కాకినాడ రూరల్: తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని ఓ వివాహిత, ఆమె కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. సర్పవరం జంక్షన్ వద్ద పోలీసు స్టేషన్ ఎదురుగా కాకినాడ – పిఠాపురం రోడ్డుపై సోమవారం రాత్రి బైఠాయించారు. ఆ వివరాల ప్రకారం.. కాకినాడ అర్బన్ 3వ డివిజన్ గుడారిగుంటలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ లోవరాజు కుటుంబం, బాధిత వివాహిత కుటుంబం పక్క పక్క పోర్షన్లలో ఉంటుంది.
లోవరాజు బాధితురాలి భర్తకు మేనమాన వరస. బాధిత మహిళకు అన్నయ్య అవుతాడు. తన భర్త ఇంట్లో లేని సమయంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు డబ్బులు ఇస్తానని, కోరిక తీర్చమని వేధింపులకు గురినట్టు ఆమె జిల్లా ఎస్పీని ఆశ్రయించంతో పాటు సర్పవరం పోలీస్ స్టేషన్‌లో గత నెల 31న ఫిర్యాదు చేసింది. వారం రోజులు అవుతున్నా చర్యలు తీసుకోవడం లేదని, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున సోమవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని రోడ్డుపై నిరసనకు దిగారు.
భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. సీఐ పెద్దిరాజు, ఎస్సై ఏసుబాబు ఆందోళన వద్దని చెప్పినా వారు ఆగలేదు. చివరికి ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడంతో ఆందోళన విరమించారు. కేసు విచారణ చేపట్టి వాస్తమని తేలితే కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని సీఐ పెద్దిరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment