
ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చండి
రైల్వే మంత్రి సురేశ్‌ప్రభుకు ఎంపీ సీతారాం నాయక్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్-న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఎంపీ సీతారాం నాయక్ సోమవారం రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభును కలసి వినతిపత్రాన్ని అందజేశారు. విజయవాడ-న్యూఢిల్లీల మధ్య నడిపించనున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు మహబూబాబాద్‌లో హాల్ట్ సదుపాయం కల్పించాలని కోరారు. ఇల్లెందు నుంచి కారేపల్లి, డోర్నకల్‌కు ప్యాసింజర్ రైలు నడిపించాలని విన్నవించారు.