్నారు. ప్రజలకు మరిన్ని∙మెరుగైన సేవలు అందించేందుకు బీఎస్ఎన్ఎల్ సమాయత్తం కావాలన్నారు. అనంతరం పీజీఎం నరేందర్ మాట్లాడుతూ జిల్లాలో బీఎస్ఎన్ఎల్ ద్వారా ప్రతినెలా 10వేల కొత్త సెల్‌ఫోన్ కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. మహబూబాబాద్‌లో త్వరలో బ్రాడ్ బ్యాండ్ సేవలు ప్రారంభిస్తామన్నారు. అంతకుముందు ఫిబ్రవరి 6న జరిగిన టీఏసీ సమావేశంలో సభ్యులు లెవనెత్తిన సమస్యలకు చూపిన పరిష్కారాల గురించి నివేదిక చదివి వినిపించారు. టీఏసీ సభ్యుడు ఒగిలిశెట్టి అనిల్ మాట్లాడుతూ వరంగల్ నగరంలోని కరీమాబాద్‌లో ఇటీవల ఓఎఫ్సీ కేబుల్ కట్ కావడంతో రెండు రోజుల పాటు అక్కడి ఎస్బీహెచ్లో బ్యాకింగ్ సేవలు నిలిచిపోయాయన్నారు. అజ్మీర శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ నర్సంపేట మహేశ్వరంలోని రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ గత కొన్ని రోజులుగా పని చేయడం లేదని, బీఎస్ఎన్ఎల్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో సభ్యులు బాస్కుల ఈశ్వర్, వీరస్వామి, సోమనర్సజీ, పీఆర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ములుగును జిల్లా చేయండి
మంత్రివర్గ ఉప సంఘానికి చందూలాల్ వినతి ములుగు : అభివృద్ధిలో వెనుకబడి, జిల్లాకు అన్ని అర్హతలు ఉన్న ములుగు డివిజన్ కేంద్రాన్ని సమ్మక్క–సారలమ్మ జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి అజ్మీర చందూలాల్, ఎంపీ అజ్మీర సీతారాంనాయక్ ఆదివారం మంత్రివర్గ ఉప సంఘానికి వినతిపత్రం అందించారు. డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహుముద్ అలీ, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జీతేందర్రెడ్డిలకు స్థానిక సౌకర్యాలపై జూబ్లిహిల్స్‌లోని ఎంసీహెచ్ఆర్డీ భవనంలో మంత్రి చందూలాల్ వివరించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ఈ విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించాలని సూచించారు. జిల్లా ఏర్పాౖటెతే వెనుకబడిన గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రెండు రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారి, గోదావరి పరివాహక ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, సుమారు 4వేల ఎకరాల ప్రభుత్వ భూములు, పరిశ్రమలు నెలకొల్పడానికి ముడి సరుకులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మంత్రి వెంట జడ్పీ ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్, మండల అధ్యక్షుడు గట్టు మహేందర్, పీఏసీఎస్ చైర్మెన్ గుగులోతు కిషన్, ఎంపీటీసీ లింగంపల్లి సంపత్‌రావు, నాయకులు బండారి మోహన్‌కుమార్, గట్ల శ్రీనివాస్‌రెడ్డి, గజ్జి నగేశ్, ఎండీ ఖాసీం, గొర్రె సమ్మయ్య, ఏరువ పూర్ణచందర్ ఉన్నారు. -
జాతీయ పండుగగా గుర్తిస్తాం
ఎస్ఎస్ తాడ్వాయి: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా జరుపుకుంటున్నామని, వచ్చే జాతర నాటికి జాతీయ పండుగగా గుర్తించేందుకు కృషి చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఆయన కుటుంబసభ్యులతో కలిసి మేడారంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకుని మొక్కు లు చెల్లించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో మొదటిసారి జరిగే జాతరకు రూ. కోట్లు వెచ్చించి భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. గోదావరి పుష్కరాల అనుభవంతో ఈ జాతరను విజయవంతం చేసేందుకు కలెక్టర్, ఎస్పీలు కృషి చేస్తున్నారన్నారు. ప్రశాంత వాతవారణంలో భక్తులు దేవతలను దర్శించుకునేలా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీ సీతారాంనాయక్ తదితరులు ఉన్నారు. -
ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చండి
రైల్వే మంత్రి సురేశ్‌ప్రభుకు ఎంపీ సీతారాం నాయక్ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్-న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ సోమవారం రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభును కలసి వినతిపత్రాన్ని అందజేశారు. విజయవాడ-న్యూఢిల్లీల మధ్య నడిపించనున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు మహబూబాబాద్‌లో హాల్ట్ సదుపాయం కల్పించాలని కోరారు. ఇల్లెందు నుంచి కారేపల్లి, డోర్నకల్‌కు ప్యాసింజర్ రైలు నడిపించాలని విన్నవించారు. -
ఊబిలో కూరుకుపోయిన బాబు
- బాబూ.. కేసీఆర్‌తో పోటీకి తగవు - కేసీఆర్‌తో పెట్టుకుంటే పొయ్యిలో చేయి పెట్టినట్లే - ఎంపీ సీతారాం నాయక్ హన్మకొండ : ఏపీ ముఖ్యమంత్రి ఊబిలో కూరుకుపోయారని, ఆయనను ఊబిలోకి ఎవరు తోసివేయలేదని, తనకు తానుగా వెళ్లాడని మహబూబాబాద్ లోక్‌సభ సభ్యుడు ఆజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తప్పు చేసినా అని ఒప్పుకోకుండా మాటలతో దాడి చేయడం ద్వారా తప్పించుకోవాలని చూస్తే కుదరదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పోటీకి తగవని, కేసీఆర్‌తో పోటీ పెట్టుకోవాలంటే మండే పొయ్యిలో చేయిపెట్టినట్లుగా ఉంటుందన్నారు. ఈ తోవలోనే వెళ్లి ఏసీబీకి అడ్డంగా దొరికారన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ది పథంలో తీసుకెళుతుంటే ఓర్వలేక టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చంద్రబాబు చూశారన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ తాను నియోజకవర్గ అభివృద్ధికి రూ.250 కోట్లు మంజూరు చేయాలని చెప్పానని, టీడీఎల్పీ నేత ఎర్రబఎల్లి దయాకర్రావులా ప్యాకేజీలు కోరలేదన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు తెలంగాణ టీడీపీ నాయకులు చంద్రబాబుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తూర్పారబట్టారు. సమావేశంలో నాయకులు మర్రి యాదవరెడ్డి, నయిమోద్దీన్, భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, గైనేని రాజన్ పాల్గొన్నారు. -
ఆ గోడలు.. ఈ కిటికీలు చూడు..
* 4 రోజులకే కూలితే ఎవరు బాధ్యత వహిస్తారు.. * డీఈఈపై ఎంపీ సీతారాంనాయక్ ఆగ్రహం * సస్పెండ్ చేస్తే గానీ పరిస్థితిలో మార్పురాదని హెచ్చరిక ఏటూరునాగారం : ఆ గోడలకు పగళ్లు ఏంటి... ఈ కిటికీలకు సందులు ఏంటి అని అధికారులపై మహబూబాబాద్ ఎంపీ సీరియస్ అయ్యారు. ములుగు నియోజకవర్గంలో సోమవారం ఆయన రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్‌తో కలిసి పర్యటించారు. పలు అభివృద్ధి పనులను పరశీలించడంతోపాటు ప్రారంభించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఉప కార్యనిర్వాహక ఇంజనీరు కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన భవనాన్ని చూసి అవాక్కయ్యూరు. నాణ్యత లోపంతో చేపట్టిన పనులకు సంబంధించి డీఈఈ సత్యనారాయణపై మండిపడ్డారు. నూతనంగా నిర్మించిన భవనం నాలుగు రోజులకే కూలితే ఎవరు బాధ్యత వహిస్తారని డీఈని ప్రశ్నించారు. కార్యాలయం నుంచి వెనుదిరిగి పోతుం డగా అధికారులు బతిమాలాడి మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్‌ను లోనికి పిలుచుకురావడం గమనార్హం. దీనికి సంబంధించి బిల్లులు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావు, ఈఈ గోపాల్‌రావు, డీఈఈ సత్యనారాయణ, ఏఈఈ భద్రం, జేఈఈ పాల్గొన్నారు. అదేవిధంగా ములుగు మండలం జాకారం పరిధిలో ఐటీడీఏ నిధులతో నిర్మించిన బాలికల బయోమెట్రిక్ నూతన భవనాన్ని మంత్రి చందూలాల్‌తో పాటు ఎంపీ సీతారాం నాయక్ ప్రారంభించారు. ఓ గదిలో ఏర్పాటు చేసిన కిటికీల మధ్య అధికంగా ఖాళీ ప్రాంతం ఎక్కువ ఉండడాన్ని గమనించిన ఎంపీ ఐటీడీఏ ఏఈ రాంరెడ్డిపై ఫైర్ అయ్యూరు. ఏఈ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కలెక్టర్‌తో మాట్లాడమని ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావును సీతారాం నాయక్ ఆదేశించారు. నిర్లక్ష్యంగా పనిచేసే అధికారులు ప్రభుత్వానికి అవసరం లేదని, ఇష్టం లేని వారు వెళ్లిపోవచ్చని నాయక్ ఈ సందర్భంగా అన్నారు. సస్పెండ్ చేస్తే గానీ అధికారుల తీరులో మార్పు రాదని పేర్కొన్నారు. ట్రైనింగ్ సెంటర్ భవన నిర్మాణం పూర్తయినా నిరుద్యోగులకు శిక్షణా కార్యక్రమాలను చేపట్టకుండా ఎందుకు కాలం గడుపుతున్నారని ఐటీడీఏ ఏపీఓ వసంతరావును ఎంపీ ప్రశ్నించారు. భవనం పూర్తయి నెలలు గడుస్తున్నా... ఇప్పటివరకు నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి సరైన సామగ్రిని ఏర్పాటు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. 15 రోజుల్లో శిక్షణ ఇవ్వడానికి కావలసిన అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
విద్యుత్ సమస్య చంద్రబాబు పుణ్యమే
మరిపెడ : విద్యుత్ సమస్య ఏపీ సీఎం చంద్రబాబు పుణ్యమేనని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ సమస్యే కాకుండా అన్నివిషయాల్లోనూ చంద్రబాబు కేంద్రంతో చేతులు కలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తున్నారని ఆరోపిం చా రు. అలాంటి వ్యక్తికి తెలంగాణలోని టీడీపీ ఎమ్మెలేలు, నాయకులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. నాయకులు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ డోర్నకల్ నియోజకవర్గ అధికార ప్రతినిధి కాలం రవీందర్‌రెడ్డి, కొండం దశరథ, వంటికొమ్ము సత్యనారాయణరెడ్డి, రాంపెల్లి రవి, ప్రవీణ్‌రెడ్డి, రంగారెడ్డి, శ్రావణ్‌రెడ్డి, బొల్లం నర్సయ్య, శ్రావణ్‌రెడ్డి, వెంకటనర్సయ్య, అఫ్సర్, సర్పంచ్ వెంకన్న, సత్యనారాయణ పాల్గొన్నారు.