విద్యార్థినితో మాట్లాడుతున్న నోడల్ అధికారి జహీరుద్దీన్
ఇప్పటి వరకు ఆ కళాశాలకు డోకా లేదు. వారు చెప్పిందే అక్కడ వేదం. అయితే అక్కడున్న కళాశాలల మధ్య పోటీతత్వం, ఈర్షాధ్వేషాలు పెరిగాయి. ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకున్నారు. కోర్టులను కూడా ఆశ్రయించారు. అపుడే మన ఇంటర్ బోర్డు అధికారులు కళ్లుతెరిచారు. నిసితంగా పరిశీలించారు. అక్రమంగా కళాశాలను నడిపిస్తున్నారనే నిర్ణయానికి వచ్చారు. అక్కడున్న రికార్డులను సీజ్ చేసి స్వాధీన పర్చుకున్నారు. ఫలితంగా అక్కడ చేరిన విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.
భద్రాచలం : భద్రాచలం బస్టాండ్ వెనుక త్రివేణి జూనియర్ కళాశాలను అనధికారికంగా నడుపుతున్నారు. ఈ కళాశాలకు చెందిన రికార్డులను ఇం టర్ బోర్డు జిల్లా నోడల్ అధికారి జహీరుద్దీన్ శుక్రవారం సీజ్ చేశారు. భద్రాచలం వచ్చిన ఆయన కళాశాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. అక్కడ ఉన్న సిబ్బంది సమక్షంలోనే రికార్డులు, అక్కడున్న ఇతర ధ్రువీకరణ పత్రాలను నిసితంగా పరిశీలించారు. ఆ సమయంలో విద్యార్థులు కళాశాలలో లేరు.
దీనికి అనుబంధంగా వసతి గృహాన్ని కూడా నడుపుతున్నారు. ఆ సమయంలో ఒక విద్యార్థిని మాత్రమే అక్కడ ఉంది. ఆ విద్యార్థిని నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు. అనుమతిలేని కళాశాలలో ఎందుకు చేరావని, వీరిచ్చిన సర్టిఫికెట్‌కు గుర్తింపు ఉండదని వివరించారు. అంతేకాక కళాశాలలో విద్యార్థులను చేర్చుకున్నట్లుగా అక్కడ ఉన్న అడ్మిషన్ దరఖాస్తులను, విద్యార్థుల దగ్గర నుంచి తీసుకున్న పదో తరగతి సర్టిఫికెట్లు, వారికి సంబంధించిన ఇతర ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్బంగా ఇంటర్‌బోర్డు నోడల్ అధికారి జహీరుద్దీన్ మాట్లాడారు. త్రివేణి కళాశాల పేరు తో భద్రాచలంలోని బస్టాండ్ వెనుక ఉన్న భవనంలో తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేవన్నారు. అందుకే ఉన్నతాధికారుల సూచనల మేరకు కళాశాలకు సంబంధించిన అన్ని రికార్డులను సీజ్ చేశామని వెల్లడించారు. సుమారు 60 మంది విద్యార్థులు ఇక్కడ అడ్మీషన్లు తీసుకున్నట్లుగా తమ పరిశీలన లో తేలిందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టి లో పెట్టుకొని వారికి నచ్చిన కళాశాలలో చేర్పించేందుకు ఇంటర్ బోర్డు నుంచి తగిన సహకారం అందిస్తామన్నారు.
పర్యవేక్షణ లేకనే..
జిల్లాలో విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ సవ్యం గా లేకపోవటంతో కొంతమంది ప్రైవేట్ పాఠశాల లు, కళాశాలల యాజమన్యాలు విద్యావ్యాపారా న్ని కొనసాగిస్తున్నారు. భద్రాచలంలోని త్రివేణి కళాశాల పేరుతో బస్టాండ్ వెనుక బోర్డులు పెట్టుకొని, ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి తరగతులను నిర్వహిస్తున్నప్పటికీ, దీనికి అనుమతుల్లేవనే విషయాన్ని ఇంటర్ బోర్డు అధికారులు ఇప్పటి వరకూ గుర్తించకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. భద్రాచలంలోని రెండు కళా శాలల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరే ఈ సంఘటనకు ప్రధాన కారణంగా పలువురు చెబుతున్నారు. ఈ విషయం న్యాయస్థానం వరకూ వెళ్లింది. అప్పుడే ఇంటర్‌బోర్డు అధికారులు అసలు విషయాన్ని గ్రహించారు.
బస్టాండ్ వెనుక ఉన్న త్రివేణి కళాశాలకు అనుమతల్లేవని అర్ధం చేసుకున్నారు. కళాశాలను సీజ్ చేయటంతో ఇక్క డ చదువుతున్న విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మా రింది. విద్యాసంవత్సరం ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు పూర్తికాగా, ఇక్కడ చదివే వారిలో పలువురు విద్యార్థులు మెరిట్ సాధించిన వారు కూడా ఉన్నారు. పోటీ పరీక్షలకు వెళ్లేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు. ఆ విద్యార్థులకు ప్రస్తుత పరిణామాలు ఆటంకాన్ని కలిగిస్తున్నాయి.
స్థానిక విద్యాశాఖాధికారులు సీజ్ చేశారు. కానీ ఇప్పటి వరకూ ఈ వ్యవహారం పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏజెన్సీ నిబంధనలకు తూట్లు పొడుస్తూ, కొన్ని ప్రైవేట్ యాజమాన్యాల వారు విద్యా వ్యాపారం చేస్తున్నప్పటికీ.. విద్యాశాఖ అధికారులు సరైన రీతిలో స్పందించకపోవటంతో సమస్య మరింతజఠిలంగా మారు తోంది. ఏదిఏమైనప్పటికీ సంఘటన జరిగిన తరువాత స్పందించి,హడావిడి చేసేకంటే ప్రైవేట్ పాఠ శాలలకు సంబంధించిన అనుమతులు, వసతు లు, ఇతర అనుమతులపై సమగ్ర పరిశీలన ముందుగానే చేస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment