Secunderabad-New Delhi
-
దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. బోగి పూర్తిగా దగ్ధం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. శనివారం అర్దరాత్రి సికింద్రాబాద్ నుండి ఢిల్లీ బయలుదేరిన దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు లగేజీ బోగీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఘట్కేసర్-పగిడిపల్లి మధ్య బోగిలో మంటలు చేలరేగాయి. ఈ క్రమంలో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అయితే, చివరి బోగీ కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్ని మాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టు తెలిపారు. -
ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చండి
రైల్వే మంత్రి సురేశ్‌ప్రభుకు ఎంపీ సీతారాం నాయక్ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్-న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ సోమవారం రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభును కలసి వినతిపత్రాన్ని అందజేశారు. విజయవాడ-న్యూఢిల్లీల మధ్య నడిపించనున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు మహబూబాబాద్‌లో హాల్ట్ సదుపాయం కల్పించాలని కోరారు. ఇల్లెందు నుంచి కారేపల్లి, డోర్నకల్‌కు ప్యాసింజర్ రైలు నడిపించాలని విన్నవించారు.