
సుజాతనగర్ (భద్రాద్రికొత్తగూడెం): ప్రేమికుడి నుంచి తనను దూరం చేశారంటూ ఓ యువతి ఆందోళనకు దిగింది. భద్రాద్రి కొత‍్తగూడెం జిల్లా ములకపల్లి మండలం మంచుపోసుగూడెం గ్రామానికి చెందిన బోడ రాజమ్మ(27) ఖమ్మంలో డిగ్రీ చదివే సమయంలో ఎల్. వెంకటేశ్వర్లు పరిచయమయ్యాడు. తన క్లాస్‌మేట్ అన్న అయిన అతనితో పరిచయం కాస్తా స్నేహంగా మారి ప్రేమగా పరిణమించింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని వెంకటేశ్వర్లు చెప్పాడు.
సుజాతనగర్ మండలం సీతంపేట బంజర గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ప్రస్తుతం నెల్లూరులో ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే, అతని కుటుంబసభ్యులకు వీరి వ్యవహారం నచ్చలేదు. దీంతో ఇటీవల నెల్లూరు వెళ్లి వెంకటేశ్వర్లును తమతో ఎటో తీసుకెళ్లారు. అతడిని వెంటనే తనకు చూపాలంటూ రాజమ్మ గురువారం సీతంపేట బంజర గ్రామంలోని అతడి ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. అయితే, ఆ ఇంట్లో ఎవరూ లేరు. తాళాలు వేసుకుని ఎటో వెళ్లిపోయారు. తనకు న్యాయం చేయలంటూ ఆ ఇంటి ముందే ఆమె బైఠాయించారు.
Comments
Please login to add a commentAdd a comment