అప్‌డేట్స్
మూడు లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ. 3 వేలు మెస్ చార్జీలు ఇవ్వలేమా?
►తెలంగాణ వ్యాప్తంగా యూనివర్శిటిలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు కనీసం మూడు వేల మెస్ బిల్లు ఇవ్వలేమా అని ఎమ్మెల్యే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మూడు లక్షల కోట్ల బడ్జెట్‌లో మూడు వేలు విద్యార్థుల మెస్ చార్జీల కింద ఇవ్వలేకపోవడం దురదృష్టకరమన్నారు.
►బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ భారీగా ఉందని, అయితే ఈ బడ్జెట్‌లో తనకు పలు సందేహాలు ఉన్నాయన్నారు. ఆదాయ అంచనాలు వాస్తవ దూరంగా ఉన్నాయని భట్టి పేర్కొన్నారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయ లెక్కలను పరిశీలిస్తే, గతేడాది కన్న ఈ ఏడాది రూ. 40 వేల కోట్లు ఎక్కువగా చూపించామన్నారు.
►ఈ రోజు సెషన్స్‌లో భాగంగా అసెంబ్లీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసెంబ్లీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా కంటి వెలుగు టెస్టులను స్పీకర్ పోచారంతో పాటు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరు చేయించుకున్నారు.
►బుధవారం నాటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment