
రాయ్‌పూర్ : తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దులోని పామేడు ఏరియాలో ఉద్రిక్తత నెలకొంది. పామేడు వద్ద భద్రత బలగాల బేస్ క్యాంప్‌పై మావోయిస్ట్‌లు మెరుపు దాడి చేశారు. మావోయిస్ట్‌ల దాడుల్ని భద్రతబలగాలు తిప్పుకొడుతున్నాయి. కాగా, మావోయిస్ట్‌ల చేసిన దాడిలో ఐదుగురు భద్రతా బలగాలకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా బలగాలు గాయపడ్డ జవాన్లను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.