husband house
-
మూడు రోజులుగా ఇంటి ముందు భార్య పడిగాపులు.. పట్టించుకోని భర్త
సాక్షి, జగిత్యాల జిల్లా: కృష్ణానగర్‌లో దారుణం వెలుగుచూసింది. ఇంటి ముందు వేచిచూస్తున్న భార్యను ఓ భర్త ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు. మూడు రోజులుగా ఇంటి ముందు పడిగాపులు కాస్తున్న ఆమెను పట్టించుకోలేదు. కాగా వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన లావణ్యతో, జగిత్యాలకు చెందిన గంగాధర్ కు 2017లో వివాహం జరిగింది. కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులతో భర్త గంగాధర్‌పై భార్య లావణ్య కేసు నమోదు చేసింది. వేధింపుల కేసులో జైలుకెళ్లిన గంగాధర్.. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్‌పై వచ్చిన భర్తలో మార్పు వచ్చిందేమోనని భావించిన భార్య లావణ్య తిరిగి అత్తారింటికి వచ్చింది. కానీ ఆమెను భర్త ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటి ముందే నిరీక్షిస్తూ ఉండిపోయింది. లావణ్యకు గత మూడు రోజులుగా ఇరుగుపొరుగువారు అన్నపానీయాలందిస్తున్నారు. -
భర్త ఇంటి ముందు రెండో భార్య దీక్ష
చేజర్ల (సోమశిల): భర్త ఇంటి ముందు అతని రెండో భార్య దీక్షకు దిగిన ఘటన అనంతసాగరం మండలం రేవూరులో ఆదివారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. రేవూరుకు చెందిన పోలయ్య అనంతసాగరం విద్యాశాఖ కార్యాలయంలో సీఆర్పీగా విధులు నిర్వహిస్తున్నారు. పోలయ్యకు ఇది వరకే పెళ్లి అయింది. మనస్పర్థలు కారణంగా భార్యాభర్తలు విడిపోయారు. దీంతో మస్తాన్‌బీ అనే మహిళ అతనికి దగ్గర కావడంతో 12 ఏళ్ల నుంచి సహ జీవనం చేస్తున్నట్లు తెలిపారు. పోలయ్య మరో పెళ్లి చేసుకుని మస్తాన్‌బీని వదిలించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుసుకుని ఆమె ఈ విషయమై రెండు నెలల క్రితం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. శనివారం రాత్రి భర్త పోలయ్య, అతని మూడో భార్య, బంధువుల మస్తాన్‌బీపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన అక్కడే కూర్చుని దీక్ష కొనసాగిస్తోంది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. -
బీచ్ కి వెళ్లిన కోడలు.. ఇంటికి తిరిగొచ్చేసరికి షాక్ ఇచ్చిన అత్తామామలు
-
తాళి కట్టిన గంటలోనే నడిరోడ్డుపై వదిలేశాడు..
సాక్షి, తిరువళ్లూరు (చెన్నై): తాళి కట్టిన గంటలోనే తనను నడిరోడ్డుపై వదిలేశాడని..తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు యువతి ఆందోళనకు దిగింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా మెయ్యూరు గ్రామానికి చెందిన మునస్వామి కుమార్తె లక్ష్మి(23) నర్సింగ్ పూర్తి చేసి చెన్నైలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తోంది. సమీప బంధువైన అదే గ్రామానికి చెందిన చిన్నరాజ్(26) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చిన్నరాజ్ నమ్మించడంతో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. గత డిసెంబర్లో యువతి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారు. వడమధురైకి చెందిన వేరే యువతితో చిన్నరాజ్‌కు పెళ్లి సంబంధం కుదుర్చారు. విషయం తెలుసుకుని యువకుడిని నిలదీయగా, నిర్లక్ష్యంగా సమాధామిచ్చాడు. దీంతో డిసెంబర్ 18న ఊత్తుకోట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ చేసి పెళ్లికి ఒప్పించారు. ఈ ఏడాది జనవరి 8న ఊత్తుకోటలోని చర్చిలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇంటికి తీసుకెళతానంటూ ఊత్తుకోట దాటిన తరువాత లక్ష్మిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. నెలన్నర తరువాత శుక్రవారం ఉదయం ఇంటికి రావడంతో లక్ష్మి అతడి ఇంటికి వెళ్లింది. తనకు న్యాయం చేయాలని నిలదీసింది. దీంతో ఆగ్రహించిన చిన్నరాజ్ బంధువులు యువతిపై దాడి చేసి ఇంటి లోపలికి రానివ్వకుండా తాళం వేశారు. దీంతో చేసేదేమి లేక తనకు న్యాయం చేయాలని యువతి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. యువతికి ఐద్వా సంఘం నేతలు మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న ఊత్తుకోట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువతిని విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
ప్రేమించి పెళ్ళి చేసుకుని కొడుకు పుట్టిన తర్వాత.. మరో అమ్మాయితో..
సాక్షి, బాన్సువాడ : ప్రేమించి పెళ్ళి చేసుకుని కొడుకు పుట్టిన తర్వాత కాపురానికి తీసుకెళ్ళడం లేదని ఆరోపిస్తూ నాగారం గ్రామానికి చెందిన స్వాతి అనే మహిళ బుధవారం దేశాయిపేట్‌లో భర్త ఆకుల శివకృష్ణ ఇంటిముందు ఆందోళనకు దిగారు. సీపీఎం, దళిత సంఘాల నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. స్వాతీ మాట్లాడుతూ.. డిగ్రీ చదువుతున్న సమయంలో తాను శివకృష్ణ ప్రేమించుకొని నిజామబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. తమకు బాబు పుట్టిన తర్వాత తన భర్త వేరే అమ్మాయిని ప్రేమించి వివాహానికి సిద్దమయ్యాడని పేర్కొన్నారు. చదవండి: ఐదున్నర గంటలు..6 నేరాలు.. వీడు మామూలోడు కాదురోయ్! తాను దళిత సామాజిక వర్గం కావడంతో తన అత్త మామలు, ఆడపడుచులు కాపురానికి తీసుకెళ్ళకుండా తన భర్తకు వేరే పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తన భర్త కాపురానికి అనుమతించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా స్వాతి భర్త శివకృష్ణ అక్కడకు చేరుకుని గురువారం పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని చెప్పడంతో బాధితురాలు ఆందోళన విరమించారు. సీపీఎం నాయకులు రవీందర్, ఖలీల్, ఎస్సీ, బీసీ సంఘం నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. చదవండి: పెళ్లైన ఆర్నెళ్లకే.. భార్యను వదిలేసి ప్రియురాలితో.. -
గర్భవతిని చేసి పరార్.. నా భర్త నాకు కావాలి.. ఓ భార్య పోరాటం..
రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు... నిజమేనని నమ్మి దగ్గరైన ఆమెను గర్భం చేసిన తరువాత కులపరమైన సమస్యలతో తప్పించుకోవాలని చూశాడు. విషయం పెద్దల వరకూ వెళ్లడంతో చీవాట్లు పెట్టి ఇద్దరికీ వివాహం జరిపించారు. వివాహం జరిగిన పది రోజుల తరువాత కనిపించకుండా పోయాడు. దీంతో ఆ బాధితురాలు భర్త ఇంటిముందు న్యాయం చేయాలంటూ బైఠాయించింది. నాలుగు నెలలుగా ఎదురు చూసిన తన అత్త, మామలు ఇంటి వద్ద ‘భర్త కావాలని, న్యాయం చేయాలంటూ ఆదివారం బైఠాయించారు. (చదవండి: బాగా చదువుకో.. ఇదే నా చివరి కాల్) చీపురుపల్లి(విజయనగరం జిల్లా): గర్భం చేసి తప్పించుకోబోయిన యువకుడిచే పెద్దల సమక్షంలో తాళి కట్టించుకొని పరారైన భర్త కోసం ఓ వివాహిత చేస్తున్న పోరాటమిదీ. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆమె మాటల్లోనే... డైలీ మార్కెట్‌కు చెందిన నా పేరు నర్రు వందన. తన ఇంటి ఎదురుగా ఉన్న నర్రు చినబాబు రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడ్డాడు. ఆయన మాటలు నమ్మి గర్భవతినయ్యాను. వివాహం చేసుకోవాలని నిలదీస్తే ‘ఎస్సీ కులం కావడంతో తల్లిదండ్రులు అంగీకరించలేదంటూ మాటమార్చాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ఏడాది జూన్ 20న అమ్మవారి ఆలయంలో వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం అత్త,మామలు తమను ఇంటిలోకి రానివ్వకపోవడంతో చీపురుపల్లిలోని కొత్తగౌడవీధిలో తన అన్నయ్య నివాసం వద్ద ఉన్నాం. సరిగ్గా పది రోజుల తరువాత జూన్ 30న తన ఇంటి నుంచి వెళ్లిన తన భర్త తిరిగి ఇంతవరకూ రాలేదని, తన అత్తమామలే ఎక్కడో దాచారని, తనకు న్యాయం చేయాలని ఆదివారం అత్తమామల ఇంటి ఎదుట బైఠాయించారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ తనకు పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తమకేమీ సంబంధం లేదని నిందితుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు మాట్లాడుతూ అందిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. అప్పటి నుంచి ఆయన కోసం గాలిస్తున్నామన్నారు. చదవండి: టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత -
టెక్కీ భర్త.. కాపురానికి పనికిరాడనే విషయం దాచి
సాక్షి, మన్సూరాబాద్ : వివాహం చేసుకున్న వారం రోజులకే భార్యను వదిలించుకోవాలని వేధింపులకు పాల్పడుతున్న అత్తింటి ఎదుట కోడలు ధర్నాకు దిగింది. ఈ సంఘటన మంగళవారం నాగోలు డివిజన్ పరిధిలోని రాక్‌టౌన్‌కాలనీలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ భగత్‌నగర్‌కాలనీకి చెందిన గుంజి శ్రీనివాస్, పద్మలకు ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాస్ ఉద్యోగ రీత్యా ముంబాయిలో ఉంటున్నాడు. ఈ ఏడాది జనవరి 8న వారి పెద్ద కుమార్తె తేజస్వీనితో రాక్‌టౌన్‌కాలనీకి చెందిన బత్తులు ఏడుకొండలు–సుశీల పెద్ద కుమారుడు వెంకటేశ్వర్రావు అలియాస్ వెంకటేశ్వర్లు (30)తో వివాహం జరిగింది. వెంకటేశ్వర్లు నగరంలో క్లేవ్‌టెక్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. తేజస్వీని బీబీఐటీ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. వివాహ సమయంలో సుమారు రూ.20లక్షల వరకు బంగారం, కట్న కానుకలుగా అందజేశారు. వివాహ సమయంలో తన భర్త నానమ్మ అనారోగ్యంగా ఉందని అబద్ధం చెప్పి వివాహ తంతుని త్వరగా ముగించారు. వివాహమైన వారం రోజుల తరువాత నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయని బాధితురాలు తెలిపింది. భర్త, అత్తమామలు, ఆడపడుచు కలిసి వేధింపులకు పాల్పడుతున్నారు. ఎలాగైన వదిలించుకోవాలని పథకం ప్రకారం కాపురానికి తీసుకురాకుండా పుట్టింటి వద్దనే బాధితురాలిని ఉంచుతున్నారు. అంతేకాకుండా తన భర్త వెంకటేశ్వర్రావు కాపురానికి పనికిరాడనే విషయం కుటుంబసభ్యులకు తెలిసినా వివాహం జరిపించారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఈనెల 24న ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసును సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌కు ట్రాన్స్ఫర్ చేయగా అక్కడ వారికి కౌన్సెలింగ్ చేశారు. పెద్దల సమక్షంలో రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించుకుంటామని తన భర్త కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారన్నారు. ఇప్పటి వరకు స్పందన లేకపోవటంతో మంగళవారం ఉదయం అత్తింటి ఎదుట న్యాయం చేయాలంటూ బాధితురాలు ధర్నాకు దిగింది. చదవండి: బాలికను కిడ్నాప్ చేసి.. ఆపై ఆమెతో బిక్షాటన వివాహేతర సంబంధం: బంధువులు వదిలిపెట్టరని.. -
‘గృహ హింస’ బాధితురాలికి ఊరట
న్యూఢిల్లీ: గృహ హింస ఎదుర్కొంటున్న మహిళలకు ఊరటనిచ్చే తీర్పును గురువారం సుప్రీంకోర్టు వెలువరించింది. బాధిత మహిళలకు భర్త తరఫు ఇంట్లో ఉండే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. గృహ హింస(డొమెస్టిక్ వయోలెన్స్– డీవీ) చట్టంలో బాధిత మహిళకు భర్త తరఫు ఉమ్మడి ఇంటికి సంబంధించిన హక్కు విషయంలో గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా సవరించింది. డీవీ చట్టం కింద ఆ ఇంటిపై ఆ మహిళకు కూడా హక్కు కల్పిస్తూ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును సంబంధిత సివిల్ దావాలోనూ పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు సరైనది కాదని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ‘ఏ సమాజ అభివృద్ధి అయినా అక్కడి మహిళల హక్కులను రక్షించే, ప్రోత్సహించే సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొంది. డీవీ చట్టంలో ‘ఉమ్మడి గృహం(షేర్డ్ హౌజ్‌హోల్డ్)’ నిర్వచనం బాధిత మహిళకు నివాస హక్కు కల్పించే విధంగా విస్తృతార్థంలో ఉంటుందని, దానికి గత తీర్పులో పేర్కొన్న వివరణ సరిగా లేదని తోసిపుచ్చింది. ‘బాధిత మహిళ భర్తకు వాటా ఉన్న ఉమ్మడి కుటుంబం నివసించే ఇల్లు’ అనే అర్థంలో మాత్రమే ఉమ్మడి గృహం నిర్వచనాన్ని తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఉమ్మడి గృహం అంటే బాధిత మహిళ నివసిస్తున్న, లేదా గతంలో భర్తతో కలిసి నివసించిన సొంత లేదా అద్దె ఇల్లు అనే అర్థం కూడా ఉంటుందని పేర్కొంది. దీన్ని బట్టి బాధిత మహిళకు ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంటుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. డీవీ క్రిమినల్ కేసు విచారణలో సంబంధిత ఉమ్మడి గృహంలో బాధిత మహిళకు కూడా హక్కు ఉంటుందని పేర్కొంటూ ఇచ్చిన మధ్యంతర లేదా తుది ఉత్తర్వులను.. ఆ ఇంటి హక్కుకు సంబంధించిన సివిల్ దావాలోనూ పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. సాక్ష్యాధారాలను పరిశీలించి తీర్పు వెలువరించాలని సివిల్ కోర్టుకు సూచించింది. ఢిల్లీకి చెందిన 76 ఏళ్ల సతీశ్ చందర్ అహూజా వేసిన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు ప్రకటించింది. ఢిల్లీలోని స్వగృహం పూర్తిగా తనదేనని, దానిపై తన కుమారుడికి కానీ, కోడలుకు కానీ ఎలాంటి హక్కు లేదని పేర్కొంటూ అహూజా స్థానిక కోర్టులో దావా వేశారు. అదే సమయంలో ఆయన కుమారుడు తన భార్య నుంచి విడాకులు కోరుతూ మరో కేసు దాఖలు చేశారు. మరోవైపు, ఆయన కోడలు గృహ హింస చట్టం కింద భర్త, అత్తమామలపై కేసు పెట్టారు. అహూజా వేసిన కేసుని విచారించిన స్థానిక సివిల్ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చి, ఆ ఇంటినుంచి కోడలు వెళ్లిపోవాలని ఆదేశించింది. దీనిపై ఆయన డిక్రీ తెచ్చుకున్నారు. ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. స్థానిక క్రిమినల్ కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆమెను ఆ ఇంటినుంచి పంపివేయవద్దని తీర్పునిచ్చింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తాజా ఆదేశాలనిచ్చింది. గృహ హింస చట్టం చరిత్రాత్మకం ఈ సందర్భంగా 2005లో వచ్చిన గృహ హింస చట్టం మహిళల రక్షణకై వచ్చిన మైలురాయి వంటి చట్టమని సుప్రీంకోర్టు ప్రశంసించింది. మహిళలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొంది. ‘కూతురిగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, భాగస్వామిగా, ఒంటరి మహిళగా.. జీవితాంతం స్త్రీ హింసను, వివక్షను, వేధింపులను భరిస్తూనే ఉంది’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఫిర్యాదులు అతి తక్కువగా వచ్చే హింస ఇదేనని, మెజారిటీ మహిళలు తప్పనిసరై మౌనంగా ఆ హింసను భరిస్తున్నారని వాపోయింది. ‘ఇళ్లల్లో హింసను భరించే మహిళలకు, ఆ హింసను ఎదిరించే చట్టపరమైన స్పష్టమైన మార్గాలు 2005 వరకు ఎక్కువగా లేవు. ఆ తరువాత వచ్చిన గృహ హింస చట్టం ఆ లోటు తీర్చింది’ అని పేర్కొంది. -
న్యాయం చేయండి
-
బిడ్డ తనకు పుట్టలేదని భర్త చెప్పడంతో..
చెన్నై : కడైయమ్ సమీపంలో బుధవారం భర్త ఇంటి ముందు పసికందుతో మహిళా ఇంజినీర్ ధర్నాకు దిగింది. తెన్కాశి జిల్లా కడైయమ్ సమీపం కట్టెలి పట్టి కీళ వీధికి చెందిన పరమశివన్ కుమారుడు మురుగన్ (30). ఇంజినీర్ అయిన ఇతను ఇండోనేషియాలో పనిచేస్తూ వస్తున్నాడు. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన గురుస్వామి కుమార్తె, ఇంజినీర్ అయిన తేన్‌మొలి (27)తో గత ఫిబ్రవరిలో వివాహమైంది. తరువాత మురుగన్ పనికోసం ఇండోనేషియాకి బయలుదేరి వెళ్లాడు. ప్రస్తుతం అతను అక్కడ పనిచేస్తున్నాడు. తేన్‌మొలి కోవైలో ఉన్న ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. గర్భంతో ఉండడంతో ఆమె పనిని వదిలి ఊరుకి తిరిగి వచ్చింది. తరువాత కన్నవారి ఇంట్లో నివసిస్తూ వచ్చింది. అప్పుడప్పుడూ ఆమె భర్తతో ఫోన్లో మాట్లాడుతుండేది. నవంబర్‌లో తేన్‌మొలికి ఆడ బిడ్డ పుట్టింది. అదే రోజు ఈ విషయం ఇండోనేషియాలో ఉన్న భర్తకి సమాచారం తెలిపింది. ఇంకా బిడ్డని చూడడానికి సెలవు తీసుకొని ఊరుకి రమ్మని ఆమె చెప్పింది. అతను వెంటనే సెలవు తీసుకుని రాలేను అని చెప్పాడు. ఈ స్థితిలో హఠాత్తుగా ఒక రోజు, బిడ్డ తనకు పుట్టలేదని, ఆ బిడ్డని చూడడానికి రాను అంటూ మురుగన్ చెప్పడంతో తేన్‌మొలి దిగ్భ్రాంతి చెందింది. బుధవారం మురుగన్ ఇంటికి ఆమె తన బిడ్డతో వచ్చి ధర్నాకు దిగింది. సమాచారం అందుకున్న కడైయమ్ పోలీసులు, గ్రామ నిర్వాహక అధికారి సుడర్‌సెల్వన్ సంఘటనా స్థలానికి చేరుకుని తేన్‌మొలితో చర్చలు జరిపారు. ఆమె మాట్లాడుతూ ఈ బిడ్డ తనకు పుట్టలేదని భర్త చెబుతున్నాడని, నేను డీఎన్ఏ పరిశోధనకి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ఆమెని కడైయమ్ పోలీసు స్టేషన్‌కి తీసుకుని వెళ్లి పోలీసులు విచారణ చేశారు. నీ భర్త నెలలో ఊరికి వస్తాడు.. అతనితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పి పంపారు. -
శబరిమలలో ప్రవేశించిన కనకదుర్గకు మరో అవమానం
-
ప్రేమించి రహస్యంగా పెళ్లాడి...
-
నాలుగేళ్లుగా భర్త కోసం ఎదురు చూపు
-
భర్త ఇంటి ముందు బైఠాయింపు
దాచేపల్లి(గురజాల): కాపురానికి తీసుకువెళ్లాలంటూ భర్త ఇంటి ముందు భార్య బైఠాయించిన ఘటన దాచేపల్లి మండలం కేసానుపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుదె వెంకటేశ్వర్లు ఇంటి ముందు ఆయన భార్య ఈశ్వరమ్మ ఆదివారం రాత్రి 10 గంటల నుంచి బైఠాయించారు. ఇరవై ఏళ్ల కిందట కేసానుపల్లికి చెందిన వెంకటేశ్వర్లుతో ఆమెకు వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్ల నుంచి ఈశ్వరమ్మ తండ్రి వద్ద ఉంటోంది. పలుమార్లు భార్యాభర్తల మధ్య రాజీ కోసం పంచాయితీలు కూడా జరిగాయి. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తనకు భర్త, పిల్లలు కావాలంటూ ఈశ్వరమ్మ భర్త ఇంటి వద్దకు వచ్చింది. లోపలకు వచ్చేందుకు భర్తతో పాటు కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఇంటి ముందు బైఠాయించింది. విషయం తెలుసుకున్న మహిళా సంఘాల నాయకురాలు లంకె శాంతితో పాటు పలువురు ఈశ్వరమ్మకు సంఘీభావం తెలిపారు. ఈశ్వరమ్మను కాపురానికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తనను ఇంట్లోకి వెళ్లేందుకు భర్తతో పాటు అత్తమామలు అడ్డుకుంటున్నారని, పిల్లల నుంచి తనను వేరు చేయాలని చూస్తున్నారని ఈశ్వరమ్మ ఆరోపించింది. దీనిపై భర్త వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనపై ఈశ్వరమ్మ పెట్టిన కేసులపై కోర్టులో విచారణ జరుగుతోందని, తేలిన తరువాత దీనిపై మాట్లాడతానని చెప్పారు. -
భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా
-
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..
మోర్తాడ్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త తనను కాపురానికి తీసుకొని పోవడం లేదని ఆరోపిస్తూ మండలంలోని సుంకెట్‌లో అర్చిత అనే మహిళ తన కుటుంబ సభ్యులు, దళిత సంఘాల సహకారంతో బైటాయించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. సుంకెట్‌కు చెందిన ప్రశాంత్, అర్చిత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. వీరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారి రెండేళ్ల కింద సికింద్రాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో ప్రేమ వివాహాన్ని వారి పెద్దలు అంగీకరించరని గోప్యంగా ఉంచారు. అయితే రెండు నెలల కింద అర్చిత మగ బిడ్డకు జన్మనిచ్చింది. అర్చిత డెలివరి అయిన నుంచి ప్రశాంత్ సుంకెట్‌కు రావడం లేదు. అంతేకాక కనీసం ఫోన్లోనైనా మాట్లాడక పోవడంతో అర్చిత ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు వివరించింది. ప్రేమించి తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి రాకపోవడం, హైదరాబాద్‌లోనూ మకాం మార్చడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన అర్చిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల సహకారంతో తన భర్త ఇంటి ముందు బైటాయించింది. విషయాన్ని స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రశాంత్ హైదరాబాద్ నుంచి వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. విషయాన్ని తెలుసుకున్న మోర్తాడ్ ఎస్ఐ సురేష్ ఇరువర్గాలను స్టేషన్‌కు రప్పించి కౌన్సెలింగ్ చేశారు. తప్పు తెలుసుకుని చక్కగా నడుచుకోవాలని ప్రశాంత్‌కు ఎస్ఐ సూచించారు. అర్చితకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా క్రిమినల్ కేసులను నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. -
న్యాయం కోసం.. భార్య ఆందోళన
ముషీరాబాద్: న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ భర్త ఇంటి ఎదుట బైటాయించిన సంఘటన ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈస్ట్ ఎంసీహెచ్ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితురాలు, ఇన్స్పెక్టర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ అలియాబాద్‌కు చెందిన శంకర్, యమున దంపతుల కుమార్తె స్వప్న (హాస్య)కు రాంనగర్ ఈస్ట్ ఎంసీహెచ్ కాలనీకి చెందిన వెంకటేష్, అనసూయల కుమారుడు విజయ్‌కుమార్‌తో 2015 లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 5లక్షలు కట్నం ఇచ్చారు. రెండు నెలల్లోనే విజయకుమార్ తరచూ భార్యను వేధించేవాడు. అయినా ఏడాది పాటు అక్కడే ఉన్నట్లు స్వప్న తెలిపింది. పద్మారావునగర్‌లో వేరు కాపురం పెట్టించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపింది. బెంగళూరులో ఉద్యోగం వచ్చిందని చెప్పి తనను పుట్టింటికి పంపించాడన్నారు. అయితే ఉద్యోగం చేయకపోగా తనను మళ్లీ కాపురానికి తీసుకెళ్లలేదని, దీంతో ఝాన్సీ బజార్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ కూడా ఇచ్చినట్లు తెలిపింది. అయితే తనకు తెలియకుండానే విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో లీగల్ అథారిటీ వాలంటీర్ పద్మ, గీతలతో కలిసి సోమవారం రాత్రి అత్తగారింటికి రాగా, ఆమె రాకను గమనించి అత్తామామ, బావ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇంటిముందే బైటాయించింది. ముషీరాబాద్ ఎస్ఐ సాయికుమార్ బాధితురాలితో పాటు, ఆమె భర్తను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి చర్చించారు. తనకు భర్తే కావాలని స్వప్న కోరుతుండగా, తనకు వద్దని విజయ్‌కుమార్ చెప్పినట్లు సమాచారం. -
భర్త రెండో వివాహం చేసుకోవడంపై ఆందోళన
తగరపువలస(భీమిలి): రెండో వివాహం చేసుకున్న భర్త ఇంటి ముందు ఓ వివాహిత తన పిల్లలతో కలిసి ఆందోళనకు దిగింది. భీమిలి మండలం టి.నగరపాలెం పంచాయతీకి చెందిన బర్ల నరసింగరావు ఈ నెల 8న భోగాపురం మండలం చెరకుపల్లి పంచాయతీకి చెందిన అప్పలనారాయణ అనే మరో మహిళను వివాహం చేసుకున్నారు. ఇతనికి మొదటి భార్య అరుణ, కుమార్తె షర్మిల(10), కుమారుడు హిమేష్(8) ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐద్వా జిల్లా కార్యదర్శి కె.నాగరాణి ఆధ్వర్యంలో పిల్లలతో కలిసి అరుణ ముందుగా జీవీఎంసీ భీమిలి జోన్ ఒకటో వార్డు బంగ్లామెట్టపైన అప్పలనారాయణతో ఉంటున్న భర్త ఇంటి ముందు, తరువాత టి.నగరపాలెంలోని అత్తింటి ముందు సోమవారం ఆందోళన చేపట్టారు. అనంతరం భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ మేనత్త కుమారుడైన నరసింగరావుతో తనకు 2007లో వివాహం కాగా ఇద్దరు సంతానం కలిగారన్నారు. అయిదేళ్ల క్రితం అదనపు కట్నం తదితర కారణాలతో తనను భర్త నరసింగరావు వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇటీవల తన భర్త నరసింగరావు మరో మహిళను వివాహం చేసుకుని బంగ్లా మెట్టపై కాపురం పెట్టి తనను, పిల్లలను నిర్లక్ష్యం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త రెండో వివాహంపై పంచాయతీలో చర్చించినా న్యాయం జరగలేదన్నారు. తన నుంచి విడాకులు కోరుతూ మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. ఐద్వా కార్యదర్శి నాగరాణి మాట్లాడుతూ మొదటి భార్య అరుణ బతికి ఉండగా అప్పలనారాయణ అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్న నరసింగరావును శిక్షించాలని డిమాండ్ చేశారు. అరుణకు, ఆమె పిల్లలకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా బంగ్లామెట్ట, టి.నగరపాలెంలో అరుణ ఆందోళన చేస్తున్నంతసేపూ నరసింగరావు, అతని తల్లిదండ్రులు అప్పన్న, ఎల్లయ్యమ్మ అందుబాటులోకి రాలేదు. -
నాకు మొగుడు కావాలి..
ధర్మవరంటౌన్: అదనపు కట్నం వేధింపుల నుంచి విముక్తి కల్పించి, తన భర్తను తనతో కాపురానికి పంపించాలని పుష్పవతి అనే మహిళ అత్తింటి ఎదుట దీక్షకు కూర్చుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు... ధర్మవరంలోని బాలాజీనగర్‌కు చెందిన పుష్పవతికి చంద్రబాబునగర్‌కు చెందిన పోలా వెంకట రంగనాయకులుతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో కట్నం కింద 12 తులాల బంగారం ఇచ్చారు. ఏడాదిపాటు వీరి కాపురం సజావుగా జరిగింది. అనంతరం చిన్నపాటి గొడవలతో మొదలై అదనపు కట్నం వేధింపులకు దారి తీసింది. అనంతరం వీరు వేరుకాపురం పెట్టారు. కొద్దిరోజులు గడిచాక భార్య బంగారు నగలతో భర్త ఉడాయించాడు. కొన్నాళ్ల తర్వాత తల్లిదండ్రుల వద్దకు చేరాడు. బంగారు పోతే పోయింది తన కూతురును కాపురానికి తీసుకువెళ్లాలని పుష్పవతి తండ్రి వెంకటేష్ బతిమాలితే.. అదనపు కట్నం, బంగారం ఇస్తేనే పిలుచుకుంటామంటూ అల్లుడితో పాటు వియ్యంకులు తేల్చి చెప్పారు. నాలుగేళ్లుగా భార్యాభర్తలను కలపాలని పెద్ద మనుషుల ద్వారా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏడాది కిందట రంగనాయకులు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు కేసును కొట్టేసింది. నాకు మొగుడు కావాలి.. తన భర్తను తనకు అప్పగించాలని అత్తమామల ఇంటి వద్ద అరుగుపై పుష్పవతి శుక్రవారం ఉదయం దీక్ష చేపట్టింది. అత్తింటివారు తలుపు కూడా తీయకపోవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాల వారినీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే తనకు న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని పుష్పవతి తేల్చిచెప్పింది. ఈమె దీక్షకు సీపీఐ మహిళా విభాగం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వరలక్ష్మి, పద్మావతి తదితరులు మద్దతు తెలిపారు. మళ్లీ విడాకులకు ప్రయత్నిస్తా.. తన భార్య చెప్పేవన్నీ అబద్ధాలని, ఆమెతో ఇన్నాళ్లూ నరకయాతన పడ్డానని బాల వెంకటరంగనాయకులు తెలిపాడు. విడాకుల కోసం మళ్లీ కోర్టులో దరఖాస్తు చేస్తానని విలేఖరులకు చెప్పాడు. తమ కుమారున్ని అకారణంగా చావగొట్టించిందని, ఇటువంటి కోడలు తమకు వద్దే వద్దంటూ మామ పోలా బాలప్ప పేర్కొన్నాడు. -
కోడలు అని చూడకుండా పచ్చి బూతులు..
-
అత్తింటి ముందు వివాహిత న్యాయపోరాటం
-
ప్రేమ పేరుతో మోసం చేశాడు: డబ్బింగ్ ఆర్టిస్ట్
-
ప్రేమ పేరుతో మోసం చేశాడు: డబ్బింగ్ ఆర్టిస్ట్
గుంటూరు: గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులో డబ్బింగ్ ఆర్టిస్ట్ సుజాత.. భర్త యశ్వంత్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని తనను మోసం చేశాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మౌనదీక్షకు దిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో యశ్వంత్ పనిచేస్తున్నాడు. తనకు ఫేస్బుక్ ద్వారా అతను పరిచయమయ్యాడని సుజాత్ చెప్పింది. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారిందని, యశ్వంత్ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా తాను అంగీకరించానని చెప్పింది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత అతను తనను మోసం చేశాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. -
భర్త ఇంట్లో భార్యకు భద్రత కల్పించాలి
పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు టీనగర్: భర్త ఇంటిలో నివశించేందుకు భార్యకు తగిన భద్రత కల్పించాలని ఉడుమలైపేట పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. మద్రాసు హైకోర్టులో తమిళరసి దాఖలు చేసిన పిటిషన్లో కోర్టు ఈ విధంగా పేర్కొంది. కుటుంబ సమస్యల కారణంగా భర్తను, ఏడేళ్ల కుమారుడిని విడిచి జీవిస్తున్నట్లు ఆమె కేసు దాఖలు చేసింది. తన భర్త ఇంటిలో నివశించేందుకు కుటుంబ హింస చట్టం అనుమతి కోరుతూ కోవై సెషన్స కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, కోర్టు కూడా భర్త ఇంట్లో నివశించేందుకు తనకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. భర్త ఇంటికి వెళ్లేందుకు తగిన భద్రత కల్పించమని ఉడుమలైపేట పోలీసు ఇన్ స్పెక్టర్, మహిళా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్కు పిటిషన్లు అందజేసినప్పటికీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి పీఎన్ ప్రకాష్ సమక్షంలో విచారణకు వచ్చింది. న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో పిటిషనర్ తన భర్త ఇంటిలో జీవించేందుకు తగిన సంఖ్యలో పోలీసుల భద్రత కల్పించాలని ఉత్తర్వులిచ్చారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోండి కావేరి నదిలో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా కావేరి నది పరిరక్షణ సంఘం సభ్యులు కరూర్ జిల్లాలో ఆందోళనలు చేస్తున్నారని.. అయినా ఇసుక చోరీలపై చర్యలు తీసుకోవడం లేదని సంఘం సభ్యులు కరూర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేటు కోర్టు న్యాయమూర్తి రేవతికి విన్నవించారు. -
మరో మౌనపోరాటం..
భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన హైదరాబాద్: ప్రేమించి.. పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకుని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ ఓ యువతి భర్త ఇంటి ముందే ఆందోళనకు దిగిన ఘటన ఆదివారం చంపాపేటలో చోటుచేసుకుంది. వివరాలు.. చంపాపేట మారుతీనగర్ రోడ్డు నెం.13లో నివసించే కుతడి వెంకటేష్ జహీరాబాద్‌లోని ట్రాన్స్‌కో కార్యాలయంలో ఏడీఇగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2005లో మెహిదీపట్నం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో వెంకటేష్ సబ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయలో అదే కార్యాలయంలో పనిచేసే మల్లీశ్వరితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2011 ఆగస్ట్‌లో కోఠిలోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకొని కవాడీగూడలోని ఓ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచి 2013లో గాంధీనగర్‌కు ఇంటిని మార్చారు. ఈ క్రమంలోనే మల్లీశ్వరికి రెండుసార్లు అబార్షన్ చేయించాడు. కొంతకాలంగా భార్యను నిర్లక్ష్యం చేయడమే కాకుండా అప్పడప్పుడు మాత్రమే ఆమె ఉండే ఇంటికి వచ్చేవాడు. దీంతో మల్లేశ్వరి 2015లో కంచన్‌భాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫలితం లేకపోవడంతో ఆదివారం భర్త ఇంటి ఎదుటే ఆందోళనకు దిగింది.