సీఎం ప్రసంగం మధ్యలో హైడ్రామా | Woman Dragged in Vijay Rupani Meeting Video Viral | Sakshi
Sakshi News home page

సీఎం ప్రసంగం మధ్యలో హైడ్రామా

Published Sat, Dec 2 2017 9:15 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీకి ఊహించని ఝలక్‌ తగిలింది. ఓ సభలో ఆయన ప్రసంగిస్తున్న వేళ ఓ యువతి నినాదాలు చేయటం.. పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లటం రచ్చ రేపింది. ఆమె అమర వీరజవాన్‌ కూతురు కావటంతో ప్రభుత్వంపై విమర్శలు మరింతగా చెలరేగుతున్నాయి. విషయం ఏంటంటే... శుక్రవారం వడోదరా జిల్లాలోని కేవదియా కాలనీలో నిర్వహించిన ప్రచార సభలో విజయ్‌ రూపానీ ప్రసంగిస్తున్నారు. ఇంతలో రూపల్‌ తాద్వి(26) అనే యువతి సీఎం ప్రసంగానికి అడ్డు తగిలింది. తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేసింది. రూపల్‌, బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ అశోక్‌ తాద్వి కూతురు. అశోక్‌ విధినిర్వహణలో ప్రాణాలు వదిలారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement