అక్క పెళ్లికి బట్టలు కొనేందుకెళుతూ.. | Young Man Deceased in Bike Accident Chittoor | Sakshi
Sakshi News home page

అక్క పెళ్లికి బట్టలు కొనేందుకెళుతూ..

Published Sat, Aug 8 2020 10:25 AM | Last Updated on Sat, Aug 8 2020 10:32 AM

Young Man Deceased in Bike Accident Chittoor - Sakshi

ప్రమాద స్థలం

పలమనేరు : తన అక్క పెళ్లికి కొత్త బట్టలు కొనేందుకు బంధువుతో కలసి బైక్‌పై వస్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన శుక్రవారం మండలంలోని టి.వడ్డూరు వద్ద జరిగింది. కాలువపల్లె గ్రామానికి చెందిన వెంకటాద్రి సోదరి వివాహం ఈ నెల 13న జరుగనుంది. టుంబీకులు కొత్త బట్టలు కొనుక్కోమని చెప్పడంతో వెంకటాద్రి (17) తన బంధువు కర్ణాటకు చెందిన ప్రశాంత్‌ (23)తో కలసి బైక్‌పై పలమనేరు వైపు వస్తుండగా ఎదురుగా వెళ్లిన ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటాద్రి తలకు బలమైన గాయమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ప్రశాంత్‌(23) తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పట్టణ సీఐ జయరామయ్య కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement