తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు విద్యుత్ సెగలు తాకనున్నాయి. బడ్జెట్ సమావేశాల రెండో రోజైన శుక్రవారం ప్రధానంగా విద్యుత్ సంక్షోభంపైనే చర్చ జరుగనుంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు విద్యుత్ సెగలు తాకనున్నాయి. బడ్జెట్ సమావేశాల రెండో రోజైన శుక్రవారం ప్రధానంగా విద్యుత్ సంక్షోభంపైనే చర్చ జరుగనుంది. ఈ సమావేశాల్లో ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీ మధ్య విద్యుత్ పంపిణీపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ప్రశ్నోత్తరాల్లో సమాధానాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వనున్నారు.
విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, నూతన పారిశ్రామిక విధానం, కల్యాణలక్ష్మీ, భూ పంపిణీ, ఫీజు రీయింబర్స్మెంట్లపై ప్రశ్నోత్తరాలు ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. విద్యుత్ సమస్యపై చర్చ జరుగనున్న నేపథ్యంలో బడ్జెట్పై సాధారణ చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే బడ్జెట్పై చర్చను ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రారంభించనున్నట్టు సమాచారం.