భద్రాద్రి జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతును జిల్లాలోని తహసీల్దార్లు గురువారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగూడెం తహసీల్దార్ అశోక్‌చక్రవర్తి, పాల్వంచ తహసీల్దార్ గన్యా, మణుగూరు తహసీల్దార్ తిరుమలచారి, భద్రాచలం తహసీల్దార్ రామకృష్ణ, పినపాక తహసీల్దార్ కోటేశ్వరరావు, జూలురుపాడు తహసీల్దార్ రవికుమార్, టేకులపల్లి తహసీల్దార్ నాగేశ్వరరావు, గుండాల తహసీల్దార్ హరిచంద్ తదితరులు కలెక్టరును కలిశారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఎస్పీ అంబర్ కిశోర్ ఝాను మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గురువారం కలిసి, శుభాంకాంక్షలు తెలిపారు. జిల్లాలను అన్ని విధాలుగా అబివృద్ధి చేయాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు వనమా రాఘవేందర్, జెడ్పీటీసీ గిడ్ల పరంజ్యోతిరావు, మాజీ చైర్‌పర్స కాసుల ఉమారాణి, కరాటే రామస్వామి, కాసుల వెంకట్, చందా మల్లేశం, బత్తుల వీరయ్య, జక్కుల సుందర్, జగన్, తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో..
భద్రాద్రి జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీ అంబర్ కిషోర్ ఝాలను గురువారం ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు కలిసి పుష్పగుచ్ఛాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ను కోరారు. శ్రీనివాస్ నాయక్, భూక్య పంతుల్య నాయక్, భూక్య దేవిలాల్ నాయక్, భూక్య బాలునాయక్, బదావత్ సీతారాం నాయక్, దారావత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.
ఆదివాసీ హక్కులను కాపాడాలి
తెలంగాణాలో నూతనంగా ఏర్పడిన భద్రాద్రి జిల్లాలోని గిరిజనుల హక్కులను కాపాడాలని ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి అధక్షుడు వాసం రామకృష్ణ కోరారు. గురువారం భద్రాద్రి జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుకు వినతిప్రతం ఇచ్చారు. కోరం బుచ్చయ్య, భట్టు కనకరాజు, తాటి పుల్లయ్య, రాందాస్ శివ తదితరులు పాల్గొన్నారు.