భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాలో బీజేపీ తలపెట్టిన గిరిజన గర్జన సభ రసాభాసగా మారింది. బీజేపీ సభ జరుగుతుండగా గిరిజన సంఘం నాయకులు మధ్యలో అడ్డుకోవడంతో ఆందోళన నెలకొంది.
చర్ల మండల కేంద్రంలో భద్రాద్రినియోజక వర్గ పరిధిలో బీజేపీ గిరిజన గర్జన బహిరంగ సభను నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని గిరిజన సంఘం నాయకులు వేదిక వద్ద బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసుల జోక్యంతో ఆందోళనకారులు వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment