Lover protest
-
క్లాస్మేట్ అని జాబ్ ఇప్పించి.. లవ్యూ అంటూ సహజీవనం.. తర్వాత..
జమ్మికుంట: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళనకు దిగింది. తనతో సహజీవనం చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని రహస్యంగా వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తోంది. ఈ ఘటన జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఆస్మాబేగం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన రాచపల్లి మధు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవి చెల్పూర్ గ్రామానికి చెందిన ఎండీ.ఆస్మాబేగం కలిసి 2017 వరకు వర్ధన్నపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివారు. ఈ సమయంలో మధు, ఆస్మాబేగం ప్రేమించుకున్నారు. తరువాత హైదరాబాద్‌లోని మధు స్నేహితుడి రియల్ ఎస్టేట్ అఫీస్‌లో ఆస్మాబేగంకు ఉద్యోగం ఇప్పించాడు. ఈ సమయంలో రెండేళ్లు సహజీవనం చేశారు. కొద్ది రోజుల క్రితం వ్యవసాయం చేసుకుంటానని బీజిగిరిషరీఫ్కు వచ్చిన మధు మరో యువతితో వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన ఆస్మాబేగం ముడు రోజులుగా మధు ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఎవరూ పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేసింది. కాగా.. మధు కుటుంబ సభ్యులు ఇంటికి తాళంవేసి పరారీలో ఉన్నారు. -
ప్రేమించింది బావనే కదా అని దగ్గరైంది.. ప్రైవసీ ఫొటోలు తీసి..
తిరువళ్లూరు: ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి వద్ద యువతి ఆందోళనకు దిగింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కొట్టయూర్ గ్రామానికి చెందిన పార్థసారథి కుమార్తె తులసీ(29). తల్లిదండ్రులిద్దరూ దివ్యాంగులు. కాగా, తులసీ అదే ప్రాంతానికి చెందిన తన మామ బాలకృష్ణన్ కుమారుడు సతీష్‌కుమార్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో శారీరకంగా దగ్గరయ్యారు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి రెండు నెలల నుంచి కోరుతోంది. అడిగిన ప్రతిసారి యువకుడు వివిధ కారణాల చెబుతూ వచ్చాడు. ఆమె ఒత్తిడి చేయడంతో తన వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని.. తీసుకొస్తే ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరింపులకు దిగాడు. ఈ నెల 4న యువతి తల్లిదండ్రులు యువకుడి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని కోరారు. నిరాకరించిన యువకుడి తల్లిదండ్రులు 50 సవర్ల బంగారు నగలు, కారు కట్నంగా ఇస్తే పెళ్లికి ఒప్పుకుంటామని తేల్చిచెప్పారు. దీంతో మనస్తాపం చెందిన యువతి తనకు జరిగిన అన్యాయంపై తిరువళ్లూరు కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీయ, ఎస్పీ ఫకెర్లా సెఫాస్ కల్యాన్, తిరువళ్లూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా న్యాయం జరగకపోవడంతో గురువారం ఉదయం యువకుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ మౌన దీక్ష చేపట్టింది. విషయం తెలుసుకున్న మప్పేడు ఎస్ఐ శక్తివేల్ సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించింది. కాగా యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రమంలో సతీష్‌కుమార్ కుటుంబ సభ్యులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన
-
ఒకరితో ప్రేమ, మరోకరితో పెళ్లి నిశ్చయం..అడిగితే రెండు రోజుల్లో వస్తానని చెప్పి
సాక్షి, ఆసిఫాబాద్ అర్బన్: ప్రియుడు మోసగించాడని ఓ యువతి శుక్రవారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో ప్రియుని ఇంటి ఎదుట భైఠాయించింది. మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన యువతి, పట్టణంలోని జన్కాపూర్ కు చెందిన ఓ యువకుడు ఏడాదికాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నాడు. దీంతో వారం రోజుల క్రితం సదరు యువతి ఆసిఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం మళ్లీ వచ్చి వివాహం చేసుకుంటానని చెప్పాడు. ఎంతకూ రాకపోవడంతో శుక్రవారం ఆసిఫాబాద్‌కు వచ్చినట్లు పేర్కొంది. సదరు యువకుడికి వివాహం నిశ్చయించినట్లు తెలిసి న్యాయం చేయాలని అతని ఇంటి ఎదుట బైఠాయించింది. మహిళా సంఘాల సభ్యులు మద్దతు తెలిపారు. -
ఇద్దరూ బంధువులే.. తొమిదేళ్లుగా ప్రేమ.. పెళ్లి చేసుకోవాలని అడగడంతో
సాక్షి, ఆదిలాబాద్: ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో మంగళవారం ప్రియుడి ఇంట్లో ప్రియురాలు తనకు న్యాయం చేయాలని ధర్నాకు దిగింది. బాధితురాలి వివరాల ప్రకారం... నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మసాయిపెట్ గ్రామానికి చెందిన సుజాత (28), ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీకి చెందిన చందల హరీష్‌కుమార్ తొమ్మిది ఏళ్లుగా ప్రేమించుకున్నారు. హైదరాబాద్‌లో చదువుకుంటున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఈ ఇరువురు సమీప బంధువులే. రెండేళ్లుగా సుజాత పెళ్లి చేసుకోవాలని హరీష్‌పై ఒత్తిడి తీసుకువ్చంది. అప్పటి నుంచి హరీష్ తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. దీంతో సుజాత 2021, ఆగస్టులో కడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానీ సంబంధిత పోలీసులు పట్టించుకోకపోవడంతో తన సమీప బంధువులతో మంగళవారం సాయంత్రం టీచర్స్‌కాలనీలో ప్రియుడి ఇంట్లో బైఠాయించింది. దీంతో కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా -
ఏడేళ్లుగా ప్రేమ.. తీరా పెళ్లి చేసుకోవాలని అడిగితే. మరో అమ్మాయితో..
సాక్షి, ఆదిలాబాద్: పెంబి మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ కుభీర్ మండల కేంద్రానికి చెందిన లక్ష్మి ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. తీరా పెళ్లి చేసుకోవాలని అడుగడంతో ముఖం చాటేశారు. ఆదివారం వెంకటేశ్ ఇంట్లో లక్ష్మి బైఠాయించి నిరసన తెలిపింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని తెలిపాడని, అంతేకాకుండా శారీరకంగా లొంగదీసుకుని తీరా పెళ్లి చేసుకోవాలని అడిగితే నిరాకరించాడని తెలిపింది. మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని, రెండేళ్ల క్రితం కుభీర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైందని తెలిపింది. విషయం తెలుసుకున్న ఎస్సై రాజు, దస్తురాబాద్ ఎస్సై జ్యోతిమయి ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని, ఇంట్లో చొరబడి బైఠాయించడం సరికాదని చెప్పి ఇంటికి పంపించారు. చదవండి: మొయినాబాద్ రోడ్డు ప్రమాదం.. మొన్న ప్రేమిక, నేడు సౌమ్య పెళ్లి చేసుకోవాలని భర్త తమ్ముడి వేధింపులు. వివాహిత ఆత్మహత్య కడెం: మండలంలోని అల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతగూడ గ్రామానికి చెందిన మసే జ్యోతి(40) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు వివరాల ప్రకారం.. జ్యోతిని భర్త తమ్ముడు సునీల్ కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన జ్యోతి ఈ నెల 25న ఉదయం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతు శనివారం రాత్రి మృతిచెందింది. భర్త ప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై దేవు పేర్కొన్నారు. చదవండి: జూబ్లీహిల్స్: స్నేహితురాలి వెంటపడి వేధించి, అసభ్యంగా ప్రవర్తించి -
వారం రోజుల పోరాటం.. దిగొచ్చిన ప్రియుడు.. ప్రేమజంటకు పెళ్లి
సాక్షి, కారేపల్లి: తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి వారం రోజులపాటు మౌనపోరాటం చేపట్టడంతో దిగొచి్చన ప్రియుడు వివాహం చేసుకున్నాడు. మంగళవారం కారేపల్లి సంతగుడి (శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం)లో మహిళా సంఘాలు, అఖిలపక్ష పార్టీలు, స్థానిక పెద్దలు ప్రేమజంటకు వివాహం జరిపించారు. కారేపల్లికి చెందిన సముద్రాల వేణు తనను ప్రేమించి, పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ మండలంలోని ఎర్రబోడు గ్రామానికి చెందిన కోన సునీత ప్రియుడు ఇంటి ముందు వారం రోజులుగా మౌన పోరాటం చేపట్టిన విషయం విదితమే. చదవండి: TSRTC: జేబీఎస్‌లోనూ యూపీఐ సేవలు ప్రారంభం ఆమెకు మహిళా సంఘాల వారు, అఖిలపక్ష నాయకులు, పెద్దలు అండగా నిలిచారు. ప్రియుడు అంగీకరించడంతో వారే దగ్గరుండి పెళ్లి జరిపించారు. మహిళా సంఘాలు, అఖిలపక్ష నాయకులు లతాదేవి, మెరుగు రమణ, కె.ఉమావతి, బి.సుజాత, దేవి, బి.వీరభద్రం నాయక్, కె.నాగేశ్వరరావు, కె.నరేందర్, శ్రీనివాసరావు, ఎం. సత్యనారాయణ, పిల్లి వెంకటేశ్వర్లు, టోనీ వీరప్రతాప్, డి. ప్రసాద్, టి.నారాయణ, ఎ. రాములు, జి శివ, ఎంపీటీసీ రమాదేవి, సర్పంచ్‌లు ఎ.స్రవంతి, కుర్సం సత్యనారాయణ, రంగారావు పాల్గొన్నారు. చదవండి: కూకట్పల్లి ప్రాంతానికి ఈ నెల 29న నీళ్లు బంద్.. -
ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి..ఇప్పుడేమో!
సాక్షి, ఆదిలాబాద్: పెళ్లి చేసుకుంటానని ప్రేమించి ప్రస్తుతం పెళ్లికి నిరాకరిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట నిరసనకు దిగింది. వివరాలు.. మండలంలోని టోంకిని గ్రావనికి చెందిన చౌదరి మాయ (24), సిర్పర్(టి) పంచాయతీ పరిధిలోని షేక్‌అహ్మద్‌గూడ కాలనీకి చెందిన దంద్రె తిరుపతి(26) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన తిరుపతి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని చౌదరి మాయ నిలదీయడంతో యువకుడు నిరాకరించాడు. దీంతో న్యాయం చేయాలని సదరు యువతి ప్రియుడి ఇంటి ఎదుట సోమవారం నిరసనకు దిగింది. యువతి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తమ గోడు విన్నవించుకోగా.. కౌటాల సీఐ బుద్దే స్వామి, ఎస్సై రవికువర్ స్టేషన్లో దంద్రె తిరుపతికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అదేవిధంగా జిల్లా మహిళా సంఘం సభ్యులు సంఘటన స్థలానికి వచ్చి బాధితురాలికి సంఘీభావం తెలిపారు. -
నాలుగేళ్లుగా ప్రేమ, సహజీవనం, పెళ్లి ప్రస్తావన తేవడంతో!
సాక్షి, ఖమ్మం: నాలుగేళ్లుగా ప్రేమించానంటూ కలిసి తిరిగి, జల్సాలకు డబ్బులు వాడుకుని తీరా పెళ్లి ప్రస్తావన తేగానే ప్రియుడు ముఖం చాటేయడంతో ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు పూనుకున్న సంఘటన బోనకల్ మండలం రావినూతల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావినూతలకు చెందిన వేణు(22) ఆదే మండలంలోని చిరునోములకు చెందిన సింధు(21) గత నాలుగేళ్గుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వేణు, సింధును వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా చేర్చి అక్కడే ఆమెతో సహజీవనం చేయసాగాడు. ఆమెకొచ్చే జీతంతో జల్సాలు చేయడం మొదలు పెట్టాడు. కొద్ది రోజుల క్రితం వేణు సింధుకు చెప్పకుండా స్వంత గ్రామానికి వచ్చాడు. సింధు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు. దీంతో శుక్రవారం సింధు రావినూతల వచ్చి ప్రియుడిని గట్టిగా నిలదీయగా పెళ్లికి తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పా డు. దీంతో మోసపోయానని గుర్తించిన ఆమె తన ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించి దీక్షకు దిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఎస్ఐ కొండలరావు సంఘటనా స్థలానికి చేరకుని యువతితో మాట్లాడి న్యాయం చేస్తామని ఇరు కుటుంబాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లికి ఒప్పిస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించింది. చదవండి: సాక్షి, ఎఫెక్ట్: తొలగించిన డబ్బా మళ్లీ పెట్టించారు -
‘అతని వల్లే నా భర్త వదిలేశాడు.. ప్రియుడు పెళ్లి చేసుకోవాలి’
సాక్షి, ఆదిలాబాద్: తనను పెళ్లిచేసుకోవాలని కోరుతూ ప్రియుడి ఇంటి ఎదుట వివాహిత బైఠాయించిన సంఘటన శనివారం మండలంలో చోటు చేసుకుంది. వివాహిత అనూష తెలిపిన వివరాల ప్రకారం.. సుర్జాపూర్ గ్రామానికి చెందిన జయరాజ్, అనూష కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో జయరాజ్ తల్లిదండ్రులు అతడిని రాత్రికి రాత్రే ఇంటి నుంచి వేరే చోటికి పంపించారు. ఈ సమస్యల నేపథ్యంలో అనూష తల్లి మరణించగా తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడు. అనూషకు మరో వ్యక్తితో వివాహం జరిపించాడు. వారికి ఒక కుమారుడు కూడా జన్మించారు. వారి ప్రేమ విషయం భర్తకు తెలియడంతో తనను వదిలేశాడని అనూష వాపోయింది. జయరాజ్ వల్లనే తన భర్త వదిలేశాడని తనను పెళ్లి చేసుకోవాలని అతడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొంది. చదవండి: భార్యను చంపి.. ఆపై సెల్ఫీ తీసుకుని.. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయింపు
మద్దూరు(హుస్నాబాద్): ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని అరుజన్పట్ల గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు కథనం ప్రకారంగ్రామానికి చెందిన సురేష్‌గౌడ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకొని తీరా పెళ్లి చేసుకోమని అడిగితే నీ కులం వేరు అంటున్నాడని తెలిపింది. దీంతో మద్దూరు పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. కుటుంబ సభ్యులు రక్షించి సురేష్‌గౌడ్ ఇంటి ఎదుట బైఠాయించారు. -
ప్రియుడి ఇంట్లో బైఠాయింపు
వరంగల్ అర్బన్ ,ఎల్కతుర్తి: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంట్లో బైఠాయించి నిరసనకు దిగింది. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. దామెరకు చెందిన ప్రశాంత్‌కు, ధర్మసాగర్ మండలం దేవునూర్‌కు చెందిన ఓ యువతికి గుడిలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నాలుగు రోజులుగా ప్రశాంత్ ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుంది. దీంతో సదరు యువతి బంధువులతో ప్రశాంత్ ఇంటికి చేరుకుని బైఠాయించింది. న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తానని భీష్మించుకు కూర్చుంది. విషయం తెలుసుకున్న ఎస్సైలు గడ్డం ఉమ, టీవీఆర్ సూరి, స్వప్న సిబ్బందితో దామెరకు చేరుకుని రెండు రోజుల్లో న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ప్రియుడి మోసం.. రోడ్డెక్కి యువతి
సిద్దిపేటరూరల్: ప్రియుడు మోసం చేయడంతో న్యాయం చేయాలంటూ ప్రియురాలు రోడ్డుపై బైఠాయించిన ఘటన ఇర్కొడు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఇర్కొడు గ్రామానికి చెందిన కుంభం వెంకటరమణరెడ్డి, బండి రాణిలు గత 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. అనంతరం యాదగిరి గుట్ట దగ్గరలోని ఓ ప్రాంతంలో పెళ్లి చేసుకున్నారు. రెండు రోజులు గడిచిన తర్వాత రాణి తల్లి రూరల్ పోలీసు స్టేషన్లో కూతురు కనబడటం లేదని ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకున్న ప్రేమికులు వెంటనే సిద్దిపేట రూరల్ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఎస్సైని కలవడంతో ఆయన ఇరు కుటుంబీకులను పిలిపించి మాట్లాడారు. ఇదే క్రమంలో అబ్బాయి తన ఇంట్లో తల్లి ఒప్పుకోవడం లేదని కొన్నాళ్లు ఆగిన తర్వాత రాణిని తన ఇంటికి తీసుకెళ్లి బాగా చూసుకుంటానని చెప్పాడు. అప్పటి వరకు హైదరాబాద్‌లో కొన్ని రోజులు తనతో పాటు ఉంచుకున్నాడు. ఇలా నెల రోజులు గడిచిన అనంతరం ఇంటికి రావాలని అనిపించడంతో వెంకటరమణరెడ్డి బైకుపై రాణిని గత ఆదివారం చిన్నగుండవెల్లిలోని వాళ్ల అమ్మమ్మ ఇంటి వద్ద వదిలి మా అమ్మను ఒప్పించి తీసుకెళ్తాన్నాని చెప్పి వెళ్లిపోయాడు. వదిలి వెళ్లిన ప్రియుడు వెంటనే వస్తానని రాకపోవడంతో సోమవారం వెంకటరమణరెడ్డి ఇంటికి వెళ్లింది. దీంతో అక్కడ ప్రియుడు తల్లి ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటి వెనకాల ఉన్న ప్రదేశంలో 4 రోజులుగా నివాసం ఉంటుంది. దీంతో గురువారం పెద్దల దృష్టికి తీసుకెళ్లగా సాయంత్రం 5 గంటల వరకు పరిష్కరిస్తామని చెప్పారు. 5 దాటినా ఎవ్వరు స్పందించకపోవడంతో తనకు న్యాయం చేయాలని రోడ్డుపై కుటుంబీకులతో కలిసి బైఠాయించింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ధర్నాను విరమింపజేశారు. -
ప్రేమపేరుతో యువకుడి వంచన
బండిఆత్మకూరు: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ యువతి బండిఆత్మకూరు బస్టాండ్‌లో మంగళవారం ఆందోళన చేపట్టింది. యువతికి ఐద్వా, సీపీఎం, డీవైఎఫ్ఐ తదితర ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామానికి చెందిన యువతి.. బండిఆత్మకూరు మండలం పరమటూరు గ్రామానికి చెందిన రహిమాన్ బీటెక్ చదివే సమయంలో ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో రహిమాన్‌కు సర్వేయర్‌గా ఉద్యోగం రావడంతో పార్నపల్లె సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా రహిమాన్ కట్నం కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కావడంతో యువతి తనకు న్యాయం చేయాలని బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగింది. ఎస్ఐ వెంకటసుబ్బయ్య, తహసీల్దారు శ్రీనివాసులు, ఎంపీడీవో వాసుదేవ గుప్తా అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో యువతి ధర్నా విరమించింది. -
ప్రియుడి ఇంటి ముందు యువతి మౌనదీక్ష
పశ్చిమ గోదావరి, అత్తిలి: ప్రేమించి పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకుంటానని ఒప్పుకున్నాడు. తీరా ముహూర్తం సమయానికి ప్రేమికుడు పత్తా లేకుండా పోవడంతో యువతి ప్రియుడి ఇంటిముందు మౌనదీక్షకు దిగిన ఘటన అత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. బాధితురాలు చెల్లబోయిన నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం...పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామానికి చెందిన నాగలక్ష్మి అదే గ్రామంలో రొయ్యల కంపెనీలో పనిచేయడానికి వెళుతుంది. అత్తిలి మండలం దంతుపల్లి గ్రామానికి చెందిన కడలి కిషోర్ రొయ్యల కంపెనీలో వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఐదు నెలల క్రితం కిషోర్ తన వెంటపడి ప్రేమిస్తున్నాను అని చెప్పాడని తొలుత అంగీకరించలేదని, తర్వాత అతని నిజాయతీని చూసి తానుకూడా ప్రేమించానని తెలిపింది. అయితే తనకు నమ్మకంలేక పెళ్లిచేసుకోవాలని కోరానని, రెండు నెలలు క్రితం ఫ్యాక్టరీ వద్ద తాళికట్టాడని, ఇంట్లో ఎవరికీ చెప్పవద్దని, రెండేళ్ల తరువాత ఇంటికి తీసుకువెళతానని అప్పటి వరకు ఎవరి ఇంటి వద్ద వాళ్లే ఉందామని చెప్పాడని తెలిపింది. గత నెల 18వ తేదీ రాత్రి కిషోర్ తన ఇంటికి రావడంతో తమ కుటుంబ సభ్యులు అతనిని పట్టుకుని పెనుమంట్ర పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్పింది. అక్కడ పోలీసుల సమక్షంలో నాగలక్ష్మిని పెళ్లి చేసుకున్నానని కిషోర్ ఒప్పుకున్నాడని, అంగీకార పత్రంపై ఇరు కుటుంబాల పెద్దలు సంతకాలు చేశారని వెల్లడించింది. దీంతో పెద్దలు వీరికి ఈనెల 5వ తేదీన సాయంత్రం మాముడూరు వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వివాహం చేయడానికి నిశ్చయించారు. అయితే వివాహానికి నాగలక్ష్మి సిద్ధమవుతున్న తరుణంలో 5వ తేదీ మధ్యాహ్నం కిషోర్ కుటుంబ సభ్యులు తమ పెద్దలకు ఫోన్‌చేసి, తమ అబ్బాయి కనిపించడంలేదని తెలిపారని, దీనిపై పెనుమంట్ర పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం ప్రియుడు కిషోర్ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి నాగలక్ష్మి మౌనదీక్షకు దిగింది. ప్రియుడి ఇంటికి తాళం వేసిఉండటంతో బాధితురాలు ఇంటి ముందే కూర్చుంది. తనకు న్యాయం చేయాలని, కిషోర్‌తో పెళ్లి చేసేవరకు ఇక్కడే ఉంటానని నాగలక్ష్మి పేర్కొంది. ఈసమాచారాన్ని ఆమె 100 నంబర్‌కు తెలపడంతో అత్తిలి పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. న్యాయం జరుగుతుందని, అధైర్యపడవద్దని పోలీసులు ఆమెకు భరోసా కల్పించారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయింపు
పెద్దపల్లిరూరల్ : ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు మొఖం చాటేస్తున్న ప్రియుడు ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయించిన సంఘటన బుధవారం పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. తన కూతురుకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తల్లి లక్ష్మి సైతం గ్రామంలోని వాటర్‌ట్యాంకు ఎక్కి నిరసన తెలిపింది. అప్పన్నపేటకు చెందిన దామ అనూష అదే గ్రామానికి చెందిన అనవేని శ్రీకాంత్‌లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పిన శ్రీకాంత్ ఇప్పుడు మాట మార్చడంతో వారం రోజుల క్రితం గ్రామంలోని వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించింది. దీంతో స్థానికులు పెద్దపల్లి సీఐ నరేందర్‌కు సమాచారం అందించగా అప్పన్నపేటకు వెళ్లిన అమ్మాయి అనూషతో మాట్లాడి న్యాయం చేస్తానని సముదాయించి కిందకు దించిన విషయం తెలిసిందే. వారం గడిచినా సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపలేదంటూ బుధవారం ప్రియుడు శ్రీకాంత్ ఇంటి ఎదుట దీక్షకు దిగింది. ప్రియురాలు తన ఇంటి ఎదుట బైఠాయిస్తుందని గ్రహించిన శ్రీకాంత్ కుటుంబీకులు నేరుగా పోలీసులనే ఆశ్రయించినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. కాగా కూతురు అనూష కోసం తల్లి లక్ష్మి ఆత్మహత్య చేసుకుంటానంటూ వాటర్‌ట్యాంకు ఎక్కడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. అనూషకు న్యాయం చేయాల్సిందిగా గ్రామస్తులంతా ముక్తకంఠంతో అనూషకు మద్దతు పలికారు. -
ప్రేమ పేరుతో మోసం..
కాళేశ్వరం: మూడు సంవత్సరాలుగా ఒకరికొకరు ప్రేమించుకున్నారు. చివరకు పెళ్లి చేసుకుంటానని ప్రియుడు ప్రియురాలిని మోసం చేసి ఊరు వదిలి పరారయ్యాడు. దీంతో గత్యంతరం లేక తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు వారం రోజులుగా ప్రియురాలు ఆందోళనకు దిగింది. ఈ ఘటన మండలంలోని కాళేశ్వరంలో ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. కాటారం మండలం నస్తూర్‌పల్లి గ్రామానికి చెందిన మేర్జాన సంధ్య, మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఎస్సీ కాలనీకి చెందిన చకినారపు రాజశేఖర్ ప్రేమించుకున్నారు. రాజశేఖర్ డిగ్రీ వరకు చదివి ఖాళీగా ఉన్నాడు. సంధ్య కాళేశ్వరంలోని అమ్మమ్మ సమ్మక్క ఇంటి వద్ద ఉంటూ తాపీమేస్త్రీ వద్ద రోజు వారి కూలీ పని చేస్తుండేది. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి అది కాస్తా ప్రేమగా మారింది. మూడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని రాజశేఖర్‌పై సంధ్య ఒత్తిడి తెచ్చింది. పెళ్లికి నిరాకరించిన ఆ యువకుడు ఇంటికి తాళం పెట్టి కుటుంబ సభ్యులతో కలసి ఊరు వదిలి వెళ్లాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె నుంచి వివరాలు సేకరించారు. ఈ విషయంపై శ్రీనివాస్‌ను వివరణ కోరగా సంధ్యకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులను తీసుకురావాలని పంపినట్లు తెలిపారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
శ్రీరంగాపూర్: మండలంలోని వెంకటాపూర్‌లో మంగళవారం ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా చేపట్టింది. బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువతి(22) ఇదే గ్రామానికి చెందిన పరశురాముడు(30) గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన కులపెద్దలు కులం, గోత్రం ఇద్దరివి ఒకటే కావడంతో వరుసలు కలువదని, ఇద్దరు పెళ్లి చేసుకోకూడదని ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. అనంతరం యువతికి మరొకరితో పెళ్లి కూడా చేశారు. కానీ ప్రియుడిపై ప్రేమతో పెళ్లయిన కొద్ది రోజులకే భర్తను వదిలి యువతి పుట్టింటికి వచ్చింది. ప్రస్తుతం పరశురాముడు మరో యువతితో పెళ్లికి సిద్ధపడడంతో తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. తనకు 24 గంటల్లో న్యాయం చేయకపోతే పోలీసులను ఆశ్రయిస్తానని హెచ్చరించింది. -
ప్రేమ ముద్దు.. పెళ్లి వద్దు!
ప్రేమించామని ఊసులు చెబుతున్నారు. పెళ్లి చేసుకుం టామని నమ్మబలుకుతున్నారు. సినిమాలకు షికార్లకు తీసుకెళ్తున్నారు. పెళ్లి చేసుకోవాలని గట్టిగా అడిగితే మాత్రం ప్లేట్ ఫిరాయిస్తున్నారు. దండేపల్లి ఘటనకు శుభం కార్డు పడకముందే ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ప్రేమించిన వాడి ఇంటి ఎదుట మౌన పోరాటాలు చేస్తున్నారు యువతులు. మంగళవారం జన్నారం మండలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య భర్త ఇంటి ఎదుట బైఠాయించగా భర్త దూషించడంతో ఆత్మహత్యకు యత్నించింది. కెరమెరిలో యువతి ప్రియుడి ఇంటి ఎదుట బైటాయించగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి మండలం అనార్పల్లిలో మంగళవారం గోలేటికి చెందిన గుగులోతు కళ్యాణి పెళ్లి చేసుకోవాలని పోరాటం చేసింది. కళ్యాణి అనార్పల్లి గ్రామానికి చెందిన శ్రీదాస్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనను కాదని మరో అమ్మాయితో శ్రీదాస్ వివాహం చేసుకుంటున్నాడని తెలుసుకున్న కళ్యాణి ఆమె కుటుంబీకులతో కలిసి మంగళవారం అనార్‌పల్లికి చేరుకుంది. మధ్యలో ఉన్న ఆశ్రమ పాఠశాల సమీపంలో ఇరు వర్గాల మధ్య ఘర్షన చోటుచేసుకుంది. కళ్యాణి, శ్రీదాస్ బంధువులు వాదులాడుకున్నారు. దీంతో కెరమెరి పోలీసుల వచ్చి ఇరు వర్గాలను శాంతింపజేశారు. అనంతరం కళ్యాణి రోడ్డుపై మూడు గంటల పాటు బైఠాయించి నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను శ్రీదాస్ ఆరేళ్లుగా ప్రేమించుకున్నామని తన చెళ్లి పెళ్లి అయ్యాక పెళ్లి చేసుకుందామని శ్రీదాస్ నమ్మబలికాడని, తనను శారీరకంగా వాడుకున్నాక ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చుంది. సీఐ శ్రీనివాస్, ఎస్సై సత్యనారాయణ విషయం తెలుసుకుని ఇద్దరిని పిలిపించి కౌన్సెలింగ్ జరిపిస్తామని ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నం చేశారు. న్యాయం జరగకుంటే పురుగులు మందు తాగి ఆత్మహత్య చేస్తానని కళ్యాణి తనతో తీసుకవచ్చిన పురుగుల మందు డబ్బాను ముందు పెట్టింది. డీఎస్పీ వదక్దు సమస్యను తీసుకెళ్లి న్యాయం చేస్తామని, శ్రీదాస్ను కూడా పిలిపించి కౌన్సెలింగ్ చేస్తామని సీఐ, ఎస్సై చెప్పడంతో కళ్యాణి ఆందోళన విరమించింది. కళ్యాణికి ఉమ్మడి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు బియ్యాల పద్మ, నాయకురాళ్లు కాజల్ బిస్వాస్, పద్మా, తారా మద్దతు పలికారు. కళ్యాణితో ఎలాంటి సంబంధం లేదు కళ్యాణితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె నాకు బంధువు మాత్రమే. నేనెప్పుడూ ఆమెను ప్రేమించలేదు. 2015 లో ఉద్యోగం వచ్చిందని అప్పటి నుంచి నన్ను వేదనకు గురిచేస్తోంది. కళ్యాణి నాపై మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా పెట్టింది. నేను హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఉత్తర్వులు వచ్చాకే వివాహం చేసుకుంటున్నాను. – శ్రీదాస్ జన్నారం(ఖానాపూర్): జన్నారం మండలం పొన్కల్‌కు చెందిన జాదవ్ బద్రేశ్వర్, పొన్కల్‌కు చెందిన బాదవత్ స్వరూప పెద్దలనెదిరించి వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో చదువుతుండగా వీరిద్దరికీ రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇంట్లో వాళ్లను ఎదిరించి 2018 మార్చిలో గూడెంలోని ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం కొన్ని గొడవలు జరగడంతో పది రోజుల క్రితం స్వరూప భర్త ఇంటి ఎదుట నిరసన తెలిపింది. చివరకు కలిసి ఉంటామని పోలీసుల ఎదుట కాగితం రాసుకున్నారు. వారం క్రితం హైదరాబాద్ వెళ్లారు. చిన్న చిన్న మనస్పర్ధలతో మంగళవారం తెల్లవారు జామున ఇద్దరూ జన్నారంకు వచ్చారు. నేను వస్తాను నువ్వు మీ ఇంటికి వెళ్లు అని బద్రేశ్వర్ ఎటో వెళ్లిపోయాడు. స్వరూప ఇంటికి వెళ్లడంతో ఆమె తల్లి అనసూయ ఇంటికి రానివ్వలేదు. దీంతో తిరిగి పొన్కల్‌లోని గాంధీనగర్‌కు వెళ్లే దారిలోని భర్త ఇంటి ఎదుట కూర్చుని ఫోన్ చేయడంతో విసిగించకు, టార్చర్ పెట్టకు అని భర్త అనడంతో స్వరూప సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగింది. స్థానికులు 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం తల్లి అనసూయ, బంధువులు స్వరూపను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై తహసీనోద్దీన్ పరిస్థితిని సమీక్షించారు. ప్రేమించి మోసం చేసిన ప్రియుడి అరెస్ట్ సారంగపూర్(నిర్మల్): సారంగాపూర్ మండలం నాగపూర్ తండాకు చెందిన జాదవ్ కరుణ తన ప్రియుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం విధితమే. అయితే బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఈ ఘటనకు బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శేక్ బాబ(30)ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సునిల్‌కుమార్ తెలిపారు. -
ప్రేమ జంటకు పెళ్లి జరిపించండి
జిల్లాలోని సిరుగుప్ప తాలూకా ముద్దటనూరు గ్రామంలో ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలని కన్నడసేన ప్రేమికుడి ఇంటి ముందు బాధితురాలితో కలిసి ధర్నా చేశారు. సోమవారం ముద్దటనూరు గ్రామంలోని చంద్రప్ప కుమారుడు సంతోష్ ఇంటి ముందు అదే గ్రామానికి చెందిన బాధితురాలు కే.రాజమ్మ అలియాస్ రాజేశ్వరి, ఆమె తండ్రి తిప్పయ్య, కన్నడ సేన పదాధికారులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఏడాదిగా రాజేశ్వరిని సంతోష్ ప్రేమిస్తున్నాడని, తల్లిదండ్రుల మాట విని పరారై ఇటీవలే గ్రామానికి తిరిగి రావడంతో కన్నడ సేన హై-క వలయ ఉపాధ్యక్షుడు కే.ఎర్రిస్వామి నేతృత్వంలో సోమవారం సంతోష్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. సంతోష్ తల్లిదండ్రులు కట్నం కోసం వేరే సంబంధం చూసి పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో కన్నడసేన సహకారంతో జూన్ 24న సిరిగేరి పోలీస్ స్టేషన్లో సంతోష్, చంద్రప్ప మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ జంటకు పెళ్లి చేసేంతవరకు ఈ పోరాటం ఆగదని సేన కార్యకర్తలు చెప్పారు. ఆందోళనలో కన్నడ సేన కర్ణాటక పదాధికారులు బీ.శ్రీనివాస్, జీ.సుధాకర్, పీ.బసవరాజ్, గాదెప్ప, రాఘవేంద్ర, లక్ష్మీ, అనిత, ఈరమ్మ, సయ్యద్‌బాషా, అబ్దులాజీ, రహిమాన్, గ్రామస్తులు చింతామణి, రాఘవేంద్ర, మారుతి తదితరులు పాల్గొన్నారు.