ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆదివాసీల నిరసన
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌లో ఆదివాసీలు కదంతొక్కారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సోమవారం ఆదివాసీలు జిల్లా కేంద్రం లో కలెక్టరేట్‌ను ముట్టడించి, ధర్నా నిర్వహించారు. అంతకు ముందు భారీ ర్యాలీ చేపట్టారు. లంబాడీల ను ఎస్టీ జాబితాలోనుంచి తొలగించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు డిమాండ్ చేశారు. అంతవరకు ఉద్యమం ఆగదన్నారు. 1977 నుండి ఎస్టీలుగా చలామణి అవుతున్న పక్క రాష్ట్రం నుంచి వలస వచ్చిన లంబాడీలు ఏజెన్సీ సర్టిఫికెట్లు పొంది ఎస్టీలుగా గుర్తింపుతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. కొమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర కార్యదర్శి వెంకగారి భూమయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
వచ్చే నెల 9 వరకు వేచి చూస్తాం
ఆదిలాబాద్ రూరల్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే విషయంలో డిసెంబర్ 9 వరకు వేచి చూస్తామని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆదివాసీ నాయకులు హెచ్చరించారు. ఆదివాసీలు సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment