
బైఠాయించిన సుజాత, ఆమె బంధువులు
సాక్షి, ఆదిలాబాద్: ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో మంగళవారం ప్రియుడి ఇంట్లో ప్రియురాలు తనకు న్యాయం చేయాలని ధర్నాకు దిగింది. బాధితురాలి వివరాల ప్రకారం... నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మసాయిపెట్ గ్రామానికి చెందిన సుజాత (28), ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీకి చెందిన చందల హరీష్‌కుమార్ తొమ్మిది ఏళ్లుగా ప్రేమించుకున్నారు. హైదరాబాద్‌లో చదువుకుంటున్న సమయంలో ప్రేమలో పడ్డారు.
ఈ ఇరువురు సమీప బంధువులే. రెండేళ్లుగా సుజాత పెళ్లి చేసుకోవాలని హరీష్‌పై ఒత్తిడి తీసుకువ్చంది. అప్పటి నుంచి హరీష్ తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. దీంతో సుజాత 2021, ఆగస్టులో కడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానీ సంబంధిత పోలీసులు పట్టించుకోకపోవడంతో తన సమీప బంధువులతో మంగళవారం సాయంత్రం టీచర్స్‌కాలనీలో ప్రియుడి ఇంట్లో బైఠాయించింది. దీంతో కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
Comments
Please login to add a commentAdd a comment