విద్యుత్ సమస్య ఏపీ సీఎం చంద్రబాబు పుణ్యమేనని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు.
మరిపెడ : విద్యుత్ సమస్య ఏపీ సీఎం చంద్రబాబు పుణ్యమేనని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ సమస్యే కాకుండా అన్నివిషయాల్లోనూ చంద్రబాబు కేంద్రంతో చేతులు కలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తున్నారని ఆరోపిం చా రు. అలాంటి వ్యక్తికి తెలంగాణలోని టీడీపీ ఎమ్మెలేలు, నాయకులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు.
నాయకులు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ డోర్నకల్ నియోజకవర్గ అధికార ప్రతినిధి కాలం రవీందర్‌రెడ్డి, కొండం దశరథ, వంటికొమ్ము సత్యనారాయణరెడ్డి, రాంపెల్లి రవి, ప్రవీణ్‌రెడ్డి, రంగారెడ్డి, శ్రావణ్‌రెడ్డి, బొల్లం నర్సయ్య, శ్రావణ్‌రెడ్డి, వెంకటనర్సయ్య, అఫ్సర్, సర్పంచ్ వెంకన్న, సత్యనారాయణ పాల్గొన్నారు.