గుంటూరు: గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులో డబ్బింగ్ ఆర్టిస్ట్ సుజాత.. భర్త యశ్వంత్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని తనను మోసం చేశాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మౌనదీక్షకు దిగింది.
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో యశ్వంత్ పనిచేస్తున్నాడు. తనకు ఫేస్‌బుక్ ద్వారా అతను పరిచయమయ్యాడని సుజాత్ చెప్పింది. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారిందని, యశ్వంత్ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా తాను అంగీకరించానని చెప్పింది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత అతను తనను మోసం చేశాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.
ప్రేమ పేరుతో మోసం చేశాడు: డబ్బింగ్ ఆర్టిస్ట్
Published Mon, Apr 17 2017 7:31 PM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM
Advertisement
Advertisement