ఆందోళన చేస్తున్న స్వాతి
సాక్షి, బాన్సువాడ : ప్రేమించి పెళ్ళి చేసుకుని కొడుకు పుట్టిన తర్వాత కాపురానికి తీసుకెళ్ళడం లేదని ఆరోపిస్తూ నాగారం గ్రామానికి చెందిన స్వాతి అనే మహిళ బుధవారం దేశాయిపేట్‌లో భర్త ఆకుల శివకృష్ణ ఇంటిముందు ఆందోళనకు దిగారు. సీపీఎం, దళిత సంఘాల నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. స్వాతీ మాట్లాడుతూ.. డిగ్రీ చదువుతున్న సమయంలో తాను శివకృష్ణ ప్రేమించుకొని నిజామబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. తమకు బాబు పుట్టిన తర్వాత తన భర్త వేరే అమ్మాయిని ప్రేమించి వివాహానికి సిద్దమయ్యాడని పేర్కొన్నారు.
చదవండి: ఐదున్నర గంటలు..6 నేరాలు.. వీడు మామూలోడు కాదురోయ్!
తాను దళిత సామాజిక వర్గం కావడంతో తన అత్త మామలు, ఆడపడుచులు కాపురానికి తీసుకెళ్ళకుండా తన భర్తకు వేరే పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తన భర్త కాపురానికి అనుమతించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా స్వాతి భర్త శివకృష్ణ అక్కడకు చేరుకుని గురువారం పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని చెప్పడంతో బాధితురాలు ఆందోళన విరమించారు. సీపీఎం నాయకులు రవీందర్, ఖలీల్, ఎస్సీ, బీసీ సంఘం నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు.
చదవండి: పెళ్లైన ఆర్నెళ్లకే.. భార్యను వదిలేసి ప్రియురాలితో..
Comments
Please login to add a commentAdd a comment