
ప్రేమజంటకు వివాహం జరిపించిన దృశ్యం
సాక్షి, కారేపల్లి: తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి వారం రోజులపాటు మౌనపోరాటం చేపట్టడంతో దిగొచి్చన ప్రియుడు వివాహం చేసుకున్నాడు. మంగళవారం కారేపల్లి సంతగుడి (శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం)లో మహిళా సంఘాలు, అఖిలపక్ష పార్టీలు, స్థానిక పెద్దలు ప్రేమజంటకు వివాహం జరిపించారు. కారేపల్లికి చెందిన సముద్రాల వేణు తనను ప్రేమించి, పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ మండలంలోని ఎర్రబోడు గ్రామానికి చెందిన కోన సునీత ప్రియుడు ఇంటి ముందు వారం రోజులుగా మౌన పోరాటం చేపట్టిన విషయం విదితమే.
చదవండి: TSRTC: జేబీఎస్‌లోనూ యూపీఐ సేవలు ప్రారంభం
ఆమెకు మహిళా సంఘాల వారు, అఖిలపక్ష నాయకులు, పెద్దలు అండగా నిలిచారు. ప్రియుడు అంగీకరించడంతో వారే దగ్గరుండి పెళ్లి జరిపించారు. మహిళా సంఘాలు, అఖిలపక్ష నాయకులు లతాదేవి, మెరుగు రమణ, కె.ఉమావతి, బి.సుజాత, దేవి, బి.వీరభద్రం నాయక్, కె.నాగేశ్వరరావు, కె.నరేందర్, శ్రీనివాసరావు, ఎం. సత్యనారాయణ, పిల్లి వెంకటేశ్వర్లు, టోనీ వీరప్రతాప్, డి. ప్రసాద్, టి.నారాయణ, ఎ. రాములు, జి శివ, ఎంపీటీసీ రమాదేవి, సర్పంచ్‌లు ఎ.స్రవంతి, కుర్సం సత్యనారాయణ, రంగారావు పాల్గొన్నారు.
చదవండి: కూకట్‌పల్లి ప్రాంతానికి ఈ నెల 29న నీళ్లు బంద్..
Comments
Please login to add a commentAdd a comment