bhadradri district
-
రెడ్ కారిడార్‌కు చెక్ పడినట్టే?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో మరోసారి పాగా వేయాలనే మావోయిస్టుల ప్రయ త్నాలు ఇప్పట్లో సాకారమయ్యే పరిస్థితి కనిపించ డం లేదు. ఓ వైపు పోలీసు నిఘా పెరిగిపోగా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మావోల వ్యూహాలకు అడ్డు క ట్టలు వేస్తున్నాయి.పలుచోట్ల పోలీసు క్యాంపుల ఏ ర్పాటుతో పహారా పెరిగింది. దీనికి తోడు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో మావోలు మృతి చెందడంతో వారు తెలంగాణలో స్థావరాలు ఏర్పాటు చేసు కోవాలన్న వ్యూహానికి చెక్ పడినట్టు తెలుస్తోంది.ఆ రెండు జిల్లాల పరిధిలోనే...బస్తర్ అడవుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన జనతన సర్కార్ ప్రభావం క్రమంగా సరిహద్దులో ఉన్న తెలంగాణ జిల్లాలకు విస్తరించింది. మావోయిస్టుల అడ్డాగా బీజాపూర్, సుక్మా జిల్లాతో సరిహద్దు పంచుకుంటున్న ములుగు జిల్లాలోని వెంకటాపురం, భద్రాద్రి జిల్లాలోని చర్ల, దుమ్మగూడెం మండలాలు మావోలకు సరికొత్త అడ్డాగా మారాయి. తెలంగాణ వచ్చిన తర్వాత దళాల సంచారం, వాల్ పోస్టర్లు, బ్యానర్లు కట్టడం, బాంబులు పేల్చడం తదితర ఘటనలన్నీ ఈ రెండు జిల్లాల పరిధిలోనే జరిగాయి. చర్ల మండలం మావోయిస్టుల ప్రభావంతో ఎరుపెక్కింది. చర్లతో సరిహద్దు పంచుకుంటున్న పామేడు–కంచాల–కొండపల్లి ఏరియాల పరిధిలో గడిచిన పదేళ్లలో అనేకసార్లు మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా..మావోల కంచుకోటలోకి చొచ్చుకుపోయే లక్ష్యంతో చర్ల కు సమీపంలో ఉన్న పామేడు దగ్గర మావోల అడ్డాకు సరి హద్దుగా ఉన్న చింతవాగు దగ్గర ఏడాది క్రితం కేంద్ర భద్రతా దళాలు క్యాంపు ఏర్పాటు చేశాయి. కానీ ఇక్కడ ఉన్న దట్టమైన అడవు లు, ఉధృతంగా ప్రవహించే వాగుల కారణంగా ప్రభుత్వ భద్రతా దళాలు పామేడును దాటి అడవుల్లోకి చొచ్చుకుపోవడం కష్టమైంది. మరోవైపు ఈ వాగుకు ఆవల ప్రాంతమంతా మావోయిస్టుల్లోనే శక్తివంతంగా భావించే దక్షిణ బస్తర్ జోన్ కమిటీ ఆధీనంలో ఉంది. దీంతో కేంద్ర భద్రతా దళాలకు చెందిన జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతీసే లక్ష్యంతో అదే పనిగా పామేడు సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడులు జరిపారు. జవాన్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ దాడులను తిప్పికొట్టగలిగారు. లేదంటే భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగేది.చుట్టుముట్టేస్తున్నారు..మావోలకు పట్టున్న ప్రాంతంలోకి చొచ్చుకుపోయేందుకు వీలుగా ఇటీవల పామేడు దగ్గరున్న చింతవాగుపై నిర్మించిన వంతెన అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత నెల వ్యవధిలోనే పామేడు అవతల ఉన్న ధర్మారం, జీడిపల్లి, కొండపల్లి, తుమ్మలపాడు గ్రామాల్లో సీఆర్పీఎఫ్ క్యాంపులు ఏర్పాటయ్యాయి. వారం వ్యవధిలోనే మొబైల్ టవర్లు వచ్చేశాయి. ఈ వేసవి నాటికి పామేడు నుంచి కొండపల్లి మీదుగా పూవర్తి వరకు యుద్ధప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో పామేడు మీదుగా తెలంగాణలోకి మావోల రాక కష్టం కానుంది. మరోవైపు తెలంగాణ, ఆంధ్రకు సరిహద్దుగా ఉన్న కర్రెగుట్టలే మావోలకు అడ్డాగా మారాయి.ఈ కర్రెగుట్టలను కేంద్రంగా చేసుకొని తరచు వెంకటాపురం, చర్ల మండలాల్లోకి మావోలు వచ్చిపోయేవారు. అయితే కర్రెగుట్టల సమీపంలో ఉన్న పూసుగుప్పతోపాటు చెలిమెల, వద్దిపేట, చెన్నాపురంలో కూడా క్యాంపులు ఏర్పాటయ్యాయి. దీంతో ఈ మార్గం కూడా మూసుకుపోయినట్టుగానే భావిస్తున్నారు. -
భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్కౌంటర్
సాక్షిప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం, ములుగు జిల్లా తాడ్వాయిల సరిహద్దు అడవుల్లో మావో యిస్టులు సంచరిస్తున్నట్టు గ్రేహౌండ్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో వారు బుధవారం సాయంత్రం నుంచి ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున మావోయిస్టులు ఉన్న కరకగూడెం మండలం రఘునాథపాలెం సమీపంలో ని నీలాద్రిగుట్టను గుర్తించారు. వెంటనే అదనపు బలగాలను అడవుల్లోకి రప్పించారు. మొత్తంగా 150 మంది వర కు పోలీసులు బృందాలుగా ఏర్పడి ఏరియా డామినేషన్ మొదలెట్టారు. ఈ క్రమంలో ఉదయం 6:45 గంటలకు ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. అడవుల్లోంచి వస్తున్న భారీ శబ్దాలు, కాల్పుల మోతలు విని సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. మృతులంతా బీకే–ఏఎస్ఆర్కే డివిజన్ వారే ఈ కాల్పుల్లో భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామ రాజు (బీకే–ఏఎస్ఆర్) డివిజన్ కమిటీకి చెందిన ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్టు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ వెల్లడించారు. మృతుల్లో నలుగురు పురుషు లు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలం నుంచి రెండు ఏకే 47, ఒక్కో ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, పిస్టల్తోపా టు తూటాలు, కిట్‌బ్యాగులు లభించినట్టు ఎస్పీ తెలిపా రు. ఈ కాల్పుల నుంచి మావోయిస్టు మాసయ్య తప్పించుకున్నట్టు తమకు సమాచారముందని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఎల్జీఎస్గా పనిచేస్తూ.. కరకగూడెం ఎన్కౌంటర్లో చనిపోయిన ఆరుగురు మావోయిస్టులు మణుగూరు–పాల్వంచ ఏరియాలో లోకల్ గెరిల్లా స్క్వాడ్‌గా (ఎల్జీఎస్) పనిచేస్తున్నారు. వీరిలో బీకే–ఏఎస్ఆర్ డివిజన్ కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్న లచ్చన్న అలియాస్ కుంజా వీరన్న (42) స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గొల్లపల్లి మండలం రాయిగూడెం గ్రామం. 2000 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరిన లచ్చన్న అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ కాల్పుల్లో చనిపోయిన పూనెం లక్కే (29) అలియాస్ తులసి (సీజీ, బీజాపూర్ జిల్లా, గంగ్లూర్ గ్రామం‡) లచ్చన్న భార్యగా ప్రచారం జరుగుతోంది. ఈమె 2005లో మావోయిస్టు పార్టీలో చేరింది. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఇద్దరు ఉన్నారు. వీరిలో అల్లూరి సీతారామరాజు జిల్లా యటపాక మండలం సంగంపాడుకు చెందిన కొవ్వాసి రాము(25) 2015లో పార్టీలో చేరాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామానికి చెందిన పొడియం కోసయ్య (21) అలియాస్ శుక్రు 2019లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. మిగిలిన ఇద్దరు కోసి, దుర్గేశ్ ఇటీవలే మావోయిస్టు పార్టీ సభ్యులుగా చేరారు. వారిద్దరూ సేఫ్ కరకగూడెం ఎన్కౌంటర్లో కానిస్టేబుళ్లు వంశీ, సందీప్‌లలో ఒకరికి పొట్టలో తూటా దూసుకుపోగా, మరొకరి కాలుకు గాయాలయ్యాయి. దీంతో వీరిద్దరిని భద్రాచలం ఆస్ప త్రికి తరలించారు. ఆపై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అవసరమైన శస్త్ర చికిత్సలు చేశారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది. సాయంత్రానికి బయటకొచ్చిన మృతదేహాలు ఉదయం 6:45 గంటలకు ఎన్కౌంటర్ జరగ్గా, ఎనిమిది గంటలకు బయటి ప్రపంచానికి తెలిసింది. 10:30 గంటలకు మృతుల ఫొటోలు, పేర్లు వెలుగులోకి వచ్చాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తహసీల్దార్, ఎస్పీ రోహిత్‌రాజ్ ఘటనాస్థలికి వెళ్లారు. అయితే సాయంత్రం 6 గంటలకు మృతదేహాలను అడవి నుంచి బయటకు తీసుకొచ్చారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు వచ్చే వరకు మృతదేహాలను మణుగూరు/భద్రాచలం ఆస్పత్రులకు తరలించనున్నారు. ఇది విప్లవద్రోహుల పనే: ఆజాద్ విప్లవ ద్రోహుల కారణంగానే ఎన్కౌంటర్ జరిగిందని మా వోయిస్టు పార్టీ బీకే –ఏఎస్ఆర్ కమిటీ కార్యదర్శి ఆజాద్ ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్య త వహించాలని డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్‌కు నిరసన గా ఈనెల 9న జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే నెత్తుటి బాకీ తీర్చుకుంటామని ప్రకటించారు.