భద్రాద్రి జిల్లా మీదుగా తెలంగాణలోకి మావోలు
అడ్డుకట్ట వేసేలా తెలంగాణ సరిహద్దులో కొత్తగా పోలీసు క్యాంపులు
ఫలితంగా కట్టుదిట్టంగా మారిన నిఘా
తాజా ఎన్‌కౌంటర్‌తో తెగిపోనున్న సంబంధాలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో మరోసారి పాగా వేయాలనే మావోయిస్టుల ప్రయ త్నాలు ఇప్పట్లో సాకారమయ్యే పరిస్థితి కనిపించ డం లేదు. ఓ వైపు పోలీసు నిఘా పెరిగిపోగా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మావోల వ్యూహాలకు అడ్డు క ట్టలు వేస్తున్నాయి.
పలుచోట్ల పోలీసు క్యాంపుల ఏ ర్పాటుతో పహారా పెరిగింది. దీనికి తోడు ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో మావోలు మృతి చెందడంతో వారు తెలంగాణలో స్థావరాలు ఏర్పాటు చేసు కోవాలన్న వ్యూహానికి చెక్ పడినట్టు తెలుస్తోంది.
ఆ రెండు జిల్లాల పరిధిలోనే...
బస్తర్ అడవుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన జనతన సర్కార్ ప్రభావం క్రమంగా సరిహద్దులో ఉన్న తెలంగాణ జిల్లాలకు విస్తరించింది. మావోయిస్టుల అడ్డాగా బీజాపూర్, సుక్మా జిల్లాతో సరిహద్దు పంచుకుంటున్న ములుగు జిల్లాలోని వెంకటాపురం, భద్రాద్రి జిల్లాలోని చర్ల, దుమ్మగూడెం మండలాలు మావోలకు సరికొత్త అడ్డాగా మారాయి.
తెలంగాణ వచ్చిన తర్వాత దళాల సంచారం, వాల్ పోస్టర్లు, బ్యానర్లు కట్టడం, బాంబులు పేల్చడం తదితర ఘటనలన్నీ ఈ రెండు జిల్లాల పరిధిలోనే జరిగాయి. చర్ల మండలం మావోయిస్టుల ప్రభావంతో ఎరుపెక్కింది. చర్లతో సరిహద్దు పంచుకుంటున్న పామేడు–కంచాల–కొండపల్లి ఏరియాల పరిధిలో గడిచిన పదేళ్లలో అనేకసార్లు మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా..
మావోల కంచుకోటలోకి చొచ్చుకుపోయే లక్ష్యంతో చర్ల కు సమీపంలో ఉన్న పామేడు దగ్గర మావోల అడ్డాకు సరి హద్దుగా ఉన్న చింతవాగు దగ్గర ఏడాది క్రితం కేంద్ర భద్రతా దళాలు క్యాంపు ఏర్పాటు చేశాయి. కానీ ఇక్కడ ఉన్న దట్టమైన అడవు లు, ఉధృతంగా ప్రవహించే వాగుల కారణంగా ప్రభుత్వ భద్రతా దళాలు పామేడును దాటి అడవుల్లోకి చొచ్చుకుపోవడం కష్టమైంది.
మరోవైపు ఈ వాగుకు ఆవల ప్రాంతమంతా మావోయిస్టుల్లోనే శక్తివంతంగా భావించే దక్షిణ బస్తర్ జోన్ కమిటీ ఆధీనంలో ఉంది. దీంతో కేంద్ర భద్రతా దళాలకు చెందిన జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతీసే లక్ష్యంతో అదే పనిగా పామేడు సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై దాడులు జరిపారు. జవాన్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ దాడులను తిప్పికొట్టగలిగారు. లేదంటే భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగేది.
చుట్టుముట్టేస్తున్నారు..
మావోలకు పట్టున్న ప్రాంతంలోకి చొచ్చుకుపోయేందుకు వీలుగా ఇటీవల పామేడు దగ్గరున్న చింతవాగుపై నిర్మించిన వంతెన అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత నెల వ్యవధిలోనే పామేడు అవతల ఉన్న ధర్మారం, జీడిపల్లి, కొండపల్లి, తుమ్మలపాడు గ్రామాల్లో సీఆర్‌పీఎఫ్ క్యాంపులు ఏర్పాటయ్యాయి. వారం వ్యవధిలోనే మొబైల్ టవర్లు వచ్చేశాయి.
ఈ వేసవి నాటికి పామేడు నుంచి కొండపల్లి మీదుగా పూవర్తి వరకు యుద్ధప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో పామేడు మీదుగా తెలంగాణలోకి మావోల రాక కష్టం కానుంది. మరోవైపు తెలంగాణ, ఆంధ్రకు సరిహద్దుగా ఉన్న కర్రెగుట్టలే మావోలకు అడ్డాగా మారాయి.
ఈ కర్రెగుట్టలను కేంద్రంగా చేసుకొని తరచు వెంకటాపురం, చర్ల మండలాల్లోకి మావోలు వచ్చిపోయేవారు. అయితే కర్రెగుట్టల సమీపంలో ఉన్న పూసుగుప్పతోపాటు చెలిమెల, వద్దిపేట, చెన్నాపురంలో కూడా క్యాంపులు ఏర్పాటయ్యాయి. దీంతో ఈ మార్గం కూడా మూసుకుపోయినట్టుగానే భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment