
ప్రజాసంఘాల నాయకులతో కలిసి ధర్నా చేస్తున్న యువతి
బండిఆత్మకూరు: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ యువతి బండిఆత్మకూరు బస్టాండ్‌లో మంగళవారం ఆందోళన చేపట్టింది. యువతికి ఐద్వా, సీపీఎం, డీవైఎఫ్‌ఐ తదితర ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామానికి చెందిన యువతి.. బండిఆత్మకూరు మండలం పరమటూరు గ్రామానికి చెందిన రహిమాన్ బీటెక్ చదివే సమయంలో ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో రహిమాన్‌కు సర్వేయర్‌గా ఉద్యోగం రావడంతో పార్నపల్లె సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా రహిమాన్ కట్నం కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కావడంతో యువతి తనకు న్యాయం చేయాలని బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగింది. ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య, తహసీల్దారు శ్రీనివాసులు, ఎంపీడీవో వాసుదేవ గుప్తా అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో యువతి ధర్నా విరమించింది.
Comments
Please login to add a commentAdd a comment