power issue
-
Sagubadi: ఎక్కడి నుంచైనా.. మోటర్ ఆన్, ఆఫ్!
'రైతులు ఊరికి వెళితే పంటలకు నీళ్లు పెట్టాలంటే ఇబ్బంది. ఓ స్టార్టప్ కంపెనీ రూపొందించిన ఈ పరికరం ద్వారా ఫోన్‌తో బోర్ మోటర్‌ను ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఓ.టి.)తో పాటు క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో తయారైన ఎంబెడ్డెడ్ స్టార్టర్ ఇది. దొంగల భయం లేని ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్న రైతులు..' వరి, మొక్కజొన్న, మిర్చి.. ఇలా పంట ఏదైనా సమయానికి సాగు నీటిని అందించటం ముఖ్య విషయం. స్వయంగా పొలానికెళ్లి మోటారు స్విచ్ ఆన్, ఆఫ్ చేయటం సాధారణంగా రైతు చేసే పని. అయితే, ఏదైనా పని మీద రైతు ఊరికి వెళ్లాల్సి వస్తే.. పక్క పొలంలో రైతును బతిమాలుకొని పంటలకు నీళ్లు పెట్టేందుకు మోటర్ ఆన్, ఆఫ్ చేయించేవారు. ఇప్పుడు అలా ఎవర్నీ ఇబ్బంది పెట్టక్కర్లేదు, రైతు ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే, రైతు ఎంత దూర ప్రాంంతం వెళ్లినా సరే ఫోన్ నెట్వర్క్ ఉంటే చాలు.. మొబైల్ ఫోన్ ద్వారా ఎప్పుడు అంటే అప్పుడు బోర్ మోటర్‌ను ఆన్ చేసుకోవచ్చు, పని పూర్తయ్యాక ఆఫ్ చేసుకోవచ్చు. న్యాస్త అనే స్టార్టప్ కంపెనీ వారు అత్యాధునిక సాంకేతికతతో విలక్షణ స్టార్టర్‌ను అందుబాటులోకి తెచ్చారు. సిద్ధిపేట జిల్లాలో చిన్నకోడూరు మండలంలో పలువురు రైతులు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ పరికరాన్ని మోటారు వద్ద అమర్చుకోవడం వలన ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా మోటర్‌ను ఆన్ చేసుకునే వెసులుబాటు ఏర్పడటంతో తమకు చాలా ఇబ్బందులు తప్పాయంటున్నారు రైతులు. నలుగురు యువ విద్యావంతులు స్థాపించిన ‘న్యాస్త’ స్టార్టప్ కంపెనీ రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధనా యాజమాన్య సంస్థ (నార్మ్) ఎ–ఐడియాలో ఇంక్యుబేషన్ సేవలు పొంది రూపొందించిన ఈ పరికరంలో మొబైల్లో మాదిరిగానే ఒక సిమ్ కార్డు ఉంటుంది. దాని ద్వారా మెసేజ్ రూపంలో పొలంలో నీటి మోటర్‌కు సంబంధించిన సమాచారం.. అంటే మోటర్‌కు నీరు సరిగ్గా అందుతోందా? విద్యుత్తు ఓల్టేజి ఎంత ఉంది? మోటర్ నీటిని సరిగ్గా ఎత్తిపోస్తోందా లేదా? వంటి సమాచారం ఎప్పటికప్పుడు రైతు మొబైల్‌కు మెసేజ్‌లు వస్తాయి. సంవత్సరానికి ఒక్కసారి ఈ సిమ్‌కు రీచార్జి చేయిస్తే సరిపోతుంది. ఫోన్ సిగ్నల్స్ ఉండే ఎక్కడి నుంచైనా మోటర్‌ను ఆఫ్, ఆన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నీరు లేకపోయినా, విద్యుత్తు హెచ్చుతగ్గులు వచ్చినా మోటర్ స్విచ్ ఆఫ్ అయిపోయి.. రైతుకు మొబైల్లో సందేశం వస్తుంది. ఉపయోగాలెన్నో.. ఎప్పుడు కావాలంటే అప్పుడు (అడ్హాక్ మోడ్) న్యాస్త మొబైల్ యాప్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఏయే వేళ్లల్లో మోటర్ నడవాలి (ఇంట్రవెల్స్ మోడ్)?: భూగర్భంలో నీరు తక్కువగా ఉన్న చోట నిరంతరంగా బోర్లు నడిపితే కాలిపోతాయి. విద్యుత్తు ప్రసారం ఉండే సమయాలకు అనుగుణంగా మోటర్‌ను ఏ సమయానికి ఆన్ చెయ్యాలి? ఏ సమయానికి ఆఫ్ చేయాలి? అని టైమ్ సెట్ చేస్తే చాలు. ఆ ప్రకారంగా అదే ఆన్ అవుతుంది, అదే ఆఫ్ అవుతుంది. షెడ్యులర్ మోడ్: ప్రతి రోజు ఒకే సమయంలో ఆన్ అయ్యేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా టైం ఫిక్స్ చేసుకోవడం వలన ప్రతి రోజు పంటలకు సాగు నీళ్లు తగిన మోతాదులో అందించే అవకాశం ఉంటుంది. దొంగల భయం లేదు.. వరి, కూరగాయలు, పామాయిల్, మొక్కజొన్న తదితర పంటలు పండిస్తున్న 117 మంది రైతులు ఈ స్టార్టర్ ద్వారా లబ్ధిపొందుతున్నారని న్యాస్త స్టార్టప్ సహ వ్యవస్థాపకులు భార్గవి (83673 69514) తెలిపారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఓ.టి.)తో పాటు క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో ఈ ఎంబెడ్డెడ్ స్టార్టర్ పనిచేస్తుంది. అందువల్ల పొలంలో నుంచి ఎవరైనా ఇతరులు దీన్ని దొంగతనంగా తీసుకెళ్లినా వారు వినియోగించలేరని, దాన్ని ఆన్ చేయగానే మొబైల్ నెట్వర్క్ ద్వారా దాని లొకేషన్ ఇట్టే తెలిసిపోతుందని ఆమె ‘సాక్షి’కి తెలిపారు. ఓవర్ ద ఎయిర్ (ఒ.టి.ఎ.) సర్వర్ ద్వారా ఈ స్టార్టర్లను తాము నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటామని, సాంకేతికంగా అప్డేట్ చేయటం చాలా సులభమన్నారు. రైతు ఒక్క సిమ్ ద్వారా అనేక మోటర్లను వాడుకోవటం ఇందులో ప్రత్యేకత అని ఆమె వివరించారు. – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్ధిపేట ఈ పరికరం లేకపోతే వ్యవసాయమే చేయకపోదును! 8 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నా. పొలానికి సుమారుగా 600 మీటర్ల దూరం నుంచి సాగు నీరు సరఫరా చేస్తున్నా. దూరంలో బోర్ ఉండటంతో పైప్‌లు చాలా సార్లు ఊడిపోతుండేవి. అప్పుడు మోటర్‌ను బంద్ చేసేందుకు అంత దూరం నడచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారానే మోటర్‌ను ఆన్, ఆఫ్ చేస్తున్నా. సెల్‌ఫోన్‌తో బోర్ మోటర్ ఆఫ్, ఆన్ చేయడం అందుబాటులోకి రావడంతో చాలా ఇబ్బందులు తప్పాయి. ఈ పరికరం లేకపోతే నేను వ్యసాయం కూడా చేయకపోదును. – నాగర్తి తిరుపతి రెడ్డి (94415 44819), మాచాపూర్, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా ఊరికి వెళ్లినా ఇబ్బంది లేదు.. ఊరికి వెళితే పంటలకు నీళ్లు పెట్టాలంటే ఇబ్బందులు ఉండేవి. పక్కన రైతును బతిమిలాడుకునే వాళ్లం. అదే ఇప్పుడు న్యాస్త స్టార్టర్‌తో ఎక్కడికైనా ఫంక్షన్‌కు, ఊరికి సంతోషంగా వెళ్లి వస్తున్నా. అక్కడి నుంచే మోటర్‌ను సెల్ఫోన్లో నుంచే ఆన్, ఆఫ్ చేస్తున్నా. ఇది ఎంతో ఉపయోకరంగా ఉంది. – పంపరి సత్తయ్య (9989385961), చిన్నకోడూరు, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా నిర్వహణ: – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: Dr Anandi Singh Rawat: అర్థం చేసుకోవడం ముఖ్యం -
అమరవీరుల స్థూపం.. మ.12 గంటలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. తనతో పాటు ఎమ్మెల్యే సంపత్, దాసోజు శ్రవణ్ చర్చకు వస్తామన్నారు. అమరవీరుల స్థూపం వద్ద శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చకు కూర్చుంటామని తెలిపారు. ఎవరూ వచ్చినా తెలంగాణలో విద్యుత్ అక్రమాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. టీఆర్ఎస్ చెప్పేవన్నీ నిజాలైతే తమతో బహిరంగంగా చర్చించడానికి రావాలన్నారు. -
విద్యుత్ సమస్య చంద్రబాబు పుణ్యమే
మరిపెడ : విద్యుత్ సమస్య ఏపీ సీఎం చంద్రబాబు పుణ్యమేనని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ సమస్యే కాకుండా అన్నివిషయాల్లోనూ చంద్రబాబు కేంద్రంతో చేతులు కలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తున్నారని ఆరోపిం చా రు. అలాంటి వ్యక్తికి తెలంగాణలోని టీడీపీ ఎమ్మెలేలు, నాయకులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. నాయకులు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ డోర్నకల్ నియోజకవర్గ అధికార ప్రతినిధి కాలం రవీందర్‌రెడ్డి, కొండం దశరథ, వంటికొమ్ము సత్యనారాయణరెడ్డి, రాంపెల్లి రవి, ప్రవీణ్‌రెడ్డి, రంగారెడ్డి, శ్రావణ్‌రెడ్డి, బొల్లం నర్సయ్య, శ్రావణ్‌రెడ్డి, వెంకటనర్సయ్య, అఫ్సర్, సర్పంచ్ వెంకన్న, సత్యనారాయణ పాల్గొన్నారు. -
సమావేశాల్లో ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు విద్యుత్ సెగలు తాకనున్నాయి. బడ్జెట్ సమావేశాల రెండో రోజైన శుక్రవారం ప్రధానంగా విద్యుత్ సంక్షోభంపైనే చర్చ జరుగనుంది. ఈ సమావేశాల్లో ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీ మధ్య విద్యుత్ పంపిణీపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ప్రశ్నోత్తరాల్లో సమాధానాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వనున్నారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, నూతన పారిశ్రామిక విధానం, కల్యాణలక్ష్మీ, భూ పంపిణీ, ఫీజు రీయింబర్స్మెంట్లపై ప్రశ్నోత్తరాలు ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. విద్యుత్ సమస్యపై చర్చ జరుగనున్న నేపథ్యంలో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే బడ్జెట్‌పై చర్చను ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రారంభించనున్నట్టు సమాచారం. -
కర్కోటక కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తరా?
రైతు ఆత్మహత్యలకు కారణమైన మిమ్మల్ని ప్రజలు నమ్ముతరా? టీ కాంగ్రెస్ నాయకులకు కేటీఆర్ బహిరంగ లేఖ సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలకు కారణమైన కర్కోటక కాంగ్రెస్ నేతలే కరెంటు సమస్య గురించి మాట్లాడుతూ ధర్నా చేస్తే, ప్రజలు ఎలా నమ్ముతారని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ నేతలకు మంగళవారం బహిరంగ లేఖ రాశారు. అధికారంలో ఉంటూ నిన్నటిదాకా కాంగ్రెస్ నేతలు చేసిన పాపాల వల్లనే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆ లేఖలో విమర్శించారు. నాలుగు దశాబ్దాల పాలనలో ఏనాడూ విద్యుత్ సమస్య గురిం చి కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదన్నారు. తాము చేసిన పాపాలను దాచిపెట్టి, ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా కేవలం నాలుగునెలల టీఆర్ఎస్ పాలనపై నిరసనలకు, ధర్నాలకు దిగుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. లేఖలో ఆయనేమన్నారంటే.. ‘అధికారంలో ఉన్నన్ని రోజులు తెలంగాణ రైతులకు వెన్నుపోటు పొడిచిన దగాకోరు ముఠా కాంగ్రెస్ నేతలదే. తల్లిదండ్రులను చంపిన కుమారుడే కోర్టుకు పోయి.. అయ్యఅవ్వ లేని అనాథను, శిక్ష వేయకుండా ఆదుకోండి అని అన్నట్టుగా కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి ఉంది. మహబూబ్‌నగర్‌లో బీమా, కల్వకుర్తి, జూరాల, కోయిల్‌సాగర్‌కు చుక్కనీరు ఇవ్వకుండా సీమాంధ్ర ప్రాజెక్టులకు నీటిని తరలించుకుపోతుంటే అప్పటి మంత్రి డి.కె.అరుణ హారతి పట్టి ఆరంభం చేయలేదా? శ్రీశైలం నీటి దోపిడీ కోసం కనీస నీటిమట్టాన్ని పెంచితే.. కళ్లకు గంతలు కట్టుకున్న అభినవ ధృతరాష్ట్రులు కాంగ్రెస్ నేతలు. విద్యుత్ సమస్యలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనంటూ గత నెలలో రాసిన లేఖలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేశారు. 40 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఫలితంగా ఏర్పడిన విద్యుత్తు సంక్షోభాన్ని నాలుగునెలల టీఆర్ఎస్కు అంటగట్టడం దారుణం. తెలంగాణ నవజాత శిశువును హత్య చేస్తున్న క్రూరులు మీరు. పాలకపక్షం నుంచి ప్రతిపక్షంలోకి మారగానే చేసిన పాపాలన్నీ మరిచిపోయిన లేటెస్ట్ గజినీలుగా కాంగ్రెస్ నేతలున్నా, వారి పాపాలను ప్రజలు మర్చిపోరు. ఇలాంటివాటితో ప్రజలను వంచించినందుకే 2 లక్షల రుణమాఫీ అన్నా నమ్మకుండా.. నిజాయితీగా టీఆర్ఎస్నే గెలిపించారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ప్రజలు, రైతుల కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఘనత టీఆర్ఎస్ది. ఇచ్చిన హామీ మేరకు రూ.17 వేలకోట్ల రుణమాఫీని తలకు ఎత్తుకుని 4,250 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. తుపాను దెబ్బకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.486 కోట్లను అందించాం. వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణా పన్ను మాఫీ, పెండింగులో ఉన్న ఎర్రజొన్న బకాయిల చెల్లింపు వంటివన్నీ చేశాం. కరెంటు కష్టాలపై ఎన్నికల్లోనే నిజాయితీగా ప్రజలకు వివరించాం. కావాలంటే అప్పటి సీడీలను కూడా పంపుతాం. ప్రజలను మోసగిస్తున్నందుకే కాంగ్రెస్‌ను, అవకాశవాద రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారు.’ -
అధికార పక్షంపై ఆగ్రహం
అన్నాడీఎంకే ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా తయారైందంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా పాల ధర, విద్యుత్ చార్జీల పెంపుపై విరుచుకుపడుతున్నాయి. ఎవరికి వారు బహిరంగ విమర్శలు చేయడం మొదలు పెట్టారు. దీంతోపాటు ఆందోళనకు సన్నద్ధం అవుతున్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: యాధృచ్ఛికమో లేక మరేదైనా కారణమోగానీ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోరాటాలు జరిపేందుకు ప్రతిపక్షాలకు పెద్దగా అవకాశం దొరికేది కాదు. పార్టీ సమావేశాల్లో విమర్శలేగానీ బహిరంగ ఆందోళనలకు వారికి బల మైన అంశాలే కరువయ్యూయి. అమ్మ జైలు పాలుకావడం తో అప్రతిహతంగా సాగుతున్న అన్నాడీఏంకే పాలనలో అధికార పక్షంపై ఆగ్రహం 35: నిరసనకు తరలి వచ్చిన డీఎండీకే వర్గాలు 36: ఓ అభిమాని వినూత్నం 37: పాల ప్యాకెట్ కవర్లతో నిరసన అపశ్రుతులు ఆరంభమయ్యూయి. రాజ్యాంగపరంగా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా మారినా ప్రజలు, ప్రతి పక్షాలను నమ్మించలేక పోతున్నారు. అమ్మకు వీర విధేయుడేగానీ ప్రజలకు కాదనే అపవాదును మూటగట్టుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పాలు, విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం అన్నాడీఎంకే పాలనకు శరాఘాతమైంది. ఆవిన్ పాలు లీటరు రూ.24 నుంచి రూ.34 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ధర నవంబరు 1 నుంచి అమల్లోకి రానుంది. అలాగే విద్యుత్ చార్జీలను సైతం పెంచేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అధికార పార్టీని దుమ్మెత్తిపోయడానికి అదునుకోసం వేచి ఉన్న ప్రతిపక్షాలకు పదునైన అస్త్రంగా మారింది. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అమ్మ అప్రతిష్టపాలై ఉన్న బలహీన క్షణాల్లోనే బలమైన దెబ్బతీయాలని విపక్షాలు సిద్ధమవుతున్నాయి. వచ్చె నెల నుంచి ప్రజలకు పెనుభారంగా మారనున్న పాల ధర, విద్యుత్ చార్జీల పెంపును భుజాలకెత్తుకుని ఆందోళనలకు దిగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో తోలుబొమ్మ పరిపాలన సాగుతోందంటూ డీఎంకే కోశాధికారి స్టాలిన్ విమర్శలు చే స్తూ సమావేశాలను నిర్వహిస్తున్నారు. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ సైతం మంగళవారం చెన్నై వళ్లువర్ కోట్టం వద్ద పోరాటబాట పట్టారు. పాల ధరను పెంచకుండా, ఆవిన్ పాల కల్తీకి పాల్పడి కోట్లు ఆర్జించిన వైద్యనాథన్ ఆస్తులు స్వాధీనం చేసుకుంటే సరిపోతుందని విజయకాంత్ వ్యాఖ్యానించారు. వచ్చేనెల 15 నుంచి 35 శాతం విద్యుత్ చార్జీలు కూడా పెరగనున్నాయన్నారు. పెంచిన ధరలను పూర్తిగా ఉపసంహరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ప్రజా సమస్యల కోసం జైలు కెళ్లడానికి తాను సిద్ధమని కెప్టెన్ వ్యాఖ్యానించారు. పాలు, విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 31న వల్లువర్‌కోట్టం వద్ద ఆందోళన నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్ మంగళవారం ప్రకటించారు. ప్రభుత్వం వెనక్కు తగ్గకుంటే నవంబరు మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఇవే అంశాలపై వచ్చేనెల 5 వ తేదీన ఆందోళన చేపట్టనున్నట్లు పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ మంగళవారం ప్రకటించారు. 