జనజీవన స్రవంతిలో కలవండి: డీజీపీ జితేందర్సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ జితేందర్ విజ్ఞప్తి చేశారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో డీజీపీ జితేందర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమాలకు తావులేదని డీజీపీ స్పష్టం చేశారు. అనాలోచిత హింసను మావోయిస్టులు కొనసాగించడంలో అర్థం లేదని పేర్కొన్నారు. జనజీవన స్రవంతిలోకి వస్తే మావోయిస్టులకు ప్రభుత్వపరంగా పునరావాసం కలి్పస్తామని, ఇందుకు తక్షణ, దీర్ఘకాలిక సహాయక చర్యలు పొందవచ్చని డీజీపీ హామీ ఇచ్చారు మావోలపై ‘టోర్నడో’ ఎఫెక్ట్» రెండునెలల క్రితమే భద్రాద్రి జిల్లాలోకి లచ్చన్న దళం » తాడ్వాయిలో సుడిగాలులకు కూలిన చెట్లు » ఆశ్రయం కోసం కరకగూడెం వనాల్లోకి వచ్చిన మావోయిస్టులు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కరకగూడెం ఎన్కౌంటర్ వెనుక తాడ్వాయి టోర్నడో (సుడిగాలులు) కీలకంగా మారాయి. తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టులు ములుగు–భద్రాద్రి జిల్లాల సరిహద్దులోని దట్టమైన అడవులను కేంద్రంగా చేసుకొని రెండు నెలలుగా తిరుగుతున్నారు. అయితే భారీ సుడిగాలుల ధాటికి తాడ్వాయి మండలంలో ఒకేచోట రెండు వందల హెక్టార్లలో వేలాదిగా చెట్లు నేలకూలాయి. దీంతో మావోయిస్టుల కదలికలకు బ్రేక్ పడింది. అనివార్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవులకే దళాలు పరిమితం కావాల్సి వచ్చి0ది. చివరకు మావోల ఉనికి పోలీసులకు తెలియడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో పార్టీ విస్తరణకు వచ్చి... తెలంగాణలో మళ్లీ పార్టీని విస్తరించాలనే లక్ష్యంతో జూన్‌లో చిన్నచిన్న జట్లుగా మావోయిస్టులు గోదావరి దాటినట్టు సమాచారం. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామెరతోగు అడవుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన భద్రు, లచ్చన్నతో పాటు దాదాపు పదిహేను మంది సభ్యులు సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గత జూలై 25న ములుగు –భద్రాద్రి జిల్లా సరిహద్దులో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన అశోక్ (34) అలియాస్ విజేందర్ చనిపోయాడు. మిగిలిన దళ సభ్యులు తప్పించుకుని పారిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. పెరిగిన నిర్బంధం.. దామెరతోగు ఎన్కౌంటర్ తర్వాత తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో నిఘా విస్తృతం చేశారు. లచ్చన్న దళానికి చెందిన సభ్యుల వివరాలు, ఫొటోలతో పాటు వారి తలలపై ఉన్న రివార్డులను సైతం వివరిస్తూ పోలీసులు వాల్‌పోస్టర్లు అంటించి నిర్బంధాన్ని తీవ్రం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయుధాలతో గోదావరి నది దాటడం మావోయిస్టులకు కష్టంగా మారినట్టు తెలుస్తోంది. నలభై రోజులుగా.. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా..అడవులు, కొండల్లో రోజుకో చోటుకు మకాం మారుస్తూ పోలీసులకు చిక్కకుండా మావోయిస్టులు సంచారం సాగిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు, అతి భారీ సుడిగాలులు సృష్టించిన బీభత్సంతో తాడ్వాయి మండలాన్ని వదిలేసి పూర్తిగా భద్రాద్రి జిల్లాకే పరిమితం కావాల్సి వచ్చి0ది. దీంతో కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్ చేస్తూ ఎన్కౌంటర్లో ఆరుగురిని మట్టుబెట్టారు. -
అసాధారణ పరిస్థితుల్లోనే నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఇక్కడ నెలకొన్న అసాధారణ విద్యుత్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకునే కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకున్నట్టు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యుత్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో వివరాలను వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం వెనుక ఉన్న అంశాలను వివరించారు.ఆ అంశాలు కేసీఆర్ మాటల్లోనే.. ‘‘మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే తెలంగాణలో అన్ని రంగాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా జరిగి.. వ్యవసాయ, ఐటీ, పారిశ్రామిక ప్రగతి సాధించాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో సుమారు 5వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఉండగా.. మా ప్రభుత్వ కఠోర శ్రమతో విద్యుత్ రంగంలో స్వయంవృద్ధి సాధించింది. 2014 నాటికి దేశంలో 90శాతం సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లే ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే ఆ తరహాలో భద్రాద్రి ప్లాంట్ చేపట్టినట్టు చెప్పడం సరికాదు.బీహెచ్ఈఎల్తో సంప్రదింపులు జరిపి పెట్టుబడి వ్యయం రూ.400 కోట్లు తగ్గించినందునే భద్రాద్రి ప్లాంటు పనులు ప్రారంభమయ్యాయి. రెండేళ్లలోనే ప్లాంట్ సిద్ధం చేస్తామని బీహెచ్ఈఎల్ లిఖిత పూర్వకంగా హామీ ఇచి్చనందునే.. అధిక ధరల భారం రాష్ట్రం మీద పడకుండా నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించాం. ఆర్థికాభివృద్ధి కోసమే యాదాద్రి ప్లాంట్ తెలంగాణలో ప్రభుత్వం నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ గోదావరి నది తీరంలోనే ఉన్నాయి. రాష్ట్ర దక్షిణ ప్రాంతంలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఒక్క భారీ విద్యుత్కేంద్రం లేదు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య మౌలిక సదుపాయాల కల్పనలో ప్రాంతీయ సమతుల్యత సాధించడం ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అప్పటి ప్రభుత్వం నల్లగొండ జిల్లాలోని దామరచర్లను ఉద్దేశపూర్వకంగానే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి ఎంపిక చేసింది.దామరచర్లకు సమీపంలో ఉన్న కృష్ణపట్నం, బందరు (మచిలీపట్నం) రేవుల నుంచి అత్యవసర పరిస్థితుల్లో బొగ్గును దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. దామరచర్లకు జాతీయ రహదారి, రైల్వే లైన్ సమీపంలో ఉన్నందున రవాణా సమస్యలు ఉండవు. నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ నుంచి ప్లాంటుకు అవసరమయ్యే నీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాంటు నుంచి వెలువడే ఫ్లైయాష్‌ను స్థానిక సిమెంటు పరిశ్రమలు వినియోగించుకుంటాయి. ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ మేలును కోరే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటును పనులను నామినేషన్ పద్ధతిపై అప్పగించాం.తీవ్ర సంక్షోభం ఉన్నందునే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ 2014లో తెలంగాణ ఏర్పాటుతో ఎదుర్కొన్న కరెంటు సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు తెలంగాణ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నాటి పరిస్థితుల్లో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవడం, వాటిని సమరి్పంచి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వద్ద 2 వేల మెగావాట్ల కారిడార్ బుక్ చేసుకోవడం తప్ప తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థలకు మరో మార్గం లేదు.ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ సరఫరా ప్రారంభమైన తర్వాత వెయ్యి మెగావాట్ల కారిడార్ ఉపయోగించుకుని, మరో వెయ్యి మెగావాట్ల కారిడార్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం. ఈ రద్దు ద్వారా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అధికారిక ప్రక్రియను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు నిర్వహించాయి.అయినప్పటికీ రెండు రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)లు పారదర్శకంగా పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ఆమోదించిన తర్వాతే కొనుగోలు జరిగింది. న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు ఆమోదించినా ఎంక్వైరీ జరపాలనే ఆలోచన దురదృష్టకరం. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి ఈఆర్సీకి అభ్యంతరాలు తెలిపారు. ఆ అభ్యంతరాలు, ఆక్షేపణలపై అప్పీలుకు వెళ్లే అవకాశమున్నా రేవంత్‌రెడ్డి ఆ ప్రయత్నం చేసిన దాఖలా లేదు’’అని కేసీఆర్ లేఖలో వివరించారు. -
భద్రాద్రి జిల్లాలో మందుపాతర నిర్వీర్యం
చర్ల: పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన భారీ మందుపాతరను గుర్తించిన పోలీసులు శుక్రవారం దాన్ని నిర్విర్యం చేశారు. దీంతో పోలీసు బలగాలకు పెనుప్రమాదం తప్పినట్లయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కలివేరు–పెదమిడిసిలేరు ప్రధాన రహదారిపై బీ కొత్తూరు వద్ద వంతెనకు సమీపాన మావోయిస్టులు 30 కిలోల మందుపాతర ఏర్పాటు చేశారు. ఈ రహదారి మీదుగా సరిహద్దు అటవీప్రాంతానికి నిత్యం బలగాలు కూంబింగ్‌కు వెళ్లివస్తుంటాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెళ్లే పోలీసులను మట్టుబెట్టేందుకు మావోయిస్టులు ఈ మందుపాతరను అమర్చగా, తనిఖీల్లో భాగంగా గురువారం ఉదయం గుర్తించారు. ఓ పక్క పోలింగ్ జరుగుతున్నందున దాన్ని నిర్వీర్యం చేస్తే వచ్చే శబ్దంతో ఓటర్లు భయబ్రాంతులవుతారని భావించిన పోలీసులు మందుపాతరకు ఉన్న ఎలక్ట్రిక్ వైర్లు తొలగించారు. శుక్రవారం ఉదయం బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఆధ్వర్యాన నిర్వీర్యం చేశారు. కాగా, ఈ మందుపాతరను మావోలు పేల్చినట్లయితే బస్సు లేదా లారీ వంటి భారీ వాహనం కనీసం 20 నుంచి 30 అడుగుల మేర ఎత్తు ఎగిరిపడి తునాతునకలయ్యేదని చెబుతున్నారు. మరోపక్క ఈ మార్గంలో ఇంకా మందుపాతరలు ఉండొచ్చనే భావించిన పోలీసులు నిశితంగా తనిఖీలు చేపడుతున్నారు. -
సింగరేణి మనుగడ కేసీఆర్‌తోనే..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థ మనుగడ సాగించాలంటే సీఎం కేసీఆర్ ఉండాలి..కేసీఆర్ ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేటలో ఆదివారం ఆయన రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...ప్రధాని నరేంద్రమోదీ సింగరేణి ప్రైవేటీకరణకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పంటికి అందకుండా సింగరేణిని మింగేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలను బీఆర్ఎస్ ఎంపీలు అడుగడుగునా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ విషయంలో ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా పార్లమెంట్లో నోరుమెదపలేదని విమర్శించారు. త్వరలోనే ‘సీతారామ’పూర్తి చేస్తాం సీతారామ ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు బీఆర్ఎస్కు సరైన ఆదరణ లేదని, కానీ ఈసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలకం కావాలని పిలుపునిచ్చారు. పార్టీలో నేతల మధ్య చిన్న చిన్న విభేదాలు, అలకలు ఉంటే అన్నీ పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. గిరిజనేతరులకు పోడు పట్టాల పంపిణీ తదితర సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నం చేస్తామన్నారు. దరిద్రానికి నేస్తం ‘హస్తం’ కాంగ్రెస్ వారు ఒక్క అవకాశం ఇవ్వండని అడుగుతున్నారని, ప్రజలు ఇప్పటికే 11 సార్లు అవకాశం ఇచ్చారని, ఇంకెన్నిసార్లు ఇవ్వాలని కేటీఆర్ ఎద్దేశా చేశారు. రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని, రాష్ట్రంలో ఎంత మంది రైతులకు 10 హెచ్‌పీ మోటార్లు ఉన్నాయని ప్రశ్నించారు. దరిద్రానికి నేస్తంగా హస్తం మారిందని ఆయన ఆరోపించారు. నా పేరే తారక రామారావు: మూడోసారి అధికా రం చేపట్టగానే యాదాద్రి కంటే మిన్నగా భద్రా చలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తా మని హామీ ఇచ్చారు. కేటీఆర్ మధ్యాహ్నం భద్రా చలం చేరుకునేసరికి అప్పటికే ఆలయం తలుపులు మూసేయగా దర్శనం సాధ్యం కాలేదు. దీనిపై కేటీఆర్ వివరణ ఇస్తూ ‘నా పేరే తారక రామారా వు’నాకు రాముడిపై భక్తి లేకుండా ఎలా ఉంటుంది’అని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థులు బానోత్ హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావు, మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
భద్రాద్రి కొత్తగూడెం: ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మూడు లారీలు, ఒక అశోక్ లే ల్యాండ్ వాహనం ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు లారీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. జూలూరుపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. మూడు లారీలు, ఒక అశోక్ లే ల్యాండ్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో లారీ డీజిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇక, ఈ ప్రమాదంలో రెండు లారీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: ఖమ్మంలో విచిత్ర ఘటన.. రెండేళ్ల తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షం -
ములుగు: ముగిసిన రాష్ట్రపతి ముర్ము పర్యటన
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రప్రథమ పౌరురాలు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయా జిల్లాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారామె. ఇక పర్యటన ముగియడంతో ఆమె హైదరాబాద్‌కు బయల్దేరారు. ఉదయం భద్రాచలం సీతారాములవారిని దర్శించుకుని,ఆపై మధ్యాహ్నా సమయంలో ములుగు రామప్పను ఆమె సందర్శించారు. ఆమె వెంట గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పలువురు తెలంగాణ మంత్రులు ఉన్నారు. సాక్షి, ములుగు జిల్లా: యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించారు . కాకతీయుల కళానైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆమె పూజలు చేశారు. రాష్ట్రపతి వెంట ఆమె కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్లు ఉన్నారు. హెలిప్యాడ్ నుంచి రామప్ప స్టోన్ గేట్ వరకు కాన్వాయ్ వాహనంలో వచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆపై స్టోన్ గేట్ నుంచి రామప్ప ఆలయానికి కాలినడకన చేరుకున్నారు. అనంతరం.. రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.రామప్ప ఆలయ ఆవరణలో ‘ప్రసాద్’ స్కీమ్ కింద రూ. 62 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. యునెస్కో గుర్తింపు లో భాగంగా కామేశ్వరాలయం పునర్నిర్మాణంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. యునెస్కో గుర్తింపులో.. ఈ కామేశ్వరాలయం పునర్నిర్మాణమే కీలకంగా మారింది. వేయి స్థంభాల మండపం తరహాలో 33 మీటర్ల పొడవు, 33 మీటర్ల వెడల్పుతో మహామండపం నిర్మాణం జరనుంది. 2023 జూన్ వరకు ప్రదక్షిణ పథం వరకు, 2026 మార్చి నాటికి కక్షాసనతో పూర్తి పునరుద్దరణ చేస్తారు. అలాగే.. 3 మీటర్ల లోతు నుంచి సాండ్ బాక్స్ పరిజ్ఞానంతో పునాదుల నిర్మాణం జరగనుంది. 8 శతాబ్దాల కిందట ఆలయం నిర్మించినప్పుడు వాడిన ఇసుకనే ఇప్పుడు వాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భద్రాచలం చేరుకున్నారు. రాజమండ్రి నుంచి వాయుమార్గం ద్వారా ఉదయం భద్రాచలం చేరుకున్నారు. ఐటీసీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర రాష్ట్రపతికి మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్,సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సీతా లక్ష్మణ సమేత భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు, వేద పండితులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. భద్రాచలం ఆలయంలో ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాద పథకం కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు. సుమారు 3:45 గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం హెలికాప్టర్లో ములుగు జిల్లాలోని రామప్పకు బయలుదేరుతారు. కాగా రాష్ట్రపతి పర్యటన సందర్భంగా 350 మంది అధికారులు విధుల్లో ఉండగా, రెండు వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లతో నిమగ్నమయ్యారని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే భద్రాచలంలో ప్రజల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని, అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దని సూచించారు. భారీ కాన్వాయ్ రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మునుపెన్నడూ చూడనంత భారీ కాన్వాయ్ గోదావరి వంతెనపై కనిపించనుంది. మంగళవారం నిర్వహించిన మాక్డ్రిల్లోనే ఏకంగా 70కి పైగా వాహనాలతో కూడిన కాన్వాయ్ ఐటీసీ క్యాంపస్ నుంచి ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఇక బుధవారం రాష్ట్రపతితో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా కలిస్తే వందకు పైగా వాహనాలతో కూడిన అతి భారీ కాన్వాయ్ భద్రాచలంలో సైరన్ మోగిస్తూ పరుగులు పెట్టనుంది. అయితే, ఆలయ తూర్పు ముఖద్వారం వరకు రాష్ట్రపతి, ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది వాహనాలకే అనుమతి ఇవ్వనున్నట్టు సమాచారం. మిగిలిన వీఐపీల వాహనాలను మిథిలా స్టేడియం వరకే అనుమతించనున్నారు. 15 రకాల వంటకాలు భద్రాచలం పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి కోసం 15 రకాల శాకాహార వంటలను సిద్ధం చేస్తున్నారు. ఉల్లిపాయ, చామగడ్డ, చింతపండు, అనపకాయలు ఉపయోగించకుండా వంటలు చేయాలని చెఫ్‌లకు ప్రత్యేక ఆదేశాలు అందాయి. రాష్ట్రపతి పర్యటన ఇలా.. ►ఉదయం 9 గంటలకు రాజమండ్రి నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరనున్న రాష్ట్రపతి సారపాక ఐటీసీలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు 9.50గంటలకు చేరుకుంటారు. రాజమండ్రి నుంచి సారపాక వరకు నడుమ 186 కి.మీ. మేర వాయుమార్గంలో ప్రయాణానికి 50 నిమిషాలు పడుతుందని షెడ్యూల్లో పొందుపర్చారు. ►10 గంటలకు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా 10:10 గంటలకు భద్రాచలం రామాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. ►ఆలయ ప్రాంగణంలో ఉదయం 10:10 గంటల నుంచి 10:15 గంటల వరకు ఐదు నిమిషాలు రిజర్వ్ టైంగా కేటాయించారు. ► ఉదయం 10:15 గంటలకు లక్ష్మణ సమేత సీతారాముల దర్శనానికి రాష్ట్రపతి వెళ్తారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోనే ‘ప్రసాద్’ పనులకు శంకుస్థాపన చేస్తారు. ►10:30 గంటలకు ఆలయం నుంచి బయలుదేరి 2 కి.మీ. దూరంలో ఉన్న శాంతినగర్‌లోని వీరభద్ర ఫంక్షన్ హాల్‌కు చేరుకుంటారు. అక్కడ ఐదు నిమిషాల పాటు రిజర్వ్ టైం కేటాయించారు. ►10:45 గంటల నుంచి 11:30 గంటల వరకు వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన సమ్మక్క – సారలమ్మ జన్జాతి పూజారి సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సమ్మేళనం తర్వాత అక్కడి నుంచే కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో నిర్మించిన ఏకలవ్య గురుకుల పాఠశాలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ►1:30 గంటలకు వీరభద్ర ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరి 11:40 గంటలకు ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. ►ఉదయం 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 గంటల వరకు భోజనానికి కేటాయించారు. ►మధ్యాహ్నం 1:15 గంటలకు గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి 1:25 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకున్నాక మంత్రి పువ్వాడతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు వీడ్కోలు పలుకుతారు ►మధ్యాహ్నం 1:35 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరనున్న రాష్ట్రపతి 160 కి.మీ. దూరంలో ఉన్న ములుగు జిల్లా రామప్పకు మధ్యాహ్నం 2:20 గంటలకు చేరుకుంటారు. -
విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి
-
కీచక టీచర్ వికృతక్రీడ.. పదో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని పెదగొల్లగూడెం ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే ఆమె పాలిట కీచకుడయ్యాడు. ఓ టీచర్.. విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, ఆందోళన చెందిన బాధితురాలు జరిగిన విషయాన్ని తన పేరెంట్స్‌కు చెప్పింది. వివరాల ప్రకారం.. పెదగొల్లగూడెంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో పిచ్చయ్యా అనే గణితం టీచర్.. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా, చాలా రోజులుగా పిచ్చయ్య.. విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థిని పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు.. సదరు కీచక టీచర్‌పై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, ఈ ఘటనపై స్థానికులు స్పందించి.. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
కార్పొరేటర్లకు మంత్రి ‘కేటీఆర్’ సీరియస్ వార్నింగ్
-
కుర్చీ నాది.. కాదు నాది
మణుగూరు టౌన్: భద్రాద్రి జిల్లా మణుగూరు మున్సిపాలిటీలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘటనతో అటు ఉద్యోగులు, ఇటు పనుల కోసం వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోయారు. కమిషనర్ కుర్చీ నాదంటే నాదేనని ఇద్దరు అధికారులు వాదించు కోవడంతో గందరగోళంలో పడిపోయారు. గతంలో మణుగూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన వెంకటస్వామిని వైరా కమిషనర్‌గా బదిలీ చేశారు. మణుగూరు కమిషనర్‌గా నాగప్రసాద్‌ను నియమించారు. అయితే మున్సిపల్ ఉన్నతాధికారులు మణుగూరు మున్సిపల్ కమిషనర్‌గా తిరిగి వెం కటస్వామిని నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంటస్వామి సోమవారం కార్యాలయానికి వచ్చి కమిషనర్ సీటులో కూర్చు న్నారు. కాసేపటికి వచ్చిన నాగప్రసాద్ తనను రిలీవ్ చేస్తూ ఆదేశాలు రానందున తానే కమిషన ర్‌నని వాదించారు. సీటులో తననే కూర్చోనివ్వా లని సూచించారు. తనకు సీడీఎంఏ నుంచి ఉత్త ర్వులు వచ్చినందున తానే కమిషనర్‌నని, కలెక్టర్ ను కలిసి రిలీవ్ ఉత్తర్వులు తెచ్చుకోవాలని వెంక టస్వామి అన్నారు. ఈ విషయమై సాయంత్రం వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. -
టీకా వికటించి అంగన్వాడీ కార్యకర్త మృతి
సాక్షి, ఖమ్మం: అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన పద్దం చిన్ని(27) స్థానిక అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తుంది. గడిచిన పది రోజుల క్రితం గుమ్మడవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకాలు వేశారు. నాలుగు రోజుల క్రితం అంగన్వాడీ టీచర్ చిన్ని కరోనా టీకా వేయించుకున్నారు. అప్పటి నుంచి జ్వరం, వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేసి పరిస్థితి విషమించడంతో ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున ఆమె మృతి చెందింది. టీకా వికటించడం వల్లే చిన్ని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: అటవీ అధికారులతో లొల్లి: బావిలో దూకిన మహిళ కోవిడ్ నుంచి కోలుకున్న వారికి వ్యాక్సిన్ వద్దు -
మావోయిస్టుల బంద్ ప్రశాంతం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవళ్లగూడెంలో ఈనెల 3న జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఆదివారం పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టుల కదలికల కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో అలజడి వాతావరణం నెలకొంది. బంద్ సందర్భంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు, ఆయా జిల్లాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని నెలలుగా తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న మావోయిస్టులు ఏజెన్సీ జిల్లాలకు ఛత్తీస్‌గఢ్ నుంచి యాక్షన్ టీమ్‌లను పంపించినట్టు తెలుస్తోంది. అలాగే జూలైలో కొత్తగా తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు మరో 12 కమిటీలను మావోయిస్టులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏజెన్సీ జిల్లాల్లో ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. గత రెండు నెలల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కరకగూడెం మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోనూ ఎదురు కాల్పులు జరిగాయి. దేవళ్లగూడెం ఎన్కౌంటర్లో తమ యాక్షన్ కమిటీ సభ్యుడు, ముఖ్యనేత హరిభూషణ్ గన్‌మన్ దూది దేవాల్ అలియాస్ శంకర్ మృతితో మావోయిస్టులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. దేవళ్లగూడెం ఎన్కౌంటర్ బూటకం అంటూ మావోయిస్టు పార్టీ ఇల్లెందు–నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి శాంత, భద్రాద్రి కొత్తగూడెం–తూర్పుగోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ తదితరుల పేర్లతో బంద్‌పై ప్రకటనలు విడుదల చేశారు. దీంతో గోదావరి పరీవాహక జిల్లాల్లో పోలీసు యంత్రాంగం అడుగడుగునా తనిఖీలు చేసింది. చివరకు బంద్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా ఈ జిల్లాల్లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా మోటాపోల్, పునాసార్ అనే రెండు గ్రామాలకు చెందిన ఆదివాసీలను అపహరించిన మావోయిస్టులు తమ అధీనంలో ఉన్న 16 మందిని వదిలిపెట్టారు. మొత్తం 26 మందిని అపహరించగా, అందులో శనివారం ఆరుగురిని విడిచిపెట్టి నలుగురిని హతమార్చిన విషయం విదితమే. -
ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భారీ నీటి జలాశయాలపై తేలియాడే (ఫ్లోటింగ్) సో లార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం చేట్టాలని యోచిస్తున్నామని సింగరేణి సంస్థ చైర్మ న్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. సింగరేణి ప్రాంతాల్లోనే కాక రాష్ట్రంలోని ఇతర భారీ జలాశయాల్లో కనీసం 500 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలా ర్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి రాష్ట్ర రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ (టీఎ స్ఆర్ఈడీ) శాఖ సహాయంతో అధ్యయనం చేసినట్లు చెప్పారు. ఇందుకు సం బంధించిన నివేదికను టీఎస్‌ఆర్‌ఈడీ అధికారులు సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో శ్రీధర్‌కు పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా వివరించారు. ఈ ప్లాంట్ నిర్మాణంతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని, నిబంధనలకు లోబడి నిర్మిం చేలా ప్రతిపాదలను సమర్పించాలని టీఎస్‌ఆర్‌ఈడీ అధికారులను సీఎండీ కోరారు. బయటి ప్రాంతాల్లో వీటి నిర్మాణం కో సం యోచిస్తున్నామని, ప్రతిపాదనలు పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించి, విద్యుత్ కొనుగోలు అనుమతు లు పొందిన తర్వాతనే నిర్మాణం ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. -
రాతి గుహల్లో రంగుల కాన్వాస్
సాక్షి, హైదరాబాద్: ఎద్దులు, ఉడుములు, పాములు, మనుషులు, మొక్కలు, పూలు, మధ్యమధ్యలో అంతుపట్టని ఆకృతులు... ఇలా ఆ గుహలోకి వెళితే అదో అందమైన కాన్వాస్. కళ్లకు కనిపించినవి, మదిలో మెదిలినవి ఆకృతులుగా ఎరుపు రంగులో పొందికగా ఆ రాతిపై చిత్రీకరించారు. అయితే ఇవన్నీ రూపుదిద్దుకున్నవి దాదాపు మూడున్నర వేల ఏళ్ల క్రితం. తెలంగాణలో మరో రాతి చిత్రాల జాడ వెలుగుచూసింది. చాలా ప్రాంతాల్లో ఆదిమానవులు గీసిన రాతి చిత్రాలు అడపాదడపా వెలుగు చూస్తున్నా... వాటి సంఖ్య ఎక్కువగా ఉన్న తావుల సంఖ్య అరుదు. ఇప్పుడు ఒకే చోట ఎక్కువ సంఖ్యలో చిత్రాలున్న గుహ వెలుగు చూసింది. భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని నల్లముడి గ్రామ చేరువలోని అడవిలో ఒంటిగుండుగా పిలుచుకునే గుహలోపల ఇవి కనిపించాయి. దీన్ని స్థానికులు ఆరాధన ప్రాంతంగా వినియోగిస్తున్నారు. ‘పంచపాండవులు’గా పేర్కొనే ఐదు నిలువురాళ్లు, పెద్ద మీసాలతో ఓ తల రూపుతో ఉన్న రాయిని పూజిస్తున్నారు. ఆ గుహలో పైభాగంలో రకరకాల ఆకృతుల్లో ఈ చిత్రాలున్నాయి. పాతరాతియుగం–మధ్యరాతియుగంలో ఇవి చిత్రించారని భావిస్తున్నారు. పాములు, ఉడుములు, మానవాకృతులు, పూల డిజైన్లు, సూర్యుడు, దీర్ఘచతురస్రాకారపు ఘనాలతో బొమ్మలు అక్కడ కనిపిస్తున్నాయి. గతంలో నీలాద్రి (రామచంద్రాపురం), రాచకొండ ప్రాంతాలలో వెలుగు చూసిన చిత్రాల తరహాలో ఇవి ఉండటం విశేషం. ఈ చిత్రాలను తాజాగా ఖమ్మం, భద్రాచలంకు చెందిన ఔత్సాహిక పరిశోధకులు కొండవీటి గోపి, జగన్మోహనరావు, కట్టా శ్రీనివాస్, రాక్ ఆర్ట్ నిపుణులు బండి మురళీధర్‌రెడ్డి, తెలంగాణ జాగృతి చరిత్ర విభాగానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్, రామన్ స్పెక్ట్రాస్పెషలిస్టు కట్టా జ్ఞానేశ్వర్, కనిగిరికి చెందిన కొండ్రేటి భాస్కర్లు రాక్‌ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యుల ఆధ్వర్యంలో పరిశీలించారు. ఆ చిత్రాల వయసు, వాటికి వాడిన ముడిపదార్థాలు, అంచులకు వినియోగించిన గీతలు పాతవా, తర్వాత చిత్రించినవా.. అన్న వివరాలను వారు ఆరా తీస్తున్నారు. ఇందుకు శాస్త్రీయ పరిశోధన జరుపుతున్నారు. ఇక్కడే ఆదిమానవులు వాడిన రాతి పనిముట్లు, కొన్ని వృక్ష శిలాజాలు కూడా లభించాయి. క్రమంగా శిథిలమవుతూ... ఎంతో విలువైన ఈ చిత్రాలు క్రమంగా దెబ్బతింటున్నాయి. స్థానికులు ఆరాధనలో భాగంగా గుహలో గండ దీపాలు వెలిగిస్తుండటంతో మసిపట్టి రంగు మారిపోతున్నాయి. మరికొందరు గుహ గోడలకు సున్నం పూస్తున్నారు. స్థానికులకు అవగాహన కలిగించటంతోపాటు వాటి సంరక్షణకు హెరిటేజ్ తెలంగాణ చర్యలు చేపట్టాలని పరిశోధన బృందం సభ్యులు కోరుతున్నారు. -
పురిటి కోసం అష్టకష్టాలు
ఇల్లెందు: పురుడు పోసుకోవడానికి ఓ మహిళ అష్టకష్టాలు పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని 21 ఏరియాకు చెందిన పూనెం శిరీష పురిటి నొప్పులతో గురువారం తెల్లారుజామున ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అప్పటికే కడుపులోని పాప కాళ్లు బయటకొచ్చాయి. వైద్యులు డెలివరీ కోసం ప్రయత్నించకుండా ఖమ్మం రిఫర్ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో శిరీషను ఆటోలో ఖమ్మం తరలిస్తుండగా మధ్యలోనే ప్రసవించింది. కానీ సకాలంలో వైద్యం అందక పాప మృతి చెందింది. దీంతో తిరిగి ఇల్లెందు వైద్యశాలకు తీసుకురాగానే మరో పాపకు జన్మనిచ్చింది. రెండో అమ్మాయి ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఏడు నెలలకే డెలివరీ కావడంతో ఇన్క్యుబేటర్ బాక్స్‌లో పెట్టాలని వైద్యులు సూచించారు. -
బూడిదతో బెంబేలెత్తుతున్న ప్రజలు
సాక్షి, పాల్వంచ: కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) నుంచి వెలువడే వృథా బూడిద నిల్వలు ఉండే..యాష్‌పాండ్ చుట్టు పక్కల ప్రాంతాల వారు బెంబేలెత్తుతున్నారు. ఈ బూడిద కాలుష్యంతో యాష్‌పాండ్‌కు సమీపంలో పునుకుల, పుల్లాయిగూడెం, సూరారం గ్రామాల ప్రజలు నిత్యం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బూడిద గాలిలోకి లేవకుండా కేటీపీఎస్ యాజమాన్యం ఎలక్ట్రోస్టాటిక్ ప్రెస్పిటెటర్ (ఈఎస్పీ)లను ఉపయోగిస్తున్నా..పనితీరు సక్రమంగా లేకపోవడంతో కాలుష్యం వెదజల్లుతోంది. నీటిద్వారా యాష్‌పాండ్‌కు తరలిస్తున్నారు. సమీపంలోని కాల్వలు, కిన్నెరసాని ప్రాంతం బూడిదతో నిండి కాలుష్యభరితంగా మారుతున్నాయి. పీల్చుతున్న కార్మికులు, ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. జెన్కో టన్ను రూ.10చొప్పున విక్రయిస్తుండగా.. ప్లైయాష్ను సిమెంట్, ఇటుకల కంపెనీలు ప్రతిరోజూ వెయ్యి టన్నుల బూడిదను తీసుకెళ్తుంటాయి. మిలిగిన నిల్వలు అలా పేరుకుపోతుంటాయి. నిత్యం వందలాది లారీల లోడ్లను హైదరాబాద్, మిర్యాలయగూడెం, జగ్గయ్యపేట, కట్టగూడెం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధిక లోడ్‌తో ఊరి రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి. గాలికి బూడిద రోడ్లపై, నివాసాలపైకి చేరి ఇబ్బంది పడుతున్నారు. బూడిదతో కూడిన గాలి పీల్చడం వల్ల స్థానికులు ఆయాసం, ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్నారుల ఒంటిపై దురదలు వస్తున్నాయి. ఇటీవల కేటీపీఏస్ యాజమాన్యం కిన్నెరసాని ప్రధాన రహదారినుంచి యాష్‌పాండ్ వరకు తారురోడ్డు నిర్మించగా..25టన్నుల లోడుకు బదులు 30 నుంచి 40 టన్నుల బూడిద లోడు ఒక్కో లారీలో తరలిస్తుండడంతో అది కూడా అధ్వానంగా మారింది. యాష్‌పాండ్ చుట్టూ రక్షణ కంచె లేకపోవడంతో మేతకు వెళ్లి పశువులు, మేకలు, గొర్రెలు బూడిద గుంతల్లో ఇరుక్కుపోయి మరణిస్తున్నాయి. అనేకమార్లు నోటీసులు.. యాష్‌పాండ్‌లో పడి మృతి చెందిన పశువులు కేటీపీఎస్ కర్మాగారం ద్వారా బూడిద చెరువులోకి పంపిస్తున్న బూడిద సమీపంలోని కిన్నెరసాని వాగులో కలవడం ద్వారా పశువులు, పంటల దెబ్బతింటున్నాయి. బూడిద కాలుష్యాన్ని కిన్నెరసానివాగులో కలవకుండా చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అనేక సార్లు నోటీసులు జారీ చేసింది. కర్మగారంలో సెడ్మెంటేషన్ ట్యాంక్‌ను నిర్మించాలని, బూడిద నియంత్రణ యంత్రాలను ఏర్పాటు చేయాలని సూచించినా ఆచరణకు నోచట్లేదు. పొలం, జలం.. బూడిదమయం యాష్‌పాండ్ పరిసరాలన్నీ బూడిదతో నిండి కనిపిస్తుంటాయి. సమీపంలోని కిన్నెరసాని వాగు జలం రంగు మారి ప్రవహిస్తుంటుంది. పొలాలన్నీ సారం కోల్పోతున్నాయి. ఈ నీళ్లను తాగిన పశువులు చనిపోతున్నాయి. జీవాల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. -
కేటీపీఎస్‌లో ఇనుము దొంగలు..
సాక్షి, కొత్తగూడెం: కేటీపీఎస్ కర్మాగారంలో ఇంజనీర్ స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇతర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే భారీగా జీతభత్యాలు అందుకుంటున్నా అక్రమ ఆదాయానికి కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కేటీపీఎస్ గతంలో అనేక స్క్రాప్, ఆయిల్ చోరీలు జరిగినా సరైన చర్యలు తీసుకోకపోవడంతో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక ఏడీఈ స్థాయి అధికారే ఇనుమును అక్రమంగా స్టోర్స్ నుంచి తరలించి, సస్పెన్షన్‌కు గురవడం చర్చనీయాంశంగా మారింది. యాష్ పాండ్‌లో పైపులైన్లకు సపోర్టింగ్ కోసం వినియోగించే స్టెయిన్ లెస్ స్టీల్ ప్లేట్లను(రూ. 3.50 లక్షల విలువ) అక్రమంగా తరలిస్తూ పట్టుబడడం, ఇందుకు బాధ్యుడైన ఓఅండ్ఎం ప్లాంట్‌లోని ‘బి ’స్టేషన్లో యాష్ పాండ్, వాటర్ ట్రీట్మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఏడీఈ బి.ఎర్నా సస్పెన్షన్‌కు గురికావడం తెలిసిందే. ఈ వ్యవహారంలో డీఈ స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఎందరి పాత్ర ఉందనే విషయంపై విచారణ సాగుతోంది. ఇనుప ప్లేట్లను గతంలోనూ అనేక మార్లు బయటకు తరలించి అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. స్టోర్స్‌లో ఇప్పటి వరకు ఇలా 40 ప్లేట్లు మాయమైనట్లు సమాచారం. సుమారు రూ.30 నుంచి రూ.40లక్షల వరకు పక్కదోవ పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ విశేషమేమిటంటే తాజాగా బయటకు తరలిస్తూ పట్టుబడిన ప్లేట్లు కొత్తవి. కొత్త ఇనుప పరికరాల విషయంలోనే ఇంతలా అక్రమాలకు పాల్పడుతుండడంతో పాత ఇనుము విషయం లో గతంలో ఎన్ని అక్రమాలు జరిగాయోననే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం పట్టుబడిన ఒక్కో ప్లేట్ విలువ సుమారు రూ.1.80లక్షలు. ఈ నేపథ్యంలో పాత ఇనుము రూ. వందల కోట్లలో ఉంటుంది. దీన్ని గుట్టుగా బయటకు అక్రమ మార్గంలో తరలించేందుకు మూసివేతకు సిద్ధంగా ఉన్న ఓ అండ్ ఎం ప్లాంట్‌లో పోస్టింగ్‌ల కోసం పలువురు ఇంజినీర్లు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చర్యలు అంతంతే.. కేటీపీఎస్‌లో అక్రమాలపై గతంలో అనేకసార్లు విజిలెన్స్ తనిఖీలు, విచారణలు చేసినా చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. గతంలో అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణ లో తేలితే థర్మల్ ప్లాంట్ల నుంచి హైడల్ విద్యుత్ ప్లాంట్లకు సైతం బదిలీ చేసిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం అలా చేస్తుండకపోతుండడంతో ఇష్టారాజ్యంగా కొందరు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గతం లో కేటీపీఎస్ ఓ అండ్ ఎం, 5, 6 దశల ప్లాంట్లలో అనేక సార్లు స్క్రాప్, ఫ్యూయల్ ఆయిల్ చోరీ చేస్తు పట్టుబడిన కేసుల్లో ఎవరిపైనా తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆర్టిజన్ కార్మికుల నియామకాల్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. సంస్థకు సంబంధం లేని వ్యక్తులు ఉద్యోగాలు పొందారు. కేటీపీఎస్ 5వ దశ కర్మాగారంలో నాణ్యత లేకుండా రోడ్డు నిర్మించడంతో మూడు నెలలకే దెబ్బతింది. కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారం నుంచి టెండర్లు పిలవకుండా కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారనే ఆరోపణలు వెల్లు వెత్తాయి. యాష్‌ను ఉచితంగా అందించాల్సి ఉండగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు విమర్శ లు వచ్చాయి. 7వ దశ నిర్మాణంలోనూ భారీ ఎత్తున నిర్మాణ సామగ్రి బయటకు తరలిపోయినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనల్లో విజిలెన్స్ తనిఖీలు చేసి కూడా సరైన చర్య లు తీసుకున్న దాఖలాలు లేవు. కాగా తాజాగా ఇనుము పక్కదోవ పట్టిన విషయంపై టీఎస్ జెన్ కో విజిలెన్స్ ఎస్పీ వినోద్ కుమార్ విచారణకు పూనుకున్నారు. శుక్రవారం కర్మాగారాన్ని సందర్శించి సీఈ జె.సమ్మయ్య ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అక్రమాలపై ఏడీఈ ఎర్నాను సైతం విచారించారు. స్టోర్స్‌ను పరిశీలించారు. ఏడీఈ ఎర్నా, మరో నలుగురు ఆర్టిజన్ కార్మికులతో కలసి ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఈ విషయమై సీఈ జె.సమ్మయ్యను వివరణ కోరగా.. విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. విజిలెన్స్ ఎస్పీ వినోద్ కుమార్‌ను వివరణ కోరగా.. విచారణలో ఉన్న కేసుల వివరాలు బయటకు వెల్లడించలేమన్నారు. సంబంధిత ఉన్నత స్థాయి అధికారుల నుంచి వివరాలు తెలుసుకోవాలన్నారు. ప్రజా ధనం దుర్వినియోగం కొందరు స్వప్రయోజనాల కారణంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. విజిలెన్స్ నివేదికలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. కార్మికులకు న్యాయం చేయాలి. –ఎస్కె.సాబీర్‌పాషా, సీపీఐ జిల్లా కార్యదర్శి చర్యలు తీసుకోవాలి కేటీపీఎస్ అవకతవకలపై విజిలెన్స్ తనిఖీల్లో పారదర్శకత ఉండాలి. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. గతంలోను అనేక సంఘటనలు ఉన్నాయి. వాటిపై విచారణ చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. –బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు -
తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపినా సేవలు అంతంతే..
సాక్షి, చుంచుపల్లి: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజు సోమవారం ప్రశాంతంగా జరిగింది. కార్మి కులు డిపోల పరిధిలో భారీ ప్రదర్శన, ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు జరగలేదు. అయితే సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో పండగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువ మంది ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించారు. జిల్లాలో మూడో రోజు 193 బస్సులను నడిపారు. శని, ఆదివారాల్లో 167 బస్సులు మాత్రమే తిరగగా, సోమవారం మరో 26 బస్సులను పెంచారు. అయినా అవి ప్రయాణికుల అవసరాలను తీర్చలేకపోయాయి. ఎక్కువ మంది ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లోనే వెళ్లాల్సి వచ్చింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా 50 శాతం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో జిల్లాలో ఆర్టీసీకి ఈ మూడు రోజుల్లో సుమారు రూ.90 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. ఆర్టీసీ కార్మికులతోనే ప్రభుత్వ పతనం ఆరంభం.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులతోనే పతనం ప్రారంభం అవుతుందని ఆర్టీసీ జేఏసీ, వివిధ రాజకీయ పక్షాల నాయకులు అన్నారు. సోమవారం ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో కొత్తగూడెంలో భారీ ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనకు వివిధ రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కొత్తగూడెం బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ..సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను విధుల నుంచి తొలగించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం సిగ్గుచేటన్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులపై వేటు వేయమనడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన కార్మికులను అణగదొక్కేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు అండగా ఉంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. కార్మికులకు మద్దతు తెలిపిన వారిలో మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎడవల్ల కృష్ణ, యెర్రా కామేష్, బీజేపీ జిల్లా నాయకులు కోనేరు చిన్ని, జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రంగాకిరణ్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్‌పాషా, వై. శ్రీనివాస్‌రెడ్డి, గుత్తుల సత్యనారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, అన్నవరపు సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య, నాగ సీతారాములు, ఇప్టూ నాయకులు సంజీవ్, సతీష్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీవీ.రాజు, ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రసాద్, జాకబ్, వైఎన్ రావు, సంధోని పాష, చిట్టిబాబు ఉన్నారు. -
అసెంబ్లీలో కేసీఆర్ హామీ ఇచ్చినా ఫలితం శూన్యం
సాక్షి, కొత్తగూడెం: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన 3 వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు సింగరేణి యాజమాన్యం నిర్వాకంతో దయనీయ స్థితిలో బతుకులీడ్చాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆయా కుటుంబాల కన్నీటి గోసను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 21 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నా.. ‘ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం’ అనే స్ఫూర్తిని యాజమాన్యం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తే.. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మరింత దౌర్భాగ్య స్థితిలోకి నెట్టిందని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. 1997లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పథకాన్ని ఎత్తేసింది. అయితే అప్పటికే వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) పెట్టుకున్న సుమారు 3 వేల మంది కార్మికులు తమ పరిస్థితి ఏంటని సింగరేణి యాజమాన్యాన్ని ఆశ్రయించారు. తమ వారసులకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో సదరు కార్మికులు 15 ఏళ్ల సర్వీసు, వేతనం వదులుకుని న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇస్తామని యాజమాన్యం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినా.. ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం తీరును డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్ ప్రశ్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇన్నేళ్లుగా వీరిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించగా సింగరేణి యాజమాన్యం వద్ద సమాధానం లేదు. 1997లో ఈ పథకాన్ని రద్దు చేసినప్పుడు.. కొత్త గనులు ఏర్పాటు చేసినా, సంస్థలో ఉద్యోగాలు ఖాళీ అయినా అప్పటికే వీఆర్ఎస్ పెట్టుకున్న కార్మికుల వారసులను నియమిస్తామని యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలో కొందరికి మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ కూడా ఇచ్చింది. వారికీ ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కాగా, మూడు నెలల్లో ఉద్యోగాలు ఇప్పించి కార్మికుల భవిష్యత్తును మారుస్తామని 2016లో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సీఎం కేసీఆర్ సైతం శాసనసభలో హామీ ఇచ్చారు. అయితే నేటికీ వారికి న్యాయం జరుగలేదు. దీంతో కార్మికులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం హామీలను నెరవేర్చాలి సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చాలి. టీబీజీకెఎస్ నాయకులు సైతం గుర్తింపు సంఘం ఎన్నికల ముందు వీఆర్ఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. ఎన్నికలు జరిగి రెండేళ్లయినా అతీగతీ లేదు. నేడు ఆయా కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగావÔకాశాలు కల్పించాలి. – చింతల సూర్యనారాయణ, బీఎంఎస్ అధ్యక్షుడు ప్రభుత్వానివి మోసపూరిత వాగ్దానాలే వీఆర్ఎస్ ఉద్యోగులు సుమారు 21 సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై అనేక హామీలు గుప్పించి ఎన్నికల్లో లబ్ధి పొంది ఇప్పుడు వారిని రోడ్డున పడేయడం సరైంది కాదు. సింగరేణి యాజమాన్యం ఆర్ఎస్సీ వద్ద వీఆర్ఎస్ విషయంలో నోరుమెదపకపోవడం దారుణం. ప్రభుత్వ వైఖరితో 3000 మంది కార్మికులు అర్ధాకలితో అలమటిçస్తున్నారు. – పి.మాధవనాయక్, బీఎంఎస్ కార్యదర్శి 48 రోజులు ఎంవీటీసీ చేయించుకున్నారు 1997లో మా నాన్న అన్‌ఫిట్ అయి నాకు 48 రోజులు మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ ఇచ్చారు. మా బ్యాచ్‌లో 16 మందిలో 8 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా వారికి నేటికీ ఇవ్వలేదు. సింగరేణి అధికారులు 2002లో పిలిచి రూ. రెండు లక్షలు ఇస్తాం.. ఉద్యోగం లేదన్నారు. అయితే నాకు ఉద్యోగమే కావాలన్నాను. సింగరేణి భవన్, హెడాఫీస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాల నాయకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. – మబ్బు శంకర్, వీఆర్ఎస్ కార్మికుడి కుమారుడు -
బొగ్గుగని కార్మికుల టోకెన్ సమ్మె విజయవంతం
సాక్షి, భూపాలపల్లి: బొగ్గు పరిశ్రమల్లో వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని బొగ్గుగని కార్మికులు మంగళవారం చేపట్టిన టోకెన్ సమ్మె విజయవంతమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బొగ్గుగని కార్మికులు స్వచ్ఛందంగా టోకెన్ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెతో భూపాలపల్లి ఏరియాలోని 6700 మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో సుమారు 7 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగి, సంస్థకు 2 కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవీఆర్ సింగరేణి ఓపెన్ కాస్ట్‌లోని కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెలో టీజీజీకేఎస్, ఏఐటీసీయూ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీసీ, సీఐటీయూసీ, హెచ్ఎమ్ఎస్, బీఎమ్ఎస్ వంటి పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. సుమారు 600 మంది బొగ్గుగని కార్మికులు పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులు బొగ్గు పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులపై తమ నిరసనను తెలిపారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో టోకెన్ సమ్మె విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎమ్ఎస్, హెచ్ఎమ్ఎస్, సీఐటీయూతో పాటు కోల్ ఇండియా సంఘాలు.. సింగరేణిలో ఒక్క రోజు టోకెన్ సమ్మెకు పిలుపు నిచ్చాయి. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీజీజీకేఎస్ కూడా సమ్మెకు మద్దతు తెలిపింది. మణుగూరు ఏరియాలో అత్యవసర విధులకు సంబంధించిన కార్మికులు తప్ప, మిగతా 90 శాతం మంది కార్మికులు విధులకు గైర్హాజరయ్యారు. దీంతో మణుగూరు ఏరియాలో సుమారు 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. -
నిన్న కొమురంభీంలో.. నేడు భద్రాద్రిలో
సాక్షి, భద్రాద్రి : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఘటన మరవకముందే.. కొత్తగూడెంలో సైతం అటవీ అధికారులపై దాడి జరిగింది. జిల్లాలోని ముల్కలపల్లి మండలం గుండాలపాడులో పోడు సాగుదారులు అటవీ అధికారులపై సోమవారం అర్ధరాత్రి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఓ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్‌కు గాయాలయ్యాయి. వివరాలు.. పోడు సాగుదారలు అటవీ భూములను చదును చేసేందుకు ట్రాక్టర్లతో వెళ్లారు. ఈ విషయం తెలుసుకుని వారిని అడ్డుకునేందుకు బీట్ ఆఫీసర్ భాస్కర్, సెక్షన్ ఆఫీసర్ నీలమయ్య ప్రయత్నించారు. ఈ క్రమంలో పోడు సాగుదారులు అధికారులపై దాడి చేయగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. -
అందని ‘అభయం’
పాల్వంచరూరల్: స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాధికారత సాధించడమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోప్రవేశపెట్టిన అభయహస్తం పథకం ప్రస్తుతం నిరాదరణకు గురవుతోంది. 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఈ పథకం ద్వారా అందించే పింఛన్లు గత 11 నెలలుగా నిలిచిపోయాయి. జిల్లాలో అభయహస్తం లబ్ధిదారులు 8 వేల మంది ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జిల్లాలో నెలకు రూ.40 లక్షల పింఛన్లు చెల్లించాల్సి ఉంది. 2017 నవంబర్ వరకు తర్వాత ఇంతవరకు తమకు రూపాయి కూడా ఇవ్వలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభయహస్తంతో ఎంతో ప్రయోజనం.. అభయహస్తం పథకం మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేంది. స్వయం సహాయక సంఘాల్లోని నిరుపేద మహిళలకు నెలకు రూ.500 వస్తే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేది. 18 నుంచి 59 సంవత్సరాల మహిళలు ఈ పథకంలో సభ్యులుగా చేరవచ్చు. వారు రోజుకు ఒక రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే, ప్రభుత్వం ద్వారా మరో రూ. 365 జమ చేసి జనశ్రీ బీమా పథకంలో లబ్ధిదారులుగా చేరుస్తారు. ఆ తర్వాత 60 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.500 పింఛన్ చెల్లిస్తారు. అంతేకాక గ్రూపులోని మహిళలకు 9 నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలు ఉంటే ఏడాదికి రూ.1200 చొప్పున ఒక్కో కుటుంబంలో ఇద్దరికి ఉపకార వేతనాలు అందిస్తారు. సభ్యులు అకాల మరణం పొందితే కుటుంబసభ్యులకు బీమా కంపెనీ ద్వారా రూ.30 వేలు చెల్లిస్తారు. ప్రమాదంలో మరణిస్తే రూ.75 వేలు, అంగవైకల్యం కలిగితే రూ.37, 500 చొప్పున పరిహారం చెల్లిస్తారు. అయితే ఇటీవల ఈ పరిహారాన్ని రెండు లక్షలకు పెంచారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు రావాల్సిన అభయహస్తం పింఛన్ డబ్బును వెంటనే ఇప్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 11 నెలలుగా ఇబ్బంది పడుతున్నాం అభయహస్తం పింఛన్ గత 11 నెలలుగా రావడం లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చే రూ.500 అయినా నెలనెలా సక్రమంగా ఇవ్వాలి.లేకుంటే తమ జీవితం ఇబ్బందికరంగా మారుతుంది. అసరా పింఛన్లోనైనా చేర్చి ప్రతినెలా పింఛన్ ఇస్తే బాగుటుంది. – నూనావత్ చాందిని, లబ్ధిదారురాలు వెంటనే విడుదల చేయాలి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ పైనే ఆధారపడి వృద్ధాప్యాన్ని గడుపుతున్నాం. గత 11 నెలలుగా పింఛన్లు ఇవ్వకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. పింఛన్ల కోసం సంబంధిత అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదు. నెలనెలా విధిగా పింఛన్ ఇవ్వాలి. – ధర్మసోతు మారు, లబ్ధిదారురాలు నిధులు విడుదల కాగానే పంపిణీ చేస్తాం అభయహస్తం పించన్లు గత 11 నెలలుగా పెండింగ్‌లో ఉన్న మాట నిజమే. ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. మంజూరు కాగానే లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం. – ప్రదీప్, అభయహస్తం పింఛన్ల జిల్లా ఇన్చార్జి -
ఉపాధ్యాయ రత్నా
సుజాతనగర్ : సమయపాలన.. అంకిత భావం, సామాజిక సేవ.. పరమావధిగా ఓ గిరిజన ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. 29 ఏళ్లుగా ప్రభుత్వ టీచర్‌గా విద్యార్థుల ఉన్నతికి పాటుపడుతున్నారు బాణోత్ రత్నా. 2011 నుంచి 2018 వరకు సుజాతనగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాద్యాయుడిగా పనిచేసిన రత్నా ఇటీవల జరిగిన ఉపాధాయ బదిలీల్లో సర్వారం ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వచ్చారు. ఆయన పాఠశాలకు వచ్చే నాటికి బడిలో 26 మందే విద్యార్థులు ఉన్నారు. వీరిలో 20 మంది మాత్రమే పాఠశాలకు వస్తున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు రత్నా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బడిలోకి పంపించాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించారు. ఇప్పుడు 26 మందీ పాఠశాలకు రావడంతోపాటు మరో 14 మందిని అదనంగా పాఠశాలలో చేర్చారు. ప్రస్తుతం సర్వారం పాఠశాలలో 40 మంది విద్యార్థులు చదువుతన్నారు. వీరందరూ గిరిజన పిల్లలే. ఆంగ్లంపై పట్టులేకపోవడంతో ప్రత్యేక తరగతులు నిర్వహించి.. పట్టు సాధించేలా కృషి చేస్తున్నారు. ఏకాగ్రత పెంపొందించేందుకు విద్యార్థులకు యోగా నేర్పిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ బడి.. అవకాశం దొరికితే చాలు..విధులకు డుమ్మా కొట్టే ఉపాధ్యాయులున్న నేటి రోజుల్లో సెలవు రోజున కూడా పాఠశాల నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నెలలో 24న వరలక్ష్మీ వ్రతం, రెండో శనివారం, ఆదివారం, జెండా వందనం, వాజ్‌పేయి మృతి తదితర 12 రోజులు సెలవులు వచ్చాయి. కానీ రత్నా విద్యార్థుల అభ్యున్నతి కోసం సెలవు రోజుల్లో కూడా పాఠశాల నిర్వహించారు. సెలవు కావడంతో మధ్యాహ్నం ప్రతీ రోజు మధ్యాహ్నం వడ్డించే అక్షయపాత్ర సంస్థ భోజనం ఏర్పాటు చేయకపోవడంతో ఈ నెల 24న వరలక్ష్మీ వ్రతం రోజు సొంత ఖర్చులతో భోజనం తయారు చేయించి పెట్టారు. గతంలో పనిచేసిన పాఠశాలలోనూ.. రత్నా సుజాతనగర్ మండల పరిషత్ పాఠశాలలో 2011 నుంచి ఇటీవల బదిలీల వరకు పనిచేశారు. ఆయన రాకముందు పాఠశాలలో విద్యార్థులు కేవలం 45 మందే ఉండేవారు. ఆ తర్వాత క్రమంగా విద్యార్థుల సంఖ్య 200కు పెరిగింది. సొంత ఖర్చులతో విద్యార్థులు భోజనం చేసేందుకు షెడ్ నిర్మించారు. గోడలూ పాఠాలు చెబుతాయి గతంలో ఆయన పనిచేసిన సుజాతనగర్ పాఠశాలలో గోడలను అందంగా ముస్తాబు చేసి చక్కని రంగులతో వివిధ కళాకృతులను వాటిపై తీర్చిదిద్దారు. జాతీయ నాయకులు చిత్రపటాలు, వివేకానందుని సూక్తులు, తెలంగాణ తల్లి, ఆచార్య జయశంకర్, సరçస్వతి చిత్రపటాలతో పాటు, స్వచ్ఛ భారత్ లోగో, భారతదేశం, తెలంగాణ రాష్ట్ర చిత్రపటాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు రాష్ట్ర పుష్పం, రాష్ట్ర పిట్ట, రాష్ట్ర చెట్టు, రాష్ట్ర జంతువుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ పలువురు ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అవార్డులు 1998లో జూలూరుపాడు మండలం కరివారిగూడెం పాఠశాలలో పనిచేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. 2004లో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం(క్యూఐటీ) జిల్లా స్థాయిలో ఉత్తమ కార్యకర్త అవార్డు అందుకున్నారు. -
వక్రదారుల్లో ‘త్రివేణి’ కళాశాల
ఇప్పటి వరకు ఆ కళాశాలకు డోకా లేదు. వారు చెప్పిందే అక్కడ వేదం. అయితే అక్కడున్న కళాశాలల మధ్య పోటీతత్వం, ఈర్షాధ్వేషాలు పెరిగాయి. ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకున్నారు. కోర్టులను కూడా ఆశ్రయించారు. అపుడే మన ఇంటర్ బోర్డు అధికారులు కళ్లుతెరిచారు. నిసితంగా పరిశీలించారు. అక్రమంగా కళాశాలను నడిపిస్తున్నారనే నిర్ణయానికి వచ్చారు. అక్కడున్న రికార్డులను సీజ్ చేసి స్వాధీన పర్చుకున్నారు. ఫలితంగా అక్కడ చేరిన విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. భద్రాచలం : భద్రాచలం బస్టాండ్ వెనుక త్రివేణి జూనియర్ కళాశాలను అనధికారికంగా నడుపుతున్నారు. ఈ కళాశాలకు చెందిన రికార్డులను ఇం టర్ బోర్డు జిల్లా నోడల్ అధికారి జహీరుద్దీన్ శుక్రవారం సీజ్ చేశారు. భద్రాచలం వచ్చిన ఆయన కళాశాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. అక్కడ ఉన్న సిబ్బంది సమక్షంలోనే రికార్డులు, అక్కడున్న ఇతర ధ్రువీకరణ పత్రాలను నిసితంగా పరిశీలించారు. ఆ సమయంలో విద్యార్థులు కళాశాలలో లేరు. దీనికి అనుబంధంగా వసతి గృహాన్ని కూడా నడుపుతున్నారు. ఆ సమయంలో ఒక విద్యార్థిని మాత్రమే అక్కడ ఉంది. ఆ విద్యార్థిని నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు. అనుమతిలేని కళాశాలలో ఎందుకు చేరావని, వీరిచ్చిన సర్టిఫికెట్‌కు గుర్తింపు ఉండదని వివరించారు. అంతేకాక కళాశాలలో విద్యార్థులను చేర్చుకున్నట్లుగా అక్కడ ఉన్న అడ్మిషన్ దరఖాస్తులను, విద్యార్థుల దగ్గర నుంచి తీసుకున్న పదో తరగతి సర్టిఫికెట్లు, వారికి సంబంధించిన ఇతర ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఇంటర్‌బోర్డు నోడల్ అధికారి జహీరుద్దీన్ మాట్లాడారు. త్రివేణి కళాశాల పేరు తో భద్రాచలంలోని బస్టాండ్ వెనుక ఉన్న భవనంలో తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేవన్నారు. అందుకే ఉన్నతాధికారుల సూచనల మేరకు కళాశాలకు సంబంధించిన అన్ని రికార్డులను సీజ్ చేశామని వెల్లడించారు. సుమారు 60 మంది విద్యార్థులు ఇక్కడ అడ్మీషన్లు తీసుకున్నట్లుగా తమ పరిశీలన లో తేలిందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టి లో పెట్టుకొని వారికి నచ్చిన కళాశాలలో చేర్పించేందుకు ఇంటర్ బోర్డు నుంచి తగిన సహకారం అందిస్తామన్నారు. పర్యవేక్షణ లేకనే.. జిల్లాలో విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ సవ్యం గా లేకపోవటంతో కొంతమంది ప్రైవేట్ పాఠశాల లు, కళాశాలల యాజమన్యాలు విద్యావ్యాపారా న్ని కొనసాగిస్తున్నారు. భద్రాచలంలోని త్రివేణి కళాశాల పేరుతో బస్టాండ్ వెనుక బోర్డులు పెట్టుకొని, ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి తరగతులను నిర్వహిస్తున్నప్పటికీ, దీనికి అనుమతుల్లేవనే విషయాన్ని ఇంటర్ బోర్డు అధికారులు ఇప్పటి వరకూ గుర్తించకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. భద్రాచలంలోని రెండు కళా శాలల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరే ఈ సంఘటనకు ప్రధాన కారణంగా పలువురు చెబుతున్నారు. ఈ విషయం న్యాయస్థానం వరకూ వెళ్లింది. అప్పుడే ఇంటర్‌బోర్డు అధికారులు అసలు విషయాన్ని గ్రహించారు. బస్టాండ్ వెనుక ఉన్న త్రివేణి కళాశాలకు అనుమతల్లేవని అర్ధం చేసుకున్నారు. కళాశాలను సీజ్ చేయటంతో ఇక్క డ చదువుతున్న విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మా రింది. విద్యాసంవత్సరం ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు పూర్తికాగా, ఇక్కడ చదివే వారిలో పలువురు విద్యార్థులు మెరిట్ సాధించిన వారు కూడా ఉన్నారు. పోటీ పరీక్షలకు వెళ్లేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు. ఆ విద్యార్థులకు ప్రస్తుత పరిణామాలు ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. స్థానిక విద్యాశాఖాధికారులు సీజ్ చేశారు. కానీ ఇప్పటి వరకూ ఈ వ్యవహారం పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏజెన్సీ నిబంధనలకు తూట్లు పొడుస్తూ, కొన్ని ప్రైవేట్ యాజమాన్యాల వారు విద్యా వ్యాపారం చేస్తున్నప్పటికీ.. విద్యాశాఖ అధికారులు సరైన రీతిలో స్పందించకపోవటంతో సమస్య మరింతజఠిలంగా మారు తోంది. ఏదిఏమైనప్పటికీ సంఘటన జరిగిన తరువాత స్పందించి,హడావిడి చేసేకంటే ప్రైవేట్ పాఠ శాలలకు సంబంధించిన అనుమతులు, వసతు లు, ఇతర అనుమతులపై సమగ్ర పరిశీలన ముందుగానే చేస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.