woman protest
-
నారావారిపల్లెలో సీఎం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
-
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఇద్దరు పిల్లలు పుట్టాక..
కర్నూలు: తనను ప్రేమించి.. పెళ్లి చేసుకొని.. ఇద్దరు పిల్లలు జన్మించాక వదిలేయడం అన్యాయమని, తనకు న్యాయం చేయాలంటూ రజియాబీ అనే మహిళ ఆదివారం భర్త వినోద్‌కుమార్ ఇంటి ఎదుట బైఠాయించింది. వివరాలు.. కడివెళ్ల గ్రామానికి చెందిన గొల్ల వినోద్‌కుమార్ తమ ఇంటి సమీపంలో నివాసముంటున్న రజియాబీనీ ప్రేమించాడు. 13 సంవత్సరాల క్రితం ముంబైకి తీసుకెళ్లి పెళ్లి చేసుకొని కాపురం పెట్టారు. ఎనిమిదేళ్ల క్రితం కాపురాన్ని ఎమ్మిగనూరుకు మార్చాడు. వీరికి గొల్ల తేజ(7), గొల్ల అంజలి(5) ఇద్దరు సంతానం ఉన్నారు. ఎమ్మిగనూరు నుంచి స్వగ్రామమైన కడివెళ్లకు వెళ్లి వస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో వర్గం యువతిని పెళ్లి చేసుకున్నావని, కులం వాళ్లు నుంచి మాట వస్తోందని వినోద్‌కుమారుకు కుటుంబసభ్యులు చెబుతూ వచ్చారు. దీంతో కొన్ని నెలల నుంచి రజియాబీకి దూరంగా ఉండటం ప్రారంభించాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా నెల క్రితం కర్ణాటకలోని తమ బంధువుల అమ్మాయితో వినోద్‌కుమార్‌కు రహస్యంగా పెళ్లి జరిపించారు. విషయం తెలుసుకున్న రజియాబీ రూరల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ నెల 5న వినోద్‌కుమార్‌తో పాటు మరో ఐదుగురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. అయితే తనకు న్యాయం చేసేంత వరకు భర్త ఇంటి ముందు నుంచి కదలబోనని కడివెళ్లలో రజియాబీ ఆదివారం దీక్షకు దిగింది. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పారు. అయినా ఆమె వినుకోలేదు. తన భర్త ఇంట్లోకి పిలుచుకోవాలని లేదంటే బయటే కూర్చుంటానని తేల్చిచెప్పారు. వినోద్ కుటుంబ సభ్యులతో పోలీసులు చర్చిస్తున్నారు. -
రెండేళ్లు కాపురం చేసి... భార్య గర్భవతి అయ్యాక వదిలేసిన భర్త..
ఒడిశా: ప్రేమ పేరుతో తనను పెళ్లి చేసుకొని రెండేళ్లు కాపురం చేసిన అనంతరం తనను వంచించారని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు బాధితురాలు కె.దీపికా కొడుకుతో సహా తనను విడిచి పెట్టిన భర్త దినేష్ ఇంటి ఎదుట గత 5 రోజులుగా న్యాయం పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భరంగా ఆదివారం ఆమె మాట్లాడుతూ 2020లో బరంపురం లోని దేశీబెహరా వీధికి చెందిన దినేష్ తను ప్రేమించి, వివాహం చేసుకున్నాడని తెలిపారు. రెండేళ్లు కాపురం చేసి, గర్భం దాల్చన అనంతరం విడిచి పెట్టినట్లు వాపోయారు. అప్పటి నుంచి లంజిపల్లిలోని తల్లితండ్రుల వద్ద తల దాచుకుంటూ కొడుకుకి జన్మనిచ్చాన్నారు. ప్రస్తుతం తన కుమారుడికి ఏడాది కావస్తోందని, భర్త మాత్రం మరో వివాహం చేసుకునేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దినేష్ ఇంటి వద్దకు చేరుకొని, తనకు న్యాయం చేయల్సిందిగా కొడుకుతో సహా పగలు, రాత్రి నిరీక్షిస్తున్నట్లు వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. తల్లీ, బిడ్డకు రక్షణకు సిబ్బందిని నియమించారు. -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యకు వేధింపులు
సాక్షి, హైదరాబాద్: భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, పిల్లలను పట్టించుకోకుండా మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య మహిళా సంఘాల నాయకులతో కలిసి ఇంటి ఎదుట ఆందోళనకు చేపట్టింది. ఈ ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన దేవులపల్లి వేణుకుమార్ (46), కల్పన (42)కు 18ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. కొంతకాలంగా బడంగ్‌పేట శివనారాయణపురంలో నివాసమున్నారు. వేణుకుమార్ నగరంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వేణు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని భార్య కల్పన ఆరోపిస్తూ గతంలో వరంగల్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వేణుపై కేసు నమోదు చేయడంతో పాటు కోర్టులో మెయింటెనెన్స్ కేసు నడుస్తోంది. తనను దూరం పెట్టాలనే ఉద్ధేశంతో మూడేళ్లుగా తనను, తన పిల్లలను పట్టించుకోవడం లేదని కల్పన శుక్రవారం స్థానిక మహిళా సంఘాల నాయకులతో కలిసి శివనారాయణపురంలోని భర్త ఇంటికి వచ్చి బైఠాయించి పోలీసులు, కోర్టు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ సంఘటనకు సంబంధించి భార్యాభర్తలిద్దరూ ఫిర్యాదులు చేయగా కేసు విచారిస్తున్నామని సీఐ తెలిపారు. చదవండి: బిహార్‌లో కల్తీ మద్యం కలకలం.. 11మంది మృతి -
బీచ్ కి వెళ్లిన కోడలు.. ఇంటికి తిరిగొచ్చేసరికి షాక్ ఇచ్చిన అత్తామామలు
-
పెళ్లి.. భర్తతో విడాకులు.. ప్రియుడితో ఇంటి నుంచి పారిపోయి
సాక్షి, ఆదిలాబాద్: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌనపోరాటానికి దిగిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం... లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన నరేష్, ఓ యువతి గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతికి వేరే వ్యక్తితో పెళ్లి కాగా, నరేష్ సైతం మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల సదరు యువతి తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. నరేష్‌తో వారం రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి వివాహం చేసుకుంది. మళ్లీ ఇరువురు లోకేశ్వరం చేరుకుని ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. మంగళవారం రాత్రి సదరు యువతి నరేష్ ఇంటికి వెళ్లింది. దీంతో నరేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. బాధితురాలు అక్కడే మౌనపోరాటానికి దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సర్ధిచెప్పి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బుధవారం ఉదయం ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడుతున్నారు. చదవండి: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. కచ్చితంగా పాటించాల్సిందే! -
‘అత్తమామలు ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. భర్తతో మాట్లాడనీయడం లేదు’
సాక్షి, చిక్కడపల్లి: అత్తమామలు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని, భర్తను తనతో మాట్లాడనీయడం లేదంటూ ఓ వివాహిత గురువారం అశోక్‌నగర్‌లోని వారి ఇంటి ముందు నిరసన చేపట్టింది. ఏలూరుకు చెందిన గౌరి, అశోక్‌నగర్‌కు చెందిన శ్రీకృష్ణకు 2019లో వివాహం జరిగింది. గత నాలుగు నెలలుగా భర్తను తనతో మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని, అత్తమామలు తన సామాన్లు బయటపడేసి వెళ్లగొట్టారని ఆరోపిస్తూ ఇంటి ముందు నిరసనకు దిగింది. తన భర్తను గచ్చిబౌలిలోని వేరే ఇంటికి పంపించి అత్తమామలు వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలంటూ గౌరి చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించింది. సీఐ సంజయ్‌కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐ అశోక్‌నగర్‌కు వచ్చి ఆమెను తిరిగి ఇంట్లోకి పంపించారు. అయితే గౌరి కేసు పెట్టడానికి అంగీకరించలేదని లీగల్‌గా ప్రొసీడ్ అవుతానని చెప్పిందని సీఐ తెలిపారు. చదవండి: కలహాలతో పిల్లలు బలి.. కన్న పేగుతో కాటికి.. -
భర్త, అత్తమామలు వేధింపులు.. చివరికి ఏమైందంటే..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అశోక్‌నగర్‌లో తన భర్త ఇంటి ముందు ఓ మహిళ నిరసనకు దిగింది. తన భర్త, అత్త మామ.. తనను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపింది. అత్తమామలు తన లగేజీ బయట వేసి ఇంటి నుంచి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటిముందు నిరసన తెలిపింది. ఏలూరుకు చెందిన గౌరీకి..హైదరాబాద్ అశోక్‌నగర్‌కు చెందిన శ్రీకృష్ణలకు 2019లో వివాహం జరిగింది. ఆమెను మూడేళ్లుగా అత్తమామలు వేధిస్తున్నారు. తన భర్తను తన నుండి దూరం చేసి వేరే ఇంటికి పంపించారు. నాలుగు నెలలుగా భర్త తన వద్దకు రాకుండా అడ్డుకుని అత్తమామలు వేధిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈరోజు ఉదయం తనను ఇంటి నుంచి బయటికి పంపించి, లగేజీ బయటవేసారని బాధిత మహిళ తెలిపింది. అత్తమామలు తాను ఇంట్లో ఉండకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని చెప్పింది. భర్త, అత్త, మామ తనను వదులుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆమె వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
ఇద్దరూ బంధువులే.. తొమిదేళ్లుగా ప్రేమ.. పెళ్లి చేసుకోవాలని అడగడంతో
సాక్షి, ఆదిలాబాద్: ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో మంగళవారం ప్రియుడి ఇంట్లో ప్రియురాలు తనకు న్యాయం చేయాలని ధర్నాకు దిగింది. బాధితురాలి వివరాల ప్రకారం... నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మసాయిపెట్ గ్రామానికి చెందిన సుజాత (28), ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీకి చెందిన చందల హరీష్‌కుమార్ తొమ్మిది ఏళ్లుగా ప్రేమించుకున్నారు. హైదరాబాద్‌లో చదువుకుంటున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఈ ఇరువురు సమీప బంధువులే. రెండేళ్లుగా సుజాత పెళ్లి చేసుకోవాలని హరీష్‌పై ఒత్తిడి తీసుకువ్చంది. అప్పటి నుంచి హరీష్ తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. దీంతో సుజాత 2021, ఆగస్టులో కడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానీ సంబంధిత పోలీసులు పట్టించుకోకపోవడంతో తన సమీప బంధువులతో మంగళవారం సాయంత్రం టీచర్స్‌కాలనీలో ప్రియుడి ఇంట్లో బైఠాయించింది. దీంతో కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా -
మూడేళ్లుగా కానిస్టేబుల్‌తో ప్రేమ.. మాయమాటలతో లోబర్చుకొని.. మరో వ్యక్తితో పెళ్లైనప్పటికీ
సాక్షి, సిద్దిపేట: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన ప్రియుడు మాట తప్పడంతో ప్రియురాలు అతని ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సంఘటన జిల్లాలోని చిన్న కోడూర్ మండల పరిధిలోని రామునిపట్లలో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన పల్లె విద్యను చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన కానిస్టేబుల్ యాసరేని సంతోష్ కుమార్ మూడేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. మాయమాటలు చెప్పి తనను లోబరుచుకున్నాడు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఆమె నిలదీయగా మొహం చాటేశాడు. ఏడాది క్రితం ఇంట్లో వారి అంగీకారం మేరకు మరో వ్యక్తితో వివాహం జరిగింది. ఆ తర్వాత సైతం ఫోన్లో రోజు చాటింగ్ చేస్తూ.. తనను పెళ్లి చేసుకుంటానని.. తన వెంట రమ్మని నమ్మించాడు. అతని మాటలు నమ్మి ఇంటి నుంచి వెళ్లిన ఆమెను కరీంగనర్‌లో ఒక అద్దె ఇంట్లో ఉంచాడు. ఆ సమయంలో ఆమెకు మంగళసూత్రం కట్టాడు. ఇప్పుడు ఆమెకు కనబడకుండా తిరుగుతున్నాడు. దీంతో న్యాయం చేసే వరకు రామునిపట్లలో సంతోష్‌కుమార్ ఇంటి ఎదుట నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చుంది విద్య. ఆమెకు మద్దతుగా వారి కుటుంబ సభ్యులు నిలిచారు. చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని నిలదీయడంతో.. -
ప్రేమించి పెళ్ళి చేసుకుని కొడుకు పుట్టిన తర్వాత.. మరో అమ్మాయితో..
సాక్షి, బాన్సువాడ : ప్రేమించి పెళ్ళి చేసుకుని కొడుకు పుట్టిన తర్వాత కాపురానికి తీసుకెళ్ళడం లేదని ఆరోపిస్తూ నాగారం గ్రామానికి చెందిన స్వాతి అనే మహిళ బుధవారం దేశాయిపేట్‌లో భర్త ఆకుల శివకృష్ణ ఇంటిముందు ఆందోళనకు దిగారు. సీపీఎం, దళిత సంఘాల నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. స్వాతీ మాట్లాడుతూ.. డిగ్రీ చదువుతున్న సమయంలో తాను శివకృష్ణ ప్రేమించుకొని నిజామబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. తమకు బాబు పుట్టిన తర్వాత తన భర్త వేరే అమ్మాయిని ప్రేమించి వివాహానికి సిద్దమయ్యాడని పేర్కొన్నారు. చదవండి: ఐదున్నర గంటలు..6 నేరాలు.. వీడు మామూలోడు కాదురోయ్! తాను దళిత సామాజిక వర్గం కావడంతో తన అత్త మామలు, ఆడపడుచులు కాపురానికి తీసుకెళ్ళకుండా తన భర్తకు వేరే పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తన భర్త కాపురానికి అనుమతించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా స్వాతి భర్త శివకృష్ణ అక్కడకు చేరుకుని గురువారం పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని చెప్పడంతో బాధితురాలు ఆందోళన విరమించారు. సీపీఎం నాయకులు రవీందర్, ఖలీల్, ఎస్సీ, బీసీ సంఘం నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. చదవండి: పెళ్లైన ఆర్నెళ్లకే.. భార్యను వదిలేసి ప్రియురాలితో.. -
'వివాహేతర సంబంధం అంటగడుతూ వేధిస్తున్నాడు'
-
అంతకు ముందే పెళ్లి.. వివాహేతర సంబంధం అంటూ రెండో భార్యను
సాక్షి, హైదరాబాద్: తనకు వివాహేతర సంబంధం అంటగడుతూ భర్త నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడని ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. భర్తతోపాటు అత్తామామలు, ఆదపడుచులందరు కలిసి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని పోలీసుల ఎదుట వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ముందు పోరాటానికి కూర్చుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియపూర్‌లో నివాసముంటున్న రవళిని(21) కాప్రా శ్రీరాం నగర్‌కు చెందిన వెంకటేష్(38) అనే వ్యక్తికి ఇచ్చి 2017 జూన్ 14న పెద్దలు వివాహం జరిపించారు. వివాహ సమయంలో కట్నం కింద 8లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు పెట్టారు. చదవండి: హైదరాబాద్ మొదటి పేరు భాగ్యనగర్ కాదు.. అసలు పేరు ఏంటంటే! అయితే వెంకటేష్‌కు అంతకుముందే వివాహం జరిగి విడాకులు కూడా అయి రవళిని వివాహం చేసుకోవడం గమనార్హం. వీరికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. వివాహం జరిగిన ఏడాది వరకు కాపురం బాగానే కొనసాగింది. తరువాత భర్త, అత్తామామలు, ఆడపడుచులు అందరూ కలిసి మానసికంగా, శారీరకంగా, సూటిపోటి మాటలతో దాడులకు దిగుతూ వేధింపులకు గురి చేస్తున్నారని రవళి ఆరోపించింది. చదవండి: అప్పుల బాధలు: గతంలో భర్త, చిన్నకుమారుడు, అల్లుడు.. ఇప్పుడేమో అదనపు కట్నం తీసుకురమ్మని, ఎవరితోనో వివాహేతర సంబంధముందని నిరాధార ఆరోపణలు చేస్తూ నిత్యం వేధిస్తున్నారని రవళి ఆవేదన వ్యక్తం చేసింది. భర్త వెంకటేష్ చెడు తిరుగుళ్లు తిరుగుతూ ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను గ్యాస్ లీక్ చేసి చంపాలని కూడా ప్రయత్నించినట్లు ఆరోపించింది. ప్రభుత్వం, పోలీసులు, మీడియా అందరూ కలిపి తనకు తగిన న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసింది.తనకు న్యాయం జరిగే వరకు ధర్నా ఆపేది లేదని స్పష్టం చేసింది. -
అత్తింటి ముందు కోడలు బైఠాయింపు
సాక్షి, చీరాల అర్బన్: కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో కాన్పుకు పుట్టింటికి వెళ్లి తిరిగి పసిబిడ్డతో ఇంటికి వచ్చిన కోడల్ని ఇంటిలోకి రానివ్వక పోవడంతో ఆ యువతి అత్తింటి ముందు బైఠాయించింది. ఈ ఘటన ఆదివారం వేటపాలం మండలం కొత్తపేట పంచాయతీ టైలర్స్ కాలనీలో జరిగిది. వివరాల్లో వెళితే.. వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ టైలర్స్‌కాలనీకి చెందిన గుంటి దీపు, ఇంకొల్లుకు చెందిన రోజాలు కులాంతర వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న రోజు నుంచి అత్తమామలు వేధిస్తున్నారనని ఆమె ఆరోపిస్తుంది. కాన్పుకు వెళ్లి ఏడు నెలల పసిబిడ్డతో ఆదివారం ఇంటికి రాగా ఇంటిలోకి రానివ్వలేదని ఆమె వాపోయింది. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్సై రత్నకుమారి సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ యువతిని ఇంటిలోకి పంపించారు. పోలీసుల జోక్యంతో వ్యవహారం సద్దుమణిగింది. -
గుమ్మానికి వేలాడిన నిరసన సూత్రం
చాలా సంఘటనలు ఇలా జరిగి అలా కాలం పొరల్లోకి వెళ్లిపోతుంటాయి. ఒక్కోసారి ఎంతో ప్రాధాన్యత గల సందర్భాలు కూడా సమాజంపై వేయవలసినంత ముద్ర వేయకుండానే మాములు ఘటనగా సమసిపోతాయి. దానివల్ల వాటి నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఎవరికీ అందకుండానే మిగిలిపోతాయి. అయితే వాటి మూలాల్ని వెదికి ఆయా వ్యక్తులు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించిన పూర్వాపరాలే మిటో తెలుసుకుంటే అవి వ్యవస్థలో రావలసిన మార్పునకు సూచనలిస్తాయి. ఈ మధ్య ఒక మహిళ తన భూసమస్యను పరిష్కరించమని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి వేసారి తన మంగళసూత్రాన్ని ఎమ్మార్వో ఆఫీసు ప్రవేశ ద్వారానికి తగిలించింది. తాను ఇంతకన్నా ఏమీ చెల్లించుకోలేను, దీన్ని తీసుకొని నా కార్యం చేసి పెట్టండని వేడుకొంది. ఈ సంఘటన జూన్ 30 నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగింది. ఆ మహిళా రైతు పేరు పొలాస మంగ. మంగకు ఎలాంటి పోరాట, ఉద్యమ నేపథ్యం లేదు. రెండేళ్లుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా తన భూమిపై హక్కును ఎలా పరిరక్షించుకోవాలో అర్థం కాలేదు. ఆఫీసు లోపల తన తాళి బొట్టును తీసి ఏ ఉద్యోగి చేతిలోనో పెడితే పరిస్థితి ఎలా ఉండేదో గానీ, ఏకంగా ఆఫీసు గుమ్మానికి తగిలించడంతో కలకలం రేగింది. మధ్యలో వేలాడుతూ ఆఫీసులోకి వచ్చే పోయేవారి కంటపడి ఇదేమి చోద్యమనేలా చర్చకు వచ్చింది. ఇదేదో ఉద్రిక్త పరిస్థితికి దారి తీస్తుందన్న బెదురుతో రెవెన్యూ అధికారులు విషయాన్ని స్థానిక పోలీసు స్టేషనుకు చేరవేశారు. ఆ సమయాన జిల్లా కేంద్రంలో ఉన్న డిప్యూటీ తహసీల్దారు హుటాహుటిన ఆఫీసుకొచ్చి ఆమెతో మాట్లాడి సమస్యను తెలుసుకొన్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్ళి ఆమె అలా ఎందుకు చేయవలసివచ్చిందో కనుక్కున్నారు. వార్త జిల్లా కలెక్టర్ దాకా వెళ్ళింది. సంగతేమిటో చూడమని ఆయన ఆర్డీవోను పుర మాయించారు. ఆ అధికారి స్వయంగా భూమి వద్దకు వెళ్లి పూర్తిస్థాయి విచారణ చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని ఆమెతో అన్నారు. ఇలా అధికారులు దిగి వచ్చి తన సమస్యను ఆలకిస్తారని ఆమె తాళిని తగిలించేముందు ఊహించి ఉండకపోవచ్చు. ఇదొక అరుదైన ఘటనగా, రెవెన్యూ శాఖ పరువు ప్రతిష్టకు ముడిపడిన విషయంగా భావించి అధికారగణం కదిలి వచ్చిందనుకోవచ్చు. ప్రపంచంలో మహిళలు అతికష్ట సమయంలో ఉద్వేగభరితమైన రీతిలో తమ నిరసనను ప్రదర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. మంగ చూపిన తెగువ కూడా ఆ స్థాయికి తక్కువేమీ కాదు. పదేళ్ల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్ళిన మంగ భర్త రాజేశం ఎక్కడ, ఎలా ఉన్నాడో సమాచారం లేదు. ప్రస్తుతం కొడుకుతో పాటు మెట్‌పల్లిలోని తన పుట్టినింటిలో ఉంటూ ఆమె ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. ఇదే అదునుగా తన ఎకరం 23 గుంటల భూమిని భర్త తోబుట్టువులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆమె వాదన. మంగ భర్త పరిస్థితిని కూడా తెలుసుకునే పని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఆమె అనుభవాలను, ఆలోచనలను నలుగురి ముందుకు తెచ్చి వాటికి తగిన ప్రాచుర్యం ఇయ్యవలసిన సందర్భమిది. మంగ చూపిన తెగువను ఒక నిరసన బాటగా మలుచుకునే బాధ్యత నారీలోకంపై ఉంది. ప్రభావశీల సంఘటనలు ప్రతిరోజూ జరుగవు. - బి. నర్సన్ వ్యాసకర్త కవి, కథకుడు మొబైల్ : 9440128169 -
న్యాయం చేయండి
-
రోడ్డున పడిన జీవితం!
పలమనేరు: తన భర్త, అత్తమామలు తనతో గొడవ పడి ఇంటి నుంచి గెంటేశారని ఓ మహిళ తన పసిబిడ్డతో విలపిస్తోంది. తలదాచుకునేందుకు స్థలం లేక తన సామగ్రితో అంగన్వాడీ కేంద్రం వద్దకు చేరింది. గురువారం ఈ సంఘటన మున్సిపాలిటీ పరిధిలోని నీళ్లకుంటలో వెలుగుచూసింది. తన గోడును బాధితురాలు అంగన్వాడీ వర్కర్ రాధకు నివేదించడంతో ఆమె మీడియా దృష్టికి తీసుకువచ్చింది. వివరాలు..పట్టణ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద కాపురమున్న శోభతో బొమ్మిదొడ్డికి చెందిన గోవిందురాజులతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏదాడి వయస్సున్న బాబున్నాడు. అయితే తల్లిమాట వింటూ భర్త తరచూ తనను వే«ధిస్తున్నాడని శోభ తెలిపింది. ఈనేపథ్యంలో రెండ్రోజుల క్రితం ఇంటినుంచి బయటకు పంపేశారని, దీంతో ఏం చేయాలో అర్థంగాక అంగన్వాడీ ముందు తలదాచుకుంటున్నానని తనకు పోలీసులు న్యాయం చేయాలని కోరుతోంది. -
భర్త ఇంటిముందు భార్య ధర్నా!
సాక్షి, హైదరాబాద్ : ఆడపిల్ల పుట్టిందని ఓ ప్రబుద్ధుడు భార్య ఇంటి నుంచి గెంటేశాడు. అదనపు కట్నం తెస్తేనే ఇంట్లోకి రానిస్తానంటూ షరతులు పెట్టాడు. దీనికి అతని తల్లిదండ్రులు సైతం వంతపాడారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటిముందు తన చిన్నారితో కలిసి ఓ మహిళ మౌనపోరాటానికి దిగింది. పసిపాపతో కలిసి ధర్నా చేపట్టింది. ఈ ఘటన వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని సహారా ఎస్టేట్‌లో జరిగింది. సహారా ఎస్టేట్‌లో ఉంటున్న మౌనిక, ఉదయ్‌కుమార్ దంపతులు. వీరికి ఓ కూతురు ఉంది. అయితే, పెళ్లయిన ఏడాది నుంచి భర్త, అత్తమామలు తనను తీవ్రంగా వేధిస్తున్నారని, అత్తమామలే కాదు మరిది కూడా తనను కొట్టేవారని బాధితురాలు మౌనిక తెలిపారు. ఈ క్రమంలో ఆడపిల్ల పుట్టిందని, అదనపు కట్నం తేవాలంటూ ఇంటి నుంచి భర్త ఉదయ్ బయటకు పంపించాడని పేర్కొంటూ మౌనిక తన చిన్నారి కూతురితో కలిసి ధర్నా చేపట్టారు. అంతేకాకుండా సరూర్‌నగర్ మహిళా పోలీసు స్టేషన్లో భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ధర్నా చేస్తున్న మౌనికను, ఆమె బిడ్డను భర్త, అత్తమామ ఇంట్లోకి తీసుకెళ్లారు. -
బిడ్డ తనకు పుట్టలేదని భర్త చెప్పడంతో..
చెన్నై : కడైయమ్ సమీపంలో బుధవారం భర్త ఇంటి ముందు పసికందుతో మహిళా ఇంజినీర్ ధర్నాకు దిగింది. తెన్కాశి జిల్లా కడైయమ్ సమీపం కట్టెలి పట్టి కీళ వీధికి చెందిన పరమశివన్ కుమారుడు మురుగన్ (30). ఇంజినీర్ అయిన ఇతను ఇండోనేషియాలో పనిచేస్తూ వస్తున్నాడు. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన గురుస్వామి కుమార్తె, ఇంజినీర్ అయిన తేన్‌మొలి (27)తో గత ఫిబ్రవరిలో వివాహమైంది. తరువాత మురుగన్ పనికోసం ఇండోనేషియాకి బయలుదేరి వెళ్లాడు. ప్రస్తుతం అతను అక్కడ పనిచేస్తున్నాడు. తేన్‌మొలి కోవైలో ఉన్న ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. గర్భంతో ఉండడంతో ఆమె పనిని వదిలి ఊరుకి తిరిగి వచ్చింది. తరువాత కన్నవారి ఇంట్లో నివసిస్తూ వచ్చింది. అప్పుడప్పుడూ ఆమె భర్తతో ఫోన్లో మాట్లాడుతుండేది. నవంబర్‌లో తేన్‌మొలికి ఆడ బిడ్డ పుట్టింది. అదే రోజు ఈ విషయం ఇండోనేషియాలో ఉన్న భర్తకి సమాచారం తెలిపింది. ఇంకా బిడ్డని చూడడానికి సెలవు తీసుకొని ఊరుకి రమ్మని ఆమె చెప్పింది. అతను వెంటనే సెలవు తీసుకుని రాలేను అని చెప్పాడు. ఈ స్థితిలో హఠాత్తుగా ఒక రోజు, బిడ్డ తనకు పుట్టలేదని, ఆ బిడ్డని చూడడానికి రాను అంటూ మురుగన్ చెప్పడంతో తేన్‌మొలి దిగ్భ్రాంతి చెందింది. బుధవారం మురుగన్ ఇంటికి ఆమె తన బిడ్డతో వచ్చి ధర్నాకు దిగింది. సమాచారం అందుకున్న కడైయమ్ పోలీసులు, గ్రామ నిర్వాహక అధికారి సుడర్‌సెల్వన్ సంఘటనా స్థలానికి చేరుకుని తేన్‌మొలితో చర్చలు జరిపారు. ఆమె మాట్లాడుతూ ఈ బిడ్డ తనకు పుట్టలేదని భర్త చెబుతున్నాడని, నేను డీఎన్ఏ పరిశోధనకి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ఆమెని కడైయమ్ పోలీసు స్టేషన్‌కి తీసుకుని వెళ్లి పోలీసులు విచారణ చేశారు. నీ భర్త నెలలో ఊరికి వస్తాడు.. అతనితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పి పంపారు. -
సమీప బంధువే నమ్మించి మోసం చేశాడు!
సాక్షి, వర్ధన్నపేట: వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో ఓ యువతి తనకు న్యాయం కావాలంటోంది. యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేశాడని చెబుతోంది. తన సమీప బంధువే నమ్మించి మోసం చేశాని అంటోంది. తనకు ఉండటానికి ఇళ్లు కూడా లేదని.. యాకయ్య అనే యువకుడితో తన వివాహం చేయించాలంటోంది బాధితురాలు. అతడి తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడంలేదని వాపోతోంది. -
మురికి గుంతలో 48 గంటలుగా..
సాక్షి, హైదరాబాద్ : కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా మురికి కాల్వలు, మ్యాన్ హోళ్లు నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ వినూత్న నిరసనకు దిగారు. ఏకంగా మురికి గుంతలో కూర్చుని డ్రైనేజీ పైప్‌లైన్ పనులను అడ్డుకున్నారు. శుక్రవారం మొదలైన ఆమె నిరసన కార్యక్రమం శనివారం (48 గంటలు) కూడా కొనసాగుతోంది. వివరాలు.. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ 30 ఫీట్ల రోడ్డులో కొంత కాలంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు తలెత్తాయి. దీంతో స్థానికులు సొంతంగా సేకరించిన నిధులతో సుమారు 200 మీటర్ల మేర యూజీడీ పైప్‌లైన్ నిర్మాణ పనులను చేపట్టారు. అయితే ఇష్టానుసారం పైప్లైన్లు నిర్మిస్తున్నారని పేర్కొంటూ కాలనీకి చెందిన అరుణ అనే మహిళ పనులను అడ్డుకుంది. డ్రైనేజీ పైప్‌లైన్ కోసం ఏర్పాటు చేసిన గుంతలో కూర్చొని నిరసనకు దిగారు. కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులను జీహెచ్ఎంసీ చేస్తుందని... మీరెందుకు చేస్తున్నారంటూ పనులను అడ్డుకుంది. అయితే, సొంత నిధులతో కాలనీని అభివృద్ధి చేసుకోవడంలో తప్పేంటని, తమ పనులకు అడ్డు రావద్దని కాలనీవాసులు ఆమెకు సూచించారు. అధికారులు ఏం చేస్తున్నారు.. ఇష్టానుసారంగా మురికి నీటి కాల్వలు నిర్మిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురౌతాయని అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణాళిక బద్దంగా డ్రైనేజీ పైప్లైన్లు నిర్మించాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు. అందుకే ఈ కాలనీలో నివసిస్తున్న మహిళగా నిరసన తెలుపుతున్నానని స్పష్టం చేశారు. చందానగర్ డిప్యూటీ కమిషనర్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, పోలీస్ అధికారులకు ఇదే విషయాన్ని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా మురికి కాలువలు, మ్యాన్ హోళ్లు నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
భర్త పొమ్మన్నాడు.. న్యాయం జరిగే వరకూ కదలనూ
సాక్షి, డోన్(కర్నూలు) : అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త.. ఇష్టం లేదని చెప్పడంతో భార్య ఆయన ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం జరిగేవరకు ఇక్కడి నుంచి కదలనని భీష్మించింది. బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన రాజు, వరలక్ష్మి బాయి దంపతుల కుమార్తె ఉమామహేశ్వరిని ఏడాది క్రితం డోన్‌లోని పాతపేటకు చెందిన నారాయణ,దేవిబాయ్ కుమారుడైన వీరేష్‌కుమార్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం సందర్భంగా రూ.2లక్షల నగదుతో పాటు రూ.20తులాల బంగారం కట్న కానుకల కింద అందజేశారు. ఆరు నెలలు సవ్యంగా సాగిని వీరి సంసారంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో భార్య ఉమామహేశ్వరిని భర్త వీరేష్‌కుమార్ అరునెలల కిందట పుట్టినింట్లో వదిలొచ్చాడు. కాపురానికి తీసుకువెళ్లేందుకు రాకపోవడంతో పాటు, నీతో సంసారం చేసేందుకు తనకు ఇష్టం లేదని భర్త తెగేసి చెప్పడంతో ఉమామహేశ్వరి తన తల్లిదండ్రులతో పాటు బంధువులను తీసుకొని డోన్‌కు వచ్చింది. అయితే ఆమె ఇంట్లోకి వెళ్లగానే భర్తతో పాటు అత్తామామలు దుస్తులను పారవేసి ఉమామహేశ్వరిని బయటికి గెంటేశారు. దీంతో ఆమె భర్త ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం జరిగి ఇంట్లోకి రానించేంత వరకు కదలని స్పష్టం చేసింది. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో సీఐ కంబగిరి రాముడు రెండు కుటుంబాలను స్టేషన్‌కు పిలిపించారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగిన యువతి
-
భర్త ఇంటి ముందు మహిళ ధర్నా
చెన్నై, అన్నానగర్: భర్తతో కలపాలని కోరుతూ కుమారుడితో సహా మహిళ అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. కన్యాకుమారి జిల్లా మార్తాండం విరికోడు ముండవిలై ప్రాంతానికి చెందిన రాజరత్తినం. ఇతని కుమార్తె రమ (24). ఈమెకు మార్తాండం సమీపం కోట్టగం సెంబక్కావిలైకి చెందిన మహేష్ (32)తో 2016లో వివాహం జరిగింది. మహేష్ విదేశంలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. వివాహం జరిగిన ఏడాదికి దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. మహేష్ కుటుంబ ఖర్చులకు నగదు ఇవ్వకుండా వచ్చాడు. దీనిపై రమ మార్తాండం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. అనంతరం ఇద్దరు కలసి జీవించారు. తరువాత మహేష్ పని కోసం విదేశానికి వెళ్లాడు. కుటుంబ ఖర్చులకు నగదు పంపకపోవడంతో రమ పుట్టింటికి చేరుకుంది. ఈ స్థితిలో కొన్ని నెలల కిందట మహేష్ స్వగ్రామానికి వచ్చాడు. అయితే భార్యను కలువలేదు. అతనికి తల్లిదండ్రులు మరో వివాహం చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న రమ గురువారం భర్తను చూసేందుకు అతని ఇంటికి వెళ్లిది. భర్త, అత్తామామలు ఆమెను ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో రమ తన కుమారుడితో భర్త ఇంటి ముందు కూర్చొని ధర్నాకు దిగింది. దీనిపై రమ తల్లి మహేశ్వరి మార్తాండం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన కుమార్తెని భర్తతో కలుపాలని కోరింది. ఈ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ఫేస్బుక్లో పరిచయమై.. ప్రేమగా మోసం చేసి..
తుమకూరు : ఫేస్బుక్లో పరిచయమైన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసాడని ఆరోపిస్తూ యువతి తల్లితండ్రులు, బంధువులతో కలసి యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. జిల్లాలోని మధుగిరి తాలూకా బుళసంద్ర గ్రామానికి చెందిన సిద్దలింగప్పకు రెండేళ్ల క్రితం చన్నపట్టణకు చెందిన సరస్వతితో ఫేస్బుక్లో పరిచయమైంది. ఇరువురికి ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారడంతో రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అనంతరం కొద్ది కాలం బెంగళూరులో కాపురం పెట్టగా కొద్ది కాలం క్రితం యువతి గర్భం దాల్చారు. దీంతో కొద్ది రోజుల క్రితం భార్యను మధుగిరికి తీసుకువచ్చిన సిద్దలింగప్ప యువతికి అబార్షన్ చేయించడానికి యత్నించాడు. అందుకు యువతి అంగీకరించకపోవడంతో తిరిగి బెంగళూరుకు వచ్చిన సిద్దలింగప్ప యువతిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. నెల రోజులుగా భర్త కనిపించకపోవడంతో బుళసంద్ర గ్రామంలోని భర్త ఇంటి ఎదుట ఆదివారం తల్లితండ్రులు, బంధువులతో కలసి ధర్నాకు దిగారు. తమ కొడుకు కనిపించడం లేదంటూ సిద్దలింగప్ప తండ్రి దొడ్డయ్య బెంగళూరు నగరంలోని అక్కూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా సిద్దలింగప్ప మోసం చేసాడని ఆరోపిస్తూ సరస్వతి బడవనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.