16 నుంచి కొత్త కార్డులు ఆవిన్ పాల ధర పెంపుపై అన్ని పార్టీలు ఆందోళనలు సాగిస్తుండగానే అధికారులు తమపని తాను చేసుకుంటూ పోతున్నారు. ఆవిన్ పాల వినియోగదారులకు ప్రతి నెలా 16 నుంచి మరుసటి నెల 15 వరకు కార్డులు జారీ చేయడం ఆనవాయితీ. ఈనెల ఆవిన్ కార్డును కొనుగోలు చేసుకున్న వారు వచ్చేనెల 1 నుంచి పెంచిన అదనపు ధరను చెల్లించాలని ఆవిన్ యాజమాన్యం ప్రకటించింది. నవంబరు 16న పెంచిన ధరకు అనుగుణంగా కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. అంటే పాత ధరపై కార్డును కొనుగోలు చేసిన వారు సైతం కొత్త ధరను చెల్లించక తప్పదని ఆవిన్ వారు స్పష్టం చేస్తున్నారు. -
డైలీ సీరియల్లా టీ-మంత్రుల అబద్ధాలు: పరకాల
-
డైలీ సీరియల్లా టీ-మంత్రుల అబద్ధాలు: పరకాల
తెలంగాణ మంత్రులు అబద్ధాలను సీరియల్లా చెబుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ విమర్శించారు. 233 జీవోలో ఎక్కడా 834 అడుగుల వరకు నీరు వాడుకోవచ్చనే పదమే లేదని ఆయన అన్నారు. చెప్పిన అబద్ధాలనే వాళ్లు మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. 107 జీవోకు, 170 జీవోకు మధ్య తేడా ఏంటో హరీష్‌రావుకు తెలియదా అని ప్రశ్నించారు. ఒకదానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని, అబద్ధాల డైలీ సీరియల్‌ను ఇకనైనా ఆపాలని పరకాల ప్రభాకర్ అన్నారు. మీ నీటిని మీరు వాడుకుంటే తమకు అభ్యంతరం లేదని, అంతేతప్ప.. తమకు రావల్సిన న్యాయబద్ధమైన వాటాలో కూడా వేలు పెడితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ఇక విద్యుత్తు విషయంలో కూడా.. తమకు వెయ్యి మెగావాట్లు రావాలని అడుగుతున్నారని, అవి ఎక్కడినుంచి రావాలని ప్రశ్నించారు. దానికి ఏమైనా లెక్క ఉందా.. ఎక్కడెక్కడ రావల్సిన దానికన్నా అదనంగా తీసుకుంటున్నారో కూడా లెక్కలు చెబుతానని అన్నారు. థర్మల్ విద్యుత్తులో ఏపీ ఉత్పత్తి చేసిన దాంట్లోంచి 769 మిలియన్ యూనిట్లు తెలంగాణకే ఇచ్చామని ఆయన చెప్పారు. జల విద్యుత్తులో కూడా ఆంధ్రా డిస్కంలు 1621, తెలంగాణ డిస్కంలు 2224 మిలియన్ యూనిట్ల చొప్పున వాడుకున్నాయన్నారు. ఇలా అన్నిచోట్లా ఎక్కువ వాడుకుంటూ.. తమ మీద తప్పునెట్టడం తెలంగాణ మంత్రులకు తగదని పరకాల ప్రభాకర్ చెప్పారు. -
కేసీఆర్‌తో చర్చించి పరిష్కరిద్దాం: చంద్రబాబు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం - కేసీఆర్ వ్యవహార శైలిపైనే మంత్రివర్గంలో 2 గంటలు చర్చ - ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నారని మంత్రుల వ్యాఖ్య - టీ ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించాలని బాబు సూచన సాక్షి, హైదరాబాద్: వివాదాల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకూ ఉందని, ఇందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల తరఫున నిపుణులు లేదా ప్రతినిధులు కూర్చుని చర్చించి సమస్యలు పరిష్కరించుకోవచ్చునన్నారు. కేంద్రం కేవలం రిఫరీగా వ్యవహరిస్తుందని చెప్పారు. సోమవారమిక్కడ కేబినెట్ భేటీ అనంతరం సహచర మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్, కె.అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన విలేకరులతో ఈ విషయం చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకు... అంతకు ముందు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కూడా తాజా వివాదాలపైనే సుదీర్ఘంగా చర్చించారు. అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)తో నేరుగా చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్తు అంశంపై కొంత చర్చించినా... తరవాత చర్చ మొత్తం కేసీఆర్‌పైకే వెళ్లింది. దాదాపు రెండు గంటలకు పైగా దీనిపైనే చర్చించారు. విభజన చట్టంలో 9, 10 షెడ్యూళ్లలో చేర్చిన అంశాలకు భిన్నంగా కేసీఆర్ తీసుకున్న చర్యల్ని అధికారులు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలోని 107 సంస్థలు, విభాగాలపై ఇరు రాష్ట్రాలు చర్చించి నిర్ణయం తీసుకోవలసి ఉన్నా తెలంగాణ ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా కేసీఆర్ ఇలా ప్రవర్తించడం వెనుక సెంటిమెంటును కొనసాగిస్తూ రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకొనే వ్యూహం ఉందని సమావేశం అభిప్రాయపడింది. దీనిని రాజకీయంగానే ఎదుర్కొనాలని, అవసరమైతే న్యాయ పోరాటం, కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా అడ్డుకట్ట వేయాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కేంద్రం పైనే కాలు దువ్వుతున్నారని, దాని పరిణామాలు కూడా అంతే తీవ్రంగా ఉండవచ్చన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. కేసీఆర్ ఏకపక్ష పోకడల వల్లే కేంద్రం హైదరాబాద్‌లో గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టిందని, ప్రధాన మంత్రిని ఫాసిస్టు అని విమర్శలు చేయడాన్ని కేంద్రంతీవ్రంగానే పరిగణిస్తోందని మంత్రులు అన్నారు. కేసీఆర్ ఇలాగే వ్యవహరిస్తే శాంతిభద్రతలు అదుపు తప్పే పరిస్థితి వస్తుందని, చివరకు కేంద్రం నేరుగా జోక్యం చేసుకోనే స్థితికి వస్తుందని విశ్లేషించారు. కేసీఆర్ తీరువల్ల తెలంగాణలోని బడుగు బలహీనవర్గాల వారు చాలా నష్టపోతున్నారని, తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈ వర్గాల ద్వారానే ఆయనకు చెక్ పెట్టొచ్చని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు వివరించారు. వారికి పరోక్షంగానైనా మద్దతు ఇవ్వాలని అన్నారు. కృష్ణా డెల్టాకు తాగునీటి విడుదల నుంచి ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నారని మంత్రులు చెప్పారు. కేసీఆర్‌కు గట్టి సమాధానమివ్వాలని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా ముప్పేట దాడిచేయాలని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి చెప్పారు.ప్రజలకు సంబంధించిన అంశాలను పక్కదారి పట్టించడమే కేసీఆర్ ఎత్తుగడని యనమల వివరించారు. తెలంగాణలోని నాలుగున్నర కోట్ల మంది ప్రజల్లో కోటి మంది సెటిలర్ల విషయాన్ని వివాదం చేస్తే తక్కిన వారంతా ఆయనవైపు ఉంటారన్న అంచనాలో కేసీఆర్ ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. మంత్రుల అభిప్రాయాలు విన్న చంద్రబాబు.. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని చెప్పారు. విభజన చట్టంలో ఉన్న అంశాలపై మంత్రులు అవగాహనకు రావాలని,ఎప్పటిక ప్పుడు స్పందిస్తూ కేసీఆర్ తీరును ఎండగట్టాలని సూచించారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లు, 8వ సెక్షన్లో ఉన్న అంశాలను న్యాయ శాఖ కార్యదర్శితో మంత్రులకు చెప్పించారు. చట్టంలో పేర్కొనని సంస్థల విషయాన్ని గవర్నర్‌ద్వారా కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వివాదాలపై కేంద్రానికి మరోసారి లేఖ రాయనున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఏపీకి బదిలీ అయిన ముంపు మండలాలు ఏడింటినీ నోటిఫై చేసి, ప్రత్యేకాధికారులను నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. రాజధానిపై మాట్లాడొద్దు: బాబు రాష్ట్రంలో రాజధాని నగరం ఎక్కడనే అంశంపై మంత్రులెవరూ ప్రకటనలు చేయకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. మంత్రులు ఎవరిష్టానుసారం వారు మాట్లాడొద్దన్నారు. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ త్వరలోనే కేంద్రానికి నివేదిక ఇస్తుందని, అందువల్ల ఇప్పుడే ఎలాంటి ప్రకటన లు చేసినా వివాదాలకు దారితీస్తుందని చెప్పారు. రాజధానిపై మంత్రి నారాయణ చేస్తున్న ప్రకటనలు ప్రస్తావనకు వచ్చినప్పుడు సీఎం ఈ విషయాన్ని స్పష్టంచేశారు. పతాకావిష్కరణ బాధ్యతలపై సీనియర్ల అసంతృప్తి మంత్రివర్గంలోని జూనియర్లకు స్వాతంత్య్ర దినోత్సవంనాడు జెండా వందనం బాధ్యతలను అప్పగించడం వివాదంగా మారింది. కేబినెట్ భేటీకి ముందు ఈ అంశంపై కొందరు మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేశారు. -
అధికారంలోకి రావడమే లక్ష్యం కాంగ్రెస్‌పై విద్యుత్ బాణం
న్యూఢిల్లీ: ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఇటు బీజేపీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. విద్యుత్ టారిఫ్ పెంపే ప్రధానాంశంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగాయి. రెండు సంవత్సరాల వ్యవధిలో నగరంలో 65 శాతం మేర టారిఫ్ పెరిగింది. ఈ నేపథ్యంలో దీని ప్రభావం ఈ ఎన్నికలపై పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ అంశంపై కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న బీజేపీ తాము అధికారంలోకి వస్తే 30 శాతం, 50 శాతం తగ్గిస్తామని ఆప్‌లు హామీల వర్షం కురిపిస్తున్నాయి. విద్యుత్ చార్జీలు విపరీతంగా పెరగడం వల్ల తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, ఇది తమ నెలసరి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోందని అటు పేదవారితోపాటు ఇటు ధనిక కుటుంబాలు సైతం వాపోతున్నాయి. విద్యుత్ సరఫరా మెరుగుపడినప్పటికీ చార్జీలు విపరీతంగా పెరిగిపోవడం అందరినీ ఆవేదనకు లోనుచేస్తోంది. 2011లో ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్సీ) 22 శాతం మేర విద్యుత్ చార్జీలను పెంచింది. ఆ తరువాత 2012 ఫిబ్రవరిలో ఐదు శాతం పెంచింది. మరలా మే నెలలో రెండు శాతం, జూలైలో 26 శాతం పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడు, జూలైలో ఐదు శాతం పెంచింది. దీంతో మేలుకున్న ప్రభుత్వం 400 యూనిట్లలోపు వినియోగించుకునేవారికి సబ్సిడీ ప్రకటించింది. ఈ విషయమై జనక్‌పురి ప్రాంతంలో నివసించే దినేశ్‌కుమార్ మాట్లాడుతూ ఓటింగ్ సమయంలో సమాజంలోని అన్నివర్గాలు ఈ అంశాన్ని మదిలో పెట్టుకోవడం తథ్యమన్నారు. విద్యుత్ చార్జీలు విపరీతంగా పెరిగిపోవడమనేది సామాన్యుడి బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదన్నారు. పిల్లల చదువుకోసం డబ్బు దాచుకోవడం అత్యంత కష్టంగా మారిపోయిందన్నారు. ఈ వాదనను జంగ్‌పుర ప్రాంతంలో నివసిస్తున్న బ్యాంకు ఉద్యోగి రాకేశ్ గుప్తా సమర్థించాడు. ‘విద్యుత్ చార్జీలు అనేక రెట్ల మేర పెరిగాయి. ఇక కూరగాయలతోపాటు నిత్యావసర సరుకుల ధరల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు’ అని అన్నాడు. ఇదిలాఉంచితే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలతో చేతులు కలిపిందని ఆరోపిస్తూ 25 శాతం మేర చార్జీలను తగ్గించాల్సిందిగా ఎందుకు కోరడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై అప్పట్లో బీజేపీ విరామం లేకుండా విమర్శనాస్త్రాలు సంధించింది. దీంతో ఇరకాటంలో పడిపోయిన ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చార్జీలు పెంచొద్దంటూ 2010, మే నాలుగో తేదీన డీఈఆర్సీని ఆదేశించింది. కొత్త టారిఫ్‌ను అమలు చేయాలంటూ మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు ఒత్తిడి చేసినా రాష్ట్రప్రభుత్వం అందుకు నిరాకరించింది. 2010-11 కాలానికి కొత్త టారిఫ్‌ను సిద్ధం చేసినప్పటికీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగా డీఈఆర్సీ తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు సన్నద్ధత వ్యక్తం చేసింది. సొంత ఇళ్లులేని వారి పరిస్థితి మరీ ఘోరం నగరంలో అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారి పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది. యజమానులు ఒక్కొక్కసారి వారి వద్ద నుంచి అసాధారణ రీతిలో బిల్లులు వసూలు చేస్తుండడమే ఇందుకు కారణం. ఈ విషయమై సాకేత్ ప్రాంతంలోని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బన్సీలాల్ మాట్లాడుతూ తన నివాసంలోని ప్రతి ఇంటికీ ఆయా యజమానులు వ్యక్తిగత మీటర్లను ఏర్పాటు చేయలేదన్నారు. ఈ కారణంగా కిరాయిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చార్జీలు అనుకూలంగా లేవు: విజయ్ గోయల్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నగరంలో విద్యుత్ చార్జీలు సామాన్యుడికి ఎంతమాత్రం అనుగుణంగాలేవని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ ఆరోపించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతోమాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో పేదలు భరించేవిధంగా చార్జీలు ఉన్నాయన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ రంగంలో సంస్కరణలు తెస్తామన్నారు. చార్జీల పెంపు ఎంతమాత్రం సరికాదన్నారు. మధ్య, దిగువతరగతి ప్రజలపై అసాధారణ రీతిలో రాష్ట్ర ప్రభుత్వం భారం మోపుతోందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో బిజిలీ ర్యాలీలు విద్యుత్ టారిఫ్ పెంపు అనంతర పరిణామాలను తనకు అనుగుణంగా మార్చుకునేందుకు, ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ శాయశక్తులా కృషి చేసింది. ఈ ఏడాది ఆగస్టులో బిజిలీ ర్యాలీలు నిర్వహించింది. ఒకవేళ తదుపరి ఎన్నికల్లో తాము గెలిస్తే విద్యుత్ చార్జీల్లో 30 శాతం రాయితీ ఇస్తామని హామీ ఇచ్చింది. ‘ఆప్’దీ అదే దారి అర వింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఊపిరిపోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సైతం ఇదే దారిని ఎంచుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నగరంలో అనేక ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. విద్యుత్ బిల్లులు చెల్లించొద్దంటూ నగరవాసులకు పిలుపునిచ్చింది. రచ్చబండ (గల్లీ-మొహల్లా) కార్యక్రమాలను చేపట్టిన ఆ పార్టీ విద్యుత్ టారిఫ్‌ను 23 శాతం తగ్గించాలంటూ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాగా 2002లో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలను ప్రవేశపెట్టింది. వివిధ వర్గాలు ఇందుకు అభ్యంతరం చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. సంస్కరణల అనంతరం విద్యుత్ పంపిణీ బాధ్యతలను బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్, రాజధాని పవర్ లిమిటెడ్, నార్త్ ఢిల్లీ పవర్ లిమిటెడ్ సంస్థలకు అప్పగించింది. ఈ మూడు సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది.