
నీళ్లకుంట అంగన్‌వాడీ సెంటర్ వద్ద తలదాచుకుంటున్న శోభ
పలమనేరు: తన భర్త, అత్తమామలు తనతో గొడవ పడి ఇంటి నుంచి గెంటేశారని ఓ మహిళ తన పసిబిడ్డతో విలపిస్తోంది. తలదాచుకునేందుకు స్థలం లేక తన సామగ్రితో అంగన్‌వాడీ కేంద్రం వద్దకు చేరింది. గురువారం ఈ సంఘటన మున్సిపాలిటీ పరిధిలోని నీళ్లకుంటలో వెలుగుచూసింది. తన గోడును బాధితురాలు అంగన్‌వాడీ వర్కర్ రాధకు నివేదించడంతో ఆమె మీడియా దృష్టికి తీసుకువచ్చింది. వివరాలు..పట్టణ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద కాపురమున్న శోభతో బొమ్మిదొడ్డికి చెందిన గోవిందురాజులతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏదాడి వయస్సున్న బాబున్నాడు. అయితే తల్లిమాట వింటూ భర్త తరచూ తనను వే«ధిస్తున్నాడని శోభ తెలిపింది. ఈనేపథ్యంలో రెండ్రోజుల క్రితం ఇంటినుంచి బయటకు పంపేశారని, దీంతో ఏం చేయాలో అర్థంగాక అంగన్‌వాడీ ముందు తలదాచుకుంటున్నానని తనకు పోలీసులు న్యాయం చేయాలని కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment