
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. తనతో పాటు ఎమ్మెల్యే సంపత్, దాసోజు శ్రవణ్ చర్చకు వస్తామన్నారు. అమరవీరుల స్థూపం వద్ద శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చకు కూర్చుంటామని తెలిపారు. ఎవరూ వచ్చినా తెలంగాణలో విద్యుత్ అక్రమాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. టీఆర్‌ఎస్ చెప్పేవన్నీ నిజాలైతే తమతో బహిరంగంగా చర్చించడానికి రావాలన్నారు.