ములుగును జిల్లా చేయండి | mulugu should become a district | Sakshi
Sakshi News home page

ములుగును జిల్లా చేయండి

Published Mon, Aug 15 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

ములుగును జిల్లా చేయండి

ములుగును జిల్లా చేయండి

 
  • మంత్రివర్గ ఉప సంఘానికి చందూలాల్‌ వినతి
 
ములుగు : అభివృద్ధిలో వెనుకబడి, జిల్లాకు అన్ని అర్హతలు ఉన్న ములుగు డివిజన్‌ కేంద్రాన్ని సమ్మక్క–సారలమ్మ జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి అజ్మీర చందూలాల్, ఎంపీ అజ్మీర సీతారాంనాయక్‌ ఆదివారం మంత్రివర్గ ఉప సంఘానికి వినతిపత్రం అందించారు. డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహుముద్‌ అలీ, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జీతేందర్‌రెడ్డిలకు స్థానిక సౌకర్యాలపై జూబ్లిహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీ భవనంలో మంత్రి చందూలాల్‌ వివరించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ఈ విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించాలని సూచించారు. జిల్లా ఏర్పాౖటెతే వెనుకబడిన  గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రెండు రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారి, గోదావరి పరివాహక ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, సుమారు 4వేల ఎకరాల ప్రభుత్వ భూములు, పరిశ్రమలు నెలకొల్పడానికి ముడి సరుకులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మంత్రి వెంట జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ సకినాల శోభన్, మండల అధ్యక్షుడు గట్టు మహేందర్, పీఏసీఎస్‌ చైర్మెన్‌ గుగులోతు కిషన్, ఎంపీటీసీ లింగంపల్లి సంపత్‌రావు, నాయకులు బండారి మోహన్‌కుమార్, గట్ల శ్రీనివాస్‌రెడ్డి,  గజ్జి నగేశ్, ఎండీ ఖాసీం, గొర్రె సమ్మయ్య, ఏరువ పూర్ణచందర్‌ ఉన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement