పురిటి కోసం అష్టకష్టాలు | Women Face Difficulties In Delivery Time At Bhadradri District | Sakshi
Sakshi News home page

పురిటి కోసం అష్టకష్టాలు

Published Fri, Dec 20 2019 4:15 AM | Last Updated on Fri, Dec 20 2019 4:15 AM

Women Face Difficulties In Delivery Time At Bhadradri District - Sakshi

శిరీషను డెలివరీ కోసం తరలిస్తున్న దృశ్యం

ఇల్లెందు: పురుడు పోసుకోవడానికి ఓ మహిళ అష్టకష్టాలు పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని 21 ఏరియాకు చెందిన పూనెం శిరీష పురిటి నొప్పులతో గురువారం తెల్లారుజామున ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అప్పటికే కడుపులోని పాప కాళ్లు బయటకొచ్చాయి. వైద్యులు డెలివరీ కోసం ప్రయత్నించకుండా ఖమ్మం రిఫర్‌ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో శిరీషను ఆటోలో ఖమ్మం తరలిస్తుండగా మధ్యలోనే ప్రసవించింది. కానీ సకాలంలో వైద్యం అందక పాప మృతి చెందింది. దీంతో తిరిగి ఇల్లెందు వైద్యశాలకు తీసుకురాగానే మరో పాపకు జన్మనిచ్చింది. రెండో అమ్మాయి ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఏడు నెలలకే డెలివరీ కావడంతో ఇన్‌క్యుబేటర్‌ బాక్స్‌లో పెట్టాలని వైద్యులు సